31, డిసెంబర్ 2011, శనివారం

"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" VI

( ఎంతో కష్టపడి సంపాదించినా గ్రీటింగులు తన ప్రియ సఖి భవాని కి లత ద్వార పంపిస్తాడు రాజు, తీసుకుని థాంక్స్ చెప్తుంది భవాని , రెండురోజుల తరువాత హిందీ క్లాసు కు వచ్చిన భావాన్ని ఆ గ్రీటింగులని హిందీ మాస్టారి చేతిలో పెడుతుంది , అవి చుసిన హిందీ మాస్టారు రాజు గాడి వీపు  బేగుంపేట్  విమానాశ్రయం చేస్తాడు ....ఇంటికి వెళ్ళిన తరువాత రాజు గాడు వాళ్ళ నాన్న చెప్పిన పని చేయలేదని వాళ్ళ నాన్న విమానాశ్రయాన్ని బేగం పెట్ నుండి శంషబాద్ కి మారుస్తాడు....ఆరోజు అనుకోకుండా దేవదాసు సినిమా చూస్తాడు రాజు.)

.ఇక చదువుకుందాం

ఎవరికోసం ?? ఎవరికోసం ?? ఈ పాల కేంద్రం ...ఈ స్వామి గారి మఠం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ???? అని పాడుకుంటూ ఉండిపోయా ఒక రెండు రోజులు ..భావాన్ని మీద ఎంత కోపం వచ్చింది అంటే....రెండు తమలపాకులతో తల మీద  కొట్టేద్దాం అనిపించింది ...మల్లి నేప్పేడుతుందేమో !!! అని వదిలేసా.......

రెండు రోజులు హిందీ క్లాసు కి వెళ్ళలేదు, మూడో రోజు అసలు ఒకసారి భవాని తో  మాట్లాదాం అనిపించింది...అంతే..భవాని రోజు వచ్చే దారిలో మళ్ళి మకాం వేసాను....ఈ రోజు మేడం గారు సైకిల్ వేసుకొని వస్తోంది అసలే కొత్తేమో ,,హండిల్ తెగ ఉపెస్తోంది.. అప్పటి దాక భవాని మీద ఉన్న కోపం ఒక్కసారిగా పోయింది, తను నన్ను చూసింది ...నవ్వుకుంటుంది.... పట్టులంగా లో ఎంత ముద్దోస్తుందో అనుకున్నా...లేచి నిలబడ్డాను రోడ్డు మీద కు వచ్చాను  నా పక్కనుండి వెళ్ళిపోతుంది లే అనుకున్నా సరాసరి తీసుకువచి గుద్దేసింది..... తన హేండిల్ పట్టుకున్న కాబట్టి సరిపోయింది కాని లేకపొతే ఈ ప్రేమ, పెళ్లి, మనకు వర్తించేవి కావు .....నేను అడ్డం రావడం వల్ల పడిపోయింది అనుకుని , ఇక జన్మలో నాతొ మాటలాడదు అనుకోని చుస్తే నవ్వుతోంది నా వంక చూస్తూ మోచెయ్యి కి మట్టి అంటుకుంది. నిజం చెప్పనా...ఆ మట్టినైతే బాగుండు అనిపించింది కాసేపైనా భావాన్ని తో ఉండవచ్చు  కదా అని ......అప్పుడు తను చెప్పిన మాట ఇప్పటికి ,నా బొంద ఇప్పటికేంటి ఎప్పటికైనా గుర్తు ఉండిపోతుంది.. ఒక చిన్న కలహం తరువాత మాటలడింది కదా అందుకే అంత విలువ ఆ మాటలకు " ఎంత కోపం ఉంటె మాత్రం ఇలా పడేస్తార బాబు?"   అంది నవ్వుతు......అప్పుడు నేను సిగ్గుతో తిరిగిన మెలికలు.... పాములు గనక చూసిఉంటె నన్ను సర్పరాజ్య అధిపతిని చేసి ఉండేవి....."హిహిహ్హి అలా ఏమి లేదు, నువ్వు ఎందుకు నా గ్రీటింగ్ కార్డులు సార్ కి ఇచ్చావ్ అని అడిగాను ....." అదంతేలే" అని చెప్పి వెళ్ళిపోయింది .... ....

           సాయంత్రం భయపడుతూనే ట్యూషన్ కి వెళ్ళాను .... ఇది హిందీ ట్యూషన్ కాదు ...రోజు వెళ్ళే జనరల్ ట్యూషన్ అన్న మాట...అది భవాని వాళ్ళ పెద్దనాన్న చెప్పే ట్యూషన్...అంటే భవాని వాళ్ళ ఇంటి ముందు మేము చదువుకున్నమే..ఆ స్కూల్ లో అన్న మాట .......నిజం చెప్పాన ఉత్త భవాని కోసమే మనకు ట్యూషన్ లేకపోతె మనం ట్యూషన్ కి వెళ్ళం...రోజు అందరికంటే ముందు వెళ్ళిపోవడం కిటికిలో నుండి భవాని ఇంటి వైపు చూస్తూ ఉండటం..భవాని పాలకు గాని కురగాయలకు గాని వెళ్తుంటే కితికో లో నుండి చూసి ఆనందించడం మన ప్రధాన ట్యూషన్ కర్తవ్యలన్నమాట, అలా ఆ రోజు కుడా అందరికంటే ముందుగా వెళ్లి కిటికీ లో నుండి చూస్తుండగా భవాని బయటకు వచ్చింది చేతిలో బుట్టతో ,...ఆ రోజు మంగళవారం..అంటే ఉళ్ళో సంత, అంటే కురగాయలకోసం వెళ్తుంది..ఈరోజు కుడా నా జీవితం లో ఎప్పటికి మర్చిపోను ...ఎందుకంటే నేను భవాని కలిసి షాపింగ్ చేసాం గా......అందుకు ..సరే తను అలా వెళ్తుంటే నేను కిటికీ లో నుండి "భవాని... భవాని ..."అని నాకు భవానికి స్కూల్ గోడలకి కొంచెం గాలికి అక్కడ ఉన్న ఒక కుక్కకు మాత్రమె వినబడేటట్టు పిలిచా ...విచిత్రం గా చూసింది స్కూల్ వైపు నేను మళ్ళి కిటికిలోనుండి "నేను రాజు" ని అన్నా "ఏంటి" అంది,,, కి కి కి,,,,, తనకి ఇంకా నేను కనబడలేదు, "ఎక్కడికి"
"కురగాయలకి"
"నేను రానా? "
"ఎందుకు"
"బెరమడాడానికి"
"నాకొచ్చు బేరం ఆడటం "
"నాకంటే బాగా వచ్చా"
"ఆ ..."
"సరేలే ..వెళ్ళు "
"ఎ వస్తావా?"
"అవును"
'సరే రా... నేను సందు తిరిగిన తరువాత రా"
"అలాగలాగే నువ్వు పద" ఎవ్వరు రాలేదు ట్యూషన్ లో ...నేనోక్కడినే.... తీన్ మార్ డాన్సు చేసుకున్నా...కాసేపు ...ఆయాసం వస్తే ఆపి నీళ్ళు తాగి ఎవరుచుడకుండా సొందు దాటేసాను.
అక్కడ మనకోసం భవాని వెయిటింగ్...

ఇక్కడ భవాని వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచే చెప్పాలి ..భవాని వాళ్ళ అమ్మ మా చిన్నప్పుడు అంటే మేము రెండు లోనో ముడులోనో ఉన్నప్పుడే చనిపోయింది ,భవాని వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, తను బ్యాంకు మానేజరు, ఆ పెళ్లి భవానికి ఇష్టం లేదు అనుకుంటా తనకి వాళ్ళ పిన్ని అంటే పడదు అని విన్నాను, తను ఎంత బాగా చూసుకున్న తానంటే భవానికి కోపం అంట, వాళ్ళ పిన్ని చాలా మంచిది అని విన్నాను ,భవాని కి ఒక అక్క కుడా ఉంది కళ్యాణి అని భవాని లాగే బాగుంటుంది, కాని మనకంటే పెద్దది కదా......ఇప్పుడు వాళ్ళ  పిన్ని కి ఒక పాపా పుట్టింది  తన పేరు "సిరి ". భవాని సిరి తో బానే ఆడుకుంటుంది కాని వాళ్ళ పిన్ని తోనే సరిగా మాట్లాడదు.

సరే అలా బయలు దేరాం సంత కి ...తను ఏవోవో కొంటుంది నేను ఏదేదో మాట్లాడు తున్నాను, టమాటోలు కోంది, అచ్చం నీలా ఉన్నాయి కదూ అన్నాను ,

మీ అమ్మ వండుతుండా ఇవి లేకపొతే నువ్వే వండుతావా అని అడిగాను.

అమ్మా? ఆవిడా లేక పోబట్టే కదా నాకు ఇన్ని కస్టాలు "
ఎ ? ఎక్కడికి వెళ్ళింది? "
పుట్టింటికి వెళ్లి ఇంకా రావట్లేదు అన్నది"
నిజం చెప్పాలంటే ఆ రోజు భవాని కళ్ళలో చుసిన బాధ నేను ఎప్పటికి మర్చిపోను, అలా ఆ రోజు షాపింగ్ ముగించాం. సిరి కొంచెం పెద్దది అయి తన అక్క తో పాటు ట్యూషన్ లో రావడం మొదలు పెట్టేది, నేనేమో తనకు మాటలు నేర్పించే వాడిని , నన్ను బావ అనమనేవాడిని ...

ఒక సారి బలే జరిగింది భవాని వాళ్ళ పెద్దనాన్న క్లాసు లో ఉన్నారు, సిరి నా దగ్గ్రకోచి "బావా నన్ను అక్క గిచ్చింది" అని గట్టిగా చెప్పింది , అందరు షాక్ అయ్యారు. ఒక్కసారిగా సిలెంట్ అయిపొయింది క్లాసు అంతా...

అప్పటినుండి భావాన్ని నాతొ మాట్లాడటం  మానేసింది.....ఈలోపు మా ట్యూషన్ లో దుర్గా ప్రసాద్ అనే పదవతరగతి వాడు భవాని ని ప్రేమిస్తున్నాడు అని తెలిసింది, వాడు మా ట్యూషన్ లోనే చదివేవాడు , ఒకరోజు ఆడి పుస్తకం మీద భవాని పేరు చూసి వాడిని ఇరగ కొట్టేశాను, భవాని వాళ్ళ పెద్దనాన్న వచ్చి నన్ను అందరిముందు ఇరగ కుమ్మెశారు. అప్పటిదాకా మంచి పేరు తో ఉన్న నేను, ఒక్కసారిగా అందరి కళ్ళలో రౌడి అయిపోయాను , పదవతరగతి వాళ్ళేమో నన్ను శత్రువుని చూసినట్లు చూసే వాళ్ళు,  అందరికి తెలిసిపోయింది నేను భవాని ని ప్రేమిస్తున్నాని,

ఇలా సాగుతూ నేను పదవ తరగతిలోకి వచ్చేసాను...





9 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

తమలపాకుతో కొడితే నొప్పా? బొప్పేం కట్టదూ ;) నేను సందు తిరిగిన తరువాత రా నా? హమ్మో హమ్మో తొమ్మిదో తరగతిలోనే? అప్పటినుండి భావాన్ని నాతొ మాట్లాడటం మానేసింది అచ్చికచ్చికా బాగయ్యింది! ఆడి పుస్తకం మీద భవాని పేరు చూసి వాడిని ఇరగ కొట్టేశాను, భవాని వాళ్ళ పెద్దనాన్న వచ్చి నన్ను అందరిముందు ఇరగ కుమ్మెశారు.హాయ్ హాయ్ జజ్జినక జనారే! అందరికి తెలిసిపోయింది నేను భవాని ని ప్రేమిస్తున్నాని అయ్యో పాపం! పోనిలెండి competition ఉండదుగా మీకు అలియాస్ రాజుకి ;)

ఉత్కంఠ భరితమయిన ఈ నవలను వ్రాస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!

అజ్ఞాత చెప్పారు...

v.good

PALERU చెప్పారు...

రసజ్ఞ గారు ,
మీకు మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్తులకు, తెలుగు మాట్లాడేవారికి, అంటే ఆంధ్ర దేశ ప్రజలకు ,అలాగే భారతీయులకు , భుగృహ వాసులకు, ఎలిఎన్ లకు కుడా నా తరుపున " నూతన సంవత్సర శుభాకాంక్షలు" .
రసజ్ఞ గారు నాకు తేలిక అడుగుతాను మీకు మా రాజు కి ఎంటండి పగ??? ఎందుకు అంత ఆనందం మీకు మా రాజు కి దెబ్బలు తగిలితే....!!! :) భవాని మాట్లాడటం మానేసిందని వాడు బాధ పడుతుంటే , మీకు జజ్జినక నా??? :) రాజు ఒక క్యారెక్టర్ కాబట్టి సరిపోయింది లేక పొతే మీ మాటలకు ఆత్మా హత్య చేసుకునే వాడు , :):):),

తాతగారు ( అందరు ఇలానే పిలుస్తున్నారు మరి!!!)

మీ లాంటి పెద్దలు నా బ్లాగ్ కు రావడం నిజంగా నా అదృష్టం అండి , చాలా చాలా ధన్యవాదాలు, చుడండి పైన రసజ్ఞ గారు ఎలా చూస్తున్నారో మిమ్మల్ని పోగిడానని..:):)

సుభ/subha చెప్పారు...

Rafsun bhai నూతన సంవత్సర శుభాకాంక్షలండీ..

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

!! raf raafsun !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

PALERU చెప్పారు...

సుభ గారో...మీక్కూడా ....నూతన సంవత్సర ఆగమన శుభాకాంక్షలు.....చాలా థాంక్స్

తెలుగు పాటలు గారు...మళ్ళి పేరు మార్చేసారా....హిహిహ్

మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

హి హి హి అవును మార్చేశా

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజు ప్రేమ కథ యొక్క సస్పెన్స్ భరించలేక జ్వరం కూడా వచ్చింది. పాపం రాజు.. నేను జజ్జనిక అనను కానీ" రసజ్ఞ " మెచ్చిన వ్యాఖ్యల తో..సరి తూచి మెచ్చి. ఇచ్చితిని రాజు కి .ఓ.. అభినందన మందారమాల.. " భవాని "ని సాధించే లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ.. నూతన సంత్సర శుభాకాంక్షలు.

PALERU చెప్పారు...

వనజ గారు...జ్వరమా...అది కుడా మీకా......కొత్త సంవత్సరం ఇలా వింతలతో ప్రారంభం అయింది ఏంటో??? :):):)

తెలుగు పాటలు గారు....మీరు ఎలా పేరు మార్చినా నేను మిమ్మలిని గుర్తుపట్టేస్తాను..:):):)