28, మే 2011, శనివారం

marade nenate (HASYA KADHA)

అందరూ  ఆలోచించేట్టు నేను ఆలోచిస్తే ఏముంటుంది నా గొప్ప అందుకే మా వాళ్ళు పెట్టిన పేరు తీసేసి వెరైటీ గా ఉంటుందని రాఫ్సన్ అని పెట్టుకున్నాదీని అర్ధం ఏంటి అని మీరు అడగవద్దు నేను చెప్పను కూడా ఎందుకంటారా? ఆ ఏముంది నాకు తెలిసి చస్తే కదా మీకు చెప్పడానికి సరే ఎ సోది మీకు ఎందుకు లెండి గాని అసలు విషయం ఏంటంటే  మొన్న నా ఫ్రెండ్ ఒకడు కనబడి ఒరేయ్ &*^%$*( అంటే నా పేరు లెండి ) అని పిలిచారు అదే టైం లో గడ్డి కోసుకోడ్డం అని పొలం వెళ్తున్నా. నా సైకిల్ కి అసలే బ్రేకులు పడవు సరే ఎదురుగ ఉన్న మంగమ్మ గోడ ని గుద్ది సైకిల్ ఆపి దిగి ఇక చూసుకోండి నా సామి రంగా వాడి వెంట పరిగెత్తాను  వాడు ముందు నేను వెనక వాడు ముందు నేను వెనుక వాడు ముందు నేను వెనుక చేతిలో కత్తి......................................................... ఇంతలో ఎవరో పోలీసు కంప్లింట్. కట్ చేస్తే ............... వాడు పోలీసు స్టేషన్ లో నేను పొలం లో .... వచ్చిందా డౌట్ వచ్చిందా ? అంతేలెండి ఇదే శీను సినిమాలో చూపిస్తే ఓహో ఈలలు కేకలు పెడబొబ్బలు నేను కధలో రాస్తే మాత్రం డౌట్లు !!! సరే చెప్తాను ఏమి జరిగిందో లేక పొతే ఎ పాలేర్లు కూడా బ్లాగ్ రాయడం మొదలుపెట్టారు! వెధవలు తల తోక  లేకుండా రాసారు అని అనకుండా నేను చెప్తగా ............................... ఎవరో కంప్లింట్ ఇచ్చారు కదా మన పోలీసులు లేట్ మాములుగానే,,, ఇంతలో ఏమి జరిగిందంటే నా ఫ్రెండ్ పరిగెడుతూ పరిగెడుతూ పోక్రి సినిమా లో హీరో లాగా సడన్ గా ఆగాడు. మనం ఏదో రక్తచరిత్ర చూసి ఎగేసుకుంటూ వాడి వెనక పడ్డాం కానీ వాడును సడన్ గా ఆగేసరికి గుండెలు మోకాల్లో కి వచ్చి మల్లి గొంతులో కి వెళ్లి అలా ఓ రెండు మూడు సార్లు కొట్టుకుని మల్లి యధా స్థాన నికి చేరుకున్నాయి అంతే మనం రివర్స్ గేర్  కత్తి పారేసి పరుగు అందుకున్నా   ఇప్పుడు నేను ముందు వాడు వెనక  మన రక్షక భటులు వచ్చే సమయానికి,,........................ ఇంకే ముంది వాడు  జైల్లో నేను పొలం లో ఇంతా చేసి కొసమెరుపు ఏంటంటే వాడు పరుగులు పెట్టింది నను కొట్టడానికి కాదు అంటా మా ఊరు కాజా ( మొవ్వ మండలం ) హై స్కూల్ పక్క సొందులో ఉన్న కుక్క కి వాడి కి పడదు అంట అది సడన్ గా మురుగు కాలవ దగ్గర కనబడగానే వీడికి పాట కక్షలు గుర్తొచ్చి పరిగేట్టాదంతా. 



మీకు గనక మైండ్ అనేది ఉంటె అసలు నువ్వు ఎందుకు పరుగేత్తవురా మూర్ఖుడా మెంటల్లోడా అని డౌట్ రావాలి ....

మరి నను పేరు మార్చుకున్న కాదమ్మా నాకు ఇష్టం లేని పేర్లు పెట్టి పిలిస్తే నాకు కోపం రాదా???


ఓకే ఉంటాను మీకే పనులు ఏమి లేనట్టు ఉన్నాయ్ అక్కడ మా శ్రీ వల్లి అరుస్తుంది దానికి పాల టైం ఐంది OHH శ్రీవల్లి అంటే ఎవరు అనుకుంటున్నారా మా  అయ్యగారి గేద పేరు నేను పలు పితుక్కొని వచ్చి మల్లి కదా రాస్తాను అప్పటి వరకు సెలవు..