28, మార్చి 2012, బుధవారం

నాది ఒక బ్రతుకేనా???

                నాన్న తెచిన పిజ్జా కొంచెం తిని అలా ఊరి మీద పడ్డాను....ఈ మధ్య నాన్న కు కోపం ఎక్కువయ్యింది ...ఎంతైనా వయసు మీద పడుతోంది కదా చాదస్తం ముదిరిపోతోంది.నాకేమో అప్పుడే ఆరు నిండి  ఏడు వచ్చేసాయి...అమ్మో పెద్దవాడిని అయిపోతున్నాను ...తప్పదు ఇంకా సంపదిన్చాలిసిందే...అందుకే ఏమైనా దొరుకుతాయేమో నని అలా బయలు దేరానన్నమాట....!!
   
         ఈ రోజు ఆదివారం గామోసు !! జనాలు చర్చికి వెళ్తున్నారు...ఎంత పెద్ద చర్చో ఎంత బాగుందో ..ఇంతలో ఆకశాకంపం వచ్చిందా అన్నట్టు " టంగ్" మని పెద్ద సౌండ్ ...ఒక్కసారిగా ఉలిక్కి పడి చుట్టూ చూసా ఏమ్మయ్యిందా అని !!! హహహ... చర్చి గంట .. నాలో నేనే నవ్వుకున్నా నా భయానికి ...ఇంతలో చర్చి ఫాథర్ కంఠం మైక్ లో " పవిత్రుడైన యెహోవా నామము జపించుడి !! మన పాప విముక్త్కి కొరకు రక్తం ధారపోసిన యేసయ్య మాట వినుడి..న్యాయం గా ఉండండి ప్రేమగా ఉండండి ఈ జీవితం ప్రేమమయం..మీ తల్లితండ్రులను ప్రేమించండి , నీ తోటివారిని , పక్షులను , జంతువులను ప్రేమించండి ...................................."ఇంకా చెబుతూనే ఉన్నారు కాని నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది " ఆహా !! నేను కుడా వీళ్ళల్లో పుట్టి ఉంటె బాగుండేది. ఎంత గొప్ప మతం అందరితో  ప్రేమగా మెలగండి అని చెపుతున్నారు ....అందరు ఇలాగే చెబితే,, వీళ్ళ లాగే ఉంటె ఎంత బాగుండు !!! ఈ మారణ హోమాలే ఉండవుకదా!!!


     అలా ఎంత సేపు వింటూ నిలబద్దనో నాకే తెలీదు లోపల కడుపులో ఎలుకలు " మరి మా సంగతో?? " అంటుంటే , ఈ లోకం లోకి వచ్చా చుస్తే మధ్యాన్నం అయిపొయింది..ఒక పక్క ఆకలి బాధ ఒక పక్క క్రిష్టియన్ గా పుట్టలేదన్న బాధ ...తిరిగి తిరిగి ఎక్కడ అన్నం దొరక్క ఒక చోట ఉన్న ఎంగిలి విస్తరాకుల లో నుండి కొంచెం అన్నం తిని ఇంటికి బయలు దేరాను..ఇంటి కి చేరేసరికి "తల " ప్రాణం " తోక " లోకి వచ్చ్చింది ...పడుకున్నానే గాని నిద్ర పట్టడం లేదు ఆ చర్చి ఫాదర్ మాటలే గుర్తుకు వస్తున్నాయి " అందరిని ప్రేమించండి ఎవ్వరిని ద్వేషించాకండి..." ఎంత మంచి మాటలు నేను ఒక నిర్ణయం తీసుకున్నా " ఈ రోజు నుండి నేను నా తోటి వారిని ద్వేషించను " అనుకుని నిద్రలోకి జారిపోయా....!!! సాయంత్రం అమ్మ లేపి కొంచెం అన్నం పెట్టింది అది తిని బద్ధకం గా ఉండటం వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళకుండానే బెడ్ మీద కి జేరిపోయాను. ఈ రోజు ఎం సంపాదించలేదు రేపైనా సంపాదించాలి అనుకుంటూ...నిద్రపోయా....


   మర్నాడు ప్రొద్దునే లేచి మా నాగన్న చెరువు దగ్గర కాలకృత్యాలు తీర్చుకుని తలారా స్నానం చేసి సంపాదనకి బయలు దేరాను .....అలా వెళ్తుండగా మా ఉరి మఠం దగ్గర ఏదో ఉపదేశం  జరుగుతుంది " ఆ (( మనకెందుకులే !!! అనుకుని ముందుకి వెళ్తున్న నన్ను ముని స్వామి వారి ఒక మాట నా "ముందరి" కాళ్ళకు బంధం వేసింది. అదేంటంటే " మన  కర్మల ఫలితమే మన జన్మ"  అంటే నేను క్రితం జన్మ లో నేను కాదన్న మాటగా...!! ఈ జన్మలో అన్నా నాకు మోక్షం అవుతుందా?? నా తరువాతి జన్మ ఎమై ఉంటుందో?? అని ఆలోచించుకుంటూ నిలబడిపోయాను ...ముని స్వామి చెబుతుఓనె ఉన్నారు " ఈ మన జన్మ మన పూర్వ కర్మల ఫలితం మనవ జన్మ అత్యుత్తమ జన్మ ఈ జన్మ లో పాపలు సహజం అయినాగాని ఆ పాపలు కడిగివేయడానికి పుణ్య మార్గాలు చాలా ఉన్నవి బిక్షువులను సాధువులను ఆదరించడం ముగా జీవాల పట్ల దయతో ఉండటం పేదలకు, విధవలకు అన్న దానం చేయడం లాంటివి ......ఆహా !!! ఎంత బాగా చెప్పారు "పుణ్య కార్యాలు " నీను కుడా చేసి మోక్షం పొందాలి ...అని అనుకుంటూ ముందుకు సాగి పోయాను ...


   అలా వెళ్తుండగా ఘుమ ఘుమ లాడే వాసన ముక్కును తాకింది ..నాలో పెరిగిన భక్తీ భావానికి మేచి దేవుడు నాకు సహకరిస్తున్నాడెమో ..అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళా ఏమైనా దోర్కుతుందేమో అని ...నా లాంటి లఫూట్ గాళ్ళు చాలా మందే జేరారు ..అందుకేనేమో ఆ భోజనాలు వడ్డించే ఆయాన దూరంగా జరిపెస్తున్నాడు ..విస్తరాకులు పడేసే చోటు  చూసి ఎంగిలి అయినా విందు ఎంగిలే కదా కొంచెం ఎంగిలి పడదాం అని అటుగా వెళ్ళా ...ఎప్పుడు దుర్గంధం తో కుప్పతోట్టిలకే తలమానికం గా ఉండే ఆ కుప్పతొట్టి ఈ రోజు కొత్త పెళ్లి కూతురిలా, ఒళ్ళంతా సెంటు పుసుకున్న పందిలా... సర్వాంగ సుందరం గా ఉంది.నడిమంత్రపు సిరి అంటే ఇదేనేమో??? హహహః నా జోకుకి నేనే నవ్వుకుంటూ ఆబగా వెళ్లి తినడం మొదలు పెట్టా ఆకలిగా ఉందేమో కొంచెం బానే లాగించా ఇంకాసేపట్లో లేగుద్దాం అనుకుంటుండగా ...ఒక రకమైన వాసన " దుర్గంధం " అనలేను కాని అలాంటిదే ...చూస్తుండగానే దగ్గరికి చేరింది .ఎవరబ్బా ఈ యువరాజు అని చుస్తే " వీడు" వీడి పేరు తెలియదు గాని అందరిదగ్గర అడుక్కుని తింటుంటాడు .హు వీడిది ఒక బ్రతుకేనా?? నేనే నయ్యం ఇంకా కొంచెం హుందాగా ఉంటాను ..అని అనుకుంటుండగా ....నా మనసులో భావం పసిగాట్టాదేమో?? నావైపు కోపం గా చూసాడు నా వైపు ..నా కెందుకో కుడి కన్ను అదిరింది ఇంతలో వాడిచేతిలో కర్ర నా వైపు విసిరాడు ..ఇలాంటివి చిన్నప్పటినుండి అలవాటే కాబట్టి తప్పుకోవడం వెన్నతో పెట్టిన విద్య అందుకే వొడుపుగా తపుకున్నా ...వీడని తగలెయ్య !! ఎవడిమీద పెత్తనం చెయ్యలేనోడు పెళ్ళాం మీద విరుచుకు పడినట్టు వీడికి నేను లోకువ ...సరేలే ....ఇవ్వాల్టికి చాలు... వీడు తినని ఎంతైనా ఆకలితో ఉన్నాడేమో అని అనుకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ..వెనక్కి తిరిగి చూసా ..తినేవాడు తినవచుగా పక్కన ఉన్న రాయి ని నా కేసి  విసిరాడు నావైపు చూడకుండానే ..అప్పుడు కాలింది నాకు ..బండ బూతులు తిట్టి పారిపోయా అక్కడినుండి ..అసలే లేట్ అయ్యింది  తొందరగా వెళ్ళాలి అనుకుంటూ బయలు డేరా..




    అలా వెళ్తుండగా కొంత మంది జనాలు కుర్చుని ఉంటె ..ఇక్కడ ఏమి పండగాబ్బా!!! అనుకుంటూ ఆగాను ..వీళ్ళందరూ తెల్ల బట్టలతో ఉన్నారు గడ్డలు అవి చూసి స్వామీజీ లేమో అనుకున్న కాని వీల్లు ముసల్మానులు ..అసలు వేల్లేమి  చెప్పుకుంటున్నారో అని ఒక చెవి అటు వేసా ..." మానవ్వులారా !! భయపడండి ..సకల లోకాల సృష్టికర్త అయిన అల్లా కు భయపడండి ..ఈ జీవితం మీకు అలాగే వచ్చింది అనుకోకండి మీరు చేసే ప్రతీ మంచి చెడు లిఖితమై ఉంటాయి దాని పర్యవసానం మీకు మీ మరణం తరువాత ఉంటుంది ..మీ డబ్బు మీ యవ్వనం , మీ సమయం , మీ స్వేచ , మీ హక్కులు, మీ బాధ్యతలు, అన్నింటికీ లెక్క చెప్పాలిసి ఉంటుంది పరిక్షా సమయం లో ప్రతీ విద్యార్ధి కి ఎలా స్వేచ ఉంటుందో అలాగే మీకు ఇహలోకం లో పూర్తీ స్వేచ ఇవ్వబడింది ...దానిని దుర్వినియోగ పరుచుకోకండి పేదల డబ్బుని "వడ్డీ" పేరుతొ తినకండి , కట్నాల పేరుతొ ఆడపిల్లల జీవితాలను దుర్భరం చేయకండి అనాధలను ఆదుకోండి భుమ్యకాసాలను సృష్టించిన ఆ విధాత మిమ్మల్ని gamaninchadani మీ పాప పున్యలకు ప్రతిఫలం ఉండబోదని అనుకుకండి..ఇలా సాగుతుంది ఆయనగారి ఉపన్యాసం ..ఆ పేపర్లు వెధవ న్యూసు చానల్సు చూసి విల్లంటే ఒకరకమైన భావం ఉండేది కాని పర్వాలేదు వీళ్ళు మంచోల్లే ..ఎవడో ఒకడు చేసినంత మాత్రానా అందరు అలాగే అంటే ఎలా ? వీళ్ళ మాటలు మంచివే, నిజాలే.."వడ్డీ" ఎంత పాపిష్టిది ..మా వీధిలో ఉండే సుబ్బయ్య  ఈ వడ్డీ వల్లే కాదు చనిపోయింది ..నీళ్ళు తిరిగాయి కళ్ళల్లో సుబ్బయ గుర్తుకు వచ్చి ..ఎంత మంచోడు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఎంతోకంత తినందే పంపించేవాడు కాదు. ఇంతకీ సుబ్బయ్యది ఎ మతమో??  పోనీలే సుబ్బయ్య మోక్షం పొందితే అదే పదివేలు ...నడుస్తూ ఉండగా సాయంత్రం వేల చల్లగాలికి  ఎక్కడైనా చిన్న కునుకు తీద్దాం అనిపించి రోడ్డు పక్కనే అరుగు మీద పడుకున్నా ...అందరి మాటలు మనసులో మెదిలాయి పాస్టర్ గారు చెప్పిన " పశు పక్ష్యడులను ప్రేమించుడి" ముని స్వామి గారు చెప్పిన " మూగ జీవాలతో ప్రేమతో మెలగటం..ఇమాం గారు చెప్పిన " ప్రతీ ప్రాణి కి వాటి వాటి హక్కు ఇవ్వటం ..." ఎంత మంచి వాళ్ళు వీళ్ళందరూ ...దేవుడు వీళ్ళని చల్లగా చూడు గాక !! మరీ అమ్మేందుకు వీళ్ళందరితో జాగర్త జాగర్త అంద్తుంటుంది ?? పాపం అమ్మ బావిలో కప్పు టైపు ..తను చూసిందే లోకం అనుకుంటుంది ..ఇంటికి వెళ్ళగానే ఇవన్ని అమ్మ కు చెప్పి దాని లోక జ్ఞానం పెంచాలి .."అరేయ్ రెండు కాళ్ళ జంతువులూ చాలా ప్రమాదకరం రా ..పిచ్చ కాగితాల కోసం ఒకరినొకరు అందునా సొంత వాళ్ళే కొట్టుకు చస్తారు రా  ..లాభం ఉంటె పని చేస్తారు లాభం లేక పొతే నువ్వెంత అంటారు..సొంత ప్రయోజనాల కోసం పక్కనోడి ప్రాణాలతో ఆడుకుంటారు ..." అంటున్తుంది ..పాపం పిచ్చిది ... అనుకుంటూ నిద్రపోయాను..


          బాగా రాత్రి అయ్యినట్టుంది ..చీకటి పడింది ..నిద్ర వల్ల ఒళ్ళంతా బద్ధకం గా ఉంది ఒళ్ళు విరుచుకుంటూ ఉండగా "  దడ.... దడ...దడ...అని ఒకటే సౌండు ..వెనక్కి తిరిగి చూస్తిని గదా ...మా MLA  కొడుకు కొత్త బుల్లెట్టు కొన్నట్టున్నాడు ...వీడు అంతే ..ఎప్పుడు మారుస్తూ ఉంటాడు ..వీడి బైకులని పెళ్ళాలని ...వెధవ..హహహ ...ఓరి వీడి దుంప తెగ వీడేంటి అంత ఫాస్టుగా వస్తున్నాడు కొంపదీసి గుద్దేస్తాడా ఏంటి? ఆ ఫాస్టు ఎ... ౦... టి....అమ్మ్మాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ ................గుద్దేసాడు పీనుగు ముండకొడుకు ....నడుము విరిగినట్టుంది  ఏదో కలుక్కు మంటుంది ..లేవలేక పోతున్న ఈ ముష్టి వెధవ ఎక్కడచాచ్చాడు...ఓహో వీడు నాలాగే పడుకుని ఉన్నాడు రోడ్డు కి ఆ చివర ...నా నొప్పి అంతకంతకు పెరుగుతుంది ..బాధ భరించలేక పోతున్నాను ..ఎవరు రారా నా దగ్గరికి?? అదేంటి అందరు వాడి దగర గుమిగుడతారు ...నా వంక చూసి గొనుక్కున్తూ వాదిదగ్గారికి వేల్తారేమిటి ? ఒకరిద్దరు ఇక్కడికి రండిరా నొప్పితో చచ్చిపోతున్నాను...ఆయనే వారు దూరంగా??? అమ్మయ్యా ....!!! ఈయనోస్తున్నాడు ..ఈయన నన్ను కాపాడతాడు ఈయనేగా చర్చి లో " మూగజీవాలను ప్రేమించుడి" అని చెప్పిన ఫతారు  ..నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడతాడు ...అని కళ్ళు మూసుకున్నాను ..అరె ..!! ఆయన కుడా వాళ్ళల్లో కలిసిపోయాడే ..ఆ MLA  కొడుకు దగ్గరికే వేళ్ళాడే??నా దగ్గరికి రాదా ?? ఈయన చెప్పినవి ఒత్తి మాటలేనా?? సరేలే పోతేపోనీ మునిస్వామి వస్తున్నాడు ఈయన ఆరోజు చెప్పాడుగా మంచి మాటలు ..ఈయన నిజమైన మనిషి ఈయన నన్ను కాపాడతాడు ..ఆ (( !! ఈయన కూడా ఏంటి?? అసలు ఆ రోజులో మంచిమాటలు చెప్పింది వీలేనా?? ఆహా ...వెళ్ళందరూ కాదు ముసల్మాను  వస్తున్నాడు ..ఈయనన్నా...అయ్యో ఈయన కుడా...చ ...ఓరి దేవుడా వీళ్ళు  మాటల వరకేనా ? ? ఇంతలో రయ్యిన్ రయ్యిన్ లంటూ ఒక బండి వచ్చింది అందరు కలిసి MLA  కొడుకుని ఆ బండిలో ఎక్కించారు ..అందులో ఆ ముగ్గురు కుడా ఉన్నారు ..అది వెళ్ళిన తరువాత నా వైపు చుదకున్దానైనా చక్కా  వెళ్ళిపోయారు ...
అరేయ్ ఎవడైనా కాపాదంద్రా...

నొప్పి భరించలేకపోతున్నాను ..అమ్మా ఏంటి ఈ నొప్పి? అమ్మా ..ఎక్కడున్నావే? ఇంతకీ బావిలో కప్పవి నువ్వా నేనా అమ్మా?? నా ప్రాణం పోతుంది అమ్మ..మిగిలిన గుంపు లో కొంత మంది నా చుట్టూ  చేరారు ..మొహాలు కనపడటం లేదు వారివి .." ఈ కుక్క వల్లే పడింది" అంది ఒక తలకాయ్.." అవును చచ్చినా  బాగుండు ఆ నా @#$" అంది ఇంకో తలకాయ్ ...వాళ్ళు ముగ్గురు ( పాస్టరు , మునిస్వామి, ముసల్మాను, ) లేకుంటే ..ఎవ్వడు వాడిని కాపాడేవాడు కాదు రా అంది ఇంకో తలకాయి ...ఒక తలకాయ్ ఏమో " ఎందుకు ?" అంది ...MLA  తో పని ఉండి ఉంటుందిరా వాళ్లకి అన్నాడు ఇంకొకడు ...

ఓహో వాడు పనికి వస్తాడని వాడిని కాపాదారా!! నేను "కుక్క" నని నా దగ్గరికి రాలేదా ?? మరి పాస్టరు పాప పరిహారం ఎలా?? ముని స్వామి కి మోక్షం వస్తుందా?? ఆ ముసల్మాను అల్లః కి ఏమని సమాధానం చెపుతాడు ?? నా హక్కు నాకు ఇవ్వలేదుగా!!! అయ్యో నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ..కళ్ళు మూతలు పడుతున్నాయి ...ఇక నా పని అయిపోయినట్టే ..అమ్మ నువ్వు చెప్పింది నిజం..నేనే అబద్దం ...చచ్చిపోతున్నాను అమ్మ ..ఉంటాను...


ఇంతలో ఒక రకమైన వాసన ....పరిచయం ఉన్న వాసనే ..కాని ఏంటో తెలిట్లేదు ..ఎవరై ఉంటారు? అందరు ఎప్పుడో వెల్లిపొయారుగా ఇది ఎవరు ?? మెల్లగా కళ్ళు తెరిచి చుస్తే ...మళ్ళి వాడే ..చెత్తకుండి దగ్గరి శత్రువు ..ఇప్పుడు వీడి కి అవకాసం ఇక నన్ను కసితీరా కోడతాదేమో ఆ రోజు బూతులు తిట్టానుగా...దగ్గరికి వస్తున్నాడు ...నా చావు వీడి చేతిలో రాసిపెట్టుందేమో !!! హు...ఇక కళ్ళు మూసుకున్నాను...


వీడేంటి నన్ను వొళ్ళో  పడుకో బెట్టుకున్తున్నాడు ? అదేంటి నా గాయానికి కట్టు కడుతున్నాడు ?? అంటే ....అంటే....అంటే.....వీడు నన్ను ..నన్ను.....కా ..,పా.. డు...తు..న్నా..డా...? నన్ను జాగర్తగా భుజాలా మీద మోసుకుని తీసుకు వెళ్తున్నాడు ..,,నాకిప్పుడో అనుమానం వస్తుంది ...వీడిదే మతమో ??? చాలా మంచి మతమేమో ?? నేను అందులో కచ్చితంగా కలిసిపోతాను ...


                                  *****************************************

21, మార్చి 2012, బుధవారం

ఏంటో??

 నేను లేకుండా చాలా విషయాలు విశేషాలు ..గొడవలు రాదంతాలు జరిగినట్టున్నయిగా బ్లాగ్లోకం లో ..!!! హ్మం ఏంటో ..లోకం చాలా మారిపోయింది...అందంగా ఉండే బ్లాగ్లోకం ఆనందంగా ఉండే బ్లాగ్లోకం ఇలా తయారయ్యిన్దేంటి??

10, మార్చి 2012, శనివారం

క్షమించండి....!!!

నేనేమైనా తప్పుగా రాసుంటే...క్షమించండి ఏదో అలా అనిపించింది ఆ టైము లో అలా రాసేసాను అంతే కాని నాకు ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు లేవని మీ అందరికి తెలుసు .....ఎవరినైనా నొప్పించి ఉంటె " సారి " అయినా నిజాన్ని నిజంగా రాయడానికి కృషి చేస్తాను ....అప్పుడు నేను వాడే భాష కొంచెం వాడిగా ఉంటె అది నా తప్పే !! ఏదైనా సౌమ్యంగా ఉండటానికే ప్రయత్నీస్తాను....

1, మార్చి 2012, గురువారం

భారతదేశం హిందువులది మాత్రమె కాదు ...




భారతదేశం హిందువులది మాత్రమె కాదు ..."ఈ దేశం అందరిది" గర్వంగా చెప్పుకోవడం కాదు "మేము కలిసి మెలిసి ఉంటాం" అని గొప్పలు చెప్పుకుని తిరగటం కాదు ... అందరూ ఈ దేశం అందరిది అనుకున్నప్పుడే " శాంతి సాధ్యం" బయటకు మాత్రం భిన్నత్వం లో ఏకత్వం ..రక రకాల ఆచార వ్యవహారాల కూడలి" అని చెప్పుకోవడం కాదు ఈ దేశం అందరిది అని ప్రతీ వర్గం అనుకున్నప్పుడే ఈ దేశానికి రక్షణ ఇవ్వగలము .....లేకపోతె సిమీలు అంజుమన్ లు పుడుతూనే ఉంటాయి...."మీరు ఆ దేశస్తులు ...ఈ దేశం మాది ...మొదటి సారి (విభజన జరిగినప్పుడు) ఏమి చేయలేదు మిమ్మలిని ....గుజరాత్లో మా ప్రతాపం చూపించాం .....బాబ్రి మస్జిద్ ని తీసేసుకున్నాం ఇక మీ ప్రాణాల వంతు అవి కుడా తీసుకుంటాం , హిందూస్తాన్ లో హిందువుగా ఉండండి .....లాంటి రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే ఎవరైనా ఎలా చూస్తూ కోరుకుంటారు ...క్రైస్తావులేమో మెల్లగా మత మార్పిడిలు చేస్తూ దేబ్బకోడుతున్నారు ........ముసల్మానులు అంత ఓపికా లేక తమ ని తాము కాపాడుకోవటానికి సొంత దేశం మీదే దాడికి తెగబడుతున్నారు .... ఇదంతా హిందువుల అతివాద వర్గం అయిన BJP , RSS , శివ సేన ...VHP  లాంటి వారి వల్లే ....ముసల్మానుల వల్ల ఈ దేశానికి భయం లేదు ,BJP , RSS , శివ సేన ...VHP  లాంటి వారు రేచాగోట్టే తీవ్రవాదులను తయారు చేస్తున్నారు .....హిందువుల్లారా!! ఆలోచించండి ఒకప్పుడు లేని ఈ తీవ్రవాదులు ఇప్పుడు ఎందుకు పుట్టుకొస్తున్నారు ?? " పిల్లిని కుడా గది లో బంధించి దాడి చేస్తే పులి అవుతుంది కదా.....కాదంటారా....ఇతర వర్గాల మీద దాడి ని ఆపండి...మీరు బ్రతకండి ఇతరులని  బ్రతకనివ్వండి .....ఎన్నో సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన ముసల్మానులు ఈ రోజు తమ రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు ...వారికి భరోసా ఇవ్వండి .........దేశాన్ని కాపాడండి ..........లేకపోతె మనదేశం కుడా ఇంకో పాకిస్తాన్ లా అనిశ్చితిలోకి వెళ్ళిపోతుంది...అందరిని గావురవించండి ...న్యాయం మీద నిలబడండి ....నిజాన్ని నిజం అనండి ...తప్పుడు మీడియా తప్పుడు కధనాలు నమ్మి ఉద్రేకులు అయిపోకండి ...ఈ రోజు ఒక నిమ్నజాతి కి ఉన్నన్ని హక్కులు కుడా ముసల్మానులకి లేవు ...ఏమైనా జరిగితే " మనం ఇక్కడ మైనారిటీలం ...వదిలేయడం బెటర్ " అని నిరాశలో బ్రతుకుతున్న సాటి భారతీయులని చుడండి ....ఆ నిరాశే వారిని తప్పుడు పనులు చేయిస్తుంది ...వారికి మీ మద్దతు ఇవ్వండి....

ఎందుకు రాసానో .....ఎందుకు రాయాలని పించిందో కాని రాసాను అంతే......!!!