ఈ రోజు ఆనందంగా వచ్చా ఆఫీసులోకి...
బాగానే మొదలుపెట్టా .....నా వర్క్ ని ...మధ్యలో బ్లాగ్ ఓపెన్ చేశా ....అనుకోకుండా ఒక బ్లాగ్ కి వెళ్ళా ....ప్రియరాగాలు ...
అసలు ఏమని రాయాలో కుడా అర్ధం కావట్లేదు ....
నా జీవితం లో నేను చూసిన ఆడవాళ్ళు చాలా తక్కువ ....
మా అమ్మ .....నాకే అర్ధం కాదు తను, కోపం ఎక్కువ అనాలో, మనస్తత్వమే అలా ఉందిలే అని అనుకోవాలో , ఎప్పుడు కోపంగా ఉండేది మా అమ్మ ఒక్కోసారి వాళ్ళు సరదాగా అన్నా... నేను నిజంగా వీళ్ళ పిల్లవాడిని కాదేమో నేను నిజంగా దొరికానేమో వీళ్ళకి, అనుకునే వాడిని ...నాన్నతో చెప్పేవాడిని చిన్నప్పుడు నాకు ఈ అమ్మ వద్దు అని ...చిన్నతనం కదా ....పోనీ నన్ను సరిగా చుసుకొదా ? అంటే నేనంటే ప్రాణం... ఇంటికి లేట్ గా వస్తే నేను వచ్చే వరుకు పడుకోదు...ఎక్కడైనా దూరంగా ఉంటె రోజు తలుచుకుని బాధపడుతుంది ( మా చెల్లెళ్ళు చెప్పేవారు) ఇప్పుడు కొంచెం పెద్ద వాడిని అయ్యా కదా ....అమ్మ ఏమిచేసినా నా కోసమే అనిపిస్తుంది.....ఇక నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నాగాని, చిన్నది ఏమో మరీ చిన్నది (నేను ఇంట్లో ఉండేప్పుడు)......పెద్దది.... హాస్టల్ లో .....ఇక నేను ప్రేమించిన భవాని , నా క్లాసు అమ్మాయిలు ( హై స్కూల్ లో) లత , తో కొంచెం మాట్లాడే వాడిని ....
ఇంటర్లో అమ్మాయిలని కామెంట్లు చేసే పోకిరి చేష్టలేగాని ఎప్పుడు కుడా వారితో క్లోజ్ గా ఉన్నది లేదు ...డిగ్రీ లో మాత్రం ఒక అమ్మాయి నాతొ మాట్లాడేది ..చాలా క్లోజ్ గా ...తను అందరితో అలాగే క్లోజ్ గా ఉండేది ..అది నాకు నచ్హక నేను తనతో మాట్లాడేవాడిని కాదు .....అదేంటో చిన్నపటినుండి ఏదైనా నాది అనుకుంటే ...అది నాతోనే ఉండాలి అనుకొనే మనస్తత్వం నాది ....ఇంకా స్నేహితులతో కలిసి అమ్మాయిలని ఏడిపించడం షరా మామూలే....ఎంతో మందిని ప్రేమించేసాను గాని ఎవరికీ చెప్పే ధైర్యం చేయలేదు ..కాని MBA లో మాత్రం ఒక్క అమ్మాయి తో ఫోనే లో పరిచయం ...అది చాలా దూరం వెళ్ళడం ...ఆ తరువాత అంటే ప్రస్తుతం ఆ పరిచయం ఇవ్వాళా రేపా ? అన్నట్టుగా పాడిమీద ఉండటం ....ఇవి కాక నా టీచర్లు ....నా కొలిగులు ...ఇప్పుడు నా RAAFSUN లో చేసే అమ్మాయిలు లేదా ఆడవారు ...మీకు తెలుసు వీల్లందిరితో మన పరిచయం ప్రవర్తన ఎలా ఉంటుందో?? అంతా ప్రోఫెస్సనల్ గా ఉంటుంది....
ఇంతే నా జీవితం లో ఆడవారి పాత్ర .....అందరు అమ్మలానే ఉంటారేమో అనుకున్నా...ఉహు కాదు కొంతమంది భవాని లా ఉంటారు అనుకున్నా ...ఉహు ...పోనీ సినిమాల్లో చూపించే వాళ్ళల ఉంటారు అనుకున్నా ....ఎక్కడ సరైన అవగాహన లేక ....వయసుతో పాటు ఆడవారి పై ఉండే ఆకర్షణే తప్ప ...ప్రత్యెక అభిమానం అంటూ ఏది లేదు ....
ఈ నా విదేశీ జీవితం నాకు చాల నేర్పింది ...ప్రతి మనిషి స్వార్ధపరుడే...నేను కూడా...కాని అతి స్వార్ధపరుడిని మాత్రం కాదు ...కాని ఇక్కడకు వచ్చి స్వార్ధపరుడి లో రెండవ క్లాసు పాస్స్ అయ్యా.....జనాలని గుడ్డిగా నమ్మే నేను ...నాతొ ప్రేమగా మాట్లాడితే శత్రువు ని కూడా నమ్మే నేను ....ప్రతివాడిని అనుమానంగా చూడటం అలవాటు చేసుకున్నా...తప్పట్లేదు నేను బాగున్నా... సమాజం బాలేదుగా..నేను సమాజం లో ఉండాలి అంటే కొన్ని త్యాగాలు తప్పవు ...నన్ను నేను మార్చుకోవాలి .....ఈరోజు కాకపొతే రేపు మారాలి ....మారాల్సి వస్తుంది .... గలగలా మాట్లాడే నేను ముభావి ని అయిపోయా .....నీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోసార్ర.. అనే వాళ్ళు అందరు మా ఉరిలో ,అలాంటిది ఇక్కడ ఏందీ భై అసలు మాట్లాడవు ? అనే స్టేజి కి వచేసా ....కాని అప్పటికి ఇప్పటికి నాలో మారని దృక్పదం ఏదైనా ఉంటె అది ఒకటే.....డబ్బు అనేది జీవితం లో ఒక భాగం,రేపటికోసం కాదు ఈరోజు కోసం కర్చు పెట్టుకోవడం నాకు ఇష్టం ...నేను MBA లో ఉండగా ఎప్పుడు అంటూ ఉండే వాడిని " డబ్బు ది ఏముందిరా కుక్క ను తంతే రాలతాయి" అని ఎప్పుడైనా సినిమా కి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను వాడే డైలాగు ఇది ..ఆ తరువాత ఎవడో ఒక స్నేహితుడి దగ్గర అప్పుచేసి వెళ్ళేవాళ్ళం ....నా ఫ్రెండ్ అనే వాడు ఎరా ఆడిని తన్నావా ( డబ్బులు ఇచిన వాడిని ) డబ్బులు రాలినాయి ..!! అనే వాడు ....
అయ్యో ఏదో మొదలు పెట్టి ఏదో రాసేస్తున్నా ....ఆ ఆడవారు ....నాకు అంతగా పరిచయం లేని పదం లా అనిపిస్తుంది....నేను ప్రేమించిన ఇద్దరు ఆడవారు (సిన్సియర్ గా) ఒకళ్ళు అస్సలు ప్రేమించ కుండా గాయ పరిచారు ఇంకొకకల్లు ప్రేమించి గాయపరిచారు .....
ఈ విదేశియానం లో నాకు దొరికిన ఒక వ్యాపకం తెలుగు నవలలు చదవడం ..అంతర్జాలం లో ఎన్ని కావాలంటే అన్ని ఉండేయి ...తెలుగు నాకు ఎంత ఇష్టం అంటే .....ఇప్పటికి కొంతమంది తెలుగు మాత్ర భాష మరియు ప్రాంతీయ భాష అయినవాళ్ళు కూడా నా అంత బాగా మాట్లాడలేరు అని చెప్పుకోవచ్చు ...అంతలా నేర్చుకున్నా...
ఇలా కధలు వెతుకుతూ వెతుకుతూ ఒక మంచి ముహూర్తాన ....బ్లాగ్లోకం లో వచ్చి పడ్డాను ఇక అప్పటినుండి బ్లాగులే మన కాలక్షేపం ....నాకు బాగా నచ్హిన బ్లాగులలో ప్రముఖం గా బులుసు వారిది...అల అలా ...ఆడ పేర్లు చూసి ఆకర్షితుడినై...వాళ్ళ బ్లాగులలో కి వెళ్ళిన నేను ....నిజంగా "ఆడాళ్ళు మీకు జోహార్లు" అని అందామనుకున్నా..!!!! తరువాత నా కొటేషన్ ని వదిలా " కొందరు ఆడాళ్ళు మీకు మనస్పూర్తిగా జోహార్లు " అని ...కొన్ని బ్లాగులు నిజంగా నన్ను కదిలించినై ....నేను ఎ ఒక్కటి ఇక్కడ ప్రస్తావించను గాని ..ఒక ఆవిడ బ్లాగ్ చదివి నిజంగా ఇవిడ జీవితం ఇంత ఆనదంగా హాయిగా ఉంటుందా ? లేకపోతె కధలు రాస్తుందా ? అని ఆలోచనలో పడ్డా...ఎంతబ్లాగ్ అయితే మాత్రం....మరీ ఇంత అబద్దాలు రాయాలా అనిపించింది....ఆవిడనే అడిగాను ఏమండి మీ జీవితం లో కష్టాలు లేవా ? ఇంత సరదాగా రాస్తున్నారు ? నాకేమో ఇన్ని కష్టాలు ఉన్నాయ్ ?అని ....పాపం ఆవిడా నాకు రిప్లై ఇచి నన్ను ఓదార్చింది ....
మనకు పరిచయం లేని ఆడవారి ని "ఆడ" వారిగానే చూసే మగబుద్ది చాలామందికి ఉంటుంది...జగద్విదితం ...నేను మినహాఇంపు కాదు ....కాని పరిచయం అయినతరువాత కూడా "ఆడ"వారిగానే చూసే బుధి కనీసం 40 శాతం మగవాళ్ళకి ఉంటుంది అని నేను అనుకుంటున్నా...ఆ నలభై శాతం మిగిలిన అరవై శాతం మధ్యలో ఉండే దుర్భాగ్యం నాది ...
అలాంటి నన్ను కొంచెం కొంచెం గా మార్చిన ఆడ బ్లాగర్లకు వందనాలు....అనుకోకుండా ఇందులో ఒక మగ బ్లాగరు కూడా ఉన్నాడు , పేరు ప్రస్తావించను గాని అయన బ్లాగులో అయన కాలేజి విషయాలు రాసుకుంటూ GAURI అనే తన సహాధ్యాయి గురించి రాసారు ...అంబులెన్సు లో పరీక్షలకి హాజరు అయిందిట...చనిపోతానని ముందే తెలిసినా ఎప్పుడు ఆ బాధ ని ఎవరితో పంచుకోలేదు ఎవరి జాలి కోరలేదు ...నిబ్బరంగా ఉన్న తన గురించి తెలుసుకొని మనసులోనే దణ్ణం పెట్టాను ఆవిడకి ...ఆవిడ ఆత్మా సంతిచాలని కోరుకుంటున్నాను.
అసలు నా బాధ అంటా ప్రియరాగాలు అనే బ్లాగ్ చదివిన తరువాత మొదలైంది ...చదివిన మొదటి టపా " చేతులెత్తి" ఆ ఎవరో బంధువు చనిపోయరేమో లే అనుకున్నా....మొత్తం టపా చదివినా సరిగా అర్ధం కాలేదు ఏడు ఎనిమిది సార్లు చదివా ..ఆ బ్లాగు అక్కచేల్లెల్లది ....అంటే ఆ బ్లాగ్ రాసిన ఆవిడ ఇక లేదు అని ...వాళ్ళ అక్క రాసిన టపా అది అని అర్ధం అయ్యింది....ఆవిడ టపాలు చదివా ....ఆవిడా రాసిన "మైలుదూరం" లో నాకు ఏడుపంటే యాక్ అంటూనే తన నాన్నారిని తల్చుకుని బాధపడి మళ్ళి తేరుకొని మనలని నవ్వించిన ఆ మాహతల్లి ని తలచుకొని నను ఏడవలేదు కాని నా కళ్ళు ఎందుకో నీళ్ళు రాల్చాయి... నాకు దేవుడు కనిపించి ఏమైనా కోరుకో అంటే నేను కోరుకునేది ఎంతో తెలుసా " దేవుడా మంచి మనసున్న అడ్డవాల్లని పుట్టించు కవ్వించే వాళ్ళని మాత్రం వద్దు కవ్వించే వారి వల్ల మంచి వాళ్ళు కూడా తమ ఉనికి కోల్పోతున్నారు ...లేదా వాళ్ళని విడి విడి గా చూసేంత బుద్ధి మగవాళ్ళకు ప్రసాదించు అని " అమ్మా!!! ప్రియా అయ్యంగార్ ...నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ....నువ్వు కనబడని లోకాలకేల్లిపోయినా కూడా నన్ను మార్చి నా జీవితం లో నవ్వు నింపావు..నేను పరిపూర్ణంగా మారడమే నేను నీకు ఇచ్హే నివాళి "
ఆడవాళ్ళూ అంటే ఇంతే ..ఇందుకే ....అని ఎల్లప్పుడూ అనుకోకపోయినా ..అప్పుడప్పుడైనా అనుకున్నందుకు చాలా బాధపడ్డా....ఇక అనుకో కూడదు....
మనసంతా పాడి పోయింది ఈ రోజు.......
3 కామెంట్లు:
ప్రియా అయ్యంగార్ ఒక ఫేక్ బ్లాగర్. గీతాచార్య అని ఒకతను 3,4 ఆడ పేర్లతో బ్లాగులు క్రియేట్ చేసి వారిలో ఒకామె తన భార్య అని, ఈ ప్రియ ఆమె ప్రెండ్ అని, చేతులెత్తి టపా రాసినావిడ ఆ ప్రెండ్ కజిన్ అని కొందరు బ్లాగర్లను నమ్మించాడు. నిజంగానే ప్రియ చనిపోయిందనుకుని కొందరు ఆడ బ్లాగర్లు టపాలు రాసి ఏడ్చేశారు కూడా. పెద్ద పెద్ద బ్లాగర్లు కూడా అతని చేతిలో పడి ఫూల్ అయ్యారు. ప్రియా అయ్యంగార్ కానీ, ఆమె అక్క కానీ నిజంగా లేరు.
Dont believe what ever u read... ..Just Chill
http://priyadayyamgaaru.wordpress.com/
అజ్ఞాత గారు మీరు చెప్పింది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలీదు....ఒకవేళ నిజం ఐతే ఆ గీతాచార్యా అనే అతను, దుర్మార్గుడు...... దుష్టుడు .....ఒకవేళ నిజమే అయితే మై పోస్ట్ ఇస్ కరెక్ట్ ,,,,,,,,,,,,,,,,,
కామెంట్‌ను పోస్ట్ చేయండి