3, జనవరి 2012, మంగళవారం

"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" VII

( అప్పటివరకు మంచివాడు గా ఉన్న రాజు , భవాని చెల్లి సిరి వల్ల, తను ఒక పడవ తరగతి విద్యార్ధిని కొట్టడం వల్ల ఒక్కసారిగా అందరి కళ్ళల్లో రౌడి అయిపోతాడు  రాజు, )

రాజు పదవతరగతి లో వచ్చిన తరువాత:::::

               అలా పడుతూ లేస్తూ పదవతరగతి లోకి వచ్చేసాం , ఇప్పుడు మేమే పెద్దవాళ్ళం స్కూల్ లో అనే రెండు కొమ్ములు మాకందరికీ వచినాయి, లతా దామోదరాన్ని , నేను భవాని ని వదలకుండా ప్రేమిస్తూనే వున్నాం, భావాన్ని పూర్తిగా నాతొ మాట్లాడటం మానేసింది, అసలు నా వైపు చూడటమే లేదు , ట్యూషన్ కుడా వెళ్ళబుద్ధి కావట్లేదు, లత బాధేమో విచిత్రం దాము గాడు ఎంత భయపడుతున్నాడో  తనతో మాట్లాడటానికి, ఆడో కామెడి అయిపోయాడు అందరికి,  నేనేమో మొదటి బెంచి నుండి లాస్ట్ బెంచి కి వచ్చేసాను, వందలో మొదటి పది మార్కులు తప్పించి మిగతా మార్కులన్నీ అక్కడే ఉంటాయి, వాళ్ళేమో ఎంత ప్రేమగా చుసుకుంటున్నారో నన్ను, నాకు మొదటి యూనిట్ పరిక్షలలో గాని అర్ధం కాలేదో, దుర్గాప్రసాద్ అంటే అందరికి భయం అందరికి స్కూల్ లో ఎవరిని లెక్క చేయడు వాడు నాకు సపోర్టు, ఇంకేముంది మనం ఒక చిన్న సైజు హీరో అయ్యం వాడికి పరిక్షలలో రెండు బిట్టులు చూపించి, ఎవడైనా ఏమైనా అంటే ఎరా ? దుర్గా గాడికి చెప్పనా అని బెదిరించేవాడిని, టేచర్లు కుడా నన్ను ద్వేషించడం ప్రారంభించారు, ఇప్పుడు మా స్కూల్ లో నాకు కొన్ని బిరుదులూ కుడా ఇచ్చారు , పెద్ద ఎదవ , పోరంబోకు, గాలోడు, ఇంకా చాలా ఉన్నాయి గాని మనదాక రాలేదు, ఇంటికెళ్ళిన తరువాత పుస్తకాలు తీయడం మానేసాను, నాన్న అంటే భయం పోయింది, నాకు నేనే రాజు ని నిజమైనా రాజు ని ,

అదేంటో గాని ఏమి చదవకపోయినా అన్ని పరిక్షలు పాస్ అయిపోయేవాడిని కాకపొతే ఇంతకూ ముందు తొంభైలు వచ్చే మార్కులు ఇప్పుడు అరవై లలో వస్తున్నై అయితే ఏమి పాస్ అవుతున్నాం గా!!! అది నా ధైర్యం, కాపీలు పెట్టడం అంటే అదేదో పెద్ద పని అనుకునే నేను దుర్గ ప్రసాద్ తో కలిసిన తరువాత అదేమీ పెద్ద పని కాదని తెలిసింది, నేను కుడా కాపీలు పెడదాం అని కాపీలు రాసేవాడిని కాని రాసిన తరువాత చుస్తే ఆ   ప్రశ్న నాకు  వచ్చేసేది ఇంకా కాపి ఎందుకులే అని పారేసేవాడిని, ఒకటి రెండు సార్లు పెట్టుకుని వెళ్ళినా గాని తీయకుండానే రాసేసేవాడిని,

వేరే ఊరులో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్ పిల్లలు ఎనిమిదవ తరగతి లో జాయిన్ అయ్యారు, వాళ్ళ జాయినింగ్ కంటే ఒక రోజు ముందు "ఈనాడు ఈ వారం" పుస్తకంలో ఒక కద  చదివాను దాని వల్ల తెలిసింది ఏంటంటే " అసుయ ముందు పుట్టి తరువాత ఆడది పుట్టింది  " అని, ఎనిమిదవ తరగతి లో కొత్తగా వచ్చిన కృత్తిక అనే ఒక అమ్మాయి ని చూడగానే నాకు ఒక భయంకర మైన ప్లాను వచ్చింది, నేను కొంచెం అందంగా ఉంటానని నా అనుమానం నా అందం తో క్రుతికా కి దగ్గర అయ్యి భవాని కి అసుయ పుట్టించాలని, అనుకున్నదే తడవుగా సడన్ గా క్లాస్స్ మధ్యలో లేచి నుంచున్న లెక్కల మేడం గౌరీ గారు " ఏంట్రా " అన్నారు
"ఏమిలేదు "
"ఎందుకు నున్చున్నావు"
"ఉరికే"
"ఊరికే ఏంట్రా""
"నా ఇష్టం నుంచుంటా'"
"మిగత వాళ్ళకి అడ్డం రాకు బయటకు పో"
"వెళ్తాం మీరు చెప్పేది డబ్బుల కోసమే గాని మాకు అర్ధం అవ్వాలని కాదుగా" అని విసురుగా బయటకు వెళ్ళిపోయాను.
నేను బయటకు వెళ్ళిన ఒక పది నిమిషాలకు ఇంటర్వెల్ అయ్యింది ,అందరు బయటకు వచ్చారు, భావాన్ని మాత్రం బయటకు ఎప్పుడు రాదు, అలాంటిది ఆ రోజు ఏంటో బయటకు వచ్చింది గ్రౌండ్ లో అందరు ఆడుకుంటున్నారు, భవాని ని చూడంగానే ఒక్కసారిగా ఆవేశం వచ్చింది,  కృత్తిక దగ్గరికి వెళ్ళాను నా వంక విచిత్రం గా చూసింది, అందరు ( వాళ్ళ బాచ్ వాళ్ళు) చూస్తున్నారు నా వంకే,
అప్పుడు నేను " క్రుతికా మీది ఈ ఉరు "
"మాది ****వరం "
"ఏడు అక్కడే చదివావా?"
"అవును "
"ఎన్ని మార్కులు వచాయి"
"504 "
"బానే వచ్చాయి కదా" మధ్యలో భావాన్ని వంక చూస్తున్నా , అలాగే నా వంక చూస్తుంది.THIS WHAT I AM EXPECTING అనుకుని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్న తనతో, ఇంటర్వెల్ అయిపోయేంతవరకు, నా పాచిక బానే పారింది భవాని కి కోపం వచ్చింది...

భవాని కి ఇంకా కాలాలని కావాలని క్రుతికా కి బాగా దగ్గరయ్యాను ఎంత అంటే తను నా కోసం నా క్లాసుకు వచ్చేవరకు అన్నమాట.

ఇది ఇంకో మలుపు తీసుకుంటుంది అని నాకేమి తెలుసు.

 ఏ మలుపో..........  త్వరలో............

4 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

పెద్ద ఎదవ , పోరంబోకు, గాలోడు, ఇవి నిజంగా రాజు బిరుదులేనా లేక????? ఒక చిన్న సైజు హీరో అబ్బో! ఆ వయసుకి మళ్ళీ హీరో కూడానా? పైగా దాదాగిరీ? హన్నా!

kastephale చెప్పారు...

మొత్తానికి హీరో అవుదామని ప్రయత్నం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మొదటి బెంచి నుండి లాస్ట్ బెంచి కి వచ్చేసాను, వందలో మొదటి పది మార్కులు తప్పించి మిగతా మార్కులన్నీ అక్కడే... కేక..
రాజు.. నిజంగా రాజే! కాక పొతే చెడ్డగా పేరు కోసం ప్రాకులాడుతున్న రాజు అన్నమాట. ఇంకా కాకపొతే మంచో..చెడ్డో..లక్ష్యం నెరవేరిన తర్వాత చూడాలేమో!

నేను కూడా..భవానీ వైపు నుండి జీవితం -పురుషుడు-లక్ష్యం .. మొదలేడదామనుకుంటున్నా.. కాస్త మీ తరహా పంచింగ్ డైలాగ్స్ లీక్ చేయండీ..రాజు..ప్లీజ్!!

PALERU చెప్పారు...

రసజ్ఞ గారు,
అవి నా బిరుదులేమో అనే కదా మీ అనుమానం.!!! మీరు రాజు ని అవమాన పరుస్తున్నారు:):) కచితంగా రాజువే.....ఇప్పుడే ఏమి చూసారు హీరో ని దాదాగిరిని ముందు ముందు చుడండి....

తాత గారు,
హీరో రాజునే...... ఇంకా ప్రయత్నం ఏమి లేదు..హహహ

వనజ గారు,
""/////మొదటి బెంచి నుండి లాస్ట్ బెంచి కి వచ్చేసాను, వందలో మొదటి పది మార్కులు తప్పించి మిగతా మార్కులన్నీ అక్కడే"""////
ఈ పంచ్ సెన్సు అఫ్ హ్యుమర్ ఉన్నవాళ్లకే తగులుతుంది , బలే పట్టేసారే......మీరూ రాద్దురుగాని.... ముందు ముందు ఇంకా ఎంతమంది భావాన్ని లు ఉన్నారో చూసుకొని అందులో ఏ భవాని తరుపున రాస్తారో నిర్ణఇంచుకోండి ముందు :):):) ....