13, జనవరి 2012, శుక్రవారం

మార్తాండ అంటే ఎవరు??


ఒక వారం రోజులు గా ఒకవిచిత్రమైన లోకం లో వెళ్లాను ఇంకా తేరుకోలేదు.....ఈ మార్తండా ఎవరు? మలక్పేట రౌడి గారు ఎవరు ? భరద్వాజ ఎవరు? ఇన్నయ్య ఎవరు? కత్తి ఎవరు? ఏకలింగం ఎవరు? అసలు ఇంతకీ " నేనెవరు???? "

అందరు కలిసి ఏదేదో రాసేసుకున్నారు ....... మొట్టమొదటి సారిగా భయపడ్డాను బ్లాగ్ లోకం లో ఇప్పటిదాకా నాకు కొంతమందే తెలుసు, వాళ్ళు ఒకరినొకరు అభిమానిచుకోవడం, గౌరవించుకోవడం చూసాను, బులుసు గారి బ్లాగ్ చూసి ఇయనకంటే బాగా రాయాలి అని బ్లాగ్ ఒకటి పెట్టుకున్నాను, కాని ఇన్ని పోస్టులు చదివాక నేను ఒట్టి మట్టి బుర్రనే అని తేలింది...నాకంటే చాలా విషయాలలో విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు , ఇలా కొట్టేసు కుంటున్నారు ఏంటో ?????

అసలు ఈ మార్తండా అంటే ఎవరో నాకేమి అర్ధం కాలేదు బాబోయ్......ఇంకెప్పుడు బ్రతికి బాగుంటే ఆ బ్లాగులకి వెళ్ళకూడదు అని అనుకున్నా...కాని వాళ్ళ రచనా చాతుర్యం, విషయ పరిజ్ఞానం , చాలా బాగుంది కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నై.....కాని భయం కుడా వేస్తుంది ...ఏమ్చేయలబ్బా....????

21 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వాళ్ళందరితో..మనం అసలు పోటీ పడలేం..(ఎందులోనూ కూడా..) భయం ఎందుకు బాయీ.. మనం మనం గానే ఉంటాం కదా!

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

!! raf raafsun !! గారు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!!

PALERU చెప్పారు...

వనజ దీది,

ముందుగా మీకు మీకు కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక సంకరాంటి శుభాకాంక్షలు....ఏమోనండి ఎందుకువేల్లనో ఎలా వేల్లనో కాని ఆ బ్లాగులకి వారం పట్టింది బయటకు రావటానికి...నిజానికి మనం పోటి పడలేము వాళ్ళు CHAAAAAAAAAAALAAAAAAAAAAA పెద్దోళ్ళు లా ఉన్నారు...

అయ్యా , తెలుగు పాటలు గారు ....కుశలమేనా???

చాన్నాళ్ళకు ఇటు పడింది మీ చూపు?? బిజీ గా ఉన్నారా!!!! మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, భారతీయులకు, ప్రపంచ వ్యాప్త హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.....

Disp Name చెప్పారు...

ఎవరు వారు
ఎచటి వారు
వారి ఇంటి 'చిరు' నామాలు ఏమిటి ?
వెంటనే 'బహిర్గతం' గావించండి
దురద కొంత వదిలించు కోవాలె !

సంక్రాంతి శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

Praveen Mandangi చెప్పారు...

నేను చెపుతాను. ముందు నా గురించి, తరువాత నా గురువు గారు కత్తి గారి గురించి, తరువాత ఇన్నయ్య గారు అనే నా పరిచయస్తుని గురించి.

మార్తాండ - The Sun అనే వ్యక్తిని నేనే. ఇంగ్లిష్ బ్లాగుల్లో అది నా తూలికానామం (Pen name)

గతంలో తెలుగు బ్లాగుల్లో మార్క్సిస్ట్-లెనినిస్ట్ తత్వశాస్త్రం గురించి అవగాహన లేనట్లు కనిపించింది. మూడేళ్ళ క్రితం నేను తెలుగు బ్లాగుల్లోకి వచ్చాను. గతితార్కిక-చారిత్రక భౌతికవాదం గురించి వ్రాసిన కొద్ది మంది తెలుగు బ్లాగర్లలో నేను ఒకణ్ణి. నేను ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివి ఉండడం వల్ల నాకు తెలుగు సరిగా రాక తెలుగు అనువాదాలలో సంస్కృత పదాలు వ్రాసేవాణ్ణి. అవి అర్థం కానివాళ్ళు పట్టించుకోకుండా వేరే పనులు చూసుకునేవాళ్ళు కానీ నా మీద వ్యక్తిగత విమర్శలు చెయ్యలేదు.

అయితే కొంత మంది గ్లోబలైజేషన్ అనుకూల వర్గంవాళ్ళకి నా మార్క్సిస్టు రాతలు నచ్చలేదు. గ్లోబలైజేషన్ విధానాలు అమలు జరుగుతున్న కాలంలో మార్క్సిజం-లెనినిజం లాంటి తత్వశాస్త్రాలని జనం చదివితే గ్లోబలైజేషన్ ప్రక్రియకే నష్టం అని వారు గ్రహించారు. నా బ్లాగ్ ముయ్యించాలనుకున్నారు.

అందులో భాగంగానే ప్రపీసస పెట్టి నన్ను తిడుతూ రోజుకి మూడు వందల కామెంట్లు వ్రాసేవాళ్ళు.

ఒకవేళ నా రచనలు నిజంగా అర్థం కాకపోతే వాటిని విమర్శించడానికి కష్టపడి అన్ని కామెంట్లు వ్రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను కామెంట్లలో “శవాల మీద మురియాలు ఏరుకునే చిల్లర ఎదవ” లాంటి తిట్లు తిట్టడంతో ప్రపీససపై వ్యతిరేకత వచ్చింది. దాంతో ప్రపీసస మూసేసారు. ప్రపీసస మూతపడడం జీర్ణించుకోలేని కెలుకుడు బేచ్ లీడర్ నాకు వ్యతిరేకంగా వదిన కామరాజు లాంటి వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో నాకూ, భరద్వాజకీ మధ్య ద్వేషం పెరిగిందే కానీ తగ్గలేదు.

ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే భరద్వాజ శిష్యుడు కార్తీక్ భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే పేరడీ ఒకటి వ్రాసాడు. ఆ పేరడీ వల్ల గొడవలు మళ్ళీ పెరిగాయి. వాళ్ళ బేచ్‌కి చెందిన ఒక అమ్మాయే ఆ బేచ్ నుంచి కొంత కాలం వరకు తప్పుకుంది. అయితే గూగుల్ గ్రూప్స్‌లో ప్రపీసస అనే గ్రూప్ పెట్టి ఆమెని కన్విన్స్ చేసి ఆమెని తిరిగి తమ బేచ్‌లోకి తెచ్చుకున్నారు. గూగుల్ బజ్‌లో వచ్చిన కామెంట్ల గొడవ వల్ల ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ బేచ్ నుంచి బయటకి వెళ్ళిపోయింది.

ఒక అమ్మాయి తమ బేచ్ నుంచి తప్పుకుందనే కోపంతో భరద్వాజ మళ్ళీ నా మీద వదిన-మరిది పేరడీలు వ్రాస్తూ దాడులు చెయ్యడం మొదలుపెట్టాడు. చివరికి ఆ గొడవ భరద్వాజ వాళ్ళ అమ్మగారిని నేను తిట్టడం వరకు వెళ్ళింది.

నా వదిన గారి మీద పేరడీలు వ్రాయడం ఎందుకు, వాళ్ళ అమ్మగారిని తిట్టించుకోవడం ఎందుకు, నేను తిట్టానని చెప్పి సానుభూతి కోరడం ఎందుకు?

ఈ గొడవలలో నాకు సపోర్ట్ ఇచ్చిన ఏకైక మహిళా బ్లాగర్ నీహారిక గారు కావడం వల్ల ఆమె గురించి కూడా వాళ్ళు చాలా చెత్తగా వ్రాసారు. ప్రైవేట్ చాట్‌రూమ్‌లలో కూడా ఆమె గురించి చాలా చెత్తగా ప్రచారం చేశారు. వాళ్ళు మొదట దాడి చేసింది కత్తి మహేశ్ అనే దళితవాది మీద. వాళ్ళు కత్తి మహేశ్ గారిని ఏమీ చెయ్యలేకపోవడం వల్ల నా మీద & నీహారిక గారి మీద విరుచుకుపడ్డారు.

కత్తి మహేశ్ గారు ఒక దళితవాద బ్లాగర్. అతను దళితవాదం గురించి వ్రాసింది తక్కువే కానీ దళితవాదం కారణంగా ఇచ్చే రిజర్వేషన్‌ల వల్ల తమ వర్గంవాళ్ళకి ఉద్యోగాలలో అవకాశాలు తగ్గిపోతున్నాయని మహేశ్ గారి మీద పడి ఏడ్చారు.

ఇన్నయ్య గారు ఒక నాస్తికుడు. అతను ఏ కులం నుంచి వచ్చారో, ఏ మతం నుంచి వచ్చారో తెలియదు కానీ అతను మూఢ విశ్వాసాలని విమర్శిస్తూ హిందూ మతం వల్ల అణచివేతకి గురైన దళితులకి సపోర్ట్ ఇస్తుంటారు. అందుకే కొంత మంది ఇన్నయ్య గారి మీద పడి ఏడుస్తుంటారు.

మిగిలినవాళ్ళు ప్రత్యర్థి వర్గానికి చెందినవాళ్ళు. చరిత్ర గురించి అంతా వివరంగా తెలియాలంటే ఈ నంబర్లకి ఫోన్ చెయ్యండి: 9295019502, 9247003952

మీరు చెప్పినట్టు గానే నా దగ్గర విషయ పరిజ్ఞానం చాలా ఉంది. నా గదిలో పెద్ద లైబ్రరీ ఉంది. నేను ఎప్పటికప్పుడు పుస్తకాలు చదివి కొత్త విషయాలు తెలుసుకుంటుంటాను. నేను కొత్త విషయాలు వ్రాయడం నచ్చని వాళ్ళే నేను సంబంధం లేని విషయాలు వ్రాస్తున్నానని చెప్పి నా మీద పడి ఏడుస్తుంటారు. కత్తి గారు కూడా అనేక కొత్త విషయాలు వ్రాస్తుంటారు. కత్తి గారు కొత్త విషయాలు వ్రాసినప్పుడు మాత్రం అతను గూగుల్ సెర్చ్ నుంచి కాపీ కొట్టాడని అంటూ అతని మీద పడి ఏడుస్తారు. ఇన్నయ్య గారు కొత్త విషయాలు వ్రాస్తే అతన్ని హిందూ ద్వేషి అని తిడుతుంటారు. నిజానికి ఇన్నయ్య గారు హిందూ ద్వేషి కాదు. ఆయన వ్యక్తిగతంగా ఏ మతాన్నీ నమ్మడు. ఊహాజనితమైన విషయాలకి ప్రాధాన్యత తగ్గించి భౌతిక ఆలోచనలు వృద్ధి చేసుకోవాలని ఆయన ప్రవచిస్తుంటారు.

Praveen Mandangi చెప్పారు...

కత్తి గారితోనే నాకు వ్యక్తిగత పరిచయం ఎక్కువ కాబట్టి అతని గురించి మరి కొంత సమాచారం నా దగ్గర ఉంది.

కత్తి గారు చిత్తూరు జిల్లాకి చెందిన వ్యక్తి. అతని కుటుంబ సభ్యుడు ఒకరు నక్సలైట్ ఉద్యమంలో పని చెయ్యడం వల్ల పోలీసులు అతని కుటుంబాన్ని వేధించారు. అతని కుటుంబం చిత్తూరు జిల్లా విడిచి హైదరాబాద్‌లో స్థిరపడింది. కత్తి గారు మాదిగ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల దళితవాదం పేరుతో కొన్ని రచనలు వ్రాస్తుంటారు. ఆయన అప్పుడప్పుడూ గ్లోబలైజేషన్‌కి వ్యతిరేకంగా కూడా వ్రాస్తుంటారు. ఆయన తెలంగాణా ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చి అభ్యుదయవాదిగా పేరుగాంచారు. కానీ అభివృద్ధి నిరోధక వర్గంవాళ్ళకి ఆయన రచనలు ఏమీ నచ్చవు. కత్తి గారికి వ్యతిరేకంగా పూరిపాక అనే బ్లాగ్ పెట్టి కత్తి గారి మీద పేరడీలు వ్రాసారు. పూరిపాక బ్లాగ్ కూడా మూతబడింది. నేను ఎలాగూ కత్తి గారి శిష్యుణ్ణే కాబట్టి ఆయన గురించిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. నా నంబర్లకి ఫోన్ చేసి వివరాలు అడగొచ్చు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీకు మీ కుటుంబ సభ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

మనం సర్వజ్నులు కానవసరం లేదు. అన్నీ మనకి తెలియాలనుకోవడము కూడా ఒక భ్రమ..... దహా

Praveen Mandangi చెప్పారు...

అలాగని కాదు, తమకి తెలిసినవి వ్రాసినవాళ్ళపై పడి ఏడుస్తారు ఇక్కడివాళ్ళు.

PALERU చెప్పారు...

నేనేదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది...:(:()......ఎవరినైనా నొప్పిస్తే ప్లీజ్ క్షమించండి.....నాకేమి తెలీదు నాకేమి రాదు....


జిలేబి గారు,

నేను మీదగ్గర శిష్యరికం చేయాలి అనుకుంటున్నానండి....మీలాగా రమ్యముగా రాయడం నేర్చుకోవాలనిపిస్తుంది.....:) దహ...

ప్రవీణ్ శర్మ గారు, మీకు మాత్రం మీ విషయ పరిజ్ఞానానికి జేజేలు....నాకు ప్రత్యెక వర్గాలు లేవు, మంచి అనిపిస్తే ( నాకోటి అర్ధమయ్యి చస్తే) మద్దత్తిస్తాను, చెడు అనిపిస్తే నిస్సంకోచంగా ఖండిస్తాను...కాని నాదగ్గర సరైన విషయ పరిజ్ఞానం లేదు అని నా అనుమానం..ఏదేమైనా..మనమందరం భారాతీయులం, మనలో మనమే కొట్టుకుంటే....శత్రువులకు అలుసైపోతాం.....ఆపత్కాల పరిస్థితులలో మనకు కులాలు ఇజాలు మతాలూ కనబడవు
" మనిషి" కనబడతాడు.మనం కోరుకోలేదు నాకు ఈ మతం కావాలి అని, నేను ఈ కులం లో పుట్టాలి అని , నాకు ఈ ఇజాలు నచ్చాలి అని, అంతా పైవాడి మాయ, ఏది మంచో ఏది చెడో తెలుసుకొనే విజ్ఞత మాత్రం ఇచ్చి, మీరే ఎన్నుకోండి అని స్వేఛ్చ ఇచ్చాడు..ఇక అంతా మన చేతుల్లో ఉంటుంది..


బులుసు గురు గారు,
ఈ రోజు నాకు నిజం గా సంక్రాంతి, మీకు ఎంతో మంది శిష్యులు ఉండవచు కాని నాకు ఒకరే గురువు, అది మీరే...మీరు నా బ్లాగుకు రావడం నిజంగా నాకు గర్వకారణం...చాలా చాలా ధన్యవాదాలు, మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంత్రి పర్వదినా శుభాకాంక్షలు.....

Praveen Mandangi చెప్పారు...

ఇన్నయ్య గారు కేవలం భౌతిక జ్ఞానం వృద్ధి చేసుకోవాలని చెపితే ఆయన హిందూ మతాన్ని దూషిస్తున్నాడని విమర్శిస్తూ ఆయన మీద పడి ఏడ్చారు. కేవలం మతాన్ని విమర్శిస్తే ఏమీ రాదు. రోజూ బతుకు పోరాటం చేసే పేదవానికి మతం పేరుతో ఇతరుల మీద పడి ఏడవడానికి సమయం ఉండదు.

అందుకే నేను విశేఖర్ గారి బ్లాగ్‌లో ఇలా కామెంట్ వ్రాసాను:
>>>>>
సాధారణ హిందువులూ, సాధారణ ముస్లింలూ చేసేది బతుకు పోరాటమే. మా పట్టణంలో హిందువుల పండగలకి పువ్వులు అమ్మేది ముస్లిం వ్యాపారులే. దసరాకీ, కనుమకీ హిందువులకి మాంసం అమ్మేది ముస్లిం కసాయీలే. హిందువులకి పండగలు వస్తే తమకి డబ్బులు వచ్చాయని ఆ ముస్లింలు కూడా virtualగా పండగ ఆనందంలోనే ఉంటారు. రోజూ బతుకు పోరాటం చేసేవాళ్ళకి మతం పేరుతో కొట్టుకోవడానికి సమయం ఎక్కడ ఉంటుంది?

నాకు తెలిసిన ఒక పూల వ్యాపారిని అందరూ సాహెబ్ గారు అనే పిలుస్తారు కానీ ఒరేయ్ సాహెబు అని ఎవరూ పిలవరు. గౌరవం అనేది మనిషిని చూసి ఇస్తారు కానీ మతాన్ని చూసి ఎవరూ ఇవ్వరు. సాధారణ వ్యక్తికి మతం పేరుతో ఇతరులని ద్వేషించాలనిపించదు. విలాసంగా ఉంటూ ఏ పని చెయ్యకుండా కూర్చునే కొంత మంది ధనిక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చెయ్యడానికి వేరే పనేమీ లేక మత విద్వేష ప్రోపగాండా చెయ్యగలరు.
>>>>>

PALERU చెప్పారు...

u r comment on vishkhar garu's blog is 100% right....i agree with that.

Praveen Mandangi చెప్పారు...

ఇన్నయ్య గారి విషయానికొస్తే ఆయన భౌతిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకోమని చెప్పారు. దేవుని మీద ఎంత నమ్మకం ఉన్నవాడైనా మొసళ్ళు ఉండే చెరువులో ఇంటెన్షనల్‌గా కాళ్ళు పెట్టి దేవుడు తనని రక్షిస్తాడని అనుకోడు. దేవుడు లేడేమో అనే సంశయం(skeptic) అతనికి ఉన్నా ఆ సంశయాన్ని అన్ని సందర్భాలలోనూ గుర్తుంచుకోడు. పాము పుట్టలో పాలు పోసేవాడు కూడా పాము పుట్టలో చెయ్యి పెట్టే ధైర్యం చెయ్యడు. పాము దేవత కాదు అనే భౌతిక జ్ఞానం అతనికి ఉంటుంది. సంశయాన్నీ, భౌతిక జ్ఞానాన్నీ అన్ని సందర్భాలలోనూ ఎందుకు వినియోగించకూడదు అనేది ఇన్నయ్య గారి ప్రశ్న. అంతే కానీ ఇన్నయ్య గారు హిందూ మతాన్ని దూషించలేదు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భాయీ.. మీ బ్లాగ్ చూస్తుంటే..నాకు ఇప్పుడు..భయం పట్టుకుంది. కామెంట్ లా మజాకా!?

అవును కానీ సంక్రాంతిని అలా సాగదీశావేంటి ..? వచ్చిన నాలుగు భాషలకే నువ్వు అంత సాగ దీష్తే..బహు భాషా కోవిదులు ..ఇంకెంత సాగదీస్తారో! తెలుగు భాషామ తల్లి బిడ్డలం..సంకరాల గోల నాకు అసలు తెలియ.హిందువుగా పుట్టాను.మానవత్వమే..మతము గా ఎదిగాను.ఎదుగుతున్నాను కూడా.. దీదీని అర్ధం చేసుకోవాలని తెలియకుంటే..ఎట్టా?
అచ్చు తప్పు అయితే..మన్నించు.ఇలా కామెంట్ బదులు చెప్పడం తప్పైతే..డిలేట్.

Praveen Mandangi చెప్పారు...

మీరు గూగుల్ ప్లస్‌లో అరబిక్ అలిఫ్‌బా వ్రాసారు. ఆ అక్షరాలు మాకు అర్థం కావడం లేదు.

PALERU చెప్పారు...

వనజక్కా ....మీరొక్కరే...నా తప్పులని సరిచేసుకోవటానికి సహాయ పడతారు...చెప్పను కదా...నాకు మీలాంటి వాళ్ళు చెప్పక పొతే ఎవరు చెబుతారు అని ....కాని అది మాత్రం టైపో తప్పు......"మన్నించు" లాంటి పెద్ద మాటలు ఎందుకక్కా!!! రెండు దెబ్బలు వేసినా ఏమి అనను :):) " మీకు మకర సంక్రాంత్రి శుభాకాంక్షలు"

Praveen Mandangi చెప్పారు...

నీకో రిక్వెస్ట్. నువ్వు ఎవరినీ అక్కా అని పిలవకు. మహిళా బ్లాగర్లని అక్కా అని పిలుస్తూనే వాళ్ళ గురించి చెత్తగా వ్రాసేవాళ్ళు ఉన్నారు. ధూం, కాగడా లాంటి బూతు బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాసి తరువాత మహిళా బ్లాగర్ల దగ్గరకి వచ్చి ఏమీ తెలియనట్టు నటిస్తారు. ఒకవేళ నేను కూడా మహిళా బ్లాగర్లని అక్కా అని పిలిస్తే నాది కూడా ఆ గ్రూపే అనుకుంటారు. అందుకే నేను మహిళా బ్లాగర్లు ఎవరినీ అక్కా అని పిలవలేదు. నువ్వు కూడా అలా పిలవకు. అలా పిలిస్తే నీది కూడా ఆ గ్రూపే అనుకుంటారు.

PALERU చెప్పారు...

ప్రవీణ్ అన్నాయ్ ..

ఏదో పిచ్హి అభిమానం లే ....లైట్ తీస్కో అన్న...నాకు నిజంగా అక్కలు గాని అన్నయ్యలు గాని లేరు, నన్ను ఎవరన్నా తమ్ముడు అంటే వాళ్ళంటే విపరీతమైన గౌరవం పెరిగిపోతుంది...అందుకే అలా......పొతే నీ పాతాకమేంట్ గురించి నాకు ఒక ఉర్దూ బ్లాగు కుడా ఉందిలే అది చూసి ఉంటావ్ అన్నా...అందుకే అర్ధం అయ్యి ఉండదు....

Praveen Mandangi చెప్పారు...

నువ్వు అలా పిలిచినవాళ్ళని గుడ్డిగా నమ్మేస్తావు, నేను అలా నమ్మను. అదే తేడా.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రవీణ్ గారు.. ఒక చిన్న మాటండీ! ఈ వ్యాఖ్య నేను ఎందుకు చేస్తున్నాను అంటే.. నేను.. రాఫ్సున్ ని భాయీ అని పిలుస్తున్నాను..మీరు అలా పిలిచిన వారిని నమ్మవద్దని చెపుతున్నారు కాబట్టి .. ఇది వ్రాయాల్సి వచ్చింది.

ఎవరి అనుభవాన్ని బట్టి వారికి నమ్మకమో..అప నమ్మకమో..ఏర్పడుతుంది. ప్రపంచంలో..ఏ ఒక్కరు మరోకరిలా ఆలోచించరు,ఉండరు కూడా. మీ అనుభవాన్నే గుణపాఠం గా తీసుకోవాలని ఇతరులకి చెప్పడం వద్దండీ! సోదరా..అని పిలిస్తే నమ్మవద్దు అని చెప్పడం ఎందుకండీ!అంతలా ద్వేష భావాలు వేళ్లూనుకునేలా.. పరిస్థితులకి దారితీయ కుండా చూసుకోనుట,నెయ్యం చేయుట మన కర్తవ్యంగా.. ఇతరుల భావాలు నచ్చకుంటే..మౌనంగా ఉండుట మంచిదని నా అభిప్రాయం.

ఇంకొక మాట.. మీలో..విషయ పరిజ్ఞానం, గ్రాహక శక్తి బహు మెండు.తెలియని విషయాన్ని తెలిసేలా చెప్ప డానికి మీరు చేసే ప్రయత్నాన్ని స్వాగతిస్తూ ఉంటాను.కానీ.. ఇలా చెప్పి భయ పెట్టకండి. నిప్పు పట్టుకుంటే కాల్తుంది..అని చెప్పే ముందు.. అది నిప్పో కాదో తెలుసుకుని చెప్పడం కూడా అవసరం. తెలియనప్పుడు.. చెప్ప కుండా ఉండటం కూడా అవసరం.

PALERU చెప్పారు...

వనజ దీది,

కోపం వలదు ....వలదు....!!!!.ప్రవీణ్ అన్నాయ్ కి కొంచెం ఆవేశం ఎక్కువ.....అందుకే అలా అన్నారు లెండి......మీరు ఉరికే ఆవేశ పడిపోకండి...మీరు నన్ను భాయి అనండి ...ఎరా...అనండి ....ఒరేయ్ అనండి.....పాలేరుగా....అనండి....నాకు మాత్రం మీరు దీదినే....మీకు గుర్తుందా...నా బ్లాగులో ఫస్టు సలహా మీదే...నవల పేరు మార్చమని...సలహా ఎవరికీ ఇస్తాం ?? మనకంటే చిన్నవాల్లకో ...మన తోటి వారకో కదా....మన కుటుంబ సభ్యులకో కదా..సో మీరు దీది నే నేను భాయి నే....ఓకే నా ...ఒకసారి నవ్వి నిద్రపోండి.....:):)

ప్రవీణ్ అన్నాయ్...లైట్ తీస్కో....ఉరికే సీరియస్ గా తీసుకుని ఆరోగ్యం పాడు చేసుకోకండి.... :):)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భాయీ.. ఎవరి పైనా కోపం ప్రదర్శించను.. ప్రవీణ్ గారిని సోదరా..అంటే వారు నమ్మక పోవచ్చును. అందుకే అనడం లేదు. షుక్రియా.. భాయీ..:))))))))))