10, డిసెంబర్ 2011, శనివారం

జీవితం......స్త్రీ ....లక్ష్యం II

PART  II

కోలుకోలేని ఎదురుదెబ్బ ....రాజు గాడికి వీడి పుట్టిన రోజు ఎప్పుడో తెలీదు కాని భవాని పుట్టినరోజు మాత్రం తెలుసు ...అందుకే తగిలింది వీడికి ఎదురుదెబ్బ ....అసేలంజరిగిందంటే ...వీడు వీడి సహా విద్యార్ధులు అయిన వెంకటేశ్వర్రావు , దామోదరం  అరుణ ,స్వాతి ,మహేశ్వరి, భవాని,నీలిమ, లత , కలిసి దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించే హిందీ పరిక్షలు రాద్దాం అని హిందీ మాస్టర్ దగ్గరికి వెళ్లారు ..ఆయన అందుకు ఒప్పుకుని ప్రతి ఆదివారం తన ఇంట్లో ప్రివాతే చెప్తాను అని ఫీజు కట్టించాడు...సో ప్రతీ ఆదివారం భావాన్ని ని కలవదనికైనా ఇష్టం లేకపోయినా ప్రైవేట్ కి వెళ్ళేవాడు రాజు... హిందీ మాస్టారు ప్రైవేట్ మొదలు పెట్టేలోపు వీళ్ళందరూ కలిసి ఏదో ఒక ఆట ఆడుకునేవారు...అలా కొంచెం భావానికి దగ్గిర కాగలిగాడు మన హీరో ...ఈలోపు వీడి ప్రేమకధ మిగత వాళ్ళు కూడా కనిపెట్టేశారు..వీడికి భావాన్ని అంటే ప్రాణం అని ...వీడు కూడా ఒక ప్రేమ కదా కనుక్కున్నాడు లత , దామోదారాన్ని ఇష్టపడుతుంది అని ....తను వాడికి చెప్పలేదు వీడు చెప్పలేదు సో లత వీడు దగ్గిరయ్యారు ఒకరి బాధలు ఇంకొకరికి చెప్పుకుందామని ....ఈలోపు రాజు గాడు ఒక మహత్తర ప్లాన్ వేసాడు ..త్వరలో భవాని పుట్టిన రోజు ...ఆ రోజు తనకి గ్రీటింగ్స్ పంపిస్తే బాగుండు అనుకున్నాడు ...కాని ఎలా ఇవ్వాలి ? వీడికేమి అర్ధం కావట్లేదు ...రోజు పొలం గట్టు మీద కూర్చుని ఆలోచించే వాడు....ఎలా ఎలా ఎలా ఇవ్వాలి అని ....ఇంతలో వీడికి ఒక మహత్తర ఆలోచన ఒకటి వచ్చింది ...లత చేత్తో ఇప్పిస్తే ? అంటే లేచి డైరెక్ట్ గా లత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు లత ను కలిసి "లత నేను నీ గురించి ఒకటి ఆలోచించా" అన్నాడు
"ఏంటది రాజు "
"ఏమి లేదు నువ్వు ఎలాగు చెప్పలేక పోతున్నవ్ కదా దాము గాడికి వాడు కూడా మొద్దు మొహంగాడు కనుక్కో లేకపోతున్నాడు అందుకే నేను చెబ్దాం అనుకుంటున్నా ...ఏమంటావ్"
"దాము గాడు ఏంటి ? మొద్దు మొహం ఏంటి ? సరిగా మాట్లడలేవా? "
"ఒహో !! సారి లే తల్లి ఏదో హెల్ప్ చేదాం అని వస్తే నన్నే కోప్పడతావే?"
"అది కాదు ఎంతైనా నా వాడు కదా "
ఆఆ  నీవాడు !! రేపు మీ ఇంట్లో గాని వాడి ఇంట్లో గాని తెలిస్తే డిప్పలు పగిలిపోతాయి ఇద్దరివిని. అయినా నా అంత  ధైర్యం గా వీల్లెక్కడ ప్రేమించగలరు అని స్వగతం లో అనుకోని . "సరేలే  ఇంతకీ ఏమంటావ్? చెప్పెయనా?"
"చెప్తావా? ఏమంటాడో ? అసలు వాడికి వాడు కనుక్కోవాలి కదా రాజు ? ఏంటో అన్ని కష్టాలు నాకే, నువ్వు నిజంగా చెప్తే బందరు నుండి 5 స్టార్ చాక్లేట్ తెప్పించి ఇస్తా నీకు "
"సరేలే ఇద్డుగాని ఎప్పుడు చెప్పను ? "
"ఎప్పుడు అంటే !! ఓ పని చేయి ...మనం వచ్చే వారం పరిక్షలు రాయడానికి బందరు జార్జి కారనేషణ్ స్కూలు కి వెళ్తాం కదా ...ఆరోజు బస్సులో చెప్పు ...సరేనా ? "
"సరేలే ...నేను వెళ్తున్న " అని చెప్పి ఇప్పుడు దీన్ని భవాని కి గ్రీటింగ్ కార్డ్ ఇమ్మంటే బాగుండదు ఇంకా రెండు రోజుల టైం ఉంది కదా ఈ లోపు మెల్లగా చెప్పోచ్చులే  అని ఇంటికి బయలు దేరాడు రాజు.

గ్రీటింగ్ కార్డ్స్ కి డబ్బులు కావాలి ఎలా ? ఒక్కోటి 5  రూపాయలు అంటా..కనీసం రెండు ఇవ్వాలి అంటే పది రూపాయలు కావాలి " ఎలా ? ఊఊ ...అయిడియా ...నాన్నగారి వల్లేట్ ఉందిగా ..ఈ రోజు దొంగతనం జరగాలి మా ఇంట్లో ...ఫస్ట్ నేను బాగా నీళ్ళు తాగి నిద్రపోవాలి ..ఎందుకంటే బాగా నీళ్ళు తాగితే అర్ధరాత్రి ఒంటెలు వస్తుంది అప్పుడు అందరు పడుకొని ఉంటారు ఈ లోపు దొంగతనం జరిగి పోవాలి ....ఏది మన ప్లాను
            సమయం అర్ధరాత్రి ....లేచాను...ఒంటెలు కి వెళ్ళాను నిద్ర మత్తులోనే అలానే వచ్చి పడుకున్నా...ఇంకేముంది ...తెల్లారింది ...ప్లాను ఫ్లోప్ అయింది ....ఛా...లేచిన వాడిని కాసేపు మేలుకొంటే బాగుండేది...రేపే భవాని పుట్టిన రోజు ...ఈ రోజు ఎలాగైనా కార్డులు కొని దాని మీద అందంగా తన పేరు చేక్కలి ఎవరు చూడకుండా ఎలా? ఎలా ?  ఆ ...FANCY  షాప్ అంకుల్ దగ్గరికి వెళ్లి ఆయన వీక్నేస్స్ మీద దేబ్బకోడదాం...ఆయనకీ వాళ్ళ అబ్బాయి అంటే చాలా ఇష్టం....వాడి గురించి కొంచెం డప్పు కొట్టి రెండు కార్డులు అప్పుగా కొట్టుకు వచ్చేయాలి....కాసేపాగి వెళ్దాం అనుకుని రెడీ అయ్యి స్నానం చేసి స్కూల్ కి అని బయలు దేరాను ..

కాని స్కూల్ కి వెళ్ళలేదు అంకుల్ షాప్ కి వెళ్ళాను..
"హలో అంకుల్ "
"ఏమ్వోయ్ రాజు ఏంటి ఎలా వచ్హావ్?
"ఏముందండి బాబు మీ లాంటి పెద్దోల్లని అప్పుడప్పుడు కలుస్తూ ఉండమని చెప్పాడు మా నాన్న "
"హ హ హ బలే చెప్తావ్ రా జోకులు "
"జోకులు కాదండి ..నిజం ..మొన్న మీ అబ్బాయి చరణ్ లేదు తనకి IIT  లో సీటు వచ్చింది కదా అది ఎవరో చెప్పుకుంటుంటే విని చెప్పాడు..ఆ అంకుల్ ని కలుస్తూ ఉండరా మంచి సలహాలు ఇస్తాడు అని .."
"అవునా"
"అవునండి బాబు నేను అన్నా... నాకు మంచి ఫ్రెండు ఆయన అని... "
"అంతే కదరా మనం దాదాపుగా సంవత్సరం నుంచి కలుస్తున్నాం మంచి చెడు మాట్లాడు కుంటాం ఏవో నాకు తెలిసిన రెండు సలహాలు చెప్తాను నువ్వు సరదాగా వింటావు...నువ్వు ఎప్పటికి అయినా చాలా పైకి వస్తావ్ రా ఇంకా ఏమన్నాడు రా మీ నాన్న చరణ్ గురించి"
అసలు అలాంటి అబ్బాయి మన వుల్లో ఉండడం మన వురి అదృష్టం ...రేపు భవిష్యత్తులో అతని వాళ్ళ మన ఉరికి మంచి పేరు వస్తుంది....నువ్వు కూడా తన లాగే చదవాలి అన్నాడు "
"అసలు మా అబ్బాయి అని కాదు గాని రా రాజు..వాడి పద్దతి నాకు చాలా బాగా నచుతుంది ..పొద్దునే లేచి చదువుకోవడం టైం కి తినడం టైం కి పడుకోవడం ..ఎక్కడో చదివాను రా అబ్దుల్ కలం ఆజాద్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు లే అయన కూడా ఇలాగే చేసేవాదంతా చిన్నప్పుడు ..."
"అవునండి మన చరణ్ ని ఆయనేంటి ..నేను కూడా ఫాల్లో కావాలి అప్పుడే బాగా చదువుకొని మంచి వాడిని అనిపించు కొంటాను ..."
ఆ ఆ అంతే అంతే ...మొన్న ఏమి జరిగిందో తెలుసా నేను సమానులు కొందామని చల్లపల్లి వెళ్ళాను ...పున్నం రాజు లేడు..! అదేరా SUNFLOWER  కాలేజి అతను..నన్ను పిలిచి కూర్చో బెట్టి ఎంత మర్యాద చేసాడు అనుకున్నావ్ ?
ఎందుకండీ ? ఆయన కూడా ఏమైనా FANCY  షాప్ పెడుతున్నడా ...
నీ తలకాయా రా ...ఆయన FANCY షాప్ పెట్టడం ఏంటి ? అందుకే మీరు మా చరణ్ వేరు వేరు అంటాను నేను ..ఆయన  చరణ్ చదివిన కాలేజి ప్రిన్సిపాలు ...అసలు చరణ్ ఎలా ఉన్నాడు ..ఎంత మంచి స్టుడెంటు తను ..అలాంటి స్టూడెంట్ ని  నేను అసలు చూడలేదు ..ఏదో ఒకరోజు మీకు మంచి పేరు తెస్తాడు అని తెగ చేప్పాడ్రా చరణ్ గురించి .."
"అసలు ఆయనెంటండి....ఆ కాలేజి లో స్వీపరు కూడా అదే అంటాడు ఎందుకంటే చరణ్ అలాంటోడు..ఎంత మంచి గుణాలు ....అసలు మీ అబ్బాయి లాగా అవ్వాలంటే ఎం చేయాలి అంకుల్?
"హ హ ఏముందిరా ఆ గుణాలు అందరికి రావురా ...పుట్టుకతో వచినై ఆడికి....."
"అవునా..!! అయ్యో చరణ్ మాటల్లో పది స్కూల్ టైం మర్చిపోయాను ...పోనిలెండి ఎప్పుడు చెప్పే పాఠాలు...చరణ్ గురించి తెలుసుకున్న కొంచెం అయినా ....తనలా ఉండాలి అంకుల్ ప్రతి స్టుడెంటు ....ఉంటాను అంకుల్ "
"సరే రా బాగా చదువు ...మీ నాన్న చాలా మంచి అతను నువ్వు బాగా చదివి ఆయన్ను సుఖపెట్టాలి రా ....."
"సరే అంకుల్ ఉంటాను...అని మెట్లు దిగుతూ అప్పుడే చూసిన వాడిలా " అంకుల్ ఈ గ్రీటింగ్ బలేగుంది ఎంత "
"అదా అందరికి 5  రుపాయల్రా నీకైతే నాలుగు రుపాయిలే ..."
"ఏది ఒకసారి చూపించండి ఒక ఫ్రెండ్ పుట్టినరోజు ఉంది వాడికి ఇద్దాం "
"ఇదిగో ఇది చూడు ...ఇంకో మోడల్ ఉంది చూడు ....ఆ కట్ట లో నుండి తీసి ఇప్పుడే బయట పెట్టా ...ఇది బ్రహ్మాండం రా తీసుకో "..
"నాకు ఈ రొండు కావాలి అంకుల్ "
"తీసుకో రా "
"చరణ్ మీద అభిమానం తో మీరంటే నాకు ఎక్కడ లేని గోరవం ..చరణ్ ని అడిగానని చెప్పండి ...సరే ఇటివ్వండి ..అయ్యో డబ్బులు పట్రాలేదు అనుకుంటా ...సాయంత్రం తీసుకెల్తా లెండి "
"సరే లేరా"
ఇయనేంటి సరేలే అంటాడు పట్టుకేల్లరా ఇవ్వోచులే అనడే..! అనుకుని " ఆ అలా కాదు ఇప్పుడివ్వండి సాయంత్రం డబ్బులు ఇస్తా ...అన్నట్టు చెప్పడం మరిచా చరణ్ వస్తే నాన్నగారు కుడా అడిగానని చెప్పమన్నారు ..
"సరేలే... ఇంద పట్టుకెల్లు "
"థాంక్స్ అంకుల్ సాయంత్రం కలుస్తాను ..ఉంటాను .." వీడి బొందా...ఇంకో వారం ఇటు వస్తే అడుగు ....ఎప్పుడు ఇంట్లో దొంగతనం జైగితే అప్పుడే నీకు డబ్బులు ..సొల్లు డబ్బా మొహం గా అనుకుని బయలు దేరా స్కూల్ కి ...
                        **************************************************
   స్కూలు కి వెళ్ళానా...అలా వచ్హాడు...దాము గాడు ...."ఏంట్రా లేట్ గా వచ్హావ్"
ఏమి లేదురా ...FACNY అంకుల్ దగ్గరికి వెళ్ళా ..
"వాడి దగ్గిరికా ఎందుకురా నాయనా సొల్లు డబ్బా గాడు ..
"మా పనులు మాకు ఉంటాయిరా..."
"సర్లే మేడం వస్తుంది తెలుగు టెక్ష్టు తీ "
"సరేలే"
                   *********************************************************
ప్రస్తుతానికి ...ఇంతే ....మాళ్లి కంటిన్యూ చేద్దాం త్వరలో ...మీ అభిప్రాయాలూ రాయండి ...ఒక కాబోయే రచయిత ని ఉత్సాహ పరచండి .... సినిమా కధలు కూడా రాసే ఆలోచన ఉంది కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ సినిమా లో ఏదో ఒక పాత్ర ఇప్పిస్తా  కావాలంటే .....తరువాత మీ ఇష్టం ..ఆ ...



2 కామెంట్‌లు:

senses of soul చెప్పారు...

come here from Malaysia.. =)

రసజ్ఞ చెప్పారు...

అది కాదు ఎంతైనా నా వాడు కదా అబ్బో! బాగా రాస్తున్నారు! బాబోయ్ నాకు సినిమాలో పాత్రలు వద్దు! ఏదో మిమ్మల్ని ఉత్సాహపరుద్దామని పెట్టాను అంతే!