28, జనవరి 2012, శనివారం

Johnny Johnny.. YES PAPA !

Johnny Johnny.. YES PAPA !
Job in Gulf..YES PAPA !
Lot of Tension..YES PAPA !
Too Much Work..YES PAPA !
Family Life..NO PAPA !
BP-Sugar..HIGH PAPA !
Yearly Bonus..JOKE PAPA !
Annual Pay..LOW PAPA !
Personal Life..LOST PAPA !

Promotion Incentive..HA ! HA ! HA !

24, జనవరి 2012, మంగళవారం

నా కోసం నా మిత్రుడు....రాసిన టపా

నా కోసం నా మిత్రుడు....రాసిన టపా....ఏంటో అభిమానం..:ప్చ్....):):)

http://endukoemo.blogspot.com/2011/11/to-dear-raafsun.హ్త్మ్ల్

థాంక్స్ టు" ఎందుకో ఏమో ?! "శివ గారు ..

23, జనవరి 2012, సోమవారం

నా ముగింపు....

     నేను ఈ దేశం రాక ముందు నాకు కొన్ని అప్పులు ...బాధ్యతలు....సమస్యలు...వచ్చేముందు   ఒకటే కోరుకున్నాను దేవుడిని...నా ప్రొబ్లెంస్ పరిష్కారమైతే చాలు.....అని ...అయిపోయినాయి.. ఏడు లక్షల అప్పు...., నాన్నారి గుండె ఆపరేషను...తమ్ముడి సెటిల్.....అంతా పరిష్కారమైనాయి..ఇంకా నేనెందుకు ఇక్కడ??? 

       నా ఈ ఒకటిన్నర విదేశీ జీవితం చాలా విషయాలు నేర్పింది...జీవిత పాఠాలుగా వాటిని స్వీకరిస్తున్నా.....మోసాలు , దోస్తులు , బంధువులు , గొడవలు , భయం , భక్తీ, డబ్బు , విలాసం, చాలా చాలా నేర్చుకున్నా...అదేంటో అందరు అదే అంటారు నువ్వు ఉంటానికి అక్కడ ఉన్నావు గాని నీ మనసంతా భారతమేరా అని ..... నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, అని పదే పదే చిన్నప్పుడు తెగ అరిచేవాడిని ..ప్రేమిస్తున్నాను అనే పదం వొత్తి పలికేవాడిని భవాని వంక చూస్తూ...హహ... ఇప్పుడు అర్ధం అవుతుంది ప్రేమించడం అంటే ఏంటో ...ఎన్నో గొడవలు...ఎన్నో రాజకీయాలు ...స్కాములు...బాబాలు ..హజారే ...అయినా నా దేశం....నా భారత దేశం అన్నింటికంటే గొప్పది..అది ఇక్కడకు వచ్చిన  తరువాత అనుభవం లో వచ్చింది...నిజానికి ఎప్పుడు నాకు మా ఉరి హైస్చులు...చెరువు గట్టు ..మురుగు కాలవ వంతెన...పంట బోదు...సెంటరు...పొట్టోడి హోటలు ...మురళి గారి టెన్నిసు కోర్టు...ఇవే ఉండేవి మనసు నిండా...

   అన్నింటి కంటే ఉత్తమంగా నేను సాధించింది ప్రతీ ముస్లిం తన జీవిత కాలం లో ఒక్కసారి అన్నా దర్శించాలి అనుకునే పవిత్ర " మక్కా" అతి చిన్న వయసులోనే ఇప్పటికి మూడు సార్లు దర్శించాను మళ్ళి ఇంకోసారి వెళ్ళ బోతున్నాను ....కాని హజ్జ్ చేయలేక పోయాను అని ఒక బాధ ఉండిపోయింది అలాగే  నా అమ్మ నానా లను ఇక్కడ ఉండి కుడా హజ్జ్ కనీసం "ఉమ్రహ్ " ( మక్కా దర్శనం" ) చేయించలేక పోయానే అనే బాధ కుడా ఉండిపోయింది... కొంచెం లావు అయ్యాను...ఎప్పుడో MBA  చదివేటప్పుడు వేసాను పోనీ టైల్ మళ్ళి ఇన్నాళ్ళకు వేయగాలిగాను..ఎవరు చూడరులే అన్న ధైర్యము తోటి.....:) సాంకేతిక విజ్ఞానం పెంచుకున్నాను....కొంచెం ఆర్ధికం గా లాభపడ్డాను ...కాని ఈ రంగు కాగితాల కోసం నా జీవితాన్ని నా లక్ష్యాన్ని వదులుకోలేను అందుకే బ్యాక్ టు ఇండియా .....

నేను వచేటప్పుడు నా అమ్మమ్మ దగ్గిరనుండి బయలు దేరాను...నేనంటే ఎంతో ఇష్టం ఆవిడకి.. ప్చ్... ఇప్పుడు నేను వెళితే " మున్నా ...ఆగయా....రుక్ చాయ్ బనాకే దేతీ.." అనే అమ్మమ ఇక లేదు ...ఆవిడా ఆఖరి మజిలికి చేరుకుంది..నేను వచేటప్పుడు " అమీర్ ...అబ్ అమీరోకా అమీర్ బాన్ జాఏగా" అని చెప్పిన నా అమ్మమ్మ ఇక కనబడదు..తలుచుకుంటే ఏడుపు వస్తుంది " ఎప్పుడూ..అరె మున్నా అమ్మి కో జత్తాన్ సే దేఖ్ లే " అని ఎప్పుడూ మా అమ్మ గురించి ఆలోచించే అమ్మమ్మ ఇక లేదు....." అమ్మమ్మ ...నీ ప్రేమను మరువలేను...నీ ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడి  కోరుకునే ...నీ మున్నా....." ( మున్నా నా ముద్దు పేరు -- మా మామ్మే పెట్టింది) ...ఇంకో విషాదం నా కజిన్ ఆత్మహత్య ....పదిహేడు సంవత్సరాలు ...ఏమి చూసాడో ...ఏమి సాధించాడో ...ఎందుకు చేసుకున్నాడో ఆత్మా హత్య చేసుకున్నాడు ...ప్చ్...మాలో ఆత్మహత్య మహా పాపం వాళ్ళ కోసం ప్రార్ధించను లేము..ప్చ్ ....

  నాన్నంటే నాకు చాలా ఇష్టం అది ఎందుకంటే ..నాన్న చిన్నప్పటి నుండి అనాధ...అన్నల సహకారం తో పెరిగి ...టీచర్లకు నీళ్ళు కూరగాయలు తెచ్చి పెట్టి పదవతరగతి వరకు చదువుకొని ఇంకా చదువుకోవాలి అంటే నీ ఆస్తి ఇంత వస్తుంది అది అమ్మి చదువుకో అని పెదనాన్న వాళ్ళు చెబితే అప్పుడే.... ఎక్కడున్నామో తెలియని మా గురించి ఆలోచించి... రక రకాల జాబులు చేసి టీ కప్పు సాసరు లో భోజనం రెండు చపాతిలతో రాత్రి గడిపి కష్టపడి మమ్మలను ఈ స్థాయి కి తీసుకు వచ్చిన ఆయన అంటే నాకు చాలా ఇష్టం ...ఎప్పుడూ ఎవరితో గొడవపడని ఆయన మనస్తత్వం నాకు ఆదర్శం...ప్రతీ దానికి స్వంతంగా ఆలోచించాలి అనే అయన ఆలోచన అమోఘం ...అలాంటి నాన్నకు గుండె నొప్పి వస్తే ..ఇండియా లో ఉన్న అందరు స్నేహితులను కంగారు పెట్టిన్చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి ..డాక్టరు తో మాట్లాడి ..ఆపరేషను కు సిద్ధం చేసి ..నాన్నారు ICU  లో ఉన్నారు ( ఆపరేషన్ కోసం ) అని చెబితే ..నేను నాన్నారి తో మాట్లాడాలి అని మారం చేసి...నా కంటే చిన్నవాడయిన తమ్ముడిని సతాయించి ...  ఏడ్చేసాను...ఎంత ఏడ్చానో నాకే తెలీదు...మళ్ళీ నాన్నతో మాట్లాడిన తరువాత కాని కుదుట పడలేక పోయాను..మొగవాళ్ళు ఏడిస్తే బాగోదు అంటారుగా అందుకే బాత్రుము లో కుర్చుని, దుప్పటి కప్పుకుని ఎద్చేవాడిని..నన్ను ఇక్కడకు ( ఈ దేశానికి) వెళ్ళు అని సలహా ఇచిన వాడిని తిట్టుకునే వాడిని...ఏదైతేనేం నాన్నారికి ఆపరేషన్ సక్సెస్స్ అయ్యింది ఇప్పుడు నాన్నారు ఆనందంగా ..ఉల్లాసంగా ఉన్నారు...మా నాన్నారి ఆపరేషను టైములో సహాయ పడినా నా స్నేహితులందరికీ కృతజ్ఞతలు...  

అందమైన బిల్డింగులు ..ఖరీదయిన కార్లు...లేవిష్ జీవితం అన్ని వదిలి ఒకే ఒక సంకల్పం తో తిరుగు ప్రయాణమౌతున్నా...నా ఈ చర్య కొంతమంది శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలిగించవచ్చ్చు ..కాని తప్పదు...ఇది నా జీవితం నేనే దిశా నిర్దేశం చేయాలి..ఎలా వస్తే అలా స్వీకరించలేను...ఎవరి ఆజమాయిషీ ని ఒప్పుకోలేను...ఇక్కడి లైఫ్ లో అన్ని ఉన్నాయి కాని "జీవితం" లేదు...ఎంత పెద్ద హోటల్ లో ఉన్న సొంత చిన్న గుడిసె మేలు కదా.....చాలా ఆఫర్లు చాలా మంది ప్రయత్నాలు నా నిర్ణయాన్ని మార్చుకొమ్మని...లేదు ..నేను పోకిరి లో  మహేష్ బాబు టైపు ...

చివరగా బ్లాగ్లోకం....వచ్హాను...నేర్చుకున్నాను...రాస్తానో లేదు తెలీదు కాని వస్తుంటాను...చాలా నేర్పించారు ..పెద్దలు ఆదరించారు ..అందరికి వందనాలు.....

జై హో ...భారత్....


17, జనవరి 2012, మంగళవారం

my enemies appealed in high court...:(:(

I LOVE MY ENEMIES...











I came to know today...my enemies appealed in high court ...I  do agree that they are politically n financially stronger than me...but in terms of confidence I ....AM....THE....KING.... i can punish them very hardly..but :( they are my relatives....i decided form the first day of my business....i want to be ethical else i can do what ever i want...


as much as they escalate the issue that much deep will be their grave...i will never fail..never fail...never fail...


How cool man i am...they made me too rough.....i m friendly but they made me too harsh....i fed up with this people....now i should strong...they played with my emotions...i had strongest confidence when i started business because of these probs i tried SUICIDE...i never cried in my life even i lost my love but never cried but these people made me so much emotionally imbalanced...


yes i was rough in dealing with these peoples...but why i was rough???? 
who were they to decide my life???


in a little span on 25 yrs i learned lot of things... love ...failure....job...business...expatriate life..all what i want to achieve i m on the way to achieve, but but... thanks god...u r making me strong enough by giving problems...they are not problems for me they are lessons...


I WISH I WILL ROCK IN BUSINESS HOW MANY HANDLES MAY COME..I NEVER LOOS MY CONFIDENCE !!!!!

పాకిస్తాన్ జిందాబాద్---- By An Indian...??!!

      నేను ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాను....ముస్లిములు అందరు చెడ్డవారు కాదు అని..ముస్లిములు మరియు ముస్లిం భారతీయులు వేరు వేరు అని ......కర్ణాటక లో పాకిస్తాన్ జండా ఎగరవేశారు అని తెలిసినప్పుడు...నేను ఏమనుకున్ననో తెలుసా...కొంత మంది తిక్క నాయాళ్ళ వల్ల ...భారత దేశం లో ముస్లింలు కొందరు  వివక్ష కు గురవ్తున్నారు అని....అంటే నేను కుడా అనుకున్నాను ఇది ముస్లిముల పనే అని....ఎందుకంటే మీడియా అలా చూపించింది మరి...కాని నిజానికి అది చేసింది ఒక వర్గ అతివాద గ్రూపు....నాకు ఈ విషయం ఇప్పుడు తెలీగానే ఎంత కోపం వచిందో ....కాని నేను ఆవేశపరుడిని కాను....ఆలోచనా పరుడిని....

   ఆ పని చేసినా అతివాదుల మీద కంటే కుడా ఆ విషయానికి ముందుగా మీడియా ఇచిన ప్రాముఖ్యత, దాని నిజానికి దాని వెనక ఉన్న రహస్యానికి ఇవ్వలేదు...అందుకే నాకు కోపం...చేసే వాడు వంద గారడీలు చేస్తాడండి....చూసే వాడు నిజం తెలుసుకుంటాడు....మరి వినేవాడు ??? చదివి తెలుసుకునే వాడు....??? మోసపోరు?? అసలు ఇలాంటి విషయాలని హైప్ చేసి చూపిస్తే కొంచం వరకైనా ఈర్ష్య ద్వేషాలు తగ్గుతాయి కదా...ఆ న్వుస్ చదివి ..ఒక వర్గాన్ని ఈసడించుకునే వాళ్ళు దాని నిజా నిజాలు తెలుసుకుని " అందరు అలాంటి వాళ్ళు కాదులే...వీళ్ళు మనవాళ్ళు" అనుకుంటారు కదా...

  అది వెధవ పనే...కాదని ఎవరు అనరు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ అభిమతం ఏదైనా లాభం పొందటం వరకే ఉండిపోయింది కాని మీడియా నిజా నిజాలు దాయటం వల్ల వాళ్ళ అభిమతానికి సహకారం చేసినట్లు అవ్వట్లేదు?? మర్డర్ చేసినోడి కన్నా వాడు తప్పించుకోవడానికి సహకరించిన పోలీసోడు ప్రమాదకారి కదా....వాడిని కాపాడి సమాజం లో వొదిలేస్తే ఇంకో హత్య చేస్తాడు కదా...అంటే హంతకుడు చేసింది ఒక తప్పు ఆ తప్పు కప్పిపుచ్చ టమే   కాకుండా ఇంకో హత్య   చేయడానికి సహపడుతున్నాడు పోలీసు ... ఇక్కడ పోలీసు ని మీడియా తో పోల్చి చుడండి...


   నేను ఇప్పటికి నా స్నేహితులతో చెప్తుంటాను...అరె ఏందిరా మీ గోల మైనారిటీలు మైనారిటీలు అని....ఒక్క సారి బయటకు వెళ్లి చూడండి...ఇక్కడ "మనం" మైనారిటీలైనా కుడా రాజయోగం అనుభవిస్తున్నాం...ఇక్కడ "మనం" ప్రశాంతం గా ఉన్నాం ...   మన సంస్కృతీ వేరు రా అని ...ఇప్పటికి అదే చెబుతాను ...కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ " మనం " లో ఎంతమంది ఉన్నాం అనిపిస్తుంది....


    నేను కోరుకునేది ఒక్కటే " ఈ విషయం ( సోదర వర్గ అతివాదులు జండా ఎగరవేయ్యడం) " ముస్లిం వర్గానికి అస్సలు తెలియకూడదు...ఎందుకంటే " చేసేదంతా వీళ్ళు .....బలయ్యేది మేము " అని ఈర్ష్య పెంచుకొనే ఆస్కారం ఉంది.....


      దొంగ బ్యాంకు దగ్గర దొంగతనం చేసేటప్పుడు..టార్గెట్ మనిషి  ఎలా సంపాదించాడు...ఈ డబ్బులు కూతురి పెళ్లి కోసమా..అబ్బాయి చదువు కోసమా??...ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ వెల్లడానికా??...ఇవన్ని ఆలోచించడు...తనకు కావలిసింది డబ్బు ...అంతే!!! ఈ పని చేసినవాళ్ళు కుడా " నేను ఇలా చెయ్యడం వాళ్ళ ఇంత పెద్ద భారత దేశం లో జనాలు ఎక్కడ ఎక్కడ కొట్టుకు చస్తారు?? ఎంత ప్రాణ నష్టం ఎంత ఆస్తి నష్టం అవుతుంది...ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి...ఎంతమంది దేశ వ్యతిరేక శక్తులు తయ్యారు అవుతారు....??? ఇవన్ని ఆలోచించడు..తన అభిమతం ఓట్లు కానివ్వండి ప్రచారం కానివ్వండి...అంత వరకే ఆలోచిస్తాడు....

    ప్రతీసారి " మేము కుడా భారతీయులమే" అని చెప్పుకు తిరగాల్సిన దౌర్భాగ్యపు బ్రతుకు బాధ నుండి మాకు విముక్తి కావాలి....ఆంటే మేము ఏమి చేయాలి ???

అసలైన నిజం ఇక్కడ ఉంది http://www.thehindu.com/news/national/article2790960.ece?homepage=true#.Tw162JLWaUQ.blogger

  నాకు ముక్తాఇంపు ఇవ్వడం సరిగా రాదు....ఇందులో నేను బాధ ను మాత్రమె పంచుకుంటున్నాను..ఒకవేళ మీకు ఈర్ష్య కనబడితే అది నా తప్పు కాదు నా కోపం తప్పు...:):) తెలియపరచండి...తీసేద్దాం....


16, జనవరి 2012, సోమవారం

"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" IX


జీవితం....స్త్రీ.....లక్ష్యం......" IX

తొమ్మిదవ భాగం 
( కష్టాలు కన్నీళ్ళతో సాగుతున్న రాజుగాడి నావ ఒక ఒడ్డుకు చేరే దశకు వచ్చింది. తను ప్రేమిస్తున్న భవానిని ఎవరుప్రేమించకుండా కుట్రలు పన్నుతూ , స్కూల్ టీచర్లతో గొడవలు పడుతూ....క్రుతికా ని మోసం చేస్తూ ఉండగా )

               అలా సోషల్ మాడం వెళ్ళిన తరువాతా ఆవిడచెల్లి గారు వచ్చి విచారించి నా వైపు క్రురాతి క్రురంగా చూసి...కస కసా వెళ్ళిపోయారు...నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ చెప్పే మాటలకు నాకు చెమటలు పట్టడం ప్రారంభం అయ్యింది, భవిష్యత్తు కళ్ళ ముందు రికార్డింగ్ డాన్సు వేస్తుండగా .....ఇంటర్వేల్లు మోగింది....మా స్కూలు ఉపాధ్యాయ కుటుంబం అంటా ఒక అత్యవసర సమావేశం తలకాయ రూం ( హెడ్ రూం ) లో పెట్టారు.....ఇంటర్వేల్లు లో అంతా "రాజు గాడు సోషల్ టీచర్ని  కొట్టాడు" అని ఒక సంచలన వార్తా గురించి ఇష్టా గోష్టి మొదలుపెట్టారు ..ఆరవ తరగతి ,ఏడవతరగతి పిల్లలు నా వంక భయం గా చూస్తున్నారు....అంతా  చిందరవందరగా చికాకుగా ఉండగా...ఇంటర్వేల్లు అయిపొయింది.

           క్లాసు మొదలైన పది నిమిషాల వరకు క్లాసులకి టీచర్లు రాలేదు...నా కోసం ఏదో మర్డర్ ప్లాన్ వేస్తున్నారని అర్ధం అయ్యింది అయినా ఒక మొండి ధైర్యం తో పారిపోకుండా క్లాసు లోనే ఉండిపోయాను...ఆతరువాత వచ్చిన మా లెక్కల టీచరు " నా దగ్గరకు వచ్చి ఏమి జరిగిందిరా  ? అని అడిగారు...నేను చెబుదాం అనుకుంటుండగానే నా అనుచరుడు ( హిహిహి) ఒకడు మొత్తం కధ పుసగుచ్చి.... దండ కట్టి .....మాడం మెళ్ళో వేసి..." ఆ..ఇక చప్పట్లు కొట్టండి అన్నట్టు "అందరి  వైపు చూసాడు, ఆవిడ మొత్తం విని నా భుజం మీద చెయ్యివేసి నన్ను తట్టి వెళ్ళిపోయారు....అలా నిమరటం  చుస్తే మా ఊరిలో  పొట్టేలు  పంద్యాలు  గుర్తుకు వచ్చాయి ,,, పోటి కి ముందు గొర్రె తల కుడా అలాగే నిమురుతారు....

కాసేపటికి నా పెళ్లి కి నాకే పిలుపు ఇవ్వటానికి మా ప్యున్ వచ్చాడు......
 
     వెళ్ళే ముందు ఒక్కసారి భవాని వంక చూసాను .. అప్పుడు తను నా వైపు చుసిన చూపు " తప్పు కదరా..అలా చెయ్యకూడదు కదా....హేడు గారు ఏమైనా అంటే ఏమి అనకు ....కొడితే నాలుగు దెబ్బలు తినేసి కళ్ళు తుడుచుకుని వచ్చి కూర్చో " అన్న సంకేతాన్ని నాకు వినిపించాయి.....

హెడ్ మాస్టారు ....అందరికి ఈయనంటే "అది"( మహేష్ బాబు బిజినెస్ మాన్ డైలాగు), ఎన్ని వెధవ వేషాలు వేసినా మనకు ఇప్పటివరకు ఈయన ఆఫీసు దర్శన భాగ్యం దక్కలేదు.....ఎందుకంటే ఎప్పుడు ఎ పరీక్షలలోను మనం తప్పలేదుగా అందుకేమో..!! యమధర్మరాజు లాగా  ఒక రూళ్ళ కర్ర ఒకటి పెట్టుకుని " నీ పెళ్ళికి సర్వం సిద్ధం " అన్నట్టు కూర్చున్నాడు....ఇక మనం పిల్లి కి దొరికిన ఎలుక లాగా నుంచున్నాం...ముందు హాజరు పట్టి తెప్పించాడు...మన హాజరు చుస్తాడేమో అనుకున్న అయినా మనం "హాజరు లో కేక" అని పాపం తెలీదు అనుకున్నా...మనం తెగ రేగ్యులరు స్కూలు కి ఎందుకంటే మరి భవాని ని చూడాలంటే ఇదే కదా మన లుంబిని వనం .......ముందుగా నా పేరు మీద రెడ్ ఇంకు తో కొట్టేసాడు.....మనకు మొదలు దడ..దడ ... నాకు కొత్త తోలు వచ్చే భాగ్యం మా నాన్న చేతిలో ఉండనే ఉంది అనుకున్నాను...ఇంతలో మన యముడి గారి గొంతు ...

" ఎరా ....నిన్ను తీసేసాను స్కూల్లో నుండి ...వెళ్లి ఆడుకో..."

ఈయన తీసేస్తే నేను కాదు ఆడుకునేది...మా నాన్న ..నాతొ...... అనుకుని ...సరే ఏమి జరిగితే అదే జరుగుతుంది లే అనుకోని 

"అలాగే సార్ ..." అన్నా....

"అయితే ఇంకే వెళ్ళు "

మెల్లగా బయటకు వచ్చి ...ఇక భవానిని బయటనుండే చూడాలేమో అనుకుంటూ నడవటం మొదలు పెట్టా...పుస్తకాలు తీసుకుందామని క్లాసు వైపు వెళ్తూ వెళ్తూ ...ఇంకా మనకి పుస్తకాలతో పనేముంది అనుకుని అలాగే మెయిన్ గేటు పైపు నడవడం మొదలు పట్టాను...సరిగ్గా గేటు దాటుతుండగా వెనక నుండి పూను వచ్చి ..."రా నిన్ను పిలుస్తున్నారు " అన్నాడు....వెళ్తూ వెళ్తూ మనకో ఉపదేశం చెప్పాడు " రెండు దెబ్బలు తినేసి ఇంకెప్పుడు చెయ్యను సార్ అని వెళ్లి క్లాసు లో కూర్చో చదువు పాడు చేసుకోకు ...చదువు లేకపోతె చంక నాకి పోతావ్ " అని ...

వెళ్ళగానే...." ఎరా వెళ్ళమంటే వెళ్ళిపోతావా" అని హెడ్ గారు నా హెడ్ మీద వాలిన ఈగని తన ప్రియ చేత్తో ఒక్కటి కొట్టారు పాపం ఈగ....అదే టైము లో నా నుదురు మీద కుడా ఒక ఈగ వాలింది " తల ఈగ" "నుదురు ఈగ " ప్రేమికులు అనుకుంటా...ఆయన తలమీద ఈగను కొట్టగానే "నుదురు ఈగ" తన శరీరాన్ని నా ముందు ఉన్న బల్లకు గుద్దుకుని " ఆత్మదానం  " చేసుకుంది ...కాకపొతే దాని బాడీ బల్లకు కొట్టుకోవడానికి నా నుదురు సహాయం తీసుకుంది....పాపం ఈగలు చచ్చిపోయాయి......(నాకేం కాలా.... నాకేం కాలా......)

అదికాదండీ ...ఆయనకు భరత నాట్యం...బ్రేక్ డాన్సు చూడాలనుకుంటే టీవి పెట్టుకుంటే సరిపోతుందిగా .....ఆ రూళ్ళ కర్ర తో నాకు చక్కిలిగింతలు పెట్టాలా????.(నాకేం కాలా.... నాకేం కాలా......)...అసలే నేను నవ్వను కాని ఎందుకో  అలా ఆయన చక్కిలిగింతలు పెడుతున్నప్పుడు టేబుల్ మీద పడిఉన్న "నుదురు ఈగ" మృతదేహాన్ని చూసి దాని ప్రేమ తలుచుకుని భవాని  గుర్తుకు వచ్చి " కొన్ని ఆనంద భాష్పాలు" ప్రకృతి కి దానం చేశా...(నాకేం కాలా.... నాకేం కాలా......)...ఆయన నా డాన్సు చూసి తరించి ...ఒక గ్లాసు మంచినీళ్ళు " కుండ మార్పిడి " చేసారు....( అంటే అక్కడ ఉన్న కుండ లో నుండి తీసి ఆయన కుండ ( పొట్ట) లో వేసుకున్నారు....జనానికి మరీ హాస్యరసం లేకుండా పోతుంది ఏంటో...)...సింహాసనం అధీష్టించి...డమరుకం ( బెల్లు) మోగించారు.....భటుడు( ప్యూను) వచ్చి 
" ఆజ్ఞా మహాప్రభో " అన్నాడు... 

"వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకురా " అని ఆజ్ఞాపించి నా వైపు ప్రేమ పూరిత చూపు విసిరారు...

అప్పటిదాకా ఉన్న నా రికార్డులు చూసి ఆయన కళ్ళు పెద్దవవ్వడం గమనించాను...ఈ మార్కులు " నీవా..నీవా" అని చంద్రముఖి లా అరిచారు...అప్పుడు గమనిచాను ఆయనలో " మనిషి" ఉండటం...ఆయన మనిషి లా అయిపోయారు....మనిషిలా నా వంక చూసారు......మనిషిలా ప్రవర్తించడానికి సమయిత్తమయ్యారు...
నేనేమో కళ్ళకింద ఏదో కదిలినట్టు అనిపిస్తే తుడుచుకున్నా( ఏమిలేదు ఏమిలేదు) ....ఏదో తడిగా తగిలింది ఫ్యాను   లేదుగా... చెమట ఏమోలెండి....

అవును "నాయె " అన్నాను ...

"నీకేం పోయేకాలం వచ్చిందిరా ఇంత బాగా చదువుతూ ఇలా తయారయ్యవ్ ...".( అంటే ప్రేమికుడిలా అని ఏమో కదా) ..అని మొదలుపెట్టి " నాకు తెలుసు నువ్వు స్కూలు ఫస్టు వస్తావ్..ఇంకోసారి నువ్వు ఇక్కడికి రాకూడదు నేనే రావాలి నీకు ప్రైజు ఇవ్వడానికి ...చదవరా ...నువ్వు పెద్ద దాక్టరువి అవుతావ్ అన్నారు....వెళ్లి పాఠాలు విను పో " అని ఆపారు....

అలా సోషల్ టీచర్ తో గొడవ పడి పెద్దాయన దగ్గర అభిమానం సంపాదించుకున్నాం...ఇంకా ఇరవై రోజులు ఉన్నాయి అర్ధసంవత్సర పరీక్షలకు....బాగా చదావాలి అని మనసులో ఉన్న భవానికి చెప్పుకుని...క్లాసు లోకి వెళ్ళాం....

ఒక ఫైన్ డే...ఏదో పని మీద స్టాఫ్ రూం పక్కనుండి వెళ్తుంటే...సైన్సు ల్యాబు లో సైన్సు మాస్టారు " గోపినారాయణ" ..నాకు ఆరవ తరగతి లో తెలుగు పాఠాలు చెప్పిన " ఆచార్యులు" మాష్టారు ..మాట్లాడు కుంటున్నారు...ఏదో" రాజు " అనే పదం వినబడి ఆగిపోయా......

గోపినారాయణ గారు "రాజు గాడు ఒట్టి వెధవ అండి ఎప్పుడు ఆ భవాని మీద రెండు కళ్ళు వేసుకుని చూస్తూంటాడు..వాడికి చదువు రాదు..పెద్దాయన ఏదో అనుకుంటున్నాడు గాని వీడి బొంద వీడు పాస్ కుడా కాడు.."

ఆచార్యులు గారే మో " కాదండి ఆడు ఏకసంతాగ్రాహి ఏదైనా యిట్టె పట్టెస్తాడు...వాడు పద్యాలు పాడితే ఎంత వినసొంపుగా ఉంటాయంటారు..."
 
గొనా" ఆ బోడి తెలుగు దేముందండి అందరికి వస్తాయి మార్కులు...మిగతావి రావాలిగా..."

ఆచార్యులు గారు "బోడి తెలుగైనా బొంగులో సైన్సైనా ఆడు తలచుకుంటే పట్టేస్తాడండి...వాడు కత్తి..."

"కత్తా ..సూత్తా ...వాడు గనక పెద్దాయన మొన్న స్టాఫ్ మీటింగులో చెప్పినట్టు వాడు ఫస్టు వస్తే నేను ఇక్కడ జాబే మానేస్తానండి"

" మాష్టారు తొందర పడుతున్నారేమో ...వాడు అసాధ్యుడు "

వాడి బొంద ...నేను   క్లాసు కెళ్ళాలి.." అని గోపి గారు లేచారు...మనం జారుకున్నాం.....

వీల్లేంటి మనగురించి గొడవపడుతున్నారు...మనకెందుకు వచ్చిన గొడవలే అనుకుని భవాని కోసం వెళ్లి పోయాను...నేను... నా భవాని..... మాకు ఒక రెండు మూడు డజన్ల పిల్లలు...... అనుకుంటూ కాలం గడిపెస్తున్నాను...కాని కాలం మారుతూ ఉంటుంది కదా...అలాగే నాకు కుడా .....

ఇప్పటికి చాలు......మొత్తం చెప్పేస్తే "  కిక్కు పోతుంది " మల్లి అత్తమానం రాదుగా....

14, జనవరి 2012, శనివారం

నాకు మాత్రం బ్లాగులోకం లో అందరు ఆడవారు " అక్కలు" మొగవారు " అన్నయ్యలు"

                                                                                                                                                                         నాకు మాత్రం బ్లాగులోకం లో అందరు ఆడవారు " అక్కలు" మొగవారు " అన్నయ్యలు" నాకంటే చిన్నవాళ్ళు ఉంటె వాళ్ళందరూ " తమ్ముళ్ళు చెల్లాయి లు " ఒక తాత " కష్టేఫాలే" , ఇద్దరు గురువులు " బులుసు గారు,భారారే గారు "
బంధాలని అనుబంధాలు చేసుకోవాలి , అందరం కలిసుండాలి, నాకు కుల, మత, వర్గ, వర్ణ, లింగ, భాష , ప్రాంతీయ బేధాలు లేవు. నేను అక్క, అన్నయ్య, గురుగారు , తాతయ్య, అని పిలిచేది బంధాలని పవిత్రం గా కలకాలం కాపాడుకోవటానికి..

      నాకు తెలిసింది కొంచెం, తెలుసుకోవాలిసినది చాలా ఉంది, మీరు నమ్మరు గాని నాకు ఇప్పటి వరకు శత్రువులు లేరు..నిజ్జంగా నిజం ....మన సంస్కృతీ అందరి కంటే   గొప్పది , మా ఉరిలో చుడండి బాబాయ్ అని ,  తాత అని , ఎంటేటో  పిలుచుకుంటారు, కాని ఒకరికి ఒకరు సంబంధం ఉండదు వేరే వేరే కులాల వాళ్ళు, మతాల వాళ్లును. 

గ్రూపులు కట్టుకుంటే గ్రూపులు వస్తాయి గాని, అన్ని నావే అనుకుంటే గ్రుపులేందుకు వస్తాయి?? మనం తెలుగోళ్ళం...తెలుగు "గొళ్ళ" లా రక్కుకోవడం అవసరమా.....?? మీ అభిప్రాయాలని చెప్పండి , ఎవరైనా విమర్శిస్తే మీరు నమ్మడానికి కారణం వివరించండి ఆ వివరణ " నువ్వు ఇదే నిజం!!! అని నమ్మి తీరాలి" అన్నట్టు కాకుండా " ఇందుకు నేను నమ్ముతాను " అన్నట్టు వ్యక్తపరచండి....విమర్శ అనేది మనల్ని మనం సరి చూసుకోవడానికి పనికివస్తుంది, విమర్శ చేసే వాళ్ళు కుడా ముందుగా" నేనెందుకు విమర్శించాలి ?" అని చూసుకోండి .....ఒకవేళ " నా భావాలతో ఈ భావాలు సరిపడటలేదు!" అని సమాధానం వస్తే వదిలేయండి ఎందుకంటే " ప్రపంచం లో ఎ ఇద్దరి భావాలు సమానం గా ఉండవు, అన్ని కలిసినా..... ఒకచోట తేడా కొట్టేస్తుంది....అందుకే కదా ఇన్ని గ్రూపులు , ఇన్ని మతాలూ, ఇన్ని ప్రాంతాలు ఇన్ని ఆచారాలు, రకరకాల సాంప్రదాయాలు , భిన్న   వేషధారణలు , ఒకవేళ మీరు విమిర్శించడానికి కారణం అతని  బాగు అయితే ఒక్కసారే చెప్పండి , మళ్ళి మళ్ళి చెప్పకండి....చెప్పగా చెప్పగా నిజం అబద్దం , అబద్దాన్ని నిజం చేయ్యోచేమో  గాని మనం మాత్రం శత్రువులం అయిపోతాం.....శత్రువు ఎప్పటికైనా ప్రమాదకారే కదా...మరి మనమే శత్రువు ని తయారు చేసుకోవడం ఎందుకు???అనక బాధపడటం ఎందుకు???

అందరు ఉండాలి అనుకునే ఒక గ్రూపు ఉంది అదే ' హాస్య గ్రూపు" ఇక్కడ మనం కొట్టేసుకోవడం వల్ల ప్రపంచం మారిపోదు, సమాజం ఏకం అయిపోదు, నలుగురు కలిసినప్పుడు అందులో ఇద్దరు కొట్టుకుంటుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? వాళ్ళెంచేయాలి ? అయితే మౌనంగా ఉండాలి, లేదా అగ్ని కి ఆజ్యం పోసి చప్పట్లు కొట్టుకుంటూ నిలబడాలి, అందరి దగ్గర ఆజ్యం ఉండదుగా...ఉన్నా.... పోసే పద్దతి తెలీదుగా....కాని అదే ఒక ఇద్దరు జోక్స్ చెప్పుకుంటున్నారు అనుకోండి ...నలుగురు నవ్వుతారు , అటుగా పోయేవాళ్ళు కుడా వచ్చి ఆ జోక్ విని నవ్వుకుంటారు , అందరు నవ్వుకుంటారు హాయిగా వెళ్ళిపోతారు. ఎంత హాయో.....

చివరగా......స్త్రీ  గురించి నేనేమి చెప్పలేను , చాలా మంది చాలా రకాలుగా చెప్పారు, నాకు సరిగా చెప్పడం కుడా రాదు, కాని తెలిసింది ఒకటే " రెండువైపుల పదును ఉన్నా కత్తి"  మంచిగా ఉంటె అమృతాన్ని ఇవ్వగలదు , చెడు చేస్తే విషాన్ని తాగించాగలదు, విషాని తాగించే వారిగురించి నాకు తెలీదు విన్నాను అంతే...!!! "మంచితనం మోములో జాణతనం మనసులో "ఉన్నవాళ్ళు కుడా ఉంటారు మనకింకా పరిచయం కాలేదు. యవరాజ్ గా చుస్తే స్త్రీ  అంటె " అమ్మ" స్త్రీ అంటె " అక్క, చెల్లి, కూతురు , భార్య,అయినా కుడా....అమ్మ అమ్మే కదా..."నీయమ్మ" అన్నా " నాయమ్మా " అన్నా అమ్మే.....ఆడవారిని తిట్టుకోకండి....తిట్టేముందు ఒక్కసారి ఆలోచించండి ...మనం బ్లాగులు రాస్తున్నాం అంటె  ఎదిగామా ....దిగాజారామా????....

ఏదో పాలేరుని ....నాకు మా కామందు ( ఓనరు ) చెప్పింది రాసాను , నాకేమి తెలీదు...నాకేమి రాదు ....ఒక కొత్త సామెత " టిఫిను కి డబ్బులు లేవురా కొడకా అని ఏడుస్తుంటే కొడుకొచ్చి టిప్పుకి డబ్బులు అడిగాడు అంటా ..."  ఊరికే సరదాగా చెప్పాను మీరు నవ్వుతారేమో అని ....నవ్వు రాలేదా....అయితే సారి ...:):):)


13, జనవరి 2012, శుక్రవారం

మార్తాండ అంటే ఎవరు??


ఒక వారం రోజులు గా ఒకవిచిత్రమైన లోకం లో వెళ్లాను ఇంకా తేరుకోలేదు.....ఈ మార్తండా ఎవరు? మలక్పేట రౌడి గారు ఎవరు ? భరద్వాజ ఎవరు? ఇన్నయ్య ఎవరు? కత్తి ఎవరు? ఏకలింగం ఎవరు? అసలు ఇంతకీ " నేనెవరు???? "

అందరు కలిసి ఏదేదో రాసేసుకున్నారు ....... మొట్టమొదటి సారిగా భయపడ్డాను బ్లాగ్ లోకం లో ఇప్పటిదాకా నాకు కొంతమందే తెలుసు, వాళ్ళు ఒకరినొకరు అభిమానిచుకోవడం, గౌరవించుకోవడం చూసాను, బులుసు గారి బ్లాగ్ చూసి ఇయనకంటే బాగా రాయాలి అని బ్లాగ్ ఒకటి పెట్టుకున్నాను, కాని ఇన్ని పోస్టులు చదివాక నేను ఒట్టి మట్టి బుర్రనే అని తేలింది...నాకంటే చాలా విషయాలలో విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు , ఇలా కొట్టేసు కుంటున్నారు ఏంటో ?????

అసలు ఈ మార్తండా అంటే ఎవరో నాకేమి అర్ధం కాలేదు బాబోయ్......ఇంకెప్పుడు బ్రతికి బాగుంటే ఆ బ్లాగులకి వెళ్ళకూడదు అని అనుకున్నా...కాని వాళ్ళ రచనా చాతుర్యం, విషయ పరిజ్ఞానం , చాలా బాగుంది కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నై.....కాని భయం కుడా వేస్తుంది ...ఏమ్చేయలబ్బా....????

10, జనవరి 2012, మంగళవారం

"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" VIII

ఇంత వరకు.......

(తొమ్మిదో తరగతి వరకు " ఈ అబ్బాయి చాలా మంచోడు" లా ఉన్న రాజు  పదవ తరగతి లో వెళ్తూ వెళ్తూ    కొన్ని అనుకోని కారణాల వల్ల " ఖతర్నాక్" అయిపోతాడు. భవాని ని పడగొట్టాలి అంటే ఆడవారి సహజ గుణం అయిన " అసూయ ని వాడుకొందాం అని ఎనిమిదవ తరగతి లో కొత్తగా జాయిన్ అయిన క్రుతికా కి దగ్గర అవుతాడు, అలా దగ్గిరవ్వడం రాజు జీవితం లో అనుకోని మలుపు తీసుకుంటుంది.)

.అది ఏంటంటే....

          నేను కృత్తిక కి దగ్గరవడం, భవాని కి నచ్చట్లేదు అని నాకు తెలుస్తూనే ఉంది , కాని తను వచ్చి ఒక్కసారి చేబితే  నేను క్రుతికా ని వదిలేద్దాం అని అనుకుంటున్నా...ఈ క్రుతికా కూడా... నేనేదో గోకితే ఇది మరీ ఇలా ఇంత ఈజీ గా పడిపోవాలా ....ఏమిటో నా అందం మహిమ....ఇలా అయితే కష్టమే కదా భవిష్యత్తులో...ఇప్పుడు మన పని బలే గుందిలెండి, ఒకే సారి ఇద్దరినీ మైంటైన్ చేయడం.....భవాని ఏమో అస్సలు చూడదు , క్రుతికా ఏమో నన్ను వోదలదు....అసలు ఈ క్రుతికా ఉంది చూసారు ఉత్త తెల్ల కలరే గాని ఒట్టి వసపిట్ట ..... అసలు మాటలాడటం మొదలు పెట్టింది అంటే ఇకా ఆపదే...నాకేమో చిరాకొస్తుంది, నాకు ఈ శిక్ష వేసిన భవాని మీద కోపం వస్తుంది, తలనోప్పివస్తుంది , తిక్క వస్తుంది, మెంటలేక్కుతుంది....కాని ఎం చేస్తాం చేపకోసం ఎరలాగా నాకు ఈ క్రుతికానే కనబడుతోంది మరి... భరించక తప్పదు...

          ముత్యాలు వీడు B  సెక్షను, బానే చదువుతాడు అని పేరు నా అంత అందం కాకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటాడు, ఈ మధ్యే తెలిసింది వీడు కూడా భవాని కి లైను వేస్తున్నాడు అని, నాకెందుకో విచిత్రం గా కోపం రాలేదు, ఒక పిచ్చి నమ్మకం ఏంటంటే " చిన్నప్పటి నుండి లైన్ వేస్తున్న నాకే పడలేదు కాబట్టి ఎవడికి పడదు " అని..... ఇంకా చాల మంది భవాని కోసం ప్రయత్నిస్తున్నారు అని తెలిసింది, మన సెలక్షన్ అంటే అంతేలే మరి అందరికి నచ్చల్సిందే..అనుకున్నా గాని టెన్షన్ పడలేదు " నాకు పడలేదు కాబట్టి ఎవడికి పడదు " అనే నమ్మకం వల్ల...కాని ఒకరోజు అనుకోకుండా....ముత్యాలు భవాని బుక్సు మార్చుకోవడం చూసాను. ఎంత కోపం వచ్చింది ఆంటే ముత్యాలు గాడిని నీళ్ళల్లో కడిగి పచ్చిగా నమిలేద్దాం అనుకున్నా ...కాని ఇలా చేయడం వల్ల భవాని ఇంకా దూరం అయ్యే చాన్సే ఉంది కాబట్టి ఈసారి విజ్ఞత గా ముందుకు వెళ్ళాను, ముత్యాలు గాడిని దోస్తు చేసుకున్నా....వాడు పాపం నిజాయితీగా స్నేహం చేసాడు, మొత్తం చెప్పేసాడు. తను భవాని ని ప్రేమిస్తున్నానని. ఆ టైం లో నన్ను నేనే గోడకు అనుకోని ( ఆంటే గోడ నన్ను గట్టిగా పట్టుకున్నట్టు అన్న మాట ) కంట్రోల్ చేసుకున్నా...ఆ టైం లో ఎవరు లేరు మరి నన్ను కంట్రోల్ చేయడానికి మా స్కూలు గోడకో థాంక్స్ లేకపోతె అదే గోడ ఒక యుద్ధానికి సాక్షిగా నిలిచేది.....

నేను అడిగా "నా గురించి తెలుసా "అని ..

"హిహిహి భవాని పాత లవర్ కదా " అని ముత్యాలు గాడు.

"పాత కాదు ఇప్పుడు కూడా రా"

"కాని భవాని నిన్ను లైక్ చెయ్యట్లేదు గా"

"ఎవరన్నారు .? అది మా ప్లాన్ రా ....మరి అందరికి తెలిసిపోతుంది కదా...మేము రోజు మాట్లాడుకుంటాం ట్యూషన్ లో" ( వీడు మా ట్యూషన్ కాదు లెండి , అందుకే అబద్ధం)

"నిజమా !! మరి అందరు నీకు పడలేదు అంటారు..."

"వెర్రి నా....యాళ్ళు ...అలాగే అనుకుంటారు రా కాని నువ్వు వేర్రోడివి కాదు లే "

"నేను కాదు అనుకో...అయినా ప్రూఫ్ ఏంటి రా ?

"ప్రూఫ్ కావాలంటే క్రుతికాని అడుగు .."

"క్రుతికా ఆంటే గుర్తుకు వచ్చింది ...మారి తను నీ లవరేగా ..."

"చ ఎవదన్నాద్రా ఆ మాటా ...తను ఫ్రెండ్ రా..."

"ఫ్రెండేంటి రా ? అమ్మాయిలు కూడా ఫ్రెండ్లు ఉంటారా?"

"నువ్వు కొంచం మోకాలు వాడలిరా ...సినిమాల్లో ఉంటారు కదా ...అలా అన్నమాట ..."

"సరేలే ....మరి నా సంగతి ???

"నీకేమైంది రా ...నువ్వు లైన్ వేయి ....తను మొత్తం నాకు చెపుతోంది నీ గురించి ....భలే నవ్వుకుంటాం లే  హిహిహి .. మొన్న ఏదో సైన్సో... సోషలో .... తెలుగేమో , ఇంగ్లీష్ అనుకుంటా...హిందీ కదా.....ఆ గుర్తొచింది లెక్కల నోట్సు అవునా ....??  ఇచ్చావంటగా ..."

"సోషల్ లే ..అది కూడా చెప్పిందా...!!!

"ఆ అవును సోషలే ...గుర్తుకొచ్చింది ..అవును చెప్పింది ...."( మనం చూసింది వీడికి తెలిసినట్టుగా లేదు ..హిహిహి)

"సరేలే ..నేను వెళ్తాను " అని బయలు దేరాడు ముత్యాలు, అప్పుడు వాడి మొఖం చుస్తే సంక్రాంతి కోడి పంద్యాలలో వోడిపోయిన కోడి మొహం గుర్తుకు వచ్చింది.....

ఎలాయితే నేమి ముత్యాలు గాడిని ప్రేమకి ఎండ్రిన్ కొట్టేసాం ...కాని ఎన్నిరోజులు ? ఎంతమందిని ? ఆపగలం...???

                నాకు ఒక వ్యతిరేక వర్గం తయ్యరయ్యారు ...ఎందుకో చెప్పనా....భవాని నాకు పడిపోయిందని ....హిహిహి ..భవానిని అల్లరి చేద్దాం అని వీళ్ళు ఒక పిచి ప్లాన్ వేసారు ......అదేంటంటే ఒక రోజు భవాని ఒంటరిగా బందరు వెళ్ళింది ఆరోజు నేను కూడా ఊర్వసి దియేటర్ లో ఏదో సిమిమా ఆడుతుంటే వెళ్ళాను ...వచ్చే టప్పుడు ఇద్దరం ఒకే బస్సులో ఉన్నాం....దిగేటప్పుడు భవాని వెనకే దిగాను ...బస్సులో మా ఉరు వచేవరకు తెగ ప్రేమిన్చేసాననుకోండి ...అలా దిగడం మా ప్రతిపక్ష పార్టీ వాడు ఒకడు చూసాడు...అంతే మరుసటి రోజు "భవాని రాజు గాడితో బందరు సినిమాకి వెళ్ళింది " అని ఈనాడు పత్రికలా ఒకడు " ఇద్దరు కలిసి హోటల్ ( భోజన హోటల్ లెండి) వెళ్లారు " అని సాక్షి పేపర్ లా ఒకడు "పరస్పర విరుద్హ ఏకాసార" న్యూస్ వదిలారు స్కూల్ లో ....

          తెగ భయపడిపోయాను మా నాన్నకు తెలేస్తే తోలు తీసి ధాన్యం సంచీలు కుట్టుకుంటాడని కాదు...భవాని కి నా మీద మళ్ళి కోపం వస్తుందేమో అని ....నానా తంటాలు పడ్డాను లెండి ఈ న్యూస్ భవాని దాకా చేరకుండా...కాని మనం మాత్రం ఒక ఆయుధం గా వాడుకున్నాం.....నేను భవాని  అపర ప్రేమికులము అని , మేమే లైలా మజ్ను అని ..." నువ్వు వస్తావని " సినిమా చూసాం బందరు లో అని ...తెగ బిల్డప్పులు ఇచి ఇంకా కొత్త కాంపిటీటార్ రాకుండా పద్మప్యుహం వేసేసా....

                   ఈలోపు అర్ధసంవత్సర పరిక్షలు అని ప్రకటించారు ..మేము బాగా చదువుతాం అనుకునే బ్యాచ్ కి సడన్ గా రెండు కొమ్ములు లేచాయి వాళ్ళకు వాళ్ళే చదువుకోవడం ఎవరితో మాట్లాడకపోవడం అవసరం ఉన్న లేకపోయినా మాస్తార్లని డౌట్లు అడగటము, వెళ్లి వచ్చిన  ప్రశ్నలు అప్పజెప్పి శెభాష్ అనిపించుకోవడం  అదోరకమైనా బిల్డప్పులు ఇవ్వడం మొదలు పెట్టారు .....మనకేమి లే మనం చదివినా పాస్ చదవక పోయినా పాస్ అని మనం మాత్రం మన గోల లో మనం ఉన్నాం.....ఒకసారి షోషల్ టీచర్ " విజయకుమారి " వచారు క్లాస్స్ కి అందరిని ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు...ఇంతలో మనంకూడా క్లాస్సు లోని ఒక అణువు కాబట్టి మనల్ని ఏదో ప్రశ్న అడిగారు ...నేను ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తూ నుంచున్నా ఇంతలో గుర్తుకు వచ్చింది మొదలుపెట్టేంతలో ఆవిడా తిట్ల దండకం అందుకున్నారు..మనకు కాలింది..అసలే భవాని ముందు తిడితే తట్టుకోలేను అలాంటిది రెండు సేక్షనులు కలిసి ఉన్నప్పుడు అందరి ముందు తిడితే ఎలా తట్టుకోనేది ?? అందుకే ......
:" మిమ్మల్ని ఉరికే అనరు " బక్కమ్మ " అని " అన్నాను ( సన్నగా పుల్లలాగా ఉండేది లెండి )

ఏమన్నావ్ రా"

"??????"

              ఒక మంచి బెత్తం తీసుకు వచ్చి నా ప్యాంటు దుమ్ము దులపడం మొదలు పెట్టారు ఆవిడ......ఒకటి రెండు ఆంటే తట్టుకోగలం గాని మరీ తెలుగు పరీక్షలో మార్కుల్లగా ఓ కొట్టేస్తే ఎక్కడ నుంచోగలం...?అసలికే  క్లాస్ అంతానా వైపు చూస్తుంది నేనెప్పుడు ఏడుస్తానా !!! అని ...కాని మనకు ఇవి ఒక లెక్క ??? అయినా రోషం తో ఆవిడా బెత్తాన్ని పట్టుకున్నా...చేతిలోనుంచి లాగేసుకున్నా...విరిచేసా ...బయటకు విసిరేశా అదే టైము లో ఇవిడ చెల్లి గారు " అజయకుమారి " గారు అటుగా వెళ్ళడం మన విసిరిన బెత్తము  ఆవిడకి తగలడం తోటి ఇక మన పని " రామలింగరాజు " అయ్యింది......

"ఇకనేను పదవతరగతి కి పాఠాలు చెప్పను "
                     అని ఆవిడ ఏడుస్తూ స్తాఫ్ఫ్ రూం కి వెళ్ళిపోయారు. మనం కూర్చున్నాం , ఆవిడ చెల్లి గారు క్లాస్స్ రూం లోకి రావడం ఆడపిల్లలతోటి విషయసమాచారం గ్రహించటం అందరు ఆవిడచుట్టు చేరడం, పరామర్శించడం మగ పిల్లల్లో కూడా కొంతమంది " లేడీస్ బోయ్స్" ఆ మేడం చుట్టూ చేరి " తందానా ....తాన " అనడం ..ఆవిడ మన వైపు పోట్లగిత్తలా చూడటం మనమేమో సింహం లా తల విదల్చడం ఆవిడ విస విసా బయటకు వెళ్ళడం , క్లాస్స్ రూము అంతా నా వైపు విచిత్రం గా చూడటం...నా బ్యాచి  నా పరామర్శ కు రావడం , నా కపట అభిమాన సంఘం నన్ను పరామర్శిస్తూ భయపెట్టడం..."నువ్వు పదోతరగతి పరీక్షలు రాయవు" అని వాళ్ళే డిసైడ్ చేసెయ్యడం ....ఎలక్షన్ల ముందు రాజకీయ నాయకుల వారాల జల్లులా .....లాస్ట్ ఫైటు లో హీరో గుద్దులు లా .....ఈ విషయం మా నాన్నకు తెలిస్తే నేను వేసే బ్రేక్ డాన్సు లా ........టక్  టక్ టకా  జరిగిపోయాయి...

అప్పుడు మొదలైందండి మనకు సినిమా ...అప్పటికి దేశం లో   IMAX  లేకపోయినా కూడా మా ఉల్లో వుందని నొక్కి వక్కానించగలను....ఎందుకంటే నాకు మరి అంత పెద్ద సినిమా కనబడింది......


సినిమా త్వరలో రిలీజ్............

7, జనవరి 2012, శనివారం

మతాన్ని బట్టి దేశద్రోహం ఉండదు



మతాన్ని బట్టి దేశద్రోహం ఉండదు, మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది....ఆలోచనా విధానాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు ఒక్కరినే ఒక వర్గాన్నే నిందించడం సరికాదు, మీడియా పక్షపాత ధోరణి కుడా ఇందుకు ఒక కారణం ఇదే పని నిందలు ఎదురుకుంటున్న వర్గ జనులు చేస్తే  మొట్టమొదటి పేజి లో పతాక శీర్షిక, మిగతా వాళ్ళు చేస్తే ఎక్కడో లోపలి పేజీల్లో ఒక వార్త...

ఇది అందరికోసం రాయట్లేదు, ఎక్కడ తప్పు జరిగినా ఒక వర్గం వైపు మాత్రమె వేలెత్తి చూపించే అతివాదుల కోసం రాస్తున్నాను, నా 25  సంవత్సరాల భారతీయత వైపు వేలేత్తితే ఏమి చేయలేని నిస్సహాయత కు చింతించి రాస్తున్నాను,మనిషి తప్పు చేస్తే మతాన్ని నిందించే మూర్ఖుల గురించి రాస్తున్నాను..." మీరు చేస్తే అత్యాచారం.... మేము చేస్తే చమత్కారం...." అనే ముడుల గురించి రాస్తున్నాను.

అసలు ఒక్కోసారి అనుమానం వస్తుంది ఇలా రాసి నన్ను నా దేశాభిమానాన్ని నాకు నేనే కించ పరుచు కుంటున్నానా...అని , కాని ఏమి చేసినా ,,ఎంత చేసినా "మీరు వాళ్ళకే వత్తాసు లే" అనే అమాయక చక్రవర్తులను చూసి వారి జ్ఞాన నేత్రాన్ని ఎలా అయినా తెరిపించాలి అని ఒక మొండి ఆలోచనతో రాస్తున్నానులే అని సమాధాన పరుచుకుంటాను ,

ఏది ఏమైనా ....భారత దేశ పౌరిడిని అని గర్వంగా చెప్పుకుందాం అంటే నా పేరు చూసి నన్ను అనుమానించే వారి కంటి చూపులు తట్టుకోవడం కుడా నా భారతీయతే !!!  అసలు పాకిస్తానియులకి మాకు సంబంధం లేదు అంతే!!!! వాళ్ళు ఆ దేశస్తులు మేము భారతీయులం...

ఇంకోవిషయం  ...మీ వాళ్ళే ఎంతో మంది వాళ్లకు మద్దత్తు ఇస్తూ బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి కావాలంటే సాక్ష్యాలు కుడా చూపిస్తాను ఆంటే " తల్లి పాలు తాగి రొమ్ము ని గుద్దే" నీచుల గురించి నేను నా సమయాన్ని వృధా చేయను, అలాంటి వారిని నిజాయతీగా విచారించి "నిజమే" అని తెలిస్తే వారిని ఉరితీయడానికి తాడు నేనే ఇస్తాను , కాల్చడానికి మా వేప మొక్క కొమ్మను ఇస్తాను, దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.

చివరగా....చాలా నిశీతంగా గమనించాలిసిన విషయం ఏంటంటే కొంత మంది అతివాదులు దీన్ని అవకాశంగా తీసుకుని ఒక వర్గ ఆచార వ్యవహారాలని, సాంప్రదాయాలని, ధర్మాల్ని గేలి చేయ ప్రయత్నిస్తుంటారు, అలాంటి వారి గురించే నా బెంగఅంతా....

ఎంటో!!! నాకు  సరైన  ముగింపు ఇవ్వడం ఎప్పటికి వస్తుందో .....

6, జనవరి 2012, శుక్రవారం

నువ్వు నాతొ..... మాటలాడలేదు ..కాని మాటలాడించావు

నువ్వు నాతొ.....
మాటలాడలేదు ..కాని మాటలాడించావు
చెప్పలేదు కాని చెప్పించావు.....
ఉరించావు...ఉరడించావు..ప్రేమించావు!!!
నేను నీతో.....
చెప్పడమే కాదు .....వివరించాను...
నా లక్ష్యం...నా జీవితం ....నా ప్రేమ
మూడు వేరు వేరన్నాను,
నా జీవితం లో లక్ష్యం తరువాత ప్రేమ అన్నాను!!!
సరే అన్నావు , సూపర్ అన్నావు, కేక అన్నావు,
కాని తరువాత ఎందుకు కెవ్వు అన్నావు????
ప్రేమించడం లో Ph . D చేసిన నన్ను 
ప్రేమించడం లో  LKG చేస్తున్న నువ్వు
ప్రేమించావు ...ప్రేమింపజేసుకున్నావు...
నేను ఎంచుకున్న బాట లో ముందు ముళ్ళు తరువాత్ రాళ్ళూ
కాని కష్టపడితే అవన్నీ కావా మనకోసం వజ్రాలు  రత్నాలు??
నిన్ను ప్రేమించినంతగా నేనెవరిని ప్రేమించలేదు ప్రియా !!!
ప్రేమించి, ద్వేషించే నీ మనసుకు లేదు నా మీద దయ.. !
నిన్ను నేను neglect చేయలేదు నా ప్రియమైన జాను!!
మన భవిష్యత్తు బాటలో నన్ను నేనే మరిచిపోయాను ...
అర్ధం చేసుకోవడం లో విఫలమై నన్ను తప్పు పట్టి
అలిగావు నా మనసుకు గాయం చేకూర్చావు,,,,
బాధ పెట్టావు నన్ను బాధపెట్టావు
భయపడ్డావు ....భయపెట్టావు
ఎడిచావు.....ఎడిపించావు
 ప్రేమలో గెలుపోటములు ఉండవు కాని లక్ష్య సాధనలో నా ప్రేమ ఓడిపోయింది
ప్రియా !!!
ఒక ఇల్లు , చిన్న కారు , కొంత బ్యాంకు బాలెన్సు.....ఇది కాదు జీవితం
మనకోసం ఎదురుచూసే కళ్ళు, మనతో నడిచే కాళ్ళు అవే ధైర్య పర్వతం
మనకోసం మనం బ్రతెకేద్దాం అనుకుంటే నేను మంత్రి
అందరికోసం బ్రతుకుదాం అనుకోబట్టే నేను కంత్రి
జీవితం అందరిలా కాదు అందరికంటే విభిన్నంగా ఉండాలి
గెలుపుండాలి ఓటమి ఉండాలి ప్రేమించాలి ప్రేమించబడాలి....
నిన్ను రాణి లా చూడాలనుకున్న నన్ను రాక్షసుడి లా చూసావు 
అందరి మాటలు విన్నావు నా జ్ఞాపకాలు మరిచావు నిస్సహాయుడి ని చేసావు
అందంగా అందరితో కలిసి ఉండే నన్ను అంటరాని వాడిని చేసావు అవిటి వాడిని చేసావు
ప్రేమా కావాలా లక్ష్యం కావాలా అంటే......తల్లి కావాలా తండ్రి కావాలా అన్నట్టు ఉంది

నన్ను అర్ధం చేసుకునే వాళ్ళు తక్కువ, అందులో నువ్వు చేరి నన్ను మానసికం గా చంపేసావు

ఎప్పటికైనా నన్ను అర్ధం చేసుకుంటావని

ఆశతో ఎదురు చూసే 
నీ రాజు

 


  

 

 
 

 
 





5, జనవరి 2012, గురువారం

ముష్టి డబ్బు ,,ముదనష్టపు డబ్బు!!!

ముష్టి డబ్బు ,,ముదనష్టపు డబ్బు!!!
రొష్టు డబ్బు ,రొచ్చు డబ్బు....!!!!
పాపి డబ్బు ,పాపిష్టి జబ్బు ........
దరిద్రపు డబ్బు .....పెద్ద గబ్బు...
దుర్మార్గపు డబ్బు .....ఓకే వారి గోకే సబ్బు ...
నీచ డబ్బు ,నికృష్టపు డబ్బు... 
ఈ ధనం  కుతంత్ర కు ఇంధనం ...
ఈ కాగితం ఒకరికి జీవితం.. ఒకరికి మరణం...
రూపాయి తో వస్తుంది బడాయి మొదలు ఇక లడాయి ..

I HATE MONEY...................................................EEEEEEEE




















4, జనవరి 2012, బుధవారం

ముస్లిములు అంటే అంట ద్వేషం ఎందుకు ప్రపంచానికి ???



హాయ్ !!!! 

నిన్న సాయంత్రం, ఇద్దరినీ కలిసాను , పాలస్తానీయుడు , ఒకరేమో ఇంగ్లాండ్ దేశస్తుడు, ఇద్దరు ముస్లిములే మాటల సందర్భము లో వాళ్ళ వాళ్ళ కష్టాలు ఏకరవు పెట్టారు, విచిత్రమైన విషయం ఏంటంటే " భారతీయ ముస్లిములు " vallakante ఎక్కువగా బాధలు అనుభవిస్తున్నారు అంట.......సిల్లి కదా....వాళ్లతో తీవ్రంగా విభేదించాను, వాళ్ళు చెప్పిన ఒక విషయం లో కాసేపు ఏమి చెప్పాలో అని తికమక పడ్డ కాని తరువాత సరియిన జవాబు ఇవ్వగలిగాను, ఇంతకీ వాళ్ళు చెప్పింది ఏంటంటే " మీ భారతీయ ముస్లిములే చెప్పారు, వాళ్ళకు ముస్లిములు అవ్వడంవలన సరైన అవకాశాలు రావట్లేదు అని, అక్కడ ఉన్న ఒక భారతీయుడు కుడా వాళ్ళకు సపోర్ట్ గా ఒక భారతీయ కంపనీ లో తన అన్నయ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు మేము ముస్లిములకు జాబులు ఇవ్వం అన్నారటా....

నా సమాధానం ఏంటంటే....టాలెంట్ ఉన్నవారికి ఎప్పటికైనా ఛాన్స్ ఉంటుంది మా భారతదేశం లో ఎవరితే మీకు ఈ విషయాలు చెప్పారో గాని వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు అందుకే అలా అనుకుంటున్నారు, ఒక ఇస్లాం కాని దేశం లో దేశ ప్రధమ పౌరుడు " రాష్ట్రపతి" ముస్లిం అవ్వడం ఒక భారతం లోనే అవుతుంది, ఇర్ఫాన్ పఠాన్ , షారుఖ్ ఖాన్, జహీర్ ఖాన్, M F  హుస్సేన్, సానియా మిర్జా, వెళ్ళందరూ అదే భారతదేశం నుండి కాదా పేరు సంపాదించింది?? అని కౌంటరు వేసాను, తరువాత ఆ భారతీయుడు ( నార్త్ అతను) బాబు మనకు లా అనే అత్యున్నత , అత్యుత్తమ వ్యవస్థ ఒకటి ఉంది !!! ఎంతో మంది తప్పు చేసిన వారిని వాళ్ళు ఎంత పెద్ద హోదా వాళ్ళు అయినా ఎంత పెద్ద ధనవంతులు పలుకు బదులు ఉన్నవాళ్ళు అయినా వాళ్ళను అరెస్ట్ చేయడం మన భారత న్యాయ వ్యవస్థ కే చెల్లుతుంది, రాజా, కనిమోలి, రామలింగరాజు ,హర్షద్ మెహతా, ఎంత పెద్ద పుడింగి అయినా గాని జైలు ఉచలు లేక్కబెట్టారు కదా, ఒకవేళ నిజంగా ఆ కంపనీ ' మీరు ముస్లిములు కాబట్టి " మీకు జాబులు ఇవ్వం అంటే , మనం మన న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉంచి ఇష్యూ ని escalate  చేస్తే కచితంగా మీ అన్నయ కు న్యాయం జరిగేది ,భారతదేశం ఇంతే , ఇక్కడ న్యాయం లేదు , పొలితిచ్స్ బాలేవు , అని ఏదో ఒక మిష మీద భారతదేశాని తిట్టడం తూలనాడటం బాగా అలవాటు అయిపొయింది మనందరికీ, ఒక్కసారికి మంచి మనసు తో చుస్తే భారతం అంత మంచి దేశం ఎక్కడుంటుంది ? అని కడిగి పారేసాను, 

తెల్ల తోలు వాడు I LIKE YOUR SPIRIT , I FEEL SORRY ON MY SELF NOT BEING INDIAN AFTER LISTENING YOUR WORDS" అన్నాడు అసలు ఎంత ఆనందం వేసింది అంటే మాటల్లో చెప్పలేను అప్పుడు ఆ నార్త్ వాడిని చూసి కళ్ళు ఎగరేసి , కాలరు ఎగరేసి , గాల్లిలో తేలుకుంటూ, రూం కి వెళ్ళాను, 

మాటల మధ్యలో ఇంగ్లీష్ వాళ్ళు చూపిస్తున్న కొన్ని అసమానతలు చెప్పాడు వాటిని ఇలా క్రోడీ కరించాను. 

మన ఇండియా లో కుడా కొన్ని సార్లు ఈ అసమానతలు కనిపిస్తుంటాయి, కాని మరీ అంట కాదు, ఒకసారి నేను హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాను డిల్లి విమానాశ్రయం లో రాత్రి ఒంటి గంట కు దిగాను, చెకింగ్ నుండి నేను బయటకు వచ్చే సరికి మార్నింగ్ నలుగు అయ్యింది, ఆరోజు నాకు RAANBAXY  లో ఇంటర్వ్యూ,  అసలు నిద్రపోకుండా ఇంటర్వ్యూ కి వెళ్లి జాబు కొట్టుకోచేసాను, కాని అందరిని వదిలేసి నన్ను మాత్రం అంతసేపు ఉంచడం కొంచెం బాధ పెట్టినా సరేలే మన దేశ పౌరుల రక్షణ కోసం నేను సహకరిస్తున్నా అని గర్వపడ్డాను కాని , వచేటప్పుడు మాత్రం ఆ ఆఫీసర్  అన్న మాటలు మాత్రం గుర్తుంది పోయినాయి " YOU ARE VERY DENGOROUS PEOPLE " నేను సరదాకి అన్నాడేమో లే అని అతని పేస్ వైపు చుస్తే చాలా సీరియస్ గా ఉంది .... అక్కడికి ఒక చిన్న జోక్ వేసాను " YOU MEAN ANDHRA PEOPLE?" కాని అతను మాత్రం చాల కోపంగా " I M NOT KIDDING I MEAN YOU MUSLIMS' అప్పుడు వచిందండి నాకు కోపం గొడవ గొడవ చేసేసాను ఎయిర్ పోర్ట్ లో " ALL MUISLIMS ARE NOT LIKE THAT TRY TO THINK LIKE INDIAN WHAT EVER HAPPENING IN INDIA IT IS NOT BY INDIAN MUSLIMS EVERYONE KNOWS WHO ARE THEY...TRY TO DISTINGUINSH BETWEEN INDIAN MUSLIMS AND MUSLIMS"  అక్కడికి వేరే వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్పించి గొడవ సర్దిపెట్టారు లేకపోతె నా ఇంటర్వ్యూ పొతే పోయింది కాని అతని మీద మాత్రం సీరియస్ గా ఆక్షన్ తీసుకునే వాడిని ఇలాంటి కొంతమంది అందరి మనస్సులో విషం నింపుతున్నారు. 



 
 
JEW

   
ఎ ఇతర మతస్తుడు అయినా  గెడ్డం పెంచుకుంటే అతనేమో తన మతాన్ని నిష్ఠ గా ఆచరిస్తున్నాడు. 






  Nunఒక నన్ తన కు తానూ దేవునికి అర్పించుకోవడానికి, లేదా దేవునిసేవ కోసం   తల నుండి కాలి వెలి వరకు కప్పుకోవచ్చు  కదా? 
Hijab అదే పని ఒక ముస్లిం మహిళా చేస్తే మాత్రం హింసించబడుతుంది, అణగదొక్కబడుతుంది,  దేశ అభివృద్ధికి అడ్డం పడుతుంది,  
 

  
 

Western Women

ఎవరైనా తల్లి ,ఇంటిదగ్గర ఉండి తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటుంటే ఆమె త్యాగ మూర్తి , తన పిల్లల పోషణ కోసం తన కెరీర్ ని త్యాగం చేస్తుంది.


Muslim Womenఅదే పని ముస్లిం చేస్తే మాత్రం "చాందసవాదులు ఆమె స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారు","! 
 

 

  
Anything ఎ అమ్మాయి అయిన కాలేజ్ కు గాని మరెక్కడికైనా గాని తన ఇష్టమైన దుస్తులు ధరించి వెళ్ళవచ్చు, ఎందుకంటే ఆమెకు ఆ హక్కు మరియు స్వేచ ఉంది.Hijab But ఒక వేళ ఒక ముస్లిం అమ్మాయి / స్త్రీ మాత్రం బురఖా / హిజాబ్ వేసుకుని కాలేజ్ కు వేలేతే మాత్రం విచిత్రం, వివాదాస్పదం,! 
 

 

  
 

Subject ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ లో కృషి చేస్తున్నాడు లేదా తన జీవితం అంకితం చేస్తే అతను టాలెంట్ ఉన్నవాడు, కష్టజీవి !

IslamBut ఒక ముస్లిం విద్యార్ధి తన జీవితాని ఇస్లాం నేర్చుకోవడం లో గడిపితే , కాబోయే ఉగ్రవాది ,  ! 


ఎందుకు?????????
  Question 
 

 

ముస్లిం కాకుండా ఎవరైనా హత్య చేస్తే , అక్కడ మతం పేరు రాదు, ఒక ముస్లిం గనక ఏదైనా తప్పు చేస్తే కోర్టులో నున్చోబెట్టేది "ఇస్లాం" ని !!! 

 Hero
 ఎవరైనా ఇతరుల కోసం తన జీవితాని త్యాగం చేస్తే, అతనేమో నిస్వార్ధుడు, అతన్ని అందరు గౌరవిస్తారు,. 



Terrorist
కాని అదే పని ఒక పాలస్తీనియుడు, తన కుటుంబాన్ని కాపాడు కోవడానికి, తన దేశ భవిష్యత్తు కోసం యుద్ధ్హ రంగం లో చనిపోతే BCC  కళ్ళకు మాత్రం అతను ఒక "ఉగ్రవాది"! ఎందుకు ?
 ఎందుకంటే అతను  "ముస్లిం"! 
 

 

 

 Car    ఎవరైనా ఒక కారు నడుపుతూ ఏదైనా ఆక్సిడెంట్ చేస్తే ఎవ్వరు కారు ని తప్పు పట్టరు!!!.... 
Islam
But కాని ఒక ముస్లిం తప్పు చేస్తే లేదా ఇతరులతో రూడ్ గా ప్రవర్తిస్తే " అది మాత్రం ఇస్లాం తప్పు"
! 
 

 

  
 Newspapers
 అసలు ఇస్లాం ఏమి చెబుతుందో ఇస్లామిక్ సిద్ధాంతాలు ఏంటో తెలుసుకోకుండా జనాలు గుడ్డిగా పేపర్లను న్యూస్ చానళ్లను నమ్ముతారు .
 

Quran

But ఇస్లాం ని ద్వేషించే విమర్సించే వాళ్ళు ఎంతమంది కురాన్ ను చదివారు ?? అర్ధం చేసుకున్నారు? !!!!



3, జనవరి 2012, మంగళవారం

"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" VII

( అప్పటివరకు మంచివాడు గా ఉన్న రాజు , భవాని చెల్లి సిరి వల్ల, తను ఒక పడవ తరగతి విద్యార్ధిని కొట్టడం వల్ల ఒక్కసారిగా అందరి కళ్ళల్లో రౌడి అయిపోతాడు  రాజు, )

రాజు పదవతరగతి లో వచ్చిన తరువాత:::::

               అలా పడుతూ లేస్తూ పదవతరగతి లోకి వచ్చేసాం , ఇప్పుడు మేమే పెద్దవాళ్ళం స్కూల్ లో అనే రెండు కొమ్ములు మాకందరికీ వచినాయి, లతా దామోదరాన్ని , నేను భవాని ని వదలకుండా ప్రేమిస్తూనే వున్నాం, భావాన్ని పూర్తిగా నాతొ మాట్లాడటం మానేసింది, అసలు నా వైపు చూడటమే లేదు , ట్యూషన్ కుడా వెళ్ళబుద్ధి కావట్లేదు, లత బాధేమో విచిత్రం దాము గాడు ఎంత భయపడుతున్నాడో  తనతో మాట్లాడటానికి, ఆడో కామెడి అయిపోయాడు అందరికి,  నేనేమో మొదటి బెంచి నుండి లాస్ట్ బెంచి కి వచ్చేసాను, వందలో మొదటి పది మార్కులు తప్పించి మిగతా మార్కులన్నీ అక్కడే ఉంటాయి, వాళ్ళేమో ఎంత ప్రేమగా చుసుకుంటున్నారో నన్ను, నాకు మొదటి యూనిట్ పరిక్షలలో గాని అర్ధం కాలేదో, దుర్గాప్రసాద్ అంటే అందరికి భయం అందరికి స్కూల్ లో ఎవరిని లెక్క చేయడు వాడు నాకు సపోర్టు, ఇంకేముంది మనం ఒక చిన్న సైజు హీరో అయ్యం వాడికి పరిక్షలలో రెండు బిట్టులు చూపించి, ఎవడైనా ఏమైనా అంటే ఎరా ? దుర్గా గాడికి చెప్పనా అని బెదిరించేవాడిని, టేచర్లు కుడా నన్ను ద్వేషించడం ప్రారంభించారు, ఇప్పుడు మా స్కూల్ లో నాకు కొన్ని బిరుదులూ కుడా ఇచ్చారు , పెద్ద ఎదవ , పోరంబోకు, గాలోడు, ఇంకా చాలా ఉన్నాయి గాని మనదాక రాలేదు, ఇంటికెళ్ళిన తరువాత పుస్తకాలు తీయడం మానేసాను, నాన్న అంటే భయం పోయింది, నాకు నేనే రాజు ని నిజమైనా రాజు ని ,

అదేంటో గాని ఏమి చదవకపోయినా అన్ని పరిక్షలు పాస్ అయిపోయేవాడిని కాకపొతే ఇంతకూ ముందు తొంభైలు వచ్చే మార్కులు ఇప్పుడు అరవై లలో వస్తున్నై అయితే ఏమి పాస్ అవుతున్నాం గా!!! అది నా ధైర్యం, కాపీలు పెట్టడం అంటే అదేదో పెద్ద పని అనుకునే నేను దుర్గ ప్రసాద్ తో కలిసిన తరువాత అదేమీ పెద్ద పని కాదని తెలిసింది, నేను కుడా కాపీలు పెడదాం అని కాపీలు రాసేవాడిని కాని రాసిన తరువాత చుస్తే ఆ   ప్రశ్న నాకు  వచ్చేసేది ఇంకా కాపి ఎందుకులే అని పారేసేవాడిని, ఒకటి రెండు సార్లు పెట్టుకుని వెళ్ళినా గాని తీయకుండానే రాసేసేవాడిని,

వేరే ఊరులో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్ పిల్లలు ఎనిమిదవ తరగతి లో జాయిన్ అయ్యారు, వాళ్ళ జాయినింగ్ కంటే ఒక రోజు ముందు "ఈనాడు ఈ వారం" పుస్తకంలో ఒక కద  చదివాను దాని వల్ల తెలిసింది ఏంటంటే " అసుయ ముందు పుట్టి తరువాత ఆడది పుట్టింది  " అని, ఎనిమిదవ తరగతి లో కొత్తగా వచ్చిన కృత్తిక అనే ఒక అమ్మాయి ని చూడగానే నాకు ఒక భయంకర మైన ప్లాను వచ్చింది, నేను కొంచెం అందంగా ఉంటానని నా అనుమానం నా అందం తో క్రుతికా కి దగ్గర అయ్యి భవాని కి అసుయ పుట్టించాలని, అనుకున్నదే తడవుగా సడన్ గా క్లాస్స్ మధ్యలో లేచి నుంచున్న లెక్కల మేడం గౌరీ గారు " ఏంట్రా " అన్నారు
"ఏమిలేదు "
"ఎందుకు నున్చున్నావు"
"ఉరికే"
"ఊరికే ఏంట్రా""
"నా ఇష్టం నుంచుంటా'"
"మిగత వాళ్ళకి అడ్డం రాకు బయటకు పో"
"వెళ్తాం మీరు చెప్పేది డబ్బుల కోసమే గాని మాకు అర్ధం అవ్వాలని కాదుగా" అని విసురుగా బయటకు వెళ్ళిపోయాను.
నేను బయటకు వెళ్ళిన ఒక పది నిమిషాలకు ఇంటర్వెల్ అయ్యింది ,అందరు బయటకు వచ్చారు, భావాన్ని మాత్రం బయటకు ఎప్పుడు రాదు, అలాంటిది ఆ రోజు ఏంటో బయటకు వచ్చింది గ్రౌండ్ లో అందరు ఆడుకుంటున్నారు, భవాని ని చూడంగానే ఒక్కసారిగా ఆవేశం వచ్చింది,  కృత్తిక దగ్గరికి వెళ్ళాను నా వంక విచిత్రం గా చూసింది, అందరు ( వాళ్ళ బాచ్ వాళ్ళు) చూస్తున్నారు నా వంకే,
అప్పుడు నేను " క్రుతికా మీది ఈ ఉరు "
"మాది ****వరం "
"ఏడు అక్కడే చదివావా?"
"అవును "
"ఎన్ని మార్కులు వచాయి"
"504 "
"బానే వచ్చాయి కదా" మధ్యలో భావాన్ని వంక చూస్తున్నా , అలాగే నా వంక చూస్తుంది.THIS WHAT I AM EXPECTING అనుకుని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్న తనతో, ఇంటర్వెల్ అయిపోయేంతవరకు, నా పాచిక బానే పారింది భవాని కి కోపం వచ్చింది...

భవాని కి ఇంకా కాలాలని కావాలని క్రుతికా కి బాగా దగ్గరయ్యాను ఎంత అంటే తను నా కోసం నా క్లాసుకు వచ్చేవరకు అన్నమాట.

ఇది ఇంకో మలుపు తీసుకుంటుంది అని నాకేమి తెలుసు.

 ఏ మలుపో..........  త్వరలో............

1, జనవరి 2012, ఆదివారం

రెచ్చగొట్టే దుస్తుల వల్లే అత్యాచారాలు...

ఇది నిజమే కదా....ఒకప్పుడు  నూటికో కోటికో జరిగే అత్యాచారాలు ఇప్పుడు సర్వసాదహరణం అయిపోయినాయి, దీనికి కారణం మన సంప్రదాయాలని , భారతీయ సంస్కృతిని వదిలి పాశ్చాత్య సంస్కృతి వెనక పరిగెత్తడమే,  ఈ మధ్యనే ఒక బ్లాగర్ గారితో ఒక చర్చ సందర్భం లో ఆవిడ చీర కట్టు గురించి చెప్పారు, నేటి ఆడవారు చీరకట్టు లో అవయవాలు కనబడుతున్నై అని స్కిన్ టైట్ దుస్తులు వేసుకుంటున్నారు అని ఆవిడా చెప్పారు ,నిజమే కదా....

కొంతమందిని చూసి మగవాళ్ళే తలదిన్చుకోవలిసిన పరిస్థితి వస్తుంది, ప్రతీ ఒక్కరికి ఉండేవె అందరికి ఉంటై ఈ చుపిచ్చుకునే పైత్యం ఏంటో???

సమాజం ఇలా తగలడడానికి కొంతమంది తల్లి తండ్రులు కుడా కారణం తమ పిల్లల మీద ఉన్న " అపార" ప్రేమతో కొత్త కొత్త మోడల్ ద్రస్సులని, ఫేషన్ అని సగం సగం దుస్తుల్ని పిల్లల్ని చిన్నప్పటి నుండే అర్ధనగ్నానికి అలవాటు చేస్తున్నారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తరువాత "సిగ్గు" అనే పదం మర్చిపోతున్నారు.

ఒకసారి ఆడపిల్లల కాలేజ్ కి వెళ్లి చుస్తే...నేను కాలేజ్ లో ఉన్నానా లేక ఏదైనా B  గ్రేడ్ సినిమా షూటింగ్ లో ఉన్నానా నాకే అర్ధం కాలేదు...


నేటి సినిమాలు కుడా ఈ రుగ్మత కి ఒక కారణం అంటాను నేను, ఇదేమి పెద్ద తప్పు కాదు అన్నట్టు చూపిస్తున్నాయి, సమాజం సరేలే అనుకుంటుంది తమ పిల్లలు అలా చేస్తే "పరవాలేదులే " పక్కింటివాళ్ళ అమ్మైయి కంటే నయం అని తమ "పెద్దరికం" చూపిస్తున్నారు, ప్రేమ అనేది ఒక "స్వచమైన ఫీలింగ్ ని తుచ్చమైన డీలింగ్" గా చేసేసారు ఈ సినిమా వాళ్ళు. పాత సినిమాలలో పాటలు లేవా?? ప్రేమ లు లేవా?? కాని నేటి సినిమాల్లో ప్రేమ అంటే పారిపోవడం పాత అంటే పడుకోవడం (ఒకరిమీద ఒకరు) చేసేసారు.


నాకు ఎప్పటినుండో అర్ధం కాని విషయం ఒకటి ఉంది ఈ సినిమాలలో నటించే అమ్మాయిల ఇళ్ళల్లో వాళ్ళు సినిమాలు చూడరా??? ఉదాహరణకు కాజల్ నే తీసుకుందాం, కాజల్ కి ఒక తమ్ముడు ఒక నాన్న ఉన్నారు అనుకుందాం , తమ్ముడేమో  సినిమా చుస్తూ "అబ్బ మా అక్క తొడలు బాగున్నై"అని తండ్రేమో "నా కూతురు బొడ్డు బాగుంది" అని కామెంట్ చేసుకుంటారా ??? ఒక వేళ వీళ్ళు బయట తిరుగుతుంటే ఎవరైనా నా లాంటి జులాయి వెధవలు " అబ్బ దీని _________ చూడరా ఎలా ఉందొ " అనుకుంటుంటే వీళ్ళకు ఎలా ఉంటుందో? సినిమా కధానాయికలు అంటే మనకు ఇష్టమే కాని మన ఇంట్లో వాళ్ళని సినిమా హీరోయిన్ చేద్దాం అనే ఆలోచనే మనకు రాదు, కధానాయికలు "మమ్మలిని సమాజం చిన్న చూపు చూస్తుంది" అంటే ఎందుకు చూడదు ?? మీరే మొత్తం చూపించి మేము పతివ్రతలం అంటే ఎవరు నమ్ముతారు ??? ఈ సినిమా హీరోఇన్ల కంటే మా గుడివాడ పాటిమీద బాచ్ బెటరు కెమెరా ముందు బట్టలు విప్పరు. ఒకవిధం గా ఆడవాళ్ళూ సమాజం చులకన కావడానికి ఈ సినిమా హీరొయిన్ లు కుడా ఒకా కారణం.

ఇక్కడ అందరితో ఒక చిన్న విషయం చెప్పుకోవాలనిపిస్తుంది, నేను ఇంటర్లో ఉండగా ఒక B  గ్రేడ్ సినిమా( షకీలా అనుకుంటా ) మొదటిగా చివరిగా చూసాను, అందరం ఫ్రెండులు కలిసి వెళ్ళాం ,బయటకు వచ్చిన తరువాత మాలో ఒక్కడు " అరేయ్ బస్ స్టాండు కి వెళ్దాం అన్నాడు" 
మాకు అదే పెద్ద టైం పాస్ కాబట్టి వెళ్ళాం. వాడు మాత్రం అక్కడ ఉన్న ప్రతీ ఆడవాళ్ళని తదేకంగా చూస్తున్నాడు ,మా బాచ్ లో ఎవడో అడిగాడు "ఏంట్రా అలా చూస్తున్నావ్ అందరిని" అని ...అప్పుడు వాడు చెప్పిన సమాధానం అప్పటికి నవ్వు వచ్చింది కాని ఇప్పుడు తలచుకుంటే ఏమనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. " ఎం లేదురా అక్కడ సీన్ లో ఈ అమ్మాయిలని ఉహించుకున్తుంటే బలే కిక్కు ఉందిరా విళ్ళవి కుడా అలాగే ఉంటాయిగా "  ఇది వాడి సమాధానం,

మన ఫెమినిస్టులకు ఈ విషయం లో భిన్నాభిప్రాయలు ఉన్నాయ్ ,కొంతమంది" అది మా హక్కు" అంటారు. అంటే ఆడవాళ్ళు ఎలా తిరిగినా కుడా మొగవాళ్ళు వెధవ వేషాలు వెయ్యకూడదు అని విల్లా ఉద్దేశం ఏమో కాని "ఇది మా హక్కు" అని అత్యాచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు.ఒక విధం గా చుస్తే కవ్వించే వాళ్ళ మీదే అత్యాచారాలు జరిగాయి తప్పితే మడి కట్టుకునే వారి మీద కాదు.

ఏదేమైనా చివరగా నేచేప్పేది ఏంటంటే నేటి సమజం లో ఆడవాళ్లకు హక్కులు కావాలి అంటే ఆడవాళ్ళు ఆడవారిగా ఉండాలి, పద్ధతిగల ఆడవారికి ఏమి అడగకుండానే సమాజం అన్ని హక్కులు కల్పిస్తుంది, ఎగిరి పడే ఆడవాళ్ళనే "ఒక రకం గా "చూస్తుంది. మేధోసంపత్తి అందరికి సమానమే కాని ఆలోచనా విధానం వేరు.

నిజానికి దీనికి ముగింపు ఎలా ఇవ్వాలో నాకు అర్ధం కాలేదు ....