7, జనవరి 2012, శనివారం

మతాన్ని బట్టి దేశద్రోహం ఉండదు



మతాన్ని బట్టి దేశద్రోహం ఉండదు, మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది....ఆలోచనా విధానాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు ఒక్కరినే ఒక వర్గాన్నే నిందించడం సరికాదు, మీడియా పక్షపాత ధోరణి కుడా ఇందుకు ఒక కారణం ఇదే పని నిందలు ఎదురుకుంటున్న వర్గ జనులు చేస్తే  మొట్టమొదటి పేజి లో పతాక శీర్షిక, మిగతా వాళ్ళు చేస్తే ఎక్కడో లోపలి పేజీల్లో ఒక వార్త...

ఇది అందరికోసం రాయట్లేదు, ఎక్కడ తప్పు జరిగినా ఒక వర్గం వైపు మాత్రమె వేలెత్తి చూపించే అతివాదుల కోసం రాస్తున్నాను, నా 25  సంవత్సరాల భారతీయత వైపు వేలేత్తితే ఏమి చేయలేని నిస్సహాయత కు చింతించి రాస్తున్నాను,మనిషి తప్పు చేస్తే మతాన్ని నిందించే మూర్ఖుల గురించి రాస్తున్నాను..." మీరు చేస్తే అత్యాచారం.... మేము చేస్తే చమత్కారం...." అనే ముడుల గురించి రాస్తున్నాను.

అసలు ఒక్కోసారి అనుమానం వస్తుంది ఇలా రాసి నన్ను నా దేశాభిమానాన్ని నాకు నేనే కించ పరుచు కుంటున్నానా...అని , కాని ఏమి చేసినా ,,ఎంత చేసినా "మీరు వాళ్ళకే వత్తాసు లే" అనే అమాయక చక్రవర్తులను చూసి వారి జ్ఞాన నేత్రాన్ని ఎలా అయినా తెరిపించాలి అని ఒక మొండి ఆలోచనతో రాస్తున్నానులే అని సమాధాన పరుచుకుంటాను ,

ఏది ఏమైనా ....భారత దేశ పౌరిడిని అని గర్వంగా చెప్పుకుందాం అంటే నా పేరు చూసి నన్ను అనుమానించే వారి కంటి చూపులు తట్టుకోవడం కుడా నా భారతీయతే !!!  అసలు పాకిస్తానియులకి మాకు సంబంధం లేదు అంతే!!!! వాళ్ళు ఆ దేశస్తులు మేము భారతీయులం...

ఇంకోవిషయం  ...మీ వాళ్ళే ఎంతో మంది వాళ్లకు మద్దత్తు ఇస్తూ బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి కావాలంటే సాక్ష్యాలు కుడా చూపిస్తాను ఆంటే " తల్లి పాలు తాగి రొమ్ము ని గుద్దే" నీచుల గురించి నేను నా సమయాన్ని వృధా చేయను, అలాంటి వారిని నిజాయతీగా విచారించి "నిజమే" అని తెలిస్తే వారిని ఉరితీయడానికి తాడు నేనే ఇస్తాను , కాల్చడానికి మా వేప మొక్క కొమ్మను ఇస్తాను, దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.

చివరగా....చాలా నిశీతంగా గమనించాలిసిన విషయం ఏంటంటే కొంత మంది అతివాదులు దీన్ని అవకాశంగా తీసుకుని ఒక వర్గ ఆచార వ్యవహారాలని, సాంప్రదాయాలని, ధర్మాల్ని గేలి చేయ ప్రయత్నిస్తుంటారు, అలాంటి వారి గురించే నా బెంగఅంతా....

ఎంటో!!! నాకు  సరైన  ముగింపు ఇవ్వడం ఎప్పటికి వస్తుందో .....

6 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

దేశ ద్రోహులని మతాల వారిగా శిక్షించకూడదు. భారతీయులుగా మనకి జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకునే శిక్షించాలి. న్యాయం చట్టం,శిక్ష అందరికి సమానమే! మీరు పరిశీలించినవి నిజమే కావచ్చు. కానీ మీ విశ్వాసాల పట్ల జంకు వద్దు. ఒక దేశ పౌరుడిగా..మీకు భావ స్వేచ్చ ఉంది. అందుకు భంగంకల్గితే.. నిర్మొహమాటంగా స్పందించండి. చివర కూడా బాగానే చెప్పారు. కన్ఫ్యూజింగా ఏం లేరు. భాయి.

PALERU చెప్పారు...

నజా దిది,
మీలాంటి సహ్రుదుయులు ఉండగా మాకు భంగమేల?? థాంక్సండి దీది,

buddhamurali చెప్పారు...

నువ్వు చెడ్డ వాడివి అని పదే పదే అనడం వల్ల మంచి వారు కూడా నిజంగానే చెడువైపు వెళ్ళే ప్రమాదం ఉంది . కొంత మంది తాము గొప్ప దేశభక్తులం, మత భక్తులం అనుకోని ఇతర మతాలను, కులాలను కించపరచడం ద్వారా దేశానికి శత్రువులను తయారు చేస్తున్నారు. మనం ఏ కులం అయినా? ఏ మతం అయినా తప్పును తప్పు అందాం , మంచిని మంచి అని అభినందిద్దాం

PALERU చెప్పారు...

మురళి గారు నా బాధ అదే...మంచి చేస్తున్నా...చేడ్దోడు అని అనిపించుకోవడం లో ఉన్న బాధ అనుభవిస్తే గాని అర్ధం కాదు కదా...ఏదేమైనా ...మీరు చెప్పింది నిజం, దేశానికి శత్రువులను మనమే తయారు చేసుకుంటున్నాం......ధన్యవాదములు

Praveen Mandangi చెప్పారు...

డబ్బుల ముందు ఎవరికీ దేవుడు, దెయ్యం లాంటి నమ్మకాలు గుర్తుండవు. ఏ మతంవాళ్ళకైనా అంతే.

PALERU చెప్పారు...

U r right Mr. Praveen