హాయ్ !!!!
నిన్న సాయంత్రం, ఇద్దరినీ కలిసాను , పాలస్తానీయుడు , ఒకరేమో ఇంగ్లాండ్ దేశస్తుడు, ఇద్దరు ముస్లిములే మాటల సందర్భము లో వాళ్ళ వాళ్ళ కష్టాలు ఏకరవు పెట్టారు, విచిత్రమైన విషయం ఏంటంటే " భారతీయ ముస్లిములు " vallakante ఎక్కువగా బాధలు అనుభవిస్తున్నారు అంట.......సిల్లి కదా....వాళ్లతో తీవ్రంగా విభేదించాను, వాళ్ళు చెప్పిన ఒక విషయం లో కాసేపు ఏమి చెప్పాలో అని తికమక పడ్డ కాని తరువాత సరియిన జవాబు ఇవ్వగలిగాను, ఇంతకీ వాళ్ళు చెప్పింది ఏంటంటే " మీ భారతీయ ముస్లిములే చెప్పారు, వాళ్ళకు ముస్లిములు అవ్వడంవలన సరైన అవకాశాలు రావట్లేదు అని, అక్కడ ఉన్న ఒక భారతీయుడు కుడా వాళ్ళకు సపోర్ట్ గా ఒక భారతీయ కంపనీ లో తన అన్నయ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు మేము ముస్లిములకు జాబులు ఇవ్వం అన్నారటా....
నా సమాధానం ఏంటంటే....టాలెంట్ ఉన్నవారికి ఎప్పటికైనా ఛాన్స్ ఉంటుంది మా భారతదేశం లో ఎవరితే మీకు ఈ విషయాలు చెప్పారో గాని వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు అందుకే అలా అనుకుంటున్నారు, ఒక ఇస్లాం కాని దేశం లో దేశ ప్రధమ పౌరుడు " రాష్ట్రపతి" ముస్లిం అవ్వడం ఒక భారతం లోనే అవుతుంది, ఇర్ఫాన్ పఠాన్ , షారుఖ్ ఖాన్, జహీర్ ఖాన్, M F హుస్సేన్, సానియా మిర్జా, వెళ్ళందరూ అదే భారతదేశం నుండి కాదా పేరు సంపాదించింది?? అని కౌంటరు వేసాను, తరువాత ఆ భారతీయుడు ( నార్త్ అతను) బాబు మనకు లా అనే అత్యున్నత , అత్యుత్తమ వ్యవస్థ ఒకటి ఉంది !!! ఎంతో మంది తప్పు చేసిన వారిని వాళ్ళు ఎంత పెద్ద హోదా వాళ్ళు అయినా ఎంత పెద్ద ధనవంతులు పలుకు బదులు ఉన్నవాళ్ళు అయినా వాళ్ళను అరెస్ట్ చేయడం మన భారత న్యాయ వ్యవస్థ కే చెల్లుతుంది, రాజా, కనిమోలి, రామలింగరాజు ,హర్షద్ మెహతా, ఎంత పెద్ద పుడింగి అయినా గాని జైలు ఉచలు లేక్కబెట్టారు కదా, ఒకవేళ నిజంగా ఆ కంపనీ ' మీరు ముస్లిములు కాబట్టి " మీకు జాబులు ఇవ్వం అంటే , మనం మన న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉంచి ఇష్యూ ని escalate చేస్తే కచితంగా మీ అన్నయ కు న్యాయం జరిగేది ,భారతదేశం ఇంతే , ఇక్కడ న్యాయం లేదు , పొలితిచ్స్ బాలేవు , అని ఏదో ఒక మిష మీద భారతదేశాని తిట్టడం తూలనాడటం బాగా అలవాటు అయిపొయింది మనందరికీ, ఒక్కసారికి మంచి మనసు తో చుస్తే భారతం అంత మంచి దేశం ఎక్కడుంటుంది ? అని కడిగి పారేసాను,
తెల్ల తోలు వాడు I LIKE YOUR SPIRIT , I FEEL SORRY ON MY SELF NOT BEING INDIAN AFTER LISTENING YOUR WORDS" అన్నాడు అసలు ఎంత ఆనందం వేసింది అంటే మాటల్లో చెప్పలేను అప్పుడు ఆ నార్త్ వాడిని చూసి కళ్ళు ఎగరేసి , కాలరు ఎగరేసి , గాల్లిలో తేలుకుంటూ, రూం కి వెళ్ళాను,
మాటల మధ్యలో ఇంగ్లీష్ వాళ్ళు చూపిస్తున్న కొన్ని అసమానతలు చెప్పాడు వాటిని ఇలా క్రోడీ కరించాను.
మన ఇండియా లో కుడా కొన్ని సార్లు ఈ అసమానతలు కనిపిస్తుంటాయి, కాని మరీ అంట కాదు, ఒకసారి నేను హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాను డిల్లి విమానాశ్రయం లో రాత్రి ఒంటి గంట కు దిగాను, చెకింగ్ నుండి నేను బయటకు వచ్చే సరికి మార్నింగ్ నలుగు అయ్యింది, ఆరోజు నాకు RAANBAXY లో ఇంటర్వ్యూ, అసలు నిద్రపోకుండా ఇంటర్వ్యూ కి వెళ్లి జాబు కొట్టుకోచేసాను, కాని అందరిని వదిలేసి నన్ను మాత్రం అంతసేపు ఉంచడం కొంచెం బాధ పెట్టినా సరేలే మన దేశ పౌరుల రక్షణ కోసం నేను సహకరిస్తున్నా అని గర్వపడ్డాను కాని , వచేటప్పుడు మాత్రం ఆ ఆఫీసర్ అన్న మాటలు మాత్రం గుర్తుంది పోయినాయి " YOU ARE VERY DENGOROUS PEOPLE " నేను సరదాకి అన్నాడేమో లే అని అతని పేస్ వైపు చుస్తే చాలా సీరియస్ గా ఉంది .... అక్కడికి ఒక చిన్న జోక్ వేసాను " YOU MEAN ANDHRA PEOPLE?" కాని అతను మాత్రం చాల కోపంగా " I M NOT KIDDING I MEAN YOU MUSLIMS' అప్పుడు వచిందండి నాకు కోపం గొడవ గొడవ చేసేసాను ఎయిర్ పోర్ట్ లో " ALL MUISLIMS ARE NOT LIKE THAT TRY TO THINK LIKE INDIAN WHAT EVER HAPPENING IN INDIA IT IS NOT BY INDIAN MUSLIMS EVERYONE KNOWS WHO ARE THEY...TRY TO DISTINGUINSH BETWEEN INDIAN MUSLIMS AND MUSLIMS" అక్కడికి వేరే వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్పించి గొడవ సర్దిపెట్టారు లేకపోతె నా ఇంటర్వ్యూ పొతే పోయింది కాని అతని మీద మాత్రం సీరియస్ గా ఆక్షన్ తీసుకునే వాడిని ఇలాంటి కొంతమంది అందరి మనస్సులో విషం నింపుతున్నారు.
|
JEW |
ఎ ఇతర మతస్తుడు అయినా గెడ్డం పెంచుకుంటే అతనేమో తన మతాన్ని నిష్ఠ గా ఆచరిస్తున్నాడు.
ఒక నన్ తన కు తానూ దేవునికి అర్పించుకోవడానికి, లేదా దేవునిసేవ కోసం తల నుండి కాలి వెలి వరకు కప్పుకోవచ్చు కదా? అదే పని ఒక ముస్లిం మహిళా చేస్తే మాత్రం హింసించబడుతుంది, అణగదొక్కబడుతుంది, దేశ అభివృద్ధికి అడ్డం పడుతుంది,
ఎవరైనా తల్లి ,ఇంటిదగ్గర ఉండి తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటుంటే ఆమె త్యాగ మూర్తి , తన పిల్లల పోషణ కోసం తన కెరీర్ ని త్యాగం చేస్తుంది. అదే పని ముస్లిం చేస్తే మాత్రం "చాందసవాదులు ఆమె స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారు","!
ఎ అమ్మాయి అయిన కాలేజ్ కు గాని మరెక్కడికైనా గాని తన ఇష్టమైన దుస్తులు ధరించి వెళ్ళవచ్చు, ఎందుకంటే ఆమెకు ఆ హక్కు మరియు స్వేచ ఉంది. But ఒక వేళ ఒక ముస్లిం అమ్మాయి / స్త్రీ మాత్రం బురఖా / హిజాబ్ వేసుకుని కాలేజ్ కు వేలేతే మాత్రం విచిత్రం, వివాదాస్పదం,!
ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ లో కృషి చేస్తున్నాడు లేదా తన జీవితం అంకితం చేస్తే అతను టాలెంట్ ఉన్నవాడు, కష్టజీవి ! But ఒక ముస్లిం విద్యార్ధి తన జీవితాని ఇస్లాం నేర్చుకోవడం లో గడిపితే , కాబోయే ఉగ్రవాది , !
ఎందుకు????????? ముస్లిం కాకుండా ఎవరైనా హత్య చేస్తే , అక్కడ మతం పేరు రాదు, ఒక ముస్లిం గనక ఏదైనా తప్పు చేస్తే కోర్టులో నున్చోబెట్టేది "ఇస్లాం" ని !!! ఎవరైనా ఇతరుల కోసం తన జీవితాని త్యాగం చేస్తే, అతనేమో నిస్వార్ధుడు, అతన్ని అందరు గౌరవిస్తారు,.
కాని అదే పని ఒక పాలస్తీనియుడు, తన కుటుంబాన్ని కాపాడు కోవడానికి, తన దేశ భవిష్యత్తు కోసం యుద్ధ్హ రంగం లో చనిపోతే BCC కళ్ళకు మాత్రం అతను ఒక "ఉగ్రవాది"! ఎందుకు ? ఎందుకంటే అతను "ముస్లిం"! ఎవరైనా ఒక కారు నడుపుతూ ఏదైనా ఆక్సిడెంట్ చేస్తే ఎవ్వరు కారు ని తప్పు పట్టరు!!!....
But కాని ఒక ముస్లిం తప్పు చేస్తే లేదా ఇతరులతో రూడ్ గా ప్రవర్తిస్తే " అది మాత్రం ఇస్లాం తప్పు"!
అసలు ఇస్లాం ఏమి చెబుతుందో ఇస్లామిక్ సిద్ధాంతాలు ఏంటో తెలుసుకోకుండా జనాలు గుడ్డిగా పేపర్లను న్యూస్ చానళ్లను నమ్ముతారు .
But ఇస్లాం ని ద్వేషించే విమర్సించే వాళ్ళు ఎంతమంది కురాన్ ను చదివారు ?? అర్ధం చేసుకున్నారు? !!!!
|
9 కామెంట్‌లు:
million Dollar question.
సునిశితంగా ఆలొచించి చూస్తే గాని అర్ధాలు బోధ పడవు. ప్రపంచంలొ అత్యధిక షాతం మంది..ముస్లింలు.. మతం కి చాంధసంగా ప్రాముఖ్యతని ఇచ్చి జీహాద్ పేరిట చేస్తున్న విధ్వంశం వల్ల ప్రపంచ దౄష్టిలో వారు అనుమానింపబడుతున్నారు .వారి ఉనికిని కాపాడుకోవడానికో లేదా వారి అణచివేతకు ,లేదా..వారిని ముందు ఉపయొగించుకుని తర్వాత వెన్ను చూపినందుకో.. యెవైనా కారణాలు అనేకం. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం కుటుంబాల లొని స్త్రీలపై అణచివెత లెదని ఇష్తానుసారంగానె వారు అన్ని చెస్థున్నారనై అందానికి నేను ఒప్పుకొను. లింగ వివక్షత అన్ని చోట్ల ఉన్నట్లె ముస్లిం వనితల పత్ల ఉంది. అలాగే మత చాంధసం వారిని మగ్గ పెదుతూనె ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచం మారినట్లు వారు మారుతున్నారు. మీరు భారత దేశాన్ని కీర్థిస్తూనే మీ పట్ల వ్యవహరించిన తీరుకి నిరసన తెలుపుతూ.. దేశంలొ.. ముస్లింస్ వివక్షత కి గురి అవుతున్నారు అని చెపుతున్నారు. మై నేం ఈజ్ ఖాన్ గుర్తుకు వస్తుంది.
ప్రతి ఒక ముస్లిం తీవ్రవాది కానట్లే ప్రతి భారతీయుడు..ముస్లిం వ్యతిరేకి కాదు. అలాగే భారత దేశంలొ ..ఉండే ప్రతి ముస్లిం భారతీయుడు గా ఉండటం లేదనే అభద్రతా భావం ని కల్గించే నిజాలు బయతపడటం లేదా? ఆశ్రయాలు ఇచ్చి.. ఈ దేశనాశనాంకి చేయూతనిచ్చినట్లు అధారాలు దొరకడం లేదా?
అధికారులు విధులలో అనేక దోరణులు యెదుర్కొవాలి. ఒక ముస్లిం గా మీరు యెదుర్కొన్న చేదు అనుభవానికి మీకు క్షమాపణలు లభించాయి. సున్నితమైన విషయాల పట్ల తీవ్రంగా స్పందిస్తారు కదా! ఒక మాట.. మీరు ఒక గర్వకారకమైన భారతీయుడు.యెల్లప్పుడూ గర్వించేలా ఉంటారు. మీ ప్రశ్నలు ఆలొచింపజేస్తున్నాయి.
>>>>>
ఒక వేళ ఒక ముస్లిం అమ్మాయి / స్త్రీ మాత్రం బురఖా / హిజాబ్ వేసుకుని కాలేజ్ కు వేలేతే మాత్రం విచిత్రం, వివాదాస్పదం,!
>>>>>
ఫ్రాన్స్‌లో సిక్కు విద్యార్థులు తలపాగాలు వేసుకుని స్కూల్‌కి వెళ్తే అది కూడా వివాదాస్పదమయ్యింది. సెక్యూరిటీ దృష్ట్యా బ్యాంక్‌లు, టెలీఫోన్ ఎక్స్‌చేంజ్‌లు, స్కూల్‌లు, కాలేజిలు లాంటి చోట్ల హిజబ్ వేసుకోకూడదు. IDBIకి వెళ్ళినప్పుడు CC కెమెరాలో నా ముఖం కనిపించడం లేదని టోపీ తీసెయ్యమన్నారు. ఇక హిజబ్ వేసుకునేవాళ్ళని ఎలా లోపలికి రానిస్తారు?
నజ గారు,
ముందుగా మీరు కొంచెం మంచి నీళ్ళు తాగండి ..చాలా కోపం లో ఉన్నట్టుఉన్నారు, :):) తెలిసో తెలియకో ఏదో ఒకటి బరికేస్తుంటాను మీరు అలా కోపగించుకుంటే ఎలా?? సరిదిద్దకపోతే ఎలా?? నా నవల పేరు మార్పించింది మీరే కదా....ఏమైనా తప్పుగా రాస్తే " ఒరే పాలేరు !!!ఏంట్రా ఇది ?? ఇలా ఎందుకు రాసావురా ?? ఇలా రాయకూడదు రా !!! అంటే వినకపోదునా.... ఆ కామెంటు మీరు కాకుండా వేరే వాళ్ళు రాసుంటే సమాధానం ఇచ్చి ఉండేవాడిని కాని గురువు లాంటి మీతో నేను వాదులాడలేను .....అనవసరంగా మిమ్మలిని BP తెప్పించినట్టున్నాను...ఈ సారికి క్షమించేయరాదు మేడం !!!! ప్లీజ్...:)):):)
ముస్లిం సోదరులో లో నాకు ఒకటి బాగా నచ్చుతుంది... వారిలో ఎవరు అయిన కష్టాలలో గాని గొడవలో గాని ఉన్న వాళ్ళు మొత్తం అతనికి సపోర్ట్ చేస్తారు అతను తప్పు చేశాడా లేదా మంచి చేశాడా చూడరు ముస్లిం అయితే చాలు...
అదే మనవారిలో చాలా తక్కువా ఎక్కువగా మనకు ఎందుకులే అని వేల్లిపోఎవారే ఎక్కువా...
raafsun గారు..మీరు రాసిన questionsకు answers నాకు తెలియవు.. కానీ ఒక్కటి మాత్రం నిజం... ఎవ్వరో కొందరు అలాంటి వాళ్ళు ఉన్నారని కనపడిన ముస్లింలందరినీ అదే ధోరణిలో చూడడం మాత్రం తప్పే...అని నా అభిప్రాయం. కానీ ఏం చేస్తాం? లోకం తీరు అంతేనేమో?
ముస్లింలు ఉగ్రవాదులా, కాదా అనే విషయం కొంత సేపు పక్కన పెడదాం. ముస్లింలలో సున్నీలపై దాడి జరిగినా షియాలు సున్నీలకి సపోర్ట్ ఇస్తారు. కానీ హిందువులలో రెండు కులాలవాళ్ళు కలిసిన సందర్భాలు ఎన్నడూ లేవు. మనవాళ్ళు ఐక్యతలో ముస్లింలని ఆదర్శంగా తీసుకోరు. ఉగ్రవాదం పేరుతో ఇస్లాం మతాన్ని విమర్శించడంలో మాత్రం ఆసక్తి ఉంటుంది మనవాళ్ళకి. ఇస్లాం మతాన్ని ఉగ్రవాద మతం అనుకున్నా వాళ్ళలో సామాజిక ఐక్యత లేదని మాత్రం అనలేము. పాలెస్తీనా ఉద్యమానికి టర్కీ తప్ప అన్ని ముస్లిం దేశాల మద్దతు ఉంది. ఒక చిన్న దేశానికి అన్ని ముస్లిం దేశాలు మద్దతు ఇవ్వడం గొప్పే కదా.
అయ్యా తెలుగు పాటలు గారు ,
మీరు చెప్పేది హైదరాబాద్ పరిసర ప్రాంత వాసుల గ్రురించి కాని మా కృష్ణా జిల్లాలో అలా ఏమి లేదు .... తప్పు చేసింది ఎవరైనా వాడిది ఎ మతం అయినా తప్పు తప్పే...అన్ని జ్జిల్లలకంటే కృష్ణా జిల్లలో మత సామరస్యం ఎక్కువ అనుకుంటానండి...
సాయి గారు,
నేను చెప్పేది అదే..తప్పు చేసిన వాడిని అనండి.... వాడి కుటుంబ సభ్యులని కాదు.... వాడి మతాన్ని కాదు ...వాడి కులాన్ని..... కాదు వాడి దేశాన్ని కాదు,..... అందరిని ఒకే గాతాన కట్టడం మంచిది కాదు అంటున్నాను, మీ సంఘీభావానికి ధన్యవాదాలు సార్.....
ప్రవీణ్ భాయ్...
/////ముస్లింలు ఉగ్రవాదులా, కాదా అనే విషయం కొంత సేపు పక్కన పెడదాం//////
పక్కన పెట్టలిసిన అవసరం లేదు , ముస్లిములు ఉగ్రవాదులు కాదు ముస్లిములలో ఉగ్రవాదులు ఉన్నారేమో !!!! ఇస్లాం మతం బోధించేది ఏకత్వం గురించి కదా...అందుకే ఆ సపోర్ట్ ఏమో....
There are many such biased, foolish officers in India. but, I appreciate your positive spirit. keep it up..
Mr. cheekati...
Thanks for u r support..the main thing thr is i tried to lighten the moment but he is too serious on his words... when he was unable to control to say " u Muslims are dangerous" then i failed to control my self...whtever, such stupids guiding the nation in wrong way...
కామెంట్‌ను పోస్ట్ చేయండి