10, జనవరి 2012, మంగళవారం

"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" VIII

ఇంత వరకు.......

(తొమ్మిదో తరగతి వరకు " ఈ అబ్బాయి చాలా మంచోడు" లా ఉన్న రాజు  పదవ తరగతి లో వెళ్తూ వెళ్తూ    కొన్ని అనుకోని కారణాల వల్ల " ఖతర్నాక్" అయిపోతాడు. భవాని ని పడగొట్టాలి అంటే ఆడవారి సహజ గుణం అయిన " అసూయ ని వాడుకొందాం అని ఎనిమిదవ తరగతి లో కొత్తగా జాయిన్ అయిన క్రుతికా కి దగ్గర అవుతాడు, అలా దగ్గిరవ్వడం రాజు జీవితం లో అనుకోని మలుపు తీసుకుంటుంది.)

.అది ఏంటంటే....

          నేను కృత్తిక కి దగ్గరవడం, భవాని కి నచ్చట్లేదు అని నాకు తెలుస్తూనే ఉంది , కాని తను వచ్చి ఒక్కసారి చేబితే  నేను క్రుతికా ని వదిలేద్దాం అని అనుకుంటున్నా...ఈ క్రుతికా కూడా... నేనేదో గోకితే ఇది మరీ ఇలా ఇంత ఈజీ గా పడిపోవాలా ....ఏమిటో నా అందం మహిమ....ఇలా అయితే కష్టమే కదా భవిష్యత్తులో...ఇప్పుడు మన పని బలే గుందిలెండి, ఒకే సారి ఇద్దరినీ మైంటైన్ చేయడం.....భవాని ఏమో అస్సలు చూడదు , క్రుతికా ఏమో నన్ను వోదలదు....అసలు ఈ క్రుతికా ఉంది చూసారు ఉత్త తెల్ల కలరే గాని ఒట్టి వసపిట్ట ..... అసలు మాటలాడటం మొదలు పెట్టింది అంటే ఇకా ఆపదే...నాకేమో చిరాకొస్తుంది, నాకు ఈ శిక్ష వేసిన భవాని మీద కోపం వస్తుంది, తలనోప్పివస్తుంది , తిక్క వస్తుంది, మెంటలేక్కుతుంది....కాని ఎం చేస్తాం చేపకోసం ఎరలాగా నాకు ఈ క్రుతికానే కనబడుతోంది మరి... భరించక తప్పదు...

          ముత్యాలు వీడు B  సెక్షను, బానే చదువుతాడు అని పేరు నా అంత అందం కాకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటాడు, ఈ మధ్యే తెలిసింది వీడు కూడా భవాని కి లైను వేస్తున్నాడు అని, నాకెందుకో విచిత్రం గా కోపం రాలేదు, ఒక పిచ్చి నమ్మకం ఏంటంటే " చిన్నప్పటి నుండి లైన్ వేస్తున్న నాకే పడలేదు కాబట్టి ఎవడికి పడదు " అని..... ఇంకా చాల మంది భవాని కోసం ప్రయత్నిస్తున్నారు అని తెలిసింది, మన సెలక్షన్ అంటే అంతేలే మరి అందరికి నచ్చల్సిందే..అనుకున్నా గాని టెన్షన్ పడలేదు " నాకు పడలేదు కాబట్టి ఎవడికి పడదు " అనే నమ్మకం వల్ల...కాని ఒకరోజు అనుకోకుండా....ముత్యాలు భవాని బుక్సు మార్చుకోవడం చూసాను. ఎంత కోపం వచ్చింది ఆంటే ముత్యాలు గాడిని నీళ్ళల్లో కడిగి పచ్చిగా నమిలేద్దాం అనుకున్నా ...కాని ఇలా చేయడం వల్ల భవాని ఇంకా దూరం అయ్యే చాన్సే ఉంది కాబట్టి ఈసారి విజ్ఞత గా ముందుకు వెళ్ళాను, ముత్యాలు గాడిని దోస్తు చేసుకున్నా....వాడు పాపం నిజాయితీగా స్నేహం చేసాడు, మొత్తం చెప్పేసాడు. తను భవాని ని ప్రేమిస్తున్నానని. ఆ టైం లో నన్ను నేనే గోడకు అనుకోని ( ఆంటే గోడ నన్ను గట్టిగా పట్టుకున్నట్టు అన్న మాట ) కంట్రోల్ చేసుకున్నా...ఆ టైం లో ఎవరు లేరు మరి నన్ను కంట్రోల్ చేయడానికి మా స్కూలు గోడకో థాంక్స్ లేకపోతె అదే గోడ ఒక యుద్ధానికి సాక్షిగా నిలిచేది.....

నేను అడిగా "నా గురించి తెలుసా "అని ..

"హిహిహి భవాని పాత లవర్ కదా " అని ముత్యాలు గాడు.

"పాత కాదు ఇప్పుడు కూడా రా"

"కాని భవాని నిన్ను లైక్ చెయ్యట్లేదు గా"

"ఎవరన్నారు .? అది మా ప్లాన్ రా ....మరి అందరికి తెలిసిపోతుంది కదా...మేము రోజు మాట్లాడుకుంటాం ట్యూషన్ లో" ( వీడు మా ట్యూషన్ కాదు లెండి , అందుకే అబద్ధం)

"నిజమా !! మరి అందరు నీకు పడలేదు అంటారు..."

"వెర్రి నా....యాళ్ళు ...అలాగే అనుకుంటారు రా కాని నువ్వు వేర్రోడివి కాదు లే "

"నేను కాదు అనుకో...అయినా ప్రూఫ్ ఏంటి రా ?

"ప్రూఫ్ కావాలంటే క్రుతికాని అడుగు .."

"క్రుతికా ఆంటే గుర్తుకు వచ్చింది ...మారి తను నీ లవరేగా ..."

"చ ఎవదన్నాద్రా ఆ మాటా ...తను ఫ్రెండ్ రా..."

"ఫ్రెండేంటి రా ? అమ్మాయిలు కూడా ఫ్రెండ్లు ఉంటారా?"

"నువ్వు కొంచం మోకాలు వాడలిరా ...సినిమాల్లో ఉంటారు కదా ...అలా అన్నమాట ..."

"సరేలే ....మరి నా సంగతి ???

"నీకేమైంది రా ...నువ్వు లైన్ వేయి ....తను మొత్తం నాకు చెపుతోంది నీ గురించి ....భలే నవ్వుకుంటాం లే  హిహిహి .. మొన్న ఏదో సైన్సో... సోషలో .... తెలుగేమో , ఇంగ్లీష్ అనుకుంటా...హిందీ కదా.....ఆ గుర్తొచింది లెక్కల నోట్సు అవునా ....??  ఇచ్చావంటగా ..."

"సోషల్ లే ..అది కూడా చెప్పిందా...!!!

"ఆ అవును సోషలే ...గుర్తుకొచ్చింది ..అవును చెప్పింది ...."( మనం చూసింది వీడికి తెలిసినట్టుగా లేదు ..హిహిహి)

"సరేలే ..నేను వెళ్తాను " అని బయలు దేరాడు ముత్యాలు, అప్పుడు వాడి మొఖం చుస్తే సంక్రాంతి కోడి పంద్యాలలో వోడిపోయిన కోడి మొహం గుర్తుకు వచ్చింది.....

ఎలాయితే నేమి ముత్యాలు గాడిని ప్రేమకి ఎండ్రిన్ కొట్టేసాం ...కాని ఎన్నిరోజులు ? ఎంతమందిని ? ఆపగలం...???

                నాకు ఒక వ్యతిరేక వర్గం తయ్యరయ్యారు ...ఎందుకో చెప్పనా....భవాని నాకు పడిపోయిందని ....హిహిహి ..భవానిని అల్లరి చేద్దాం అని వీళ్ళు ఒక పిచి ప్లాన్ వేసారు ......అదేంటంటే ఒక రోజు భవాని ఒంటరిగా బందరు వెళ్ళింది ఆరోజు నేను కూడా ఊర్వసి దియేటర్ లో ఏదో సిమిమా ఆడుతుంటే వెళ్ళాను ...వచ్చే టప్పుడు ఇద్దరం ఒకే బస్సులో ఉన్నాం....దిగేటప్పుడు భవాని వెనకే దిగాను ...బస్సులో మా ఉరు వచేవరకు తెగ ప్రేమిన్చేసాననుకోండి ...అలా దిగడం మా ప్రతిపక్ష పార్టీ వాడు ఒకడు చూసాడు...అంతే మరుసటి రోజు "భవాని రాజు గాడితో బందరు సినిమాకి వెళ్ళింది " అని ఈనాడు పత్రికలా ఒకడు " ఇద్దరు కలిసి హోటల్ ( భోజన హోటల్ లెండి) వెళ్లారు " అని సాక్షి పేపర్ లా ఒకడు "పరస్పర విరుద్హ ఏకాసార" న్యూస్ వదిలారు స్కూల్ లో ....

          తెగ భయపడిపోయాను మా నాన్నకు తెలేస్తే తోలు తీసి ధాన్యం సంచీలు కుట్టుకుంటాడని కాదు...భవాని కి నా మీద మళ్ళి కోపం వస్తుందేమో అని ....నానా తంటాలు పడ్డాను లెండి ఈ న్యూస్ భవాని దాకా చేరకుండా...కాని మనం మాత్రం ఒక ఆయుధం గా వాడుకున్నాం.....నేను భవాని  అపర ప్రేమికులము అని , మేమే లైలా మజ్ను అని ..." నువ్వు వస్తావని " సినిమా చూసాం బందరు లో అని ...తెగ బిల్డప్పులు ఇచి ఇంకా కొత్త కాంపిటీటార్ రాకుండా పద్మప్యుహం వేసేసా....

                   ఈలోపు అర్ధసంవత్సర పరిక్షలు అని ప్రకటించారు ..మేము బాగా చదువుతాం అనుకునే బ్యాచ్ కి సడన్ గా రెండు కొమ్ములు లేచాయి వాళ్ళకు వాళ్ళే చదువుకోవడం ఎవరితో మాట్లాడకపోవడం అవసరం ఉన్న లేకపోయినా మాస్తార్లని డౌట్లు అడగటము, వెళ్లి వచ్చిన  ప్రశ్నలు అప్పజెప్పి శెభాష్ అనిపించుకోవడం  అదోరకమైనా బిల్డప్పులు ఇవ్వడం మొదలు పెట్టారు .....మనకేమి లే మనం చదివినా పాస్ చదవక పోయినా పాస్ అని మనం మాత్రం మన గోల లో మనం ఉన్నాం.....ఒకసారి షోషల్ టీచర్ " విజయకుమారి " వచారు క్లాస్స్ కి అందరిని ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు...ఇంతలో మనంకూడా క్లాస్సు లోని ఒక అణువు కాబట్టి మనల్ని ఏదో ప్రశ్న అడిగారు ...నేను ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తూ నుంచున్నా ఇంతలో గుర్తుకు వచ్చింది మొదలుపెట్టేంతలో ఆవిడా తిట్ల దండకం అందుకున్నారు..మనకు కాలింది..అసలే భవాని ముందు తిడితే తట్టుకోలేను అలాంటిది రెండు సేక్షనులు కలిసి ఉన్నప్పుడు అందరి ముందు తిడితే ఎలా తట్టుకోనేది ?? అందుకే ......
:" మిమ్మల్ని ఉరికే అనరు " బక్కమ్మ " అని " అన్నాను ( సన్నగా పుల్లలాగా ఉండేది లెండి )

ఏమన్నావ్ రా"

"??????"

              ఒక మంచి బెత్తం తీసుకు వచ్చి నా ప్యాంటు దుమ్ము దులపడం మొదలు పెట్టారు ఆవిడ......ఒకటి రెండు ఆంటే తట్టుకోగలం గాని మరీ తెలుగు పరీక్షలో మార్కుల్లగా ఓ కొట్టేస్తే ఎక్కడ నుంచోగలం...?అసలికే  క్లాస్ అంతానా వైపు చూస్తుంది నేనెప్పుడు ఏడుస్తానా !!! అని ...కాని మనకు ఇవి ఒక లెక్క ??? అయినా రోషం తో ఆవిడా బెత్తాన్ని పట్టుకున్నా...చేతిలోనుంచి లాగేసుకున్నా...విరిచేసా ...బయటకు విసిరేశా అదే టైము లో ఇవిడ చెల్లి గారు " అజయకుమారి " గారు అటుగా వెళ్ళడం మన విసిరిన బెత్తము  ఆవిడకి తగలడం తోటి ఇక మన పని " రామలింగరాజు " అయ్యింది......

"ఇకనేను పదవతరగతి కి పాఠాలు చెప్పను "
                     అని ఆవిడ ఏడుస్తూ స్తాఫ్ఫ్ రూం కి వెళ్ళిపోయారు. మనం కూర్చున్నాం , ఆవిడ చెల్లి గారు క్లాస్స్ రూం లోకి రావడం ఆడపిల్లలతోటి విషయసమాచారం గ్రహించటం అందరు ఆవిడచుట్టు చేరడం, పరామర్శించడం మగ పిల్లల్లో కూడా కొంతమంది " లేడీస్ బోయ్స్" ఆ మేడం చుట్టూ చేరి " తందానా ....తాన " అనడం ..ఆవిడ మన వైపు పోట్లగిత్తలా చూడటం మనమేమో సింహం లా తల విదల్చడం ఆవిడ విస విసా బయటకు వెళ్ళడం , క్లాస్స్ రూము అంతా నా వైపు విచిత్రం గా చూడటం...నా బ్యాచి  నా పరామర్శ కు రావడం , నా కపట అభిమాన సంఘం నన్ను పరామర్శిస్తూ భయపెట్టడం..."నువ్వు పదోతరగతి పరీక్షలు రాయవు" అని వాళ్ళే డిసైడ్ చేసెయ్యడం ....ఎలక్షన్ల ముందు రాజకీయ నాయకుల వారాల జల్లులా .....లాస్ట్ ఫైటు లో హీరో గుద్దులు లా .....ఈ విషయం మా నాన్నకు తెలిస్తే నేను వేసే బ్రేక్ డాన్సు లా ........టక్  టక్ టకా  జరిగిపోయాయి...

అప్పుడు మొదలైందండి మనకు సినిమా ...అప్పటికి దేశం లో   IMAX  లేకపోయినా కూడా మా ఉల్లో వుందని నొక్కి వక్కానించగలను....ఎందుకంటే నాకు మరి అంత పెద్ద సినిమా కనబడింది......


సినిమా త్వరలో రిలీజ్............

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

waste story...dont waste your time...

PALERU చెప్పారు...

anon,

thanks for your suggestion :):)

రసజ్ఞ చెప్పారు...

కోడి పంద్యాలలో వోడిపోయిన కోడి మొహం ఎలా ఉంటుంది? నేనెప్పుడూ చూడలేదే! మా నాన్నకు తెలేస్తే తోలు తీసి ధాన్యం సంచీలు కుట్టుకుంటాడని అరె! ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందే? ఒక మంచి బెత్తం తీసుకు వచ్చి నా ప్యాంటు దుమ్ము దులపడం మొదలు పెట్టారు అచ్చికచ్చిక! అప్పడప్పడ తాండ్ర అయ్యిందనమాట ఒళ్ళు. మీరిలా ప్రతీ భాగానికీ ఇంతింత గ్యాప్ ఇస్తే ఎలా? వెంట వెంటనే వ్రాయాలి.

PALERU చెప్పారు...

రసజ్ఞ గారు...చూస్తున్నా.... చూస్తున్నా.... అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా.....:):) మీకు రాజంటే ఎందుకంత కోపమండి????:):)

సరే సరే ..త్వర త్వరగా రాస్తాను ఇకనుండి ...మీ లాంటి పెద్దలు ప్రోత్సహిస్తుంటే మళ్ళి సిగ్గేస్తోంది..:!!.

మీకు మీ కుటుంబ సభ్యులకు, సకల హిందూ జనులకు సంక్రాంతి శుభాకాంక్షలు.......