6, జనవరి 2012, శుక్రవారం

నువ్వు నాతొ..... మాటలాడలేదు ..కాని మాటలాడించావు

నువ్వు నాతొ.....
మాటలాడలేదు ..కాని మాటలాడించావు
చెప్పలేదు కాని చెప్పించావు.....
ఉరించావు...ఉరడించావు..ప్రేమించావు!!!
నేను నీతో.....
చెప్పడమే కాదు .....వివరించాను...
నా లక్ష్యం...నా జీవితం ....నా ప్రేమ
మూడు వేరు వేరన్నాను,
నా జీవితం లో లక్ష్యం తరువాత ప్రేమ అన్నాను!!!
సరే అన్నావు , సూపర్ అన్నావు, కేక అన్నావు,
కాని తరువాత ఎందుకు కెవ్వు అన్నావు????
ప్రేమించడం లో Ph . D చేసిన నన్ను 
ప్రేమించడం లో  LKG చేస్తున్న నువ్వు
ప్రేమించావు ...ప్రేమింపజేసుకున్నావు...
నేను ఎంచుకున్న బాట లో ముందు ముళ్ళు తరువాత్ రాళ్ళూ
కాని కష్టపడితే అవన్నీ కావా మనకోసం వజ్రాలు  రత్నాలు??
నిన్ను ప్రేమించినంతగా నేనెవరిని ప్రేమించలేదు ప్రియా !!!
ప్రేమించి, ద్వేషించే నీ మనసుకు లేదు నా మీద దయ.. !
నిన్ను నేను neglect చేయలేదు నా ప్రియమైన జాను!!
మన భవిష్యత్తు బాటలో నన్ను నేనే మరిచిపోయాను ...
అర్ధం చేసుకోవడం లో విఫలమై నన్ను తప్పు పట్టి
అలిగావు నా మనసుకు గాయం చేకూర్చావు,,,,
బాధ పెట్టావు నన్ను బాధపెట్టావు
భయపడ్డావు ....భయపెట్టావు
ఎడిచావు.....ఎడిపించావు
 ప్రేమలో గెలుపోటములు ఉండవు కాని లక్ష్య సాధనలో నా ప్రేమ ఓడిపోయింది
ప్రియా !!!
ఒక ఇల్లు , చిన్న కారు , కొంత బ్యాంకు బాలెన్సు.....ఇది కాదు జీవితం
మనకోసం ఎదురుచూసే కళ్ళు, మనతో నడిచే కాళ్ళు అవే ధైర్య పర్వతం
మనకోసం మనం బ్రతెకేద్దాం అనుకుంటే నేను మంత్రి
అందరికోసం బ్రతుకుదాం అనుకోబట్టే నేను కంత్రి
జీవితం అందరిలా కాదు అందరికంటే విభిన్నంగా ఉండాలి
గెలుపుండాలి ఓటమి ఉండాలి ప్రేమించాలి ప్రేమించబడాలి....
నిన్ను రాణి లా చూడాలనుకున్న నన్ను రాక్షసుడి లా చూసావు 
అందరి మాటలు విన్నావు నా జ్ఞాపకాలు మరిచావు నిస్సహాయుడి ని చేసావు
అందంగా అందరితో కలిసి ఉండే నన్ను అంటరాని వాడిని చేసావు అవిటి వాడిని చేసావు
ప్రేమా కావాలా లక్ష్యం కావాలా అంటే......తల్లి కావాలా తండ్రి కావాలా అన్నట్టు ఉంది

నన్ను అర్ధం చేసుకునే వాళ్ళు తక్కువ, అందులో నువ్వు చేరి నన్ను మానసికం గా చంపేసావు

ఎప్పటికైనా నన్ను అర్ధం చేసుకుంటావని

ఆశతో ఎదురు చూసే 
నీ రాజు

 


  

 

 
 

 
 





4 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

వ్యాఖ్య రాయాలనిపించలేదు కాని ఈ లేఖ రాసేలా చేసింది ;) ఈ లేఖ మొదట్లో భవానీ పేరేమయింది? అంటే భవానీకి కాకపోతే ఏ శివానీకో ఇచ్చేద్దామని మీ ప్లానా :P
ప్రేమా కావాలా లక్ష్యం కావాలా అంటే ఎందుకంత ఆలోచనా? ప్రేమగా చేరుకునే లక్ష్యం కావాలి అని చెప్పరాదూ!
నన్ను అర్ధం చేసుకునే వాళ్ళు తక్కువ, అందులో నువ్వు చేరి నన్ను మానసికం గా చంపేసావు ఎప్పటికైనా నన్ను అర్ధం చేసుకుంటావని అన్నారు కదా! ఇక్కడ ఎందుకో ఈ వాక్యం సరిగా లేదో నాకు సరిగ్గా అర్ధం కాలేదో ఒకసారి వివరిస్తారా? నాకు అర్ధమయినంతవరకు అర్ధం చేసుకునేవాళ్ళు తక్కువ నువ్వు అందులో చేరావు. మరి అర్ధం చేసుకున్నప్పుడు మానసికంగా చంపేసావు అంటే బహుశా అంతలా అర్ధం చేసుకుని కూడా దూరం చేసిందనా? మరి అర్ధం చేసుకున్నది మళ్ళీ అర్ధం చేసుకోవడమేమిటి? కొంచెం విడమరచి చెప్పరా మాష్టారూ!

kastephale చెప్పారు...

భావావేశం స్పష్టంగా వుంది. లక్ష్యం ముఖ్యమే! జీవితం లో అదొక భాగమే! అదే సర్వస్వం కాదు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రేమ జీవితంలో ఒక భాగం,పెళ్లి మరి కొంత భాగం.. ఇవి రెండే జీవితం కాదు.జీవితాన్ని, జీవనాన్ని ప్రేమించండి ..జీవిత లక్ష్యం .. ప్రేమే అయితే బాధ తప్ప ఏం మిగలదు. అదే లక్ష్యమే జీవితం అయితే.. ప్రేమ వెదుక్కుంటూ వస్తింది. ఒక వేళ రాక పోయినా శూన్యం ఏం ఉండదు..అని రాజు కి చెప్పండి ..

PALERU చెప్పారు...

అమ్మాయ్ రసజ్ఞ ..!!!! ( దీక్షితులు తాత స్టైలు)

కొత్త కవుల మీద మీకు అసూయ అనుకుంటాను..:):) ఏదో చిన్నపిల్లాడు, ఏదో గీకాడు, దాన్ని చదివి చీల్చి చెండాడి తప్పులు పట్టుకుంటారా..అమ్మో :):)

ఇక నేను ...
ఇంతకీ అక్కడ అర్ధం ఏంటంటే " నన్ను చాలా తక్కువ మంది అర్ధం చేసుకుంటారు ( అని నా అనుమానం) ఆ అర్ధం చేసుకున్నవాళ్ళు కుడా అర్ధం చేసుకోనట్టు ప్రవర్తిస్తే కలిగే బాధ ఆ వాక్య నిర్మాణం లో వాడుకున్న నన్నమాటా :p
మళ్ళి" నన్ను అర్ధం చేసుకుంటావని" అంటే మరలా ఎప్పటికైనా కొత్తగా వేరే angle లో అర్ధం చేసుకుంటుంది ఏమో అని ....

హమ్మయ్య ... వివరించేసాను... కవిత్వం రాసినప్పుడు కుడా ఇంత కష్ట పడలేదండి బాబు.. ...

దీక్షితులు తాత..

మీకేంటి అన్ని లక్ష్యాలు సాధించేసారు...ఇప్పుడు అలాగే అంటారు...మీరు మొన్న రాత్రి మనం అరుగు మీద మీ ప్రేమ కధ చెబుతూ రుక్మిణి కోసం ఎన్ని గోడలేక్కింది చెప్పలేదు !!! అప్పుడు లక్ష్యమే మీకు ముఖ్యం కదా...:):):)


వనజ దీది ...

రాజు జీవితం లో ప్రేమ అనేది లక్ష్యం మాత్రం కాదు ...కాని ప్రేమించడం వల్ల, ప్రేమించి ఓడిపోతున్డటం వల్ల లక్ష్యానికి చేరుకోవడం లో వెనకబడుతున్నాడు.....ఏదేమైనా రాజు ని రాజు లా చూసేది మీరొక్కరే.....