10, డిసెంబర్ 2011, శనివారం

జీవితం.....స్త్రీ .....లక్ష్యం I

  రాజు ...ఎంత మంచి పేరు....పూర్వ కాలం లో ఈ పేరు వింటే జనాల జేజేలు ...మంది మర్భాలం తో ఊరేగింపులు .....మన హీరో పేరు రాజు నే ...ఒక జీవితం ...ఒక కల ...ఒక ఆశ ...ఒక లక్ష్యం .....ఒక ఆడది ...అందరు కలిసి రాజు ని ఏమి చేసారు? ఏమిజరిగింది వీడి జీవితం లో ?

                 అది ఒక పల్లెటూరు పల్లెటూరు లో ఉన్న ఏకైక ప్రేవేట్ స్కూల్ ప్రాంగణం....అక్కడ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు క్లాసులు నడుస్తున్నాయి...అందరు ఆడుకుంటున్నారు కాని ఒకడు మాత్రం ఒక అమ్మిని తదేకంగా చూస్తున్నాడు....ఎందుకో ఆ ఆమ్మాయిని చూస్తుంటే వీడికి ముచటగా ఉంది....తను ఆడుతుంటే వీడు ఆనంద పడుతున్నాడు ....తను గెంతుతుంటే ....వీడు చూస్తున్నాడు ....పుస్తకం తీసి తన పేరు రాసాడు  భ.. వా.. ని... ఎన్నో సార్లు తడిమి చూస్కున్నాడు ఆ పేరు ని...అప్పటికి దేశానికీ స్వతంత్రం వచ్చి కేవలం 50  సంవత్సరాలు మాత్రమె అయింది, వీడు అప్పటికి చదువుతున్నది 5  వ తరగతి వీడి పేరు రాజు....దీన్నే ప్రేమ అంటారని వాడి దోస్తు చెప్పాడు...అంటే ఇప్పుడు రాజు ప్రేమిస్తున్నాడు....తిప్పి తిప్పి కొడితే 10  సంవత్సరాల వయసు ...చదివేది 5  వ క్లాసు వీడికి ప్రేమ .....  మన ఖర్మ ....తప్పదు ఎం చేస్తాం కలికాలం....

         రాజు మధ్యతరగతి ఇంట్లో పుట్టిన 2  కూతుళ్ళు 2  కొడుకులలో మొదటి వాడు అందరిలో పెద్దవాడు ....వీడి తండ్రి ఒక చిన్న మెకానిక్ కొంచెం పొలం గట్రా ఉన్నాయ్...ప్రశాంతం గా సాగుతున్న జీవితం.ఆనందం గా భవాని ని ప్రేమిస్తూ.... ఎక్కాలు బట్టి పడుతూ......

వీడి క్లాసుమేట్ గోపాలం " ఏరా రాజు గా ఏంటి రా నీ పుస్తకం మీద భవాని పేరు రాసావ్ ? " రాజు " ఏమి లేదు రా ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం " 
"అంటే నువ్వు చిరంజీవి భవాని శ్రీదేవి నా "
"అవున్రా ఆ అమ్మాయి అంటే ఎందుకో ఇది "
అబ్బో ...ఒరేయ్ శ్రీను మన రాజు గాడు భవాని లవర్ అంటా "
"అరేయ్ అరవకు రా ఆ అమ్మాయి వింటుంది "
"ఓహో భయమా  ? ఒసిని ..బలేగుంది రా ...నీ పని ..."
సర్లే నిన్న చెప్పిన లెక్కలు చేసావేరా గోపాలం ?"
ఓ చేసాన్రా ! నువ్వో ? నీకేం లే నువ్వు లెక్కలు బాగా చేస్తావ్ గా చేసేసే ఉంటావ్ లే " 
లేదేహ ...నిన్నంతా గోలీలు ఆడుకున్న మర్చిపోయా..ఒక సారి నీ హోం వరకు బుక్కు ఇవ్వర ఎక్కిచేసుకుంటా ..."
ఎల్లెలెల్లరా....నేను ఇవ్వను నీ భవాని నే అడుగు పో " 
మచినీళ్ళ దగ్గరికి వెళ్తుంది వెళ్ళు ..అడిగి తీస్కో "
మంచినీళ్ళ దగ్గిరకు వెళ్లి రాజు గాడు భవాని తో 
"బన్ని " 
"ఏంటి "
"ఏమి లేదు.... నిన్న లెక్కలు చేయలేదు........... నీ పుస్తకం ఇవ్వా........ కొంచెం ఎక్కించు కుంటా "
"సర్లే "
"నువ్వు చాలా మంచి దానివి "
భవాని పుస్తకం ఇచ్చింది ..వీడు లెక్కలు ఎక్కించుకున్నాడు..పుస్తకం చివరన తన పేరు రాసి ఇచ్చాడు...

రాజు గాడు ఎప్పుడు స్కూలు ఫస్టు రాలేదు గాని ఎప్పుడు ఫెయిల్ కుడా కాలేదు బానే చదువుతాడు ...తెలివిగల వాడు అని వీళ్ళ టీచర్లు అంటుంటారు....కాని ఎందుకో కరస్పండేంట్ కి వీడంటే ఇష్టం లేదు. వీడికి ఎప్పుడు ఎంత బాగా పరిక్షలు రాసినా క్లాస్ థర్డ్ మాత్రమె వచ్చేది ...క్లాసు ఫస్టు కి క్లాస్ సెకండ్ కి మాత్రమె బహుమతులుఇచే వాళ్ళు వాళ్ళిద్దరూ గోపాలం , శ్రీను ....ఇంతకీ భవాని ఉరుఫ్ బన్ని అనబడు అమ్మాయి వీడు చదివే స్కూల్ కరస్పండేంట్ కి స్వయానా తమ్ముడి కూతురు ....వీళ్ళు అయిదవ తరగతి నుండి ఆరవ తరగతి లోకి వెళ్లారు....అది ఉరిలో ఉన్న పెద్ద స్కూల్ ZP  స్కూలు ...500 వందల మంది పిల్లలు 6  వ తరగతి నుండి 10  వ తరగతి వరకు క్లాసులు ....వీడు C సెక్షను...భవాని కూడా ...అప్పటిదాకా భవాని ఒక్కటే అందంగా ఉంది అనుకున్న వీడు అక్కడ కొత్తగా జాయిన్ అయిన ఎలిమెంటరి పిల్లలు వేరే ఉరి పిల్లల్ని చూసి కొంచెం ఆశ్చర్య పోయినా నాకు భవాని నే కావలి అనుకున్నాడు...కొత్త స్కూలు ..కొత్త మాస్టర్లు...ఇక్కడి మస్తార్లని పాత స్కూల్ మాస్తార్లతో పోల్చుకొని ఆనందపడేవాడు   వీడు ...
          ఇప్పుడు భవాని స్కూల్ కి వెళ్ళాలంటే వీడి ఇంటి మీదగానే వెళ్ళాలి ఇక చూసుకోండి స్కూల్ పది గంటలకు అయితే మనవడు మొఖానికి పవ్దార్ రాసుకుని వీడి ఇంటి ఎదురుగా ఉన్న అరుగు మీద కూర్చునే వాడు ఇక భవాని వచ్చే వరకు వెయిటింగ్ ...తర్తువాట భవాని వెనకాలే స్కూల్ వరకు ఫాలోఇంగ్.....అలా ఆరో క్లాస్స్ లో గడిపేస్తూ ఉండంగా మనవాడు హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది....ఒక రోజు యూనిట్ పరీక్షా పెట్టారు ...ఎవరికీ ఎక్కువ మార్కులు వస్తే వాడికి స్కూల్ అసెంబ్లీ లో డిక్షనరీ ఇస్తానని వీళ్ళ క్లాసు ఇంగ్లీష్ టీచర్ రాణి మేడం ప్రకటించారు...వీడేమో ఆ ( గోపాలం గాడికో లేకపొతే శ్రీను గాడికో లేకపోతె కొత్తగా వచ్చిన సతీష్ గాడికో వస్తుంది లే అనుకున్నాడు...పరిక్షలు రాసారు పేపర్లు ఇస్తున్నారు ....ఆశ్చర్యం అందరికంటే ఎక్కువగా వీడికి వచినై ఇంగ్లీష్ లో మార్కులు ....ఒక్కసారిగా స్కూల్ అందరి దృష్టి లో వీడు హీరో అయిపోయాడు...రాజు అంటే బాగా చదువుతాడు ...తెలివైన వాడు అని...వీడు బాగాచదవగలడు అని వీడికి కూడా అప్పుడే తెలిసింది....అలా వీడు భావాన్ని ని ప్రేమించుకుంటూ చదువుకుంటూ ..మచ్న్హోడు అనిపించికుంటూ ...6  7  8 క్లాసులు దాటేసాడు ....ఇప్పుడు రాజు 9 వ తరగతి ...ఇక్కడ ఒక అద్భుతం జరిగింది వీడి దోస్తు ఒకరోజు వీడని బందరు సినిమా కి తీసుకువెళ్ళాడు ..అదే వీడు తొలిసారి సినిమా హాలు కి వెళ్ళడం సినిమా చూడడం....చుసిన సినిమా కుడా " తొలిప్రేమ" అంతే !! మనోడు ఇంటికిరాగానే పవన్ కళ్యాణ్ వీడిలోకి దూరిపోయాడు ఆ సినిమా ప్రభావం తో భవాని పిచ్చ పిచ్చ గా ప్రేమించడం మొదలు పెట్టాడు ...అలా జరుగుతుండగా వీడి జీవితం లో ఒక పెద్ద సంఘటన......మొట్టమొదటి ఎదురుదెబ్బ ......

                                                                                                         (స శే సం )

ఈ కధ చదివిన వాళ్ళు కామెంట్ రాసి మీ అభిప్రయలు తెలియజేయగలరు...నేను ఇంకా బాగా రాయడానికి సహకరించగలరు .....




2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

అప్పటిదాకా భవాని ఒక్కటే అందంగా ఉంది అనుకున్న వీడు అక్కడ కొత్తగా జాయిన్ అయిన ఎలిమెంటరి పిల్లలు వేరే ఉరి పిల్లల్ని చూసి కొంచెం ఆశ్చర్య పోయినా నాకు భవాని నే కావలి అనుకున్నాడు...ఆహా ఏమి sincerity ? మీరు మాట్లాడితే బందరంటారు మీ ఊరు బందరా?

PALERU చెప్పారు...

రసజ్ఞ గారు, ధాంక్స్ ధాంక్స్ ధాంక్స్....
మా ఉరు బందరు కాదు, బందరు దగ్గిర ఒక చిన్న, అందమైన, కల్లా కపటం లేని,మంచి ఊరు .....