నాకు మాత్రం బ్లాగులోకం లో అందరు ఆడవారు " అక్కలు" మొగవారు " అన్నయ్యలు" నాకంటే చిన్నవాళ్ళు ఉంటె వాళ్ళందరూ " తమ్ముళ్ళు చెల్లాయి లు " ఒక తాత " కష్టేఫాలే" , ఇద్దరు గురువులు " బులుసు గారు,భారారే గారు "
బంధాలని అనుబంధాలు చేసుకోవాలి , అందరం కలిసుండాలి, నాకు కుల, మత, వర్గ, వర్ణ, లింగ, భాష , ప్రాంతీయ బేధాలు లేవు. నేను అక్క, అన్నయ్య, గురుగారు , తాతయ్య, అని పిలిచేది బంధాలని పవిత్రం గా కలకాలం కాపాడుకోవటానికి..
నాకు తెలిసింది కొంచెం, తెలుసుకోవాలిసినది చాలా ఉంది, మీరు నమ్మరు గాని నాకు ఇప్పటి వరకు శత్రువులు లేరు..నిజ్జంగా నిజం ....మన సంస్కృతీ అందరి కంటే గొప్పది , మా ఉరిలో చుడండి బాబాయ్ అని , తాత అని , ఎంటేటో పిలుచుకుంటారు, కాని ఒకరికి ఒకరు సంబంధం ఉండదు వేరే వేరే కులాల వాళ్ళు, మతాల వాళ్లును.
గ్రూపులు కట్టుకుంటే గ్రూపులు వస్తాయి గాని, అన్ని నావే అనుకుంటే గ్రుపులేందుకు వస్తాయి?? మనం తెలుగోళ్ళం...తెలుగు "గొళ్ళ" లా రక్కుకోవడం అవసరమా.....?? మీ అభిప్రాయాలని చెప్పండి , ఎవరైనా విమర్శిస్తే మీరు నమ్మడానికి కారణం వివరించండి ఆ వివరణ " నువ్వు ఇదే నిజం!!! అని నమ్మి తీరాలి" అన్నట్టు కాకుండా " ఇందుకు నేను నమ్ముతాను " అన్నట్టు వ్యక్తపరచండి....విమర్శ అనేది మనల్ని మనం సరి చూసుకోవడానికి పనికివస్తుంది, విమర్శ చేసే వాళ్ళు కుడా ముందుగా" నేనెందుకు విమర్శించాలి ?" అని చూసుకోండి .....ఒకవేళ " నా భావాలతో ఈ భావాలు సరిపడటలేదు!" అని సమాధానం వస్తే వదిలేయండి ఎందుకంటే " ప్రపంచం లో ఎ ఇద్దరి భావాలు సమానం గా ఉండవు, అన్ని కలిసినా..... ఒకచోట తేడా కొట్టేస్తుంది....అందుకే కదా ఇన్ని గ్రూపులు , ఇన్ని మతాలూ, ఇన్ని ప్రాంతాలు ఇన్ని ఆచారాలు, రకరకాల సాంప్రదాయాలు , భిన్న వేషధారణలు , ఒకవేళ మీరు విమిర్శించడానికి కారణం అతని బాగు అయితే ఒక్కసారే చెప్పండి , మళ్ళి మళ్ళి చెప్పకండి....చెప్పగా చెప్పగా నిజం అబద్దం , అబద్దాన్ని నిజం చేయ్యోచేమో గాని మనం మాత్రం శత్రువులం అయిపోతాం.....శత్రువు ఎప్పటికైనా ప్రమాదకారే కదా...మరి మనమే శత్రువు ని తయారు చేసుకోవడం ఎందుకు???అనక బాధపడటం ఎందుకు???
అందరు ఉండాలి అనుకునే ఒక గ్రూపు ఉంది అదే ' హాస్య గ్రూపు" ఇక్కడ మనం కొట్టేసుకోవడం వల్ల ప్రపంచం మారిపోదు, సమాజం ఏకం అయిపోదు, నలుగురు కలిసినప్పుడు అందులో ఇద్దరు కొట్టుకుంటుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? వాళ్ళెంచేయాలి ? అయితే మౌనంగా ఉండాలి, లేదా అగ్ని కి ఆజ్యం పోసి చప్పట్లు కొట్టుకుంటూ నిలబడాలి, అందరి దగ్గర ఆజ్యం ఉండదుగా...ఉన్నా.... పోసే పద్దతి తెలీదుగా....కాని అదే ఒక ఇద్దరు జోక్స్ చెప్పుకుంటున్నారు అనుకోండి ...నలుగురు నవ్వుతారు , అటుగా పోయేవాళ్ళు కుడా వచ్చి ఆ జోక్ విని నవ్వుకుంటారు , అందరు నవ్వుకుంటారు హాయిగా వెళ్ళిపోతారు. ఎంత హాయో.....
చివరగా......స్త్రీ గురించి నేనేమి చెప్పలేను , చాలా మంది చాలా రకాలుగా చెప్పారు, నాకు సరిగా చెప్పడం కుడా రాదు, కాని తెలిసింది ఒకటే " రెండువైపుల పదును ఉన్నా కత్తి" మంచిగా ఉంటె అమృతాన్ని ఇవ్వగలదు , చెడు చేస్తే విషాన్ని తాగించాగలదు, విషాని తాగించే వారిగురించి నాకు తెలీదు విన్నాను అంతే...!!! "మంచితనం మోములో జాణతనం మనసులో "ఉన్నవాళ్ళు కుడా ఉంటారు మనకింకా పరిచయం కాలేదు. యవరాజ్ గా చుస్తే స్త్రీ అంటె " అమ్మ" స్త్రీ అంటె " అక్క, చెల్లి, కూతురు , భార్య,అయినా కుడా....అమ్మ అమ్మే కదా..."నీయమ్మ" అన్నా " నాయమ్మా " అన్నా అమ్మే.....ఆడవారిని తిట్టుకోకండి....తిట్టేముందు ఒక్కసారి ఆలోచించండి ...మనం బ్లాగులు రాస్తున్నాం అంటె ఎదిగామా ....దిగాజారామా????....
ఏదో పాలేరుని ....నాకు మా కామందు ( ఓనరు ) చెప్పింది రాసాను , నాకేమి తెలీదు...నాకేమి రాదు ....ఒక కొత్త సామెత " టిఫిను కి డబ్బులు లేవురా కొడకా అని ఏడుస్తుంటే కొడుకొచ్చి టిప్పుకి డబ్బులు అడిగాడు అంటా ..." ఊరికే సరదాగా చెప్పాను మీరు నవ్వుతారేమో అని ....నవ్వు రాలేదా....అయితే సారి ...:):):)
14 కామెంట్లు:
భాయీ.. ఇరగదీశావు కదా! ఏం చెప్పినవ్!? మస్తు కుషాల్. జోక్ ఏకే 47 ..బుల్లెట్ లా..దూసుకేల్లేక ఇంకా నవ్వి చావకుండా ఉంటామా!? పండుగ రోజు మంచి మాటలు చెప్పినవ్. చల్లగా,సంతోషంగా ఉండాలే అందరు. కుష్ రహో..భాయీ!!!!
వనజ దీది .
గదేంది ?? సడ్డెన్ గా తెలంగాణా ల ఉర్కినావ్? మజాక్ చేస్తున్నావా మా తెలంగాణా వొల్ల మీద ? ఆవుమల్ల అందరు కుశిగా ఉంటె నే కదా పండగ ... :):)
పండుగ రోజున బాగా చెప్పారు .
సంక్రాంతి శుభాకాంక్షలు
మాలా కుమార్ గారు,
స్వాగతం, పాలేరు బ్లాగ్ కి సుస్వాగతం ....:):) ధన్యవాదాలండి...మీకు కుడా పండుగ శుభాకాంక్షలు ...........
నీకు బ్లాగింగ్ పోకడల గురించి తెలియవు. నచ్చిన వ్యక్తిని బావయ్య అనీ, నచ్చని వ్యక్తిని అన్నయ్య అనీ పిలిచిన మహిళామణుల్ని కూడా చూశాను. నన్ను ఎవరు ఏమని పిలిచినా పట్టించుకోను. నా అభిమాన నవల మైదానంలో రాజేశ్వరి తనని దీదీ అని పిలిచిన మీరా అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. కానీ అప్పటికే అమీర్‌ని నమ్మి మోసపోయిన రాజేశ్వరి మీరా విషయంలో జాగ్రత్తపడుతుందనేది వేరే విషయం. వరస పిలుపులకీ, నిజం బంధుత్వాలకీ మధ్య చాలా తేడా ఉంది కానీ వరస పిలుపులు పిలుస్తూ ఓవర్ యాక్షన్ చెయ్యడమే నాకు నచ్చదు.
ఈ లింక్ చదువు: http://manishi-manasulomaata.blogspot.com/2008/06/blog-post_26.html
బ్లాగ్ మొదలెట్టిన కొత్తలో ఇలాగే నేను కొందరిని అక్కా అని పిలిచి అభాసు పాలయ్యాను.
ఏమైనా ఎవరు ఎలా స్పందిస్తారో ఊహించటం కష్టం !!
ఎదేమైనా మన మనమంతా ఒక కుటుంబం,
ఆరోగ్యకరమైన బంధాలున్న పరివార సభ్యులం !!
ప్రవీణ్ అన్నాయ్ ...మీ కామెంట్ విచారించ దగ్గదే....కాని ఇతరులు చెబితే పైత్యం మనం తెలుసుకుంటే అనుభవం కదా....దేవుడి దయవల్ల ఇప్పటి వరకు నాకు అలాంటి మిత్రులు లేరు అందరు మంచి వారే ఉన్నారు.....అయినా మనం బాగుంటే మనలని ఎవరు ఏమనరు....ఒకవేళ అన్నాగాని వాళ్ళ పాపాన వల్లే పోతారులే......
ఆత్రేయ గారు,
స్వాగతం......... మీకు అలా జరగటం నిజంగా శోచనీయం....నావరకు నాకు అలా జరగకూడదని కోరుకుంటున్నా...ఒకవేళ నన్ను ఎవరైనా ఏమైనా అన్నా...చినావాడిని కాబట్టి ఆశీర్వచనాలు అని సరిపెట్టుకుంటాను...ఒక కుటుంబ లో కలహాలు సహజమే కాని కలకాలం మాత్రం ఉండవు అని అనుకుంటున్నాను.
రాఫ్సన్ మహాశయా,
నా కు మీ టపా లో కనిపించిన సూక్ష్మం ఇది.
నాకు మాత్రం బ్లాగు లోకం లో అందరూ ఆడవారు,
అక్కలు మొగవారు, అన్నయ్యలు !
ఇప్పడు ఏమంటారో ? నారదాయ నమః
చీర్స్
జిలేబి.
I am at my uncle's village now. I am unable to catch docomo connection and presently using airtel usb modem that works slower than android phone. I can't reply until I return to my town.
జేలేబి బామ్మా గారు,
మీ గ్రాహక శక్తి అమోఘం....ఇంతకీ నారదులవారు ఎవరో....!!!
మీక్కూడా చీర్స్
లడ్డు
praveen sharma...have a happy pongal sir.....
పొంగల్ గురించి గూగుల్ ప్లస్‌లో చర్చ జరుగుతోంది, ఈ లింక్ చదువు: https://plus.google.com/113328872010907615365/posts/5iHnQMv8w3B
Read these two links:
https://plus.google.com/111113261980146074416/posts/9jsZV2e1agi
http://manishi-manasulomaata.blogspot.com/2008/06/blog-post_26.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి