24, డిసెంబర్ 2011, శనివారం

"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" V

PART - V 
( భవాని పుట్టినరోజు కోసమని ఎంతో కష్టపడి గ్రీటింగులు సంపాదిస్తాడు రాజు, తీరా వాటిని ఇద్దామనుకునే సమయానికి భవాని హిందీ క్లాస్ కి రాదు..లత ని మాటలతో మాయ చేసి....లత ద్వార భవాని కి  గ్రీటింగ్స్ పంపిస్తాడు రాజు ...తీసుకుని థాంక్స్ చెప్తుంది భవాని....రెండు రోజుల తరువాత క్లాసు కి వచ్చిన భవాని క్లాసు అయిపోయిన తరువాత ఆ గ్రీటింగ్ కార్డులు హిందీ మాస్టారి చేతిలో పెడుతుంది...అవేమి తెలియని రాజు ఉల్లాసంగా వస్తు వస్తూ..గేటు దగ్గర హిందీ మాస్టారిని మరియు హిందీ మాస్టారి చేతిలో ఉన్న తను ఇచిన గ్రీటింగ్ కార్డులను చూసి ఆవాక్కయాడు...ఆ తరువాత ....)

"ఎరా రాజు " భింకరంగా పలికింది హిందీ వొడి గొంతు.... 
(యండమూరి వారైతే కళ్ళు చింతనిప్పులా మండుతున్నాయి....అతని చేతులు అస్ప్రష్టంగా వణుకుతున్నాయి అని వివరించే వారు మనకంత శీను లేదు కాబట్టి ...సింపుల్ గా )
 కోపంగా ఉన్నాడు. నాకేమో  నా గుండె మోకాల్లోకి జారి మళ్ళి గొంతులోకి వచ్చి..మళ్ళి మోకాల్లో కి జారి మళ్ళి గొంతులోకి వచ్చి అలా ఒక నాలుగైదు సార్లు కొట్టుకుని యదాస్థానానికి వచ్చింది. నోట్లోనించి మాట వస్తే వొట్టు గుడ్లు అప్పగించి అలా చూస్తున్న ఎందుకంటే నేను షాక్ లో   ఉన్నా మరీ.....

మళ్లీ హిందీ వొడి గొంతు ..."మాట్లడవేరా "??

"ఆ సార్...అది..... చెప్పండి సార్ "

"ఇవి ఏంట్రా ?" హిందీ వొడి గంభీర కంఠం

"గ్రీటింగులు సార్"  మన కీచు శబ్దం 

        ఇంతలో రోడ్డు మీద నా ఫ్రెండు దావీదు గేదలని తోలుకువేళ్తున్నాడు..రాజకీయనాయకుడి స్టైల్లో చెయ్యెత్తాడు నేనేమో సినిమా హీరో లాగా నవ్వాను ...ఇక్కడ నేను చేసిన పాపం ఏంటో గాని ...హిందీ వోడికి ఒక్కసారిగా  పూనకం వచ్చింది గ్రీటింగులు గోడ మీద పెట్టి మెరుపులా దగ్గరికి వచ్చి వంగోబెట్టి రెండు ఉతప్పాలు ఒక చపాతి ఒక పరోటా వేసుకున్నాడు నా వీపు మీద...ఆడు కొట్టినందుకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయో....అందరిముందు కొట్టినందుకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయో.....లేక అసంకల్పిత ప్రతీకార చర్య వల్ల కళ్ళలో నీరు వచిందో నాకు ఇప్పటికి కన్ఫ్యుసనే..!!! ఏదైతేనేమి పొద్దున్న టిఫిన్ చేయలేదు అన్న బాధ మాత్రం తీరింది ....

      "నాకు తెలిదట్రా..!! ఇవి గ్రీటింగులు అని ....నకరాలు చేస్తావా....బ్లా బ్లా బ్లా భౌ భౌ భౌ చై చై చై .....ఇలా ఆయన కట్ట తెగిన కృష్ణ నదిలా వాగుతూనే ఉన్నాడు ....నాకేమో ఎవరు కనబడట్లేదు అంతా గుండ్రంగా తిరిగినట్టు...మసక మసక గా కనిపిస్తుంది.ఏదో ప్రశ్న అడిగినట్టున్నాడు ...చెప్పాగా... మనం వినట్లేదు ఆని, మనమేమో ఒక కొసెన్ మార్కు మొహం పెట్టాం....ఆ తరువాతా...ఒక మంచి పాఠం చెప్పాడు " గ్రీటింగులు ఇవ్వడం లో తప్పు లేదురా.... కాని ఈ సంభోదన ఏంటి ? డియర్ భవాని ఏంటి? ఇంకోసారి ఇలా చేసావా తోలు తీస్తా" అని ఒక వార్నింగ్ ఇచి మనకు సెలవు ఇప్పించాడు. ఆ గ్రీటింగులు నా చేతికి ఇచ్చాడు..అవి పుచ్చుకొని బయలు దేరా.....నాకు ఇంగ్లీష్ లో తక్కువ మార్కులు వచినప్పుడు..పేపర్లు ఇచ్చిన తరువాతా ఆ మార్కులు చూసుకుంటూ కళ్ళు భూమి లో పాతిపెట్టి నడుస్తానే అలా నడుస్తున్నాను....

         వీడు ఒకప్పుడు ఇంగ్లీష్ చెప్పే రాణి మేడం గారికి లైన్ వేసాడు అంట ....ఆవిడేమో పడలేదు ఆని పదవతరగతి వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నా....ఇడికి ఇలాగే జరగాలి అది ఈడికి పడలేదని ఇంకా ఎవరు ఎవరికీ లైన్ వేయకూడదు ఆని ఎదవా ఆలోచన వీడిది..ఆని మనసులో అనుకుంటూ వెళ్తుండగా.....ఒక్కసారిగా నాకు పిచ్చ కోపం వచ్చింది ఆ గ్రీటింగులు చింపి ముక్కలు ముక్కలు చేసి , రోడ్డు మీద పారేసుకుంటూ వెళ్ళా....నా వెనక అందరు ఉన్నారు అన్న సంగతి నాకు తెలుసు కాని వాళ్ళ వంక చూసే ధైర్యం నాకు లేకపాయింది ఆ సమయం లో.....అలా ఆ రోజు అనుకోని , ఉహించని ఎదురుదెబ్బ తగిలింది, నాకేమి తెలుసు వెరిగిన నా మనసు ఇంకొంచెం సేపటిలో పగలబోతోందని.....
  
       అలా కోపంగా ఇంటికి వెళ్ళా ....ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో  అందరు అదోలా ఉన్నారు ....కొంపదీసి వీళ్ళకు కుడా తెలిసిపోయిందా ఆని మనసులో అనుకుంటుండగా......బక్కెట్టు చేతిలో పట్టుకుని మా నాన్న " రాజు " అన్నాడు .

"ఆ ఏంటి"

"నిమ్మకాయిల తోట ఆవిడ లేదు ఆవిడ చనిపోయింది రా "..

"అయితే నేనేమి చేయను?"

"వెళ్లి చూసిరా , మనకు కావలిసిన వాళ్ళు" ....

"పొతే పోనీ ...నేను వెళ్ళను."

"వెళ్ళవా" మా నాన్న కొసెను లాంటి కోపం తో అడిగాడు,

"నేను వెళ్ళను నాన్న..విసిగించకు "

"వెళ్ళు..నేను చెప్తున్నాను వెళ్లి చూసిరా...."

"ఎవరో పొతే ..నేను వెళ్ళడం ఏంటి ? అసలే నా మనసు ఏమి బాలేదు ఈ రోజు, అవిడేమైనా ఇందిరా గాంధి నా ..? దొంగ నిమ్మకాయలు అమ్మేది..డబ్బులకోసం రోడ్డు మీద పడిన కొబ్బరికాయలు కుడా ఎత్తుకెళ్ళి మా దొడ్లోయే అనేది అలాంటి ఆవిడ కోసమా నేను వెళ్ళేది? వెళ్ళనంటే వెళ్ళను' ఆని కరాఖండీగా చెప్పేసా..

"చనిపోయిన ఆవిడ గురించి అలా మాట్లాడతావేరా" ఆని మా నాన్న ఆ రోజు కు సరిపడా భోజనం పెట్టాడు...పోనీ అప్పుడైనా వదిలాడా అంటే... అదీ లేదు...రెండు కొవ్వత్తులు ఇచ్చి.. ఇవి ఆవిడా సవం దగ్గిర వెలిగించి రా లేకపోతె నీకు ఈ రోజు నా చేతిలో మూడిందే..ఆని హుంకరించాడు...అప్పుడు నాకొచ్చిన కోపానికి మా నాన్న వైపు చూడకుండా మా కొబ్బరి చెట్టు వైపు చూసా ...అది అప్పటినుండి ఇప్పటి వరకు కొబ్బరికాయలు కాయడం మానేసింది....

అసలే విరిగిన నా మనసు ఈ సంఘటనతో ముక్కలైపోయింది ....నా బాధ ఎవడు అర్ధం చేసుకుంటాడు ?? శవం దగ్గిరికి వెళ్లి ఎంత కోపం గా చుసానంటే ...ఇప్పటికి ఆవిడ ఆత్మ నన్ను క్షమించి ఉండదు...ఇంటికి రాగానే ...ఈ బట్టలు మనకు కలిసి రాలేదు ఆని విప్పి ఇంటి వెనకకు వెళ్లి చింపి పాతిపెట్టేసా ఆ ఖాకి ఫాంటు, తెల్ల చొక్కాని .....

ఆరోజు సాయంత్రం వరకు ప్రతీదానికి ఇంట్లో ప్రతి వోక్కళ్ళు తిట్టడమే..అన్ని తిక్కపనులు చేశా... సాయంత్రం పూటా అలా నడుచుకుంటూ సెంటర్ కి వెళ్తుంటే..పాల వెంకటేశ్వరరావు ఇంట్లో ఏదో సినిమా వస్తుంటే చూసా....అప్పట్లో తెలీదు గాని అది దేవదాసు..ఇంకేం మనం కుడా...................


VI వ భాగం త్వరలో ...........
      


4 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

WoW..what A expression!!!? ..Good.. baagaa vraastunnaru. Baagundi. maatala rachayita ayye soochanalu baagaa kanipistunnaayi. Keep it up.

PALERU చెప్పారు...

హిహిహి నాకు సిగ్గేస్తుంది వనజ గారు...మీరు అలా పోగుడేస్తుంటే...థాంక్స్

రసజ్ఞ చెప్పారు...

సిగ్గు పడే రాఫ్సన్ గారూ! సిగ్గు పడింది చాలు కాని కాస్త కళ్ళు తెరచి మొహం ఇటు తిప్పండి! ఏదైతేనేమి పొద్దున్న టిఫిన్ చేయలేదు అన్న బాధ మాత్రం తీరింది ....సంతోషం. ఈ రాజు పాత్ర మీదయితే నేను ఒక సాంగ్ ఊహించుకునేదానిని. గ్రీటింగులు ఇవ్వడం లో తప్పు లేదురా.... కాని ఈ సంభోదన ఏంటి ? డియర్ భవాని ఏంటి?అంటే ఇప్పుడు మాష్టారు బాధ డియర్ భవాని అని వ్రాసిన గ్రీటింగ్ కార్డు ఇచ్చినందుకా? లేక అలా సంబోధించినందుకా?

PALERU చెప్పారు...

రాజు పాత్ర ..నాదయితే .....ఆ సాంగ్ ఏంటో..!! ఏదో క్యురియసిటీ లెండి....:):మీకు వచ్చిన డౌట్ ...నాకు రాలేదేంటబ్బా...!!! అలా చూడకండి..!!!:):)అదే నేను సృష్టించిన రాజు పాత్ర కు రాలేదేంటా ...!!! థాంక్స్ అంది రసజ్ఞ గారు ఫర్ కామెంటు ....