నేను ఈ దేశం రాక ముందు నాకు కొన్ని అప్పులు ...బాధ్యతలు....సమస్యలు...వచ్చేముందు ఒకటే కోరుకున్నాను దేవుడిని...నా ప్రొబ్లెంస్ పరిష్కారమైతే చాలు.....అని ...అయిపోయినాయి.. ఏడు లక్షల అప్పు...., నాన్నారి గుండె ఆపరేషను...తమ్ముడి సెటిల్.....అంతా పరిష్కారమైనాయి..ఇంకా నేనెందుకు ఇక్కడ???
నా ఈ ఒకటిన్నర విదేశీ జీవితం చాలా విషయాలు నేర్పింది...జీవిత పాఠాలుగా వాటిని స్వీకరిస్తున్నా.....మోసాలు , దోస్తులు , బంధువులు , గొడవలు , భయం , భక్తీ, డబ్బు , విలాసం, చాలా చాలా నేర్చుకున్నా...అదేంటో అందరు అదే అంటారు నువ్వు ఉంటానికి అక్కడ ఉన్నావు గాని నీ మనసంతా భారతమేరా అని ..... నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, అని పదే పదే చిన్నప్పుడు తెగ అరిచేవాడిని ..ప్రేమిస్తున్నాను అనే పదం వొత్తి పలికేవాడిని భవాని వంక చూస్తూ...హహ... ఇప్పుడు అర్ధం అవుతుంది ప్రేమించడం అంటే ఏంటో ...ఎన్నో గొడవలు...ఎన్నో రాజకీయాలు ...స్కాములు...బాబాలు ..హజారే ...అయినా నా దేశం....నా భారత దేశం అన్నింటికంటే గొప్పది..అది ఇక్కడకు వచ్చిన తరువాత అనుభవం లో వచ్చింది...నిజానికి ఎప్పుడు నాకు మా ఉరి హైస్చులు...చెరువు గట్టు ..మురుగు కాలవ వంతెన...పంట బోదు...సెంటరు...పొట్టోడి హోటలు ...మురళి గారి టెన్నిసు కోర్టు...ఇవే ఉండేవి మనసు నిండా...
అన్నింటి కంటే ఉత్తమంగా నేను సాధించింది ప్రతీ ముస్లిం తన జీవిత కాలం లో ఒక్కసారి అన్నా దర్శించాలి అనుకునే పవిత్ర " మక్కా" అతి చిన్న వయసులోనే ఇప్పటికి మూడు సార్లు దర్శించాను మళ్ళి ఇంకోసారి వెళ్ళ బోతున్నాను ....కాని హజ్జ్ చేయలేక పోయాను అని ఒక బాధ ఉండిపోయింది అలాగే నా అమ్మ నానా లను ఇక్కడ ఉండి కుడా హజ్జ్ కనీసం "ఉమ్రహ్ " ( మక్కా దర్శనం" ) చేయించలేక పోయానే అనే బాధ కుడా ఉండిపోయింది... కొంచెం లావు అయ్యాను...ఎప్పుడో MBA చదివేటప్పుడు వేసాను పోనీ టైల్ మళ్ళి ఇన్నాళ్ళకు వేయగాలిగాను..ఎవరు చూడరులే అన్న ధైర్యము తోటి.....:) సాంకేతిక విజ్ఞానం పెంచుకున్నాను....కొంచెం ఆర్ధికం గా లాభపడ్డాను ...కాని ఈ రంగు కాగితాల కోసం నా జీవితాన్ని నా లక్ష్యాన్ని వదులుకోలేను అందుకే బ్యాక్ టు ఇండియా .....
నేను వచేటప్పుడు నా అమ్మమ్మ దగ్గిరనుండి బయలు దేరాను...నేనంటే ఎంతో ఇష్టం ఆవిడకి.. ప్చ్... ఇప్పుడు నేను వెళితే " మున్నా ...ఆగయా....రుక్ చాయ్ బనాకే దేతీ.." అనే అమ్మమ ఇక లేదు ...ఆవిడా ఆఖరి మజిలికి చేరుకుంది..నేను వచేటప్పుడు " అమీర్ ...అబ్ అమీరోకా అమీర్ బాన్ జాఏగా" అని చెప్పిన నా అమ్మమ్మ ఇక కనబడదు..తలుచుకుంటే ఏడుపు వస్తుంది " ఎప్పుడూ..అరె మున్నా అమ్మి కో జత్తాన్ సే దేఖ్ లే " అని ఎప్పుడూ మా అమ్మ గురించి ఆలోచించే అమ్మమ్మ ఇక లేదు....." అమ్మమ్మ ...నీ ప్రేమను మరువలేను...నీ ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడి కోరుకునే ...నీ మున్నా....." ( మున్నా నా ముద్దు పేరు -- మా మామ్మే పెట్టింది) ...ఇంకో విషాదం నా కజిన్ ఆత్మహత్య ....పదిహేడు సంవత్సరాలు ...ఏమి చూసాడో ...ఏమి సాధించాడో ...ఎందుకు చేసుకున్నాడో ఆత్మా హత్య చేసుకున్నాడు ...ప్చ్...మాలో ఆత్మహత్య మహా పాపం వాళ్ళ కోసం ప్రార్ధించను లేము..ప్చ్ ....
నాన్నంటే నాకు చాలా ఇష్టం అది ఎందుకంటే ..నాన్న చిన్నప్పటి నుండి అనాధ...అన్నల సహకారం తో పెరిగి ...టీచర్లకు నీళ్ళు కూరగాయలు తెచ్చి పెట్టి పదవతరగతి వరకు చదువుకొని ఇంకా చదువుకోవాలి అంటే నీ ఆస్తి ఇంత వస్తుంది అది అమ్మి చదువుకో అని పెదనాన్న వాళ్ళు చెబితే అప్పుడే.... ఎక్కడున్నామో తెలియని మా గురించి ఆలోచించి... రక రకాల జాబులు చేసి టీ కప్పు సాసరు లో భోజనం రెండు చపాతిలతో రాత్రి గడిపి కష్టపడి మమ్మలను ఈ స్థాయి కి తీసుకు వచ్చిన ఆయన అంటే నాకు చాలా ఇష్టం ...ఎప్పుడూ ఎవరితో గొడవపడని ఆయన మనస్తత్వం నాకు ఆదర్శం...ప్రతీ దానికి స్వంతంగా ఆలోచించాలి అనే అయన ఆలోచన అమోఘం ...అలాంటి నాన్నకు గుండె నొప్పి వస్తే ..ఇండియా లో ఉన్న అందరు స్నేహితులను కంగారు పెట్టిన్చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి ..డాక్టరు తో మాట్లాడి ..ఆపరేషను కు సిద్ధం చేసి ..నాన్నారు ICU లో ఉన్నారు ( ఆపరేషన్ కోసం ) అని చెబితే ..నేను నాన్నారి తో మాట్లాడాలి అని మారం చేసి...నా కంటే చిన్నవాడయిన తమ్ముడిని సతాయించి ... ఏడ్చేసాను...ఎంత ఏడ్చానో నాకే తెలీదు...మళ్ళీ నాన్నతో మాట్లాడిన తరువాత కాని కుదుట పడలేక పోయాను..మొగవాళ్ళు ఏడిస్తే బాగోదు అంటారుగా అందుకే బాత్రుము లో కుర్చుని, దుప్పటి కప్పుకుని ఎద్చేవాడిని..నన్ను ఇక్కడకు ( ఈ దేశానికి) వెళ్ళు అని సలహా ఇచిన వాడిని తిట్టుకునే వాడిని...ఏదైతేనేం నాన్నారికి ఆపరేషన్ సక్సెస్స్ అయ్యింది ఇప్పుడు నాన్నారు ఆనందంగా ..ఉల్లాసంగా ఉన్నారు...మా నాన్నారి ఆపరేషను టైములో సహాయ పడినా నా స్నేహితులందరికీ కృతజ్ఞతలు...
అందమైన బిల్డింగులు ..ఖరీదయిన కార్లు...లేవిష్ జీవితం అన్ని వదిలి ఒకే ఒక సంకల్పం తో తిరుగు ప్రయాణమౌతున్నా...నా ఈ చర్య కొంతమంది శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలిగించవచ్చ్చు ..కాని తప్పదు...ఇది నా జీవితం నేనే దిశా నిర్దేశం చేయాలి..ఎలా వస్తే అలా స్వీకరించలేను...ఎవరి ఆజమాయిషీ ని ఒప్పుకోలేను...ఇక్కడి లైఫ్ లో అన్ని ఉన్నాయి కాని "జీవితం" లేదు...ఎంత పెద్ద హోటల్ లో ఉన్న సొంత చిన్న గుడిసె మేలు కదా.....చాలా ఆఫర్లు చాలా మంది ప్రయత్నాలు నా నిర్ణయాన్ని మార్చుకొమ్మని...లేదు ..నేను పోకిరి లో మహేష్ బాబు టైపు ...
చివరగా బ్లాగ్లోకం....వచ్హాను...నేర్చుకున్నాను...రాస్తానో లేదు తెలీదు కాని వస్తుంటాను...చాలా నేర్పించారు ..పెద్దలు ఆదరించారు ..అందరికి వందనాలు.....
జై హో ...భారత్....
18 కామెంట్‌లు:
Bhayee!!!!
Great Welcome To Mother India.
కళ్ళనీళ్ళు తిరిగాయి. పొద్దుటే యెవరికో యీ కామెంటు పెట్టా. బాధే సౌఖ్యమనే భావన రానీవొయ్... ఆ యెరుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్....జగమే మాయ... బతుకే మాయ... ఏదీ స్థిరంకాదు. వొక పరమాత్మ సత్యం, స్థిరం..
Wish you all the best in life. Hearty WELCOME to mother land. I am unable to post with my kastephale
అరే రాఫ్సున్ భాయ్
ఎప్పుడూ సరదాగా ఉండే మీరు ఒక్కసారిగా ఇలా గుండెని పిండేసారేమిటి? మంచి నిర్ణయం! మన భూమి మీద ఉన్న ఆనందంతో గంజి తాగినా పరమాన్నమే! అంతా మంచే జరుగుతుంది! హాయిగా ముందుకి సాగిపొండి! నేను కూడా త్వరగా వచ్చేస్తా మన దేశానికి!
గమనిక: ఇక్కడ అరే అన్నది అరరే అని ఒక expression అంతే కాని మిమ్మల్ని అగౌరవంగా పిలిచినది కాదు!
అన్నట్టు దీనికి మీరు నా ముగింపు అని పెట్టడం నాకెందుకో నచ్చలేదు!
వనజ దీది...బాగున్నారా....!!!
థాంక్స్ అండి...వచేస్తున్నా ... వచ్చేస్తున్నా ..వచేస్తున్నానోచ్.....:):)
తాత ....
మీలాంటి పెద్దలు ఉండగా,,,నాకు భయమేలా?? కష్టాలకు..నష్టాలకు...భయపడను గాని ..నన్ను బాగా భయపెట్టేది ఎవరో తెలుసా...బంధువులు....:):) నిజ్జం .....
అరెరే ...రసజ్ఞ ...:):)
మిమ్మల్ని దీది అనోచో అనకుడదో కొంచే కన్ఫ్యూజన్ అండి ..వనజ అక్క ను కనుక్కోవాలి....:):) త్వరగా వచేయండి...మనకు మనం సంపాదించుకోకుండా నలుగురి కోసం సంపాదిద్దాం..ఏదైనా మంచి పని చేద్దాం....ఏమంటారు??
గమనిక : అరెరే ..అన్నది ఒక expression మాత్రమె...మిమ్మలిని గౌరవించినట్టు కాదు ..:):) అక్కలని చేల్లెల్లని ఆట పట్టించటమే కాని గౌరవించటం నాకు తెలీదుగా.......హహహ :):):)
This is Mr. aatreya's comment..i donno why not published i m posting it from my mail..
మున్నా
చాలా చక్కని నిర్ణయం
సౌదీ వెళ్లక మునుపు ఉన్న పరిస్థితులు చక్కబడటం సంతోషదాయకం.
ప్రతీ మండు వేసవి తొలకరి తో చిలకరించ పడుతుంది,
ప్రతీ మబ్బు ముసురు ఒక ఉదయ కిరణాలతో తేలిపోయి వెలిగి పోతుంది,
నాన్న ఆరోగ్యం బాగవటం, తమ్ముడు సెటిల్ అవటం. అప్పులు తీరి పోవటం,
అన్నీ బాగున్నాయి
అమ్మమ్మ అంటావా, పైనుంచి ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. దీవిస్తూనే ఉంటుంది.
త్రాగే ప్రతి టీ కప్పు ఆమెని నీ ముందు చూపుతూనే ఉంటుంది.
జై హొ !!
బుజ్జి (ఇది నా ముద్దు పేరు, ఇలా పిలవబడటం నాకిష్టం మరి)
ఆత్రేయ (బుజ్జి)గారు...
మీ కామెంటుకు ధన్యవాదాలు...నేను మీకు తెలుసేమో అని నా అనుమానం..:):) ఏదేమైనా కొత్త ఉత్సాహం ఇచ్చారు..ధాంక్స్:):)
స్వాగతం. మన దేశానికి సుస్వాగతం. మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. All the best.
రాఫ్సన్ గారూ ఏం రాయాలో తెలియడం లేదండీ..మీ బ్లాగు తీరిగ్గా చదవాలనుకుంటూ ఆలస్యం చేశాను. ఈ టపా చదవగానే మనసు కదలిపోయింది..మంచి నిర్ణయం తీసుకున్నారు.
బులుసు గురు గారు,
ధన్యవాదాలు...మీ లాంటి పెద్దల ఆశిస్సులు ఉండాలే గాని దూసుకెల్లిపొనూ..:):)
జ్యోతిర్మయీ గారు..
నా బ్లాగు అంతా చదివినందుకు మీరు అర్జెంటు గా ఒక మెడికల్ చెకప్ చేయించుకోవాలి..:):) ధన్యవాదాలు...అవునండి !! జీవితం లో ఏదైనా సాధించాలి అనుకుంటే ఇక్కడ ఉండకూడదు...ఇక్కడ "రంగు పేపర్లు" మాత్రమె సాధించ గలను..కాని అందరిలా కాకుండా నా రంగు పేపర్లు నాకు వస్తు..... ఇంకో నలుగిరికి రంగు పేపర్లు పట్టుకు రావాలి...థాంక్స్..
మీ పాఠశాల బ్లాగు కి నేనో పెద్ద AC ని మా టీచర్లు కుడా చెబుతూ ఉంటా చూస్తూ ఉండమని ...మనకు పనికొచ్చేయి ..వదలకుండా నోట్సు రాసుకోండి అని...హిహిహి..కోపం రాదు కదా....!!
మున్నా భాయ్,
బై బై అకడికి
సై సై ఇక్కడికి
రైట్ రైట్ రైటో
మీ తాత గారు అనుబంధం గురించి రాస్తే వర్డ్ ప్రెస్ అయి పోయింది అన్నాను.
మీ ఈ 'నా ముగింపు ' చదివ్తే బ్లాగ్ లో 'స్పాట్' అయి పోయిన రాఫ్సన్ మహాశయుడు కనబడ్డాడు.
అల్ ది బెస్ట్ ఫార్ యువర్ అడ్వెంచర్.
చీర్స్
జిలేబి.
Gilebi Ma'm,
Thanks a lot .... Raafsun Bhai..is Raafsun bhai..:):)
జీతం ఏమ్టా ఊన్నా ....జీవితం వదులుకొకూడదు.
మనం అనుకుంటె....సంపాదించగలం....కాని త్రుప్తి లెకుండా బతకలెము...మీ కజిన్ ఆత్మ శాంతి కలగాలని కొరుకుంటూన్నా....మాకెమి తప్పు లెదు...నెను ప్రార్దిస్తాను....
ఆలస్యంగా చూసానే ఇంత మంచి పొస్ట్ ని అనే భాధ...అయినా మీ నిర్ణయం చదివాక కలచిన మనసుకి సంతృప్తి.
శశి కళ గారు ...చాన్నాళ్ళకి ...వచ్చారు .....
బాగాచెప్పారు...జీతం కంటే జీవితం ముఖ్యం....చాలా చాలా థాంక్స్ అండి మా కజిన్ కోసం ప్రార్ధిస్తాను అన్నందుకు...:) :)
పద్మర్పితా గారు,
నచ్చినందుకు, వచ్చినందుకు...ధన్యుడిని.....కొన్ని నిర్ణయాలు స్వల్ప బాధ అదిక ఆనందాన్ని కలిగిస్తాయి ..నా నిర్ణయం కుడా అలాంటిదే....:)
చాలా బాగుంది. ఇదిడ్ పాత పోస్తే కాని, ఇప్పుడే చూసాను. ఇప్పుడే చూసాను. ఈ టైం కి మీరు ఇండియా వచ్చేసి ఉంటారేమో. కాని చదువుతుంటే నేనే ఇండియా కి వచేస్తున్నట్టు feel అయ్యాను. నేను కూడా ఇండియా బయటే ఉన్నాను. నా లక్ష్యం పూర్తీ కావాదానికి ఇంకా టైం ఉండి లెండి. anyhow all the best.
:venkat.
కామెంట్‌ను పోస్ట్ చేయండి