1, మార్చి 2012, గురువారం

భారతదేశం హిందువులది మాత్రమె కాదు ...




భారతదేశం హిందువులది మాత్రమె కాదు ..."ఈ దేశం అందరిది" గర్వంగా చెప్పుకోవడం కాదు "మేము కలిసి మెలిసి ఉంటాం" అని గొప్పలు చెప్పుకుని తిరగటం కాదు ... అందరూ ఈ దేశం అందరిది అనుకున్నప్పుడే " శాంతి సాధ్యం" బయటకు మాత్రం భిన్నత్వం లో ఏకత్వం ..రక రకాల ఆచార వ్యవహారాల కూడలి" అని చెప్పుకోవడం కాదు ఈ దేశం అందరిది అని ప్రతీ వర్గం అనుకున్నప్పుడే ఈ దేశానికి రక్షణ ఇవ్వగలము .....లేకపోతె సిమీలు అంజుమన్ లు పుడుతూనే ఉంటాయి...."మీరు ఆ దేశస్తులు ...ఈ దేశం మాది ...మొదటి సారి (విభజన జరిగినప్పుడు) ఏమి చేయలేదు మిమ్మలిని ....గుజరాత్లో మా ప్రతాపం చూపించాం .....బాబ్రి మస్జిద్ ని తీసేసుకున్నాం ఇక మీ ప్రాణాల వంతు అవి కుడా తీసుకుంటాం , హిందూస్తాన్ లో హిందువుగా ఉండండి .....లాంటి రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే ఎవరైనా ఎలా చూస్తూ కోరుకుంటారు ...క్రైస్తావులేమో మెల్లగా మత మార్పిడిలు చేస్తూ దేబ్బకోడుతున్నారు ........ముసల్మానులు అంత ఓపికా లేక తమ ని తాము కాపాడుకోవటానికి సొంత దేశం మీదే దాడికి తెగబడుతున్నారు .... ఇదంతా హిందువుల అతివాద వర్గం అయిన BJP , RSS , శివ సేన ...VHP  లాంటి వారి వల్లే ....ముసల్మానుల వల్ల ఈ దేశానికి భయం లేదు ,BJP , RSS , శివ సేన ...VHP  లాంటి వారు రేచాగోట్టే తీవ్రవాదులను తయారు చేస్తున్నారు .....హిందువుల్లారా!! ఆలోచించండి ఒకప్పుడు లేని ఈ తీవ్రవాదులు ఇప్పుడు ఎందుకు పుట్టుకొస్తున్నారు ?? " పిల్లిని కుడా గది లో బంధించి దాడి చేస్తే పులి అవుతుంది కదా.....కాదంటారా....ఇతర వర్గాల మీద దాడి ని ఆపండి...మీరు బ్రతకండి ఇతరులని  బ్రతకనివ్వండి .....ఎన్నో సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన ముసల్మానులు ఈ రోజు తమ రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు ...వారికి భరోసా ఇవ్వండి .........దేశాన్ని కాపాడండి ..........లేకపోతె మనదేశం కుడా ఇంకో పాకిస్తాన్ లా అనిశ్చితిలోకి వెళ్ళిపోతుంది...అందరిని గావురవించండి ...న్యాయం మీద నిలబడండి ....నిజాన్ని నిజం అనండి ...తప్పుడు మీడియా తప్పుడు కధనాలు నమ్మి ఉద్రేకులు అయిపోకండి ...ఈ రోజు ఒక నిమ్నజాతి కి ఉన్నన్ని హక్కులు కుడా ముసల్మానులకి లేవు ...ఏమైనా జరిగితే " మనం ఇక్కడ మైనారిటీలం ...వదిలేయడం బెటర్ " అని నిరాశలో బ్రతుకుతున్న సాటి భారతీయులని చుడండి ....ఆ నిరాశే వారిని తప్పుడు పనులు చేయిస్తుంది ...వారికి మీ మద్దతు ఇవ్వండి....

ఎందుకు రాసానో .....ఎందుకు రాయాలని పించిందో కాని రాసాను అంతే......!!!

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నేను ఈ దేశంలోనే పుట్టినా
కొన్ని వేల ఎండ్లుగా ఇక్కడ్నే
బతికి బట్టకట్టింది నా జాతి
నల్దిక్కులా నమ్మిన మతానికి
కన్పడని ఓ బలాన్కి గుళ్ళు కట్టింది నా జాతి
ఎక్కడ్నుండి ఊడిపడిండో తెల్వదు
కొడుకు, వంకర కత్తుల్తో
శాంతితో
ప్రశాంతంగా
వెల్గుతున్ననా ఇండ్లలోనికి
కుశాలుగా వెళ్తున్న జీవితాల్లోకి
బలవంతంగా సొచ్చుకుని ఒచ్చినాడు కొడుకు
కత్తి చేతబూని
రక్తం మరకల కత్తి
నా నమ్మకాలను నేలకంట కూలగొట్టిండు
ఎందర్ని సంపిండో కొడుకు
వచ్చినోడు కన్పడ్డ కుతికని
తెగ నరికిండు
జాలిలా
దయలా
పిల్లలని జుడలా
పెద్దలని జూడలా
కన్పించిన ఆడదాన్ని చెరిచిండు
కన్పించిన ప్రాణాన్ని నరికిండు
తెగ నరికిండు
నా మతంల మారు అన్నడు
నా మతం కానోడు కాఫిర్ అన్నడు
నా గుళ్ళను కూల్చిండు
నా జాతి మానాన్ని దోచిందు
నా జాతి ప్రాణాలను దోచిండు
అరె, ఇప్పుడేమైందిబై?
మతం మారిన కొడుకు
మరో దేశం గావాలె అన్నడు
నా దేశాన్ని ముక్కలుజేపించిండు
సరే, పో!! ఫైసల్. ఖతం అనుకుంటి
లే!! అప్పట్నుండి ప్రతేళ
పక్కలో బల్లెం
పొడుస్తనే ఉన్నడు
రైల్ల పోతుంటే, నిప్పుపెట్టిండు
కాలికట్టైన ప్రాణాలని జూసి
నే కన్నెర్ర జేయగూడదు
కిందా పైన సేపెట్టి మూస్కుని కూకోవాలె
ఏం? ఎందుకు?
నే మనిడిసిని కాదా?
నాలో రగతం లేదా?
న రగతం ఎరుపెక్కదా?
నేను నీకూ, ఎన్నెముకలేని ప్రభుత్వానికి వెట్టోణ్ణా?
నా రగతం మరగదా?
నా ప్రాణం ప్రాణం గాదా?
నా జనం ప్రాణం ప్రాణం గాదా?

'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా
దూస్రీబార్ బచీ జాన్‌
తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా'
- గుజరాత్ గోడ మీది వాక్యాలు

source:-

http://ramakantharao.blogspot.in/2012/03/blog-post.html

aravind Joshua చెప్పారు...

" అకంటికి కన్ను, పంటికి పన్ను అన్నది కొన్ని మతాల సిధ్ధాంతం. తమ తమ మతాన్ని కాపాడుకోవడం కోసం చంపడం, చావడం కొన్ని మతాల్లో సాధారణం. గుజరాత్ లో జరిగినదానికి ప్రతీ మనిషీ బాధ పడ్డాడు.గోధ్రా ట్రైన్ ఇన్సిడెంట్ కూడా బాధాకరం. తమ ప్రార్ధనా స్తలాలని కూల్చెయ్యడం, తమ రక్త సంబంధులనీ సన్నిహితులనీ తమకళ్ళముందే దారుణంగా చంపడం చూసినవారు, అదే మతంకి చెందిన యువకులు ఈ దేశం మాదికాదు అనుకోవడం సాధారణం.ఈరోజు మన దేశం అనుభవిస్తున్న ఈ తీవ్రవాదానికి కారణాలు అనేకం.

"క్రైస్తవులేమో మతమార్పిడులు చెస్తూ దెబ్బ కొడుతున్నారు" ఇదే అర్ధం కాలేదు. మత మార్పిడులు మత మార్పిడులు అంటారు. కొంతమంది బలవంతపు మత మార్పిడులు అని ప్రచారం చేస్తుంటారు. గొంతు మీద కత్తిపెట్టి మతం మారు అంటారా? లేక "ఇంత డబ్బు ఇస్తా మతం మారు అంటారాలా అమ్ముడు పోయే వాళ్ళుంటే- డబ్బు క్రైస్తవులదగ్గరే ఉందా? వాటికన్ ని మించిన డబ్బు మన టి టీ డీ దగ్గర లేదా? ఇతర దేశాల్లో హిందువులుగా మారుతున్నవారిని మీరు అలాగే కొంటున్నారా?

మత ప్రచారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. హిందువులు, ముస్లిములు అందరూ మత ప్రచారం చేసుకుంటారు. క్రైస్తవులు కూడా చేసుకుంటారు.

ఈ దేశంలో మసీదులే కాదు చర్చ్ లు కూడా తగలబెట్టబడ్డాయి, కూల్చబడ్డాయి. క్రైస్తవులు చంపబడ్డారు, సజీవంగా కాల్చబడ్డారు.ఈ దేశంలో పుట్టిన ముస్లిములు భారతీయులే అని మీరన్నది నిజం. అలాగే క్రైస్తవులు కూడా ఈ దేశంలోనే పుట్టారు. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారు, భారతీయులుగా గర్విస్తున్నారు. దయచేసి అలోచించి వాఖ్యలు చేయండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భారత దేశం నా మా తృ భూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.. నాదేశం నాకెంతో గర్వ కారణం అని చెప్పుకుంటూనే.. ఒకే గొడుకు క్రింద ఉన్న వివిధ మతస్థులైన మనమందరం.. ఎవరి మత విశ్వాసాలతో..వారు.. కలసి మెలసి సమైఖ్యంగా జీవిస్తున్నాం.
స్వార్ద రాజకీయ పార్టీలు వాటి మనుగడ కోసం విద్వేషాలు సృష్టిస్తున్నాయని మనకందరికీ కూడా తెలుసు.
గోద్రా లో సంఘటనలు ,ఇంకా చాలా చాలా సంఘటనలు విచార కరమే! కానీ ఇవ్వాళ గుజరాత్ ముఖ చిత్రం చూడండి. అక్కడ హిందూ -ముస్లింలు అన్నే మరచిపోయి సమైఖ్యంగా ఉన్నారు. నివురు గప్పిన నిప్పులా రాజకీయ స్వార్ధం ఉండవచ్చు కూడా.
గతం గతః అంటూ.. సాగిపోవడం కావాలి. ఎందుకు తప్పుకోవడం!? శాంతి-సమైఖ్యత అంతర్లీన సూత్రం కావాలి.
మతమార్పిడులు..ఎవరి కారణాలు వారికి.
మతం మనిషికి అవసరమో కాదో..నిర్ణయించుకో గల్గితే చాలు.

గాయాలను కెలక వద్దు. గాయం భాద గనుక తోటి మనిషిని ప్రేమించే మనసు అనే నవనీతం పూద్దాం".

PALERU చెప్పారు...

@అజ్ఞాత

మీ బాధ నా బాధ ఒకటేనేమో !!!!

కాకపొతే .... గుజరాత్ గోడ మీది వ్యాక్యాలు నిజం ఎన్నటికి కాలేవు...ఎందుకంటే ఎవరు తక్కువ తినలేదు...నేను నేను నేనులా రాసాను ...అజ్ఞాత గా దాక్కొని దెబ్బకొట్టే రక్తం నాలో లేదు .........ధన్యవాదాలు

@జాషువా గారు..

అది నా అభిప్రాయం మాత్రమె...ఏదో కోపం లో వాడినట్టు ఉన్నాను ..దానికి చింతిస్తున్నాను మీరు చెప్పింది వంద శాతం నిజం క్రైస్తవులు కుడా కాల్చబడ్డారు ఈ దేశం లో ఇదంతా ...ఈ దేశం మా బాబు గాడి సొత్తు అనుకునే గాడిదల వల్లే..దేశం మారాలి దేశం అభివ్రుది చెందాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు ఈ కుక్కలకి మద్దత్తు ఇవ్వకూడదు...ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు ...నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను ...ఈ దేశం అందరిది ఎవడైనా ఏది నాది మాత్రమె అంటే మాత్రం చుస్తూ ఊరుకునేది లేదు,,,,, ధన్యవాదాలు జాషువా గారు...మరొక్కసారి క్షమాపణలు

@వనజక్కా



ఉభయకుశలోపరి !!! అందరు మీలా ఆలోచిస్తే ఈ రోజు ఈ పరిస్థితులు ఉండేవి కావేమో మన దేశానికి....రాజకీయ పార్టీలే కాదు కొన్ని మత సంస్థలు కుడా ఉన్మాదాన్ని ఒక వర్గం మీద ద్వేషాన్ని కలిగించెట్టు ప్రవర్తిస్తున్నాయి ...వాటిని కట్టడి చేయడం మన కర్తవ్యం లేకపొతే ఒకరోజు మనం అందరం కుడా ఉగ్రవాదుల ఆకలికి బలి కావల్సివస్తుంది.....అయినా అక్క నేను రాగానే నాకు తగిలిన షాకులకి అలా రాసాను గాని నా మనసు నీకు తెలుసు కదక్కా !!!

సీత చెప్పారు...

మీ బాధ అర్దమైంది
భారత దేశం మనందరిదీ....!!!
అన్ని మతాలు,అన్నీ భావాలు, అన్నీ ఆలోచనల సంగమమే మన దేశం.
అందరం కలిసే ఉండాలి..!ఉందాం.. ఉందాం ఏంటి?
ఉంటున్నాం,ఉండబోతున్నాం...

(ఎప్పటికీ మరొ పాకిస్తాన్ కాకూడదు ,కాదు కుడా..!!)

చాలా బాగా రాసారు...

సీత..

PALERU చెప్పారు...

సీత గారు (సీతక్క గారు)

నా పొలానికి స్వాగతం ....మీరు చెప్పింది అక్షరాల నిజం ..ఎప్పటికి మరో పాకిస్తాన్ రాకూడదు ..రాదు కుడా...నా బ్లాగు దర్శించి నందుకు ధన్యవాదాలు..అన్నట్టు మీ బ్లాగు చాలా బాగుంది