26, డిసెంబర్ 2011, సోమవారం

వీళ్ళు ముస్లిములు కారు.....వీళ్ళ మతం ఇస్లాం కాదు....


వీళ్ళు ముస్లిములు కారు.....వీళ్ళ మతం ఇస్లాం కాదు....  నేను ఈ టపా రాసి చాల మందికి దూరం అవుతానేమో అనిపిస్తుంది , కాని కొంత మందికి తెలియని నిజాలు  సమాజం లో ఒక వర్గం మీద ఉన్న అపోహలు తొలగించడానికి నాకు తప్పట్లేదు... ఎవరిని కించపరచడం గాని, లేక ఒక వారగా ప్రచార నిమిత్తం గాని ఈ టపా కాదు.. 

చెప్పోచేదేంటంటే ...ఏ మతం అయినా పక్కనోడిని హింసించి నువ్వు ఆనందించు..!! అని చెప్పదు....దానికి ఇస్లాం కుడా మినహాయింపు కాదు,  ఒకవేళ ఇస్లాం గనక అలా చెప్పిఉంటే ఒక ముస్లిం గా నేను తల దించుకుంటాను, కాని నా పరిశోధనలో నాకు అలా కనబడలేదు , అసలు వచ్చిన సమస్య ఏంటంటే కురాన్ లోని కొన్ని వాక్యాలను తీసుకుని ఇస్లాం లో ఉగ్రవాదం ఒక భాగం అనే భావాన్ని  సమాజం లో నాటడంలో అతివాదులు సఫలీకృతులయ్యారు, ఉదాహరణకు  కురాన్ లో ఒక చోట " మీకు ఎక్కడ యూదులు కనబడితే అక్కడ వారిని హత మార్చండి"  అని వుంటుంది, ఈ ఒక్క వాక్యమే గనక మనం చుస్తే...నిజంగా ఇస్లాం మీద దురభిప్రాయం గలగడం సహజం ఇలాంటి వాక్యాలనే అతివాదులు తమ పబ్బం గడుపుకోవటానికి, తమ అభిప్రాయాలు ఇతరుల మీద రుద్దడానికి, తమ కుయుక్తులు పండటానికి వాడుకున్నారు..ఒకవేళ నేను ఇస్లాం మతం బయట నుండి ఈ వాక్యం చుస్తే కచ్చితంగా... ఇస్లాం తీవ్రవాదాన్ని ప్రోత్సహించే మతం ,పరమత సహనం లేని మతం అని అపోహ పడతాను,  ఇక్కడే అతివాదులకి తమ కుయుక్త రాజ్య నిర్మాణానికి బీజం పడింది, అది పెరిగి పెద్దదై,  ఒక వర్గం ఈ రోజు ఎన్నో అసమానలతకు , అవమానాలకు గురయ్యింది ,ఆ వర్గ ప్రజల వైపు అనుమానపు చూపు పడడానికి దోహదం అయ్యింది. పైన ఉదహరించిన వాక్యం " " మీకు ఎక్కడ యూదులు కనబడితే అక్కడ వారిని హత మార్చండి" అన్న వాక్యం కురాన్ లో ఉన్నా మాట నిజమే, కాని దాని context ఏమిటి అనేది మాత్రం ఎవరు పట్టించుకోరు.
               ఇక్కడ విషయం ఏంటంటే ముస్లిములకు మరియు యూదులకు జరిగిన ఒక యుద్ద సందర్భములో వెలువడిన వాక్యమే ఆ వాక్యం, ముస్లిములతో ఒక ఒడంబడిక కుదుర్చుకొని దాన్ని ఉల్లఘించి యుద్ధానికి పాల్పడిన యూదులను ఉద్దేశించి ప్రేకోనబడిన వాక్యం ఇలా మొదలవుతుంది " యుద్ధ  రంగం లో  ఎక్కడ యౌడులు కనబడితే అక్కడ వారిని హతమార్చండి "  అతీవాదుల కుయుక్తులకు నేను హైలైట్ చేసిన పదాలు హైజాక్ కు గురై, ఎక్కడో అడవులలో దాగి ఉన్నాయ్  దాని వలన ఆ గ్రంధ ఉద్దేశం, ఆ వాక్య సారంశం, ఆ వర్గ జనులు మనో హత్య కు గురయ్యారు,  యుద్ధరంగం లో వెన్ను చూపక పోవడం కుడా అన్ని మత ధర్మాలలో కుడా ఒక భాగమే, యుద్ధరంగం లో వెన్ను చూపి పారిపోవడం అనేది ఆ దేశ, వర్గ, ప్రాంత, మత , విశ్వాసాల ను అవమాన పరచడం, నమ్మక పోవడం వలననే జరుగుతుంది అని విజ్ఞత ఉన్నా ఈ మనిషైనా చెప్పే మాటలే....ఇక్కడ యుద్ధ వాతావరణం  లో యూదులతో యుద్ధం జరుగుతుండగా యూదులను హతమార్చడం అనేది యుద్ధ ధర్మం మే కాని ద్వేషం కాదు .....ఒడంబడికను ఉల్లఘించటం అన్యాయం మరియు అధర్మం కాబట్టి ఇది ధర్మానికి - అధర్మానికి జరిగిన యుద్ధం గా పేర్కొనబడింది, అందుకే పవిత్ర యుద్ధం అనే పదం వాడబడింది దాని అరబిక్ పదమే ఈ "జీహాద్". అంటే జీహాద్ అంటే మన పైన అన్యాయంగా  దాడి చేసేవారి మీద ,అక్రమంగా మన మీద, మన వ్యవస్థ మీద దాడి చేసిన వారిమీద ప్రతిదాడి చేయడం.  
         ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను ...1920  లో అమెరికా మరియు రష్యన్ల మధ్య యుద్ధం జరిగింది అనుకుందాం, ఆ యుద్ధ సమయం లో అమెరికా ప్రెసిడెంట్ తమ సైన్యాన్ని ఉత్సాహ పరుస్తూ ,స్ఫూర్తి నింపే ఉపాన్యాసం లో "మీకు యుద్ధ రంగం లో ఎక్కడ రష్యన్ కనబడితే అక్కడ హతమార్చండి " అన్నారు అనుకుందాం..ఇక్కడ రెండు విషయాలు గమనించాలి, ఒకటి అమెరికన్ సైనికుడు రష్యన్ కనిపించగానే హతమార్చడం అనేది యుద్ధ  ధర్మ భాగమా కాదా? ఒకవేళ ఇతను హతమార్చకపోతే రష్యన్ ఇతనిని హత మారుస్తాడు కదా...ఒకవేళ అమెరికన్ కాని, రష్యన్ కాని యుద్ధరంగం లో తమ తమ శత్రువులను హత మార్చట్లేదు అంటే కారణం ఏమి ఉండొచ్చు? ఒకటి తమ తమ దేశం అంటే వీరికి ప్రేమ లేకపోవడం, తమ ప్రజలను కాపాడాలి అనే ధర్మం నిర్వర్తించక పోవడం, లేదా శత్రు దేశం మీద ఇష్టం ,(జాలి దయ అనే పదాలు అన్నిచోట్లా ఉపోయోగాపడినా యుద్ధరంగం లో వాటిని వాడలేము అనేది నిర్వివాదాంశం) ఇక రెండవ విషయం... ప్రస్తుతం అంటే  2011  లో అప్పటి మాటలు కొంచెం కుదించి " ఎక్కడ రష్యన్ కనబడితే అక్కడ హతమార్చండి" అని  అమెరికన్లను ద్వేషించడం అవమాన పరచడం మంచి పనేనా? విజ్ఞత గలిగిన వాళ్ళు చేసే పనేంటంటే " పరిశోధన"!!! అసలు ఈ వాక్యం ఎందుకు వాడబడింది? ఎప్పుడు వాడబడింది? ఏ పరిస్థితులలో ఈ వాక్య ప్రయోగం జరిగింది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం.. గుడ్డిగా నమ్మేసి ద్వేషించడం మూర్ఖత్వం అని నేను అనుకుంటాను.

అసలు ఒక దిన పత్రికలో వచ్చే విషయాలే సరిగా లేవు, వాడి మీద వీడు వీడి మీద వాడు రాసుకోవడం తరతరాల నుండి వస్తున్న ముర్ఖాచారమే ..ఎన్నో మతాల, సంప్రదాయాల, ఆచార వ్యవహారాల, నిలయం  అయిన అఖండ భారతావని లో ఒక వర్గం మీద మరొక వర్గం దాడి చేయడం కూడా మానవ సహజ నైజం...కాని విజ్ఞత ఉపయోగించక పోవడం వాటిల్ని నమ్మి గుడ్డిగా ఆచరించడం ఒక్క మూర్ఖరాజ్య ముఖ్యులకే సాధ్యం. ఏమంటారు? ఏ  మత దినపత్రిక అయినా గాని వేరే మతాన్ని ద్వేషిస్తూ, కించపరుస్తూ, సంపదికియాలు గాని కధనాలు గాని రాస్తుంది అంటే అది నా వరకు సహజం, ఎందుకంటే,,, అసూయా మనవ లక్షణం, తమ వర్గం మీద అభిమానం, తమది అందరికంటే గొప్ప వర్గం అభిప్రాయం...ఇవి సహజ గుణాలు ...కాని ఇలాంటివి చదివి నప్పుడు మనిషిలోనుంది వేరొకడు బయటకు వస్తాడు వాడు " మూర్ఖుడా" విజ్ఞుడా" అనేది ఆ వ్యక్తీ , అభిరుచి, అలవాట్లు , పెరిగిన వాతావరణం, ఆలోచన శక్తి లాంటి వాటి మీద ఉంటుంది.


                 మన చరిత్రలలోను ,మత చరిత్ర లోను యుద్ధాలు ఒక భాగామే!!! క్రుసేడులు కానివ్వండి, మహాభారత యుద్ధం కానివ్వండి, జీహాద్ కానివ్వండి, ఇవి అప్పటి పరిస్థితులను అనుసరించి జరిగిన యుద్ధాలే  గాని, వాటిని మత ధర్మాలను ముడి పెట్టడం సరికాదు. ప్రతీ మత చరిత్రల లోను రాజ్య పాలన జరిగింది. రాజ్యపాలన వేరు, మత ధర్మాలు వేరు,     అసలు ఈ జిహాద్ అనే పదం వ్యాప్తి లోకి రావడానికి మరియు తప్పుగా అర్ధం చేసుకోవటానికి ఆద్యుడు లాడెన్. ఎన్నో సంవత్సరాల నుండి ఈ పదం ఉన్నా గాని ఒక హంతకుడి చేతిలో పడి దీని అర్ధం పాడయ్యిపోయింది, అసలు జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అనే మనకు  తెలుసు, కాని ఒక ముస్లిం గా జిహాద్ రెండు రకాలు అని నాకు తెలుసు, ఒకటి జిహాద్ ఎ అక్బర్, రెండవది జిహాద్ ఎ అస్గర్, జిహాద్ ఎ అక్బర్ అంటే పెద్ద జీహాద్ అని  జిహాద్ ఎ అస్గర్ అంటే చిన్న జీహాద్ అని అర్ధం,  మనసు మీద చేసే యుద్ధం పెద్ద జీహాద్ , శత్రువుల మీద చేసే యుద్ధం చిన్న జీహాద్, మన మనసులో ఉండే  ద్వేషం, అసూయా ,కుట్ర, కుళ్ళు , వీటి మీద ఆధిక్యం పొందడమే అసలు జిహాద్..ఏది అర్ధం కాని కొంత మంది మూర్ఖులు ప్రస్తుతం చేస్తున్నది జిహాద్ ఏ అస్గర్ ....మొట్ట మొదట జిహాదే అక్బర్ మీద వీళ్ళు ఎంతవరకు విజయం సాధించారో నాకైతే తెలీదు.....అసలు జిహాద్ చేయడానికి కూడా ఇస్లాం లో కొన్ని నియమాలు ఉన్నాయి ...సత్రుదేసం లేదా శత్రువుల నుండి యుద్ధ ప్రకటన కావడం కూడా అందులో ఒక భాగం...ఇవేమీ లేకుండా దొంగ తనంగా దెబ్బతీయడం జిహాద్ కాజాలదు.... దీనిని  ఎంత మాత్రం ఇస్లాం ప్రోత్సహించదు,...ఇస్లాం పేరు  చెప్పుకుని ఈ పనికి పాల్పడిన వాళ్ళు , పాల్పడే వాళ్ళు ఎంత మాత్రము ముస్లిములు కాజాలరు..

        ఇస్లాం లో కొన్ని నియమాలు ఉన్నాయి అవి అతిక్రమిస్తే  ఆ వ్యక్తీ  ముస్లిం కాదు అని అవి ఉద్ఘాటిస్తాయి...ఇలా ఇస్లాం లో లేని వాటిని ఉన్నట్టుగా ఉహించుకుని ఆచరించడం కూడా అలాంటిదే...ఏక పాకిస్తాన్ విషయం కూడా కొంచెం ప్రస్తావించుకుందాం..వాళ్ళు ISI  కానివ్వండి , తాలిబాని కానివ్వండి, లష్కరే తయ్యిబా కానివ్వండి ఏ   ఉగ్రవాద సంస్థ అయినా కానివ్వండి ,అలాగే వాళ్లకు సపోర్ట్ గా పనిచేసే భారత దేశపు సంస్థ లైన " దీన్దార్ అంజుమన్ " "సిమి" వీళ్ళు చేసేది జిహాద్ కానే కాదు ఒక భుబాగం కోసం అది ఇతరులకు చెందినా దాని మీద అన్యాయంగా దాడి చేయడం, ఇప్పుడు.... భారతీయ ముస్లిములు లేదా అందరు భారతీయులు కలిసి  తమ దేశానికి చెందినా కాశ్మీర్ మీద దాడి కి తెగబడుతున్న పాకిస్తానీయుల మీద జిహాద్ ప్రకటించవచ్చు..ఇది సమ్మతమే ఇస్లాం లో ....

      నేను మనవి చేసేది ఒక్కటే ..గెడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకున్న ప్రతీవాడు ..ముస్లిము కాదు ..అలా అని తీవ్రవాది కాదు...రక్తపాతం సృష్టించే ఈ ముస్లిం కూడా ముస్లిం కాదు ఎందుకంటే కురాన్ ని నమ్మడం ఆచిరించడం ఇస్లాం పద్దతి అయితే అదే కురాన్ ఈ వాక్యం కూడా చెబ్తుంది " మీరు అన్యాయంగా ఒక మనిషిని చంపితే మొత్తం మానవాళిని చంపినట్లే.( ఒక మనిషిని చంపినా పాపం కాదు మొత్తం మనుషులను చంపినా పాపం చుట్టుకుంటుంది) " అని మరి ఆఫ్గనిస్తాన్ మీద దాడి చేసింది అమెరికన్ సైన్యం...WTC  లో పని చేసుకుంటున్న వాలు ఏ పాపం చేసారు ? నా భారత సోదరులైనా ముంభై వాసుల మీద ఈ పాప నెపం తో దాడి చేసారు? వాళ్ళు ముస్లిములు కాదు ముస్లిములు కాదు....మా మీద ఏదో అన్యాయం జరుగుతుంది అనుకుని మా రక్షణ కోసం దాడి చేస్తున్నాం అనుకునే ముర్ఖత్త్వపు పాకిస్తానీయులు తెలుసుకోవాలిసింది ఏంటంటే  ప్రపంచం మొత్తం మీద ముస్లిములు, ఒక ముస్లిం కాని వేరే వర్గ ఆధిక్యం లో ఉన్న దేశం లో తక్కువ జనాభా కలిగి కూడా ఎంతో సుఖం గా  ,హాయిగా , ప్రశాంతంగా..ఎక్కడైనా ఉన్నారు అంటే అది భారత దేశం లోనే.......అది మా దేశ సాంప్రదాయం..మరి అల్లర్లు ???? అనీ అసహనం గా మొఖం పెట్టె వాళ్ళను నేను అడిగే ప్రశ్న ఒక్కటే..." మీరు ఎప్పుడు మీ అన్నయ్యలతో గాని తమ్ముళ్ళతో గాని , అక్కలతో గాని , చ్ల్లెళ్ళతో గాని ,గొడవ పడలేదా  ???? మీరు కొట్టుకోలేదా???" సమాధానం సులభం, అనుసరణీయం కుడా  ....వాళ్ళు చేసే మూర్ఖపు పనుల వల్ల ప్రపంచం లో ఇస్లాం కి చెడ్డ పేరు..... భారదేసపు ముస్లిమలకు అవమానాలు..ఇదే వాళ్ళ విజయం .

           ఇంకొక్క విషయం ఏంటంటే ...ముస్లిములు వేరు భారతీయ ముస్లిములు వేరు,... మన సంప్రదాయం , పరమత సహనం , కలివిడి తనం , భిన్నత్వం లో ఏకత్వం ప్రపంచం లో   ఎక్కడా లేవు..వాటిని నరనరాన నింపుకున్న భారతీయ ముస్లిముల్ని పాకిస్తానియులతో పోల్చకండి..ఎందుకంటే మాకు ఈ నేలె  ముఖ్యం అని మేము ఇక్కడే ఆగిపోయాం, దేశమంతా అల్లర్లు రక్తపాతాలు జరుగుతున్నా మాకేమి తెలీ నట్లే కలిసి మెలసి ఉండి పోయాం కాని.............. కొంతమంది పాకిస్తానియులను తిడుతూ ...ముస్లిమల వంక ఓరకంటి తో  చూస్తుంటే ఉండే బాధ అందరికి అర్ధం కాదు...అందరు కలిసి భారత్ పాకిస్తాన్ క్రికటే ఆట చూస్తుంటే ..పాకిస్తానీ వికెట్ పడితే ముస్లిముల వంక గర్వంగా చూసే చూపు కలిగించే నొప్పి భరించలేము.....అవసరం ఉన్న లేక పోయినా "మేము భారతీయులమే" అని చెప్పుకు తిరాగాల్సిన దౌర్భాగ్యపు బ్రతుకు బాధ మీకు అర్ధం కాదు......ఎక్కడ  దాడి జరిగినా అందరు చూసే చూపు కంటే గునపం గుండెల్లో దించితే హాయి గా ఉంటుంది.... ప్రతీ ముస్లిం టెర్రరిస్టు కాదు ప్రతీ టెర్రరిస్టు ముస్లిం కాదు....మమ్మలిని వేరు చేసి చూసే చూపులు మమ్మలిని ఎంత బాధ పెడతాయో తెలుస్కున్తారనే గాని ....ఎవరిని ఉద్దేశించి మాత్రం నేను ఎప్పుడు రాయను..అర్ధం  చేసుకోగలరు .......




41 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Heart Touching.

PALERU చెప్పారు...

Thanks alot vanaja madam

Balu చెప్పారు...

జిహాద్ కు అసలైన అర్ధం ఏమిటో మీ టపా ద్వారా తెలుసుకున్నాను.

Balu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శిశిర చెప్పారు...

>>>>అందరు కలిసి భారత్ పాకిస్తాన్ క్రికటే ఆట చూస్తుంటే ..పాకిస్తానీ వికెట్ పడితే ముస్లిముల వంక గర్వంగా చూసే చూపు కలిగించే నొప్పి భరించలేము.....అవసరం ఉన్న లేక పోయినా "మేము భారతీయులమే" అని చెప్పుకు తిరాగాల్సిన దౌర్భాగ్యపు బ్రతుకు బాధ మీకు అర్ధం కాదు..

Touching!!! మీ ఫీలింగ్స్ ని బాగా వ్యక్తీకరించారు.

durgeswara చెప్పారు...

ముస్లిమ్ లు వేరు భారతీయముస్లిమ్ లువేరు .ఎందుకంటే భారతీయధర్మం అణువణువునా నిండిఉంటుంది మనలో అదిగుర్తించాలి ముందు. బాగాచెప్పారు ,అభినందనలు

రసజ్ఞ చెప్పారు...

ముస్లిం స్నేహితులే కాదు రాఖీ కట్టించుకున్న అన్నయ్యలు కూడా చాలా మంది ఉన్నారు నాకు! వాళ్ళు, మేము కలిసి ఎన్నో పండగలను జరుపుకున్నాం. మొత్తం మీద ఇందులో నన్ను బాగా ఆకర్షించిన విషయం ఏమిటంటే "పది మందికి మంచి జరుగుతుందంటే ఒక మనిషిని చంపేసినా పాపం లేదు కాని అనవసరంగా ఆకుని మొక్క నించి వేరు చేసినా ఘోర పాపం". ఇదే సారాంశం ఏ పవిత్ర గ్రంధాన్ని తీసుకున్నా మనకి చెప్తుంది. టచ్ చేశారండీ! టచ్లో ఉండండి;)

PALERU చెప్పారు...

బాలు గారు,
నా టపా ఉద్దేశం మీ కామెంట్ తో పూర్తయ్యింది...చాలా ఆనందం గా ఉంది...WE ARE ALL ONE ...INDIANS...

శిశిర గారు,
చాలా థాంక్స్ అండి....వచినందుకు కామెంటినందుకు ...

దుర్గేశ్వర గారు,
మీ లాంటి పెద్దలు ఉన్నంతవరకు మన భారతావని కి ధోకా లేదు...ధన్యవాదాలు

రసజ్ఞ MADAM

బాగున్నారా.....మనం ఎప్పటినుండో కలిసే ఉన్నాం అండి.... కొంత మంది అతివాదుల వల్లే ఒకరి వయిపు ఒకరు అనుమానంగా చూసుకొంటున్నాం ...ఆ అనుమానాలు తొలగిపోయినయ్యే అనుకోండి...ఒక్క పండగ రోజే ఏమిటి ప్రతీ రోజు భారతావనిలో పండగే .....థాంక్స్ ఫర్ కామెంట్....కచితంగా టచ్ లో ఉంటానండి....:): పెద్దల్ల ఆశిస్సులు కావాలి కదా..హహహః

sandeep చెప్పారు...

Jai Hind

Bro... good post..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"ఏ మతం అయినా పక్కనోడిని హింసించి నువ్వు ఆనందించు..!! అని చెప్పదు..."
చాలా మంచి విషయాలు చెప్పారండీ..

"అందరు కలిసి భారత్ పాకిస్తాన్ క్రికటే ఆట చూస్తుంటే ..పాకిస్తానీ వికెట్ పడితే ముస్లిముల వంక గర్వంగా చూసే చూపు కలిగించే నొప్పి భరించలేము....."

ఇది నిజంగా చాలా బాధ కలిగించే విషయం..
మీ మనసులోని బాధను,భావాలను బాగా వ్యక్తం చేశారు..

యశోదకృష్ణ చెప్పారు...

chaala baaga raasaru. nijamga muslim ante ento nenu choosanu. modata manam bharateeyulam anthe.

నవజీవన్ చెప్పారు...

మత చాందస వాదం మన దేశం లో వేల్లూనికుని పోయి వుంది.
అటువంటి సందర్భం లో అపోహలు, అజ్ఞానపు సంకేతాలు
మనుష్యులను చుట్టుకొని వారిని చెడు మార్గాల వైపు తీసుకొని వెళ్ళడం సహజమే
అయినప్పటికీ తీవ్ర వాద ఛాయలు గల భావజాలలే జనులవైపు వేగంగా వెళ్తున్నాయి.
మతగ్రంధాలలో మంచిని జనాలకు పంచే మంచి ఆదర్శప్రాయమైన భావజాలాలు
జనుల చెంతకు చేరకపోవడం మన దురదృష్టం.
మొన్నే మధ్య "భగవద్గీత" ను తీవ్రవాద గ్రంధం అని రష్యన్లు వాదించినట్లు
అదే అపోహ "ఖురాన్" కూడా అదే హింసాత్మకమైన భావజాలాన్ని ప్రేరేపిస్తునట్లు
భారతీయుల్లో చాల మంది అపోహ పడుతున్నారు.
ఇది మేధావులు మేల్కొనవలసిన సమయం.

Praveen Mandangi చెప్పారు...

అవిశ్వాసులని ముస్లింలుగా మార్చేంత వరకు జిహాద్ చెయ్యాలని ఇస్లాం మతం చెపుతోంది. అటువంటప్పుడు ఉగ్రవాదులు ముస్లింలు కాకుండా ఎలా పోతారు. Don't think that I am hindutva advocate. I am pure atheist.

PALERU చెప్పారు...

@sandeep
thanks a lot bro...

రాజి గారు...
మీలాంటి పెద్దలు, మీ చిన్ని ప్రపంచం లో నుండి నా గల్లిలో రావడం చాలా ఆనందం గా ఉంది...:):):) మీ కామెంటు కి చాలా ధన్యవాదాలు అండి....

గీతాయశస్వి గారు,
అంతే!!!!...:)):)....

చైతన్య దీపిక గారు....

మీరు చెప్పింది అక్షరాల నిజం....10 మంది ముందు ఒక కత్తి, ఒక గన్ను..పెడితే తొమ్మిది మంది గన్ను వైపు చూస్తారు ఒక్కడు మాత్రమె పెన్ను వైపు చూస్తాడు....అది మానవ సహజ నైజం...మత-గ్రంధాలలో మంచి చెడు అంటూ ఏది ఉండదు...ఉండేదంతా మంచే....... అర్ధం చేసుకోవడం రాక ..లేకపోతె...అదివాద భావాల వల్ల.....మంచిని కుడా చెడుగా వాడుకోవడం జరుగుతుంది...మత గ్రంధం ఏదైనా కానివ్వండి నాకు తెలిసి ద్వేషాన్ని పెంచదు....తీవ్రవాద భావాజాలాన్ని ప్రోత్సహించదు, అర్ధం చేసుకోవడం లో ఉంటుంది అని నా అభిప్రాయం ......మేధావులు అంతే ఎవరో నాకు తెలియదు..:):)

PALERU చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారు...

మీ లాంటి పెద్దల రాక
తెచింది నా బ్లాగుకు శోభ ...

//////అవిశ్వాసులని ముస్లింలుగా మార్చేంత వరకు జిహాద్ చెయ్యాలని ఇస్లాం మతం చెపుతోంది//////

ఒక ముస్లిం గా ఇస్లాం మతం ఇలా చెబుతుంది అని నాకు తెలియదు...నేనక్కడ వినలేదు, నాకెవరు చెప్పలేదు, నేనెక్కడ చదవలేదు.....మీ వాఖ్య కు source ఎక్కడో ???? మీరు ethiestaa సనాతన దార్మికులా, క్రైస్తావులా అనేది నాకు అనవసరం మీరు మనసున్న మనిషా?? కాదా?? అన్నదే నాకు ముఖ్యం...


/////అటువంటప్పుడు ఉగ్రవాదులు ముస్లింలు కాకుండా ఎలా పోతారు/////

పై వాక్యానికి source లేదు కాబట్టి ఈ వాక్యానికి అర్ధం లేదు..ఏమంటారు....????:)

Praveen Mandangi చెప్పారు...

మీరు ముస్లిం అని నాకు తెలియదు. కానీ నేను ఒక విషయం చెపుతాను. నేను ఖురాన్ తెలుగు అనువాదం చదివాను. ఇస్లాం మతం క్రైస్తవ మతాన్ని & యూదు మతాన్ని మాత్రమే ఇతర మతాలుగా పరిగణిస్తుంది. విగ్రహారాధకులు ఇస్లాం దృష్టిలో అవిశ్వాసులతో సమానమే. ఖురాన్-ఎ-మజీద్ తెలుగు అనువాదంలో చదివిన విషయమే ఇది కానీ నా సొంత అభిప్రాయం కాదు.

Disp Name చెప్పారు...

మొత్తం మీద భాస్కరునికి (రాఫ్సన్) ఒక దివిటీ చూపించారన్న మాట. మిగిలిన అగ్ని కణాలు ఎప్పుడు వస్తాయి ?

చీర్స్
జిలేబి.

PALERU చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారు...

మీరు చదివిన అనువాదం లో మేరు చెప్పిన వాక్యం ఎక్కడ ఉందొ ఉదాహరించగలరు...ఎందుకంటే సరైన రుజువులు లేకపోతె ఎ విషయం కూడా చర్చ కు సాధ్యం కాదు.... ఎందుకంటే చదవడం వేరు అర్ధం చేసుకొంటూ చదవడం వేరు.....తప్పులు తెలుసుకోవాలి అని చదివితే మనకు తప్పులే దొరుకుతాయి .... అందునా ఒప్పులు కుడా తప్పులుగా అర్ధం అవుతాయి

విశ్వాసి...అవిశ్వాసి...దీని అర్ధాలు తెలుసుకోవడం చాల ముఖ్యం మన చర్చ కోసం

విశ్వాసి = విశ్వసించే వాడు
అవిశ్వాసి = విశ్వసించని వాడు....

ఎ విషయం అయిన మీరు విశ్వసిస్తున్నారు అంటే మీరు ' విశ్వాసి" మీరు విశ్వసించటం లేదు అంటే " అవిశ్వాసి" ..
ఇక్కడ విషయం మతం కాబట్టి, మతానికి మూలం దైవం కాబాట్టి, దైవాన్ని విశ్వసించే వాళ్ళందరూ " విశ్వసులే" కదా....సనాతన ధర్మం లో పూజించే విధానం వేరు అంతే గాని వాళ్ళు అవిశ్వాసులు కారు....

PALERU చెప్పారు...

జిలేబి గారు,

మీరు సూపరండి....ఎ విషయం అయినా అర్ధం కాకుండా బలే చెప్పేస్తారు...ధాంక్స్...:):)

Praveen Mandangi చెప్పారు...

I am reading Kuran again. I will reply later about those verses I have read in Kuran. FYI, read this link: https://plus.google.com/111113261980146074416/posts/8eDYzveEH2Z

Praveen Mandangi చెప్పారు...

Reading Surah-e-bakra
>>>>>
113. నస్రానీలు ఏ మార్గమందును లేరని యూదులు చెప్పుదురు. యూదులు ఏ మార్గమందును లేరని నస్రానీలు అందురు. వారందరు గ్రంథములను పఠించుచునే యున్నారు. వారు పలుకుతున్నట్టు మూఢులు కూడ పలికిరి. కావున దేవుడు వారు కలహించు దాని గురించి తీర్పు దినమునందు తీర్పు చెప్పును.
>>>>>
Though Islam considers Christianity and Judaism as religions, they order Christians and Jews to obey the Islamic law. These verses were translated by Muhammad Abdul Gafur of Kurnool.

Praveen Mandangi చెప్పారు...

And also read verses 120 and 135 of Surah-e-Bakra.

PALERU చెప్పారు...

Mr. sharma, please allow me to reply you

PALERU చెప్పారు...

please allow some time i mean....

Praveen Mandangi చెప్పారు...

Remember that Jews, Christians and Muslims believe the same god but different prophets. Jews do not agree the New Testament of Bible and do not consider the prophets of New Testament as their prophets. Muslims consider Jesus as second prophet after Muhammad but they do not consider him as god. Muslims do not even celebrate Christmas though they consider Jesus as a prophet. There are many more differences between these three Abrahamic religions.

PALERU చెప్పారు...

హాయ్ ప్రవీణ్ గారు...

letz first discuss on your first comment......you said " Islam is encouraging terrorism "and i started discussion on that....but you shifted to "Islam is not recognizing Hinduism as religion" again i tried to feed you with correct information , still now you migrated to " comparison b/w Christianity , Judaism and Islam" ..

I request you to please stick to one topic so that we can come to conclusion, i suggest you to read this book first and then start discussion http://www.islamawareness.net/Islam/misconcep.html


I promise you i will definitely discuss with you and try to present my point of view on your topics...

Praveen Mandangi చెప్పారు...

I have read http://www.islamawareness.net website. There are many vital questions such as what happened to Jews in Medina etc.

Praveen Mandangi చెప్పారు...

I replies so because the author himself said that Islam was not spread by sword.

Praveen Mandangi చెప్పారు...

I replied so because the author himself said that Islam was not spread by sword.

Praveen Mandangi చెప్పారు...

Don't think that I am Hindutva advocate by reading these replies. I know that Hinduism is not an organised faith and Hindus are more inclined towards individualism than religion or caste. Islam entered south India through Arab traders who had trade links with Kerala. Islam was introduced in Pakistan (north-west India) by Umayyad Caliphate who believed the swords.

PALERU చెప్పారు...

praveen sharma..

I hearty appreciate you on the knowledge you have but the thing is you have some misconceptions..i will defiantly help you if you raise some questions...i too believe that Islam is not spread by sword...if so for sake of example Hyderabad consistency was ruled by Muslims but still it is allowed to practice other religions.. Else all the people might converted into islam..isn't it??

I don't comment on other religions..coz i am an Indian I have highest tolerance power than any other nationality..

PALERU చెప్పారు...

Actually, the religion of GOD is having a chain of Prophets (Peace be them on all). Those who believe from Adam (our father) till Moses (Peace be on Him) are Jews and they rejected Jesus (Peace be on Him).
And those who believe from Adam (our father) till Jesus (Peace be on Him) are Christians.
And those who believe form Adam (our father) along with Moses (Peace be on Him) + Jesus (Peace be on Him) till Muhammad (Peace be on Him) are considered as Muslims.

There is no difference in between them … refer to what the Holy Quran says to Muslims to confirm their faith as :

The Messenger believeth in what hath been revealed to him from his Lord, as do the men of faith. Each one (of them) believeth in Allah, His angels, His books, and His Messengers "We make no distinction between one and another of His Messengers." And they say: "We hear and we obey; (We seek) Thy forgiveness, Our Lord, and to Thee is the end of all journeys." (2:285)

Also note that We Muslims do not celebrate any birthdays for any prophet. It is not PERMITTED in islam.

Praveen Mandangi చెప్పారు...

Muslims living in Hyderabad are descendants of migrants from North India. They are not scions of converted locals. Any way, I didn't say that forced conversions happened in South India.

Nrahamthulla చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Nrahamthulla చెప్పారు...

తెలుగు వికీపీడియాలో నా స్పందనలు
*పూర్వం ఎవరో పెంటతిన్నదృశ్యాలు ఇప్పటికీ గుర్తుచేసేకంటే మనప్రజలు శాంతిసామరస్యాలకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది.అన్ని మతాలవాళ్ళూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారే. కానీ ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే.పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు.ఏది ఏమిటో తెలుసుకున్నాక నేను ఆస్తిక హేతువాది ని మానవవాది ని అయ్యాను.నామకార్ధంగా ముస్లిముల పేర్లుపెట్టుకుని శాంతియుత జీవనం గడుపుతున్న నాలాంటి వారు ఈ దేశంలో కోట్లాదిమంది ఉన్నారు.మానినపుండు మళ్ళీ సెలపోసేలా చేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదంలో భాగస్తులే.ఒకవేళ అంతగా అకృత్యాలు చేసే ఇస్లామ్ మతాన్ని వద్దనుకొని ఈనాటి ముస్లిములు బయటకు రాదలుచుకున్నా హిందూ మతంలో మాత్రం చేరే చట్టపరమైన అవకాశం లేదు.అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి.కౌరవ సంతతినైనాసరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది.ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్న ఈనాటి వారసుల్ని నిందలువేసి అవమానిస్తే అది మోక్షసిద్ధినిస్తుందా?హింసకు జవాబు హింసేనా? అహింసకాదా?ఎవరు తప్పుచేస్తే వారినే శిక్షించాలి.5 డిసెంబర్ 2008

*నరమాంసభక్షకుడికి మతం ఏమిటి?నరమాంసభక్షణ చెయ్యమని ఇస్లాం చెప్పిందా? ఇస్లాం చెప్పిన ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని పెడచెవిన పెట్టి సౌదీ అరేబియాలో రాచరికపాలన కొనసాగిస్తున్నారు.15 డిసెంబర్ 2008

*ప్రజాస్వామ్యం విషయాల్లో ఇస్లాం చెప్పిందానికి భిన్నంగా వ్యవహరించేవాళ్ళది తప్పు కానీ ఇస్లాంది తప్పు కాదు.మేధస్సును మేధస్సుతో ఎదుర్కోవాలి కానీ హింసకు తెగబడ కూడదు తెలివిగా జవాబివ్వాలి కానీ తిట్లకు వ్యక్తిగత విమర్శలకూ దిగకూడదు.15 డిసెంబర్ 2008

*ప్రజాస్వామ్యం లేని ఏఒక్క ఇస్లామిక్ దేశాన్నీ సమర్దించకండి..ప్రజాస్వామ్యాన్ని ప్రబోధిస్తూనే ఉండండి.16 డిసెంబర్ 2008
*నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే. పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు.ఒక మతస్తులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆమత వారసులందరూ నేరస్తులైనట్లు వారు చేయని నేరానికి వారిని అపరాధభావనకు గురిచెయ్యటం అవమానించటం కూడా అకృత్యమే. ముస్లిముల పేర్లుపెట్టుకుని శాంతియుత జీవనం గడిపే వారికి వారి పూర్వీకుల అకృత్యాలను పదేపదే గుర్తుచేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే. అశుద్ధం అశుద్ధమే.దాన్ని అందరికీ చూపించటం అనర్ధదాయకం.22 మే 2009

*అన్ని మతాలలో హింస ఉంది.మత గ్రంధాల్లోని హంతక ఆధ్యాయాలను వదిలి మంచిని మానవత్వాన్ని బోధించే లేఖనాలను స్వీకరించాలి.22 మే 2009

*ఎవరు ఎవరిమీద చేసినా అకృత్యం అకృత్యమే.అకృత్యాలు వద్దు.మానవత్వమే ముద్దు-- 29 జూన్ 2009

*ఈ దేశంలో పుట్టటమే ఏ మతస్థుడికైనా ఎన్నోజన్మల పుణ్యఫలం అంటారు కదా?.తీవ్రవాది ఏ మతాన్నీ అనుసరించలేని అరాచకవాది.నరహంతకులు,సాటిమనిషిని ప్రశాంతంగా బ్రతకకుండా చేసేవాళ్ళు ఏ మతంలో ఉన్నా వారిని కఠినంగా అణిచివేయాలి.7 ఏప్రిల్ 2010

Nrahamthulla చెప్పారు...

ముస్లిం ఉగ్రవాదం,హిందూ ఉగ్రవాదం,క్రైస్తవ ఉగ్రవాదం లాంటి శీర్షికలు అనవసరం.నమాజు చేసుకొని ప్రశాంతంగా బతికే సాధారణ సాయిబుకి తీవ్రవాదులతో ఏమీ సంబంధం ఉండదు.తీవ్రవాదులను ఎదుర్కోవటానికి ఎంతో దైర్యం కావాలి, ముస్లిముల్లోని నా లాంటి కోట్లాది సౌమ్యులు శాంతికాముకులు దౌర్జన్యం చేయలేరు.ఉగ్రవాదుల అధర్మాన్ని ఎదిరించలేరు.అప్పుడే పుట్టిన బిడ్డకు కులం,మతం గురించి తెలియదు కాని కాలక్రమేణా దాని గురించి తెలుపుతాము.ఉగ్రవాదమే హంతకుల ప్రత్యేక మతం.వారు ఎవరు చెప్పినా వినరు.కత్తి తీసుకొని వీరంగం వేసే వాడి ముందుకు కత్తి పట్టలేని మీరు వెళ్ళగలరా? కత్తిపట్టే వాడికి తుపాకి పట్టే పోలీసులు,సైనికులే సరైన జవాబు.అందుకని ఆ మతం ఈమతం అని చూడకుండా దొరికిన తీవ్రవాదిని దొరికినట్లు జైల్లో తొయ్యడమే సరైన మార్గం.

అజ్ఞాత చెప్పారు...

aapandra sodi . allah nu nammani vadu kafir kafir ante aviswasi islam ki shathruvu. sathruvunu champamani islam chepthundi. meru entha venakesukochina idi dagadu jaruguthu undi

అజ్ఞాత చెప్పారు...

hazan ki ardham enti babu allah tappa migatha devude ledane kada. khuran allah tappa vere devudu ledu migathavanni deyyalu ivega islam

అజ్ఞాత చెప్పారు...

o hindu lara merintha pichollani anukoledu thu. oka pakka allah okkade devudani gullu gopuralu koolchadam meeku thelyada? cha ilanti commets chusthunte mana meda manake virakthi kalguthundi. bible kuran okate cheptai yesu allah okkade devudu. migilinavi deyyalu moorkhulu. ala cheppukune varu manatho ela kalsi untaru.?

అజ్ఞాత చెప్పారు...

jehada asalu ardham aviswasulni champatam. manava jathini andarni allah vipuku tippadam. rani varini nariki champadam ra erri babullara.

narasimha rao yaddanapudi చెప్పారు...

My Dear Hindus,

How he clarifying about Jihad.

as per him we cant blame Islam , if Muslims killing innocent people in the name of jihad .

that means we cant prevent action against Muslims of Islam terror
and think
Islam terror means not only with gun with propaganda like this blogger
be careful

Note: India means every one can live freely include Jews but not for terrorists