తొమ్మిదవ భాగం
( కష్టాలు కన్నీళ్ళతో సాగుతున్న రాజుగాడి నావ ఒక ఒడ్డుకు చేరే దశకు వచ్చింది. తను ప్రేమిస్తున్న భవానిని ఎవరుప్రేమించకుండా కుట్రలు పన్నుతూ , స్కూల్ టీచర్లతో గొడవలు పడుతూ....క్రుతికా ని మోసం చేస్తూ ఉండగా )
అలా సోషల్ మాడం వెళ్ళిన తరువాతా ఆవిడచెల్లి గారు వచ్చి విచారించి నా వైపు క్రురాతి క్రురంగా చూసి...కస కసా వెళ్ళిపోయారు...నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ చెప్పే మాటలకు నాకు చెమటలు పట్టడం ప్రారంభం అయ్యింది, భవిష్యత్తు కళ్ళ ముందు రికార్డింగ్ డాన్సు వేస్తుండగా .....ఇంటర్వేల్లు మోగింది....మా స్కూలు ఉపాధ్యాయ కుటుంబం అంటా ఒక అత్యవసర సమావేశం తలకాయ రూం ( హెడ్ రూం ) లో పెట్టారు.....ఇంటర్వేల్లు లో అంతా "రాజు గాడు సోషల్ టీచర్ని కొట్టాడు" అని ఒక సంచలన వార్తా గురించి ఇష్టా గోష్టి మొదలుపెట్టారు ..ఆరవ తరగతి ,ఏడవతరగతి పిల్లలు నా వంక భయం గా చూస్తున్నారు....అంతా చిందరవందరగా చికాకుగా ఉండగా...ఇంటర్వేల్లు అయిపొయింది.
క్లాసు మొదలైన పది నిమిషాల వరకు క్లాసులకి టీచర్లు రాలేదు...నా కోసం ఏదో మర్డర్ ప్లాన్ వేస్తున్నారని అర్ధం అయ్యింది అయినా ఒక మొండి ధైర్యం తో పారిపోకుండా క్లాసు లోనే ఉండిపోయాను...ఆతరువాత వచ్చిన మా లెక్కల టీచరు " నా దగ్గరకు వచ్చి ఏమి జరిగిందిరా ? అని అడిగారు...నేను చెబుదాం అనుకుంటుండగానే నా అనుచరుడు ( హిహిహి) ఒకడు మొత్తం కధ పుసగుచ్చి.... దండ కట్టి .....మాడం మెళ్ళో వేసి..." ఆ..ఇక చప్పట్లు కొట్టండి అన్నట్టు "అందరి వైపు చూసాడు, ఆవిడ మొత్తం విని నా భుజం మీద చెయ్యివేసి నన్ను తట్టి వెళ్ళిపోయారు....అలా నిమరటం చుస్తే మా ఊరిలో పొట్టేలు పంద్యాలు గుర్తుకు వచ్చాయి ,,, పోటి కి ముందు గొర్రె తల కుడా అలాగే నిమురుతారు....
కాసేపటికి నా పెళ్లి కి నాకే పిలుపు ఇవ్వటానికి మా ప్యున్ వచ్చాడు......
వెళ్ళే ముందు ఒక్కసారి భవాని వంక చూసాను .. అప్పుడు తను నా వైపు చుసిన చూపు " తప్పు కదరా..అలా చెయ్యకూడదు కదా....హేడు గారు ఏమైనా అంటే ఏమి అనకు ....కొడితే నాలుగు దెబ్బలు తినేసి కళ్ళు తుడుచుకుని వచ్చి కూర్చో " అన్న సంకేతాన్ని నాకు వినిపించాయి.....
హెడ్ మాస్టారు ....అందరికి ఈయనంటే "అది"( మహేష్ బాబు బిజినెస్ మాన్ డైలాగు), ఎన్ని వెధవ వేషాలు వేసినా మనకు ఇప్పటివరకు ఈయన ఆఫీసు దర్శన భాగ్యం దక్కలేదు.....ఎందుకంటే ఎప్పుడు ఎ పరీక్షలలోను మనం తప్పలేదుగా అందుకేమో..!! యమధర్మరాజు లాగా ఒక రూళ్ళ కర్ర ఒకటి పెట్టుకుని " నీ పెళ్ళికి సర్వం సిద్ధం " అన్నట్టు కూర్చున్నాడు....ఇక మనం పిల్లి కి దొరికిన ఎలుక లాగా నుంచున్నాం...ముందు హాజరు పట్టి తెప్పించాడు...మన హాజరు చుస్తాడేమో అనుకున్న అయినా మనం "హాజరు లో కేక" అని పాపం తెలీదు అనుకున్నా...మనం తెగ రేగ్యులరు స్కూలు కి ఎందుకంటే మరి భవాని ని చూడాలంటే ఇదే కదా మన లుంబిని వనం .......ముందుగా నా పేరు మీద రెడ్ ఇంకు తో కొట్టేసాడు.....మనకు మొదలు దడ..దడ ... నాకు కొత్త తోలు వచ్చే భాగ్యం మా నాన్న చేతిలో ఉండనే ఉంది అనుకున్నాను...ఇంతలో మన యముడి గారి గొంతు ...
" ఎరా ....నిన్ను తీసేసాను స్కూల్లో నుండి ...వెళ్లి ఆడుకో..."
ఈయన తీసేస్తే నేను కాదు ఆడుకునేది...మా నాన్న ..నాతొ...... అనుకుని ...సరే ఏమి జరిగితే అదే జరుగుతుంది లే అనుకోని
"అలాగే సార్ ..." అన్నా....
"అయితే ఇంకే వెళ్ళు "
మెల్లగా బయటకు వచ్చి ...ఇక భవానిని బయటనుండే చూడాలేమో అనుకుంటూ నడవటం మొదలు పెట్టా...పుస్తకాలు తీసుకుందామని క్లాసు వైపు వెళ్తూ వెళ్తూ ...ఇంకా మనకి పుస్తకాలతో పనేముంది అనుకుని అలాగే మెయిన్ గేటు పైపు నడవడం మొదలు పట్టాను...సరిగ్గా గేటు దాటుతుండగా వెనక నుండి పూను వచ్చి ..."రా నిన్ను పిలుస్తున్నారు " అన్నాడు....వెళ్తూ వెళ్తూ మనకో ఉపదేశం చెప్పాడు " రెండు దెబ్బలు తినేసి ఇంకెప్పుడు చెయ్యను సార్ అని వెళ్లి క్లాసు లో కూర్చో చదువు పాడు చేసుకోకు ...చదువు లేకపోతె చంక నాకి పోతావ్ " అని ...
వెళ్ళగానే...." ఎరా వెళ్ళమంటే వెళ్ళిపోతావా" అని హెడ్ గారు నా హెడ్ మీద వాలిన ఈగని తన ప్రియ చేత్తో ఒక్కటి కొట్టారు పాపం ఈగ....అదే టైము లో నా నుదురు మీద కుడా ఒక ఈగ వాలింది " తల ఈగ" "నుదురు ఈగ " ప్రేమికులు అనుకుంటా...ఆయన తలమీద ఈగను కొట్టగానే "నుదురు ఈగ" తన శరీరాన్ని నా ముందు ఉన్న బల్లకు గుద్దుకుని " ఆత్మదానం " చేసుకుంది ...కాకపొతే దాని బాడీ బల్లకు కొట్టుకోవడానికి నా నుదురు సహాయం తీసుకుంది....పాపం ఈగలు చచ్చిపోయాయి......(నాకేం కాలా.... నాకేం కాలా......)
అదికాదండీ ...ఆయనకు భరత నాట్యం...బ్రేక్ డాన్సు చూడాలనుకుంటే టీవి పెట్టుకుంటే సరిపోతుందిగా .....ఆ రూళ్ళ కర్ర తో నాకు చక్కిలిగింతలు పెట్టాలా????.(నాకేం కాలా.... నాకేం కాలా......)...అసలే నేను నవ్వను కాని ఎందుకో అలా ఆయన చక్కిలిగింతలు పెడుతున్నప్పుడు టేబుల్ మీద పడిఉన్న "నుదురు ఈగ" మృతదేహాన్ని చూసి దాని ప్రేమ తలుచుకుని భవాని గుర్తుకు వచ్చి " కొన్ని ఆనంద భాష్పాలు" ప్రకృతి కి దానం చేశా...(నాకేం కాలా.... నాకేం కాలా......)...ఆయన నా డాన్సు చూసి తరించి ...ఒక గ్లాసు మంచినీళ్ళు " కుండ మార్పిడి " చేసారు....( అంటే అక్కడ ఉన్న కుండ లో నుండి తీసి ఆయన కుండ ( పొట్ట) లో వేసుకున్నారు....జనానికి మరీ హాస్యరసం లేకుండా పోతుంది ఏంటో...)...సింహాసనం అధీష్టించి...డమరుకం ( బెల్లు) మోగించారు.....భటుడు( ప్యూను) వచ్చి
" ఆజ్ఞా మహాప్రభో " అన్నాడు...
"వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకురా " అని ఆజ్ఞాపించి నా వైపు ప్రేమ పూరిత చూపు విసిరారు...
అప్పటిదాకా ఉన్న నా రికార్డులు చూసి ఆయన కళ్ళు పెద్దవవ్వడం గమనించాను...ఈ మార్కులు " నీవా..నీవా" అని చంద్రముఖి లా అరిచారు...అప్పుడు గమనిచాను ఆయనలో " మనిషి" ఉండటం...ఆయన మనిషి లా అయిపోయారు....మనిషిలా నా వంక చూసారు......మనిషిలా ప్రవర్తించడానికి సమయిత్తమయ్యారు...
నేనేమో కళ్ళకింద ఏదో కదిలినట్టు అనిపిస్తే తుడుచుకున్నా( ఏమిలేదు ఏమిలేదు) ....ఏదో తడిగా తగిలింది ఫ్యాను లేదుగా... చెమట ఏమోలెండి....
అవును "నాయె " అన్నాను ...
"నీకేం పోయేకాలం వచ్చిందిరా ఇంత బాగా చదువుతూ ఇలా తయారయ్యవ్ ...".( అంటే ప్రేమికుడిలా అని ఏమో కదా) ..అని మొదలుపెట్టి " నాకు తెలుసు నువ్వు స్కూలు ఫస్టు వస్తావ్..ఇంకోసారి నువ్వు ఇక్కడికి రాకూడదు నేనే రావాలి నీకు ప్రైజు ఇవ్వడానికి ...చదవరా ...నువ్వు పెద్ద దాక్టరువి అవుతావ్ అన్నారు....వెళ్లి పాఠాలు విను పో " అని ఆపారు....
అలా సోషల్ టీచర్ తో గొడవ పడి పెద్దాయన దగ్గర అభిమానం సంపాదించుకున్నాం...ఇంకా ఇరవై రోజులు ఉన్నాయి అర్ధసంవత్సర పరీక్షలకు....బాగా చదావాలి అని మనసులో ఉన్న భవానికి చెప్పుకుని...క్లాసు లోకి వెళ్ళాం....
ఒక ఫైన్ డే...ఏదో పని మీద స్టాఫ్ రూం పక్కనుండి వెళ్తుంటే...సైన్సు ల్యాబు లో సైన్సు మాస్టారు " గోపినారాయణ" ..నాకు ఆరవ తరగతి లో తెలుగు పాఠాలు చెప్పిన " ఆచార్యులు" మాష్టారు ..మాట్లాడు కుంటున్నారు...ఏదో" రాజు " అనే పదం వినబడి ఆగిపోయా......
గోపినారాయణ గారు "రాజు గాడు ఒట్టి వెధవ అండి ఎప్పుడు ఆ భవాని మీద రెండు కళ్ళు వేసుకుని చూస్తూంటాడు..వాడికి చదువు రాదు..పెద్దాయన ఏదో అనుకుంటున్నాడు గాని వీడి బొంద వీడు పాస్ కుడా కాడు.."
ఆచార్యులు గారే మో " కాదండి ఆడు ఏకసంతాగ్రాహి ఏదైనా యిట్టె పట్టెస్తాడు...వాడు పద్యాలు పాడితే ఎంత వినసొంపుగా ఉంటాయంటారు..."
గొనా" ఆ బోడి తెలుగు దేముందండి అందరికి వస్తాయి మార్కులు...మిగతావి రావాలిగా..."
ఆచార్యులు గారు "బోడి తెలుగైనా బొంగులో సైన్సైనా ఆడు తలచుకుంటే పట్టేస్తాడండి...వాడు కత్తి..."
"కత్తా ..సూత్తా ...వాడు గనక పెద్దాయన మొన్న స్టాఫ్ మీటింగులో చెప్పినట్టు వాడు ఫస్టు వస్తే నేను ఇక్కడ జాబే మానేస్తానండి"
" మాష్టారు తొందర పడుతున్నారేమో ...వాడు అసాధ్యుడు "
వాడి బొంద ...నేను క్లాసు కెళ్ళాలి.." అని గోపి గారు లేచారు...మనం జారుకున్నాం.....
వీల్లేంటి మనగురించి గొడవపడుతున్నారు...మనకెందుకు వచ్చిన గొడవలే అనుకుని భవాని కోసం వెళ్లి పోయాను...నేను... నా భవాని..... మాకు ఒక రెండు మూడు డజన్ల పిల్లలు...... అనుకుంటూ కాలం గడిపెస్తున్నాను...కాని కాలం మారుతూ ఉంటుంది కదా...అలాగే నాకు కుడా .....
ఇప్పటికి చాలు......మొత్తం చెప్పేస్తే " కిక్కు పోతుంది " మల్లి అత్తమానం రాదుగా....
6 కామెంట్‌లు:
" కొన్ని ఆనంద భాష్పాలు" ప్రకృతి కి దానం చేశా...(నాకేం కాలా.... నాకేం కాలా......)...ఆయన నా డాన్సు చూసి తరించి ...ఒక గ్లాసు మంచినీళ్ళు " కుండ మార్పిడి " చేసారు....( అంటే అక్కడ ఉన్న కుండ లో నుండి తీసి ఆయన కుండ ( పొట్ట) లో వేసుకున్నారు....జనానికి మరీ హాస్యరసం లేకుండా పోతుంది ఏంటో...)
నవ్వి నవ్వి చచ్చిపోయాను.
.మనకెందుకు వచ్చిన గొడవలే అనుకుని భవాని కోసం వెళ్లి పోయాను...నేను... నా భవాని..... మాకు ఒక రెండు మూడు డజన్ల పిల్లలు...... అనుకుంటూ కాలం గడిపెస్తున్నాను...కాని కాలం మారుతూ ఉంటుంది కదా...అలాగే నాకు కుడా .
సంతానం చాలా బాబు..!? రాజు కి మంచి కాలం రావాలని కోరుకుంటూ. రాజు దెబ్బ చూపించాలి..Thamps up ..taste thunder laa ..
పోటి కి ముందు గొర్రె తల కుడా అలాగే నిమురుతారు....హహహ బాగా ఎక్ష్పెరిఎన్కెఅనుకున్త భాయ్ మీకు! వెళ్ళే ముందు ఒక్కసారి భవాని వంక చూసాను .. అప్పుడు తను నా వైపు చుసిన చూపు " తప్పు కదరా..అలా చెయ్యకూడదు కదా....హేడు గారు ఏమైనా అంటే ఏమి అనకు ....కొడితే నాలుగు దెబ్బలు తినేసి కళ్ళు తుడుచుకుని వచ్చి కూర్చో " అన్న సంకేతాన్ని నాకు వినిపించాయి.....అబ్బో! అంత అర్ధమయ్యిందా ఆ వయసులో? " నీ పెళ్ళికి సర్వం సిద్ధం "హాయ్ హాయ్ నాకిష్టమయిన ఘట్టం వచ్చిందోచ్చ్! ఆ రూళ్ళ కర్ర తో నాకు చక్కిలిగింతలు పెట్టాలా????.(నాకేం కాలా.... నాకేం కాలా......)... " కొన్ని ఆనంద భాష్పాలు" ప్రకృతి కి దానం చేశా...(నాకేం కాలా.... నాకేం కాలా......)...ఆయన నా డాన్సు చూసి తరించి ...ఒక గ్లాసు మంచినీళ్ళు " కుండ మార్పిడి " చేసారు.... హహహ సూపరో సూపరు! కేక పెట్టిస్తున్నారుగా! good going!
వనజ దీది,
నిజ్జంగా అంత నవ్వుకున్నారా....:):) నా గోల్ ఏంటో తెలుసా.....బులుసు గారికంటే, నేస్తం అని ఇంకొకళ్ళు ఉన్నారు కదా ఆవిడ గారి కంటే ఎక్కువ నవ్వించాలి అని....అవుతుంది అంటారా..?? సంతానం గురించి అప్పట్లో అలాగే ఉండేవి దీది ఆలోచనలు.....:):):) ....ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి....కాని.....రాజు ని మనం అంచనా వేయలేము.....!!!!
అమ్మాయ్ రసజ్ఞ....( కష్టే ఫలే తాత గారి ఇష్టయలు)
ఆవయసులోనే కదా అన్ని అర్ధం అయ్యేవి....అందుకే ఆ ఒక్క చూపు నా మనవడికి అంత పెద్ద సందేశం ఇచింది అన్నమాట....:):)...రూళ్ళ కర్రతో మా వాడి పెళ్లి జరుగుతుంటే...నీకు ఇష్టమైన ఘట్టమా....!!! బాగుంది బాగుంది అలాంటి పెళ్ళిళ్ళు చాలా చేయించుకున్నాడులే....:):)..బాగా రాస్తున్నాడా...నువ్విలాగే ప్రోత్సహించు ఇంకో బులుసు గారిని తాయారు చేద్దాం ...ఏమంటావ్....:):):)
రాఫ్సన్.....గారు ( అంటే నేనే )
థాంక్స్ అండి రసజ్ఞ గారు...మీరు అలా పోగిడేయకండి....నాకేమో అసలే సిగ్గెక్కువ....:)(:()
ha..ha..nakemi kaale...ha..ha...))
Thanks Shashi kala gaaru...after long days..............vachaaru...:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి