18, డిసెంబర్ 2011, ఆదివారం

జీవితం......స్త్రీ .....లక్ష్యం III

PART III

( భవాని పుట్టినరోజు నాడు గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలి అని ఒక పధకం వేసిన రాజు మొదటి మెట్టు గా ఒక మధ్యవర్తి ని ఎంచుకున్నాడు...(లత అనే వీడి సహాధ్యాయిని ) ఆ గ్రీటింగ్ కార్డ్ సంపాదించడానికి ఒక దొంగతనం ప్లాన్ చేసి విఫలం అవుతాడు రాజు, ఆ తరువాత తన ఉరిలో ఉన్న ఒక FANCY షాప్ అతని దగ్గర తన మాటల చాకచక్యం తో కార్డులు అప్పుగా సంపాదించి స్కూల్ కి వెళ్ళాడు,)

మధ్యానం లంచ్ బెల్ తరువాత అలా బ్యాగ్ పట్టుకు వెళ్ళిపోతున్న నన్ను ఈ మాస్టారు కనిపెట్టలేదు గాని ఈ గోపాలం గాడు తగిలాడు.
"ఎరా రాజు మధ్యానం రావా ? బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నావ్"
"లేదురా తలనొప్పిగా ఉంది అందుకే రెస్టు తీసుకుందామని "
"రేపు హిందీ క్లాసు కి వెళ్తావా ? ఆదివారంగా !!!"
"వెళ్ళాలి రా పరీక్షా దగ్గిర పడుతుంది " ఉంటాన్రా బై ...
"బై "

ఈడి ఎదవ నస వీడికేందుకో నేను ఏమిచేస్తే ఎప్పుడు నా మీద పది ఏడవడమే డబ్బా మొహం గాడు...అలా ఆరోజు మధ్యానం ఇంటికి వెళ్లి ఇంట్లో ఒక అబద్దం చెప్పి సెటిల్ అయిపోయా ..మధ్యానం మా అమ్మ కు పడుకోవడం అలవాటు..అదే మనకు అదును కూడా ...అమ్మ పడుకోగానే పుస్తాకాలు తీసి రక రకాల డిజైన్ లలో భవాని పేరు చెక్కడం మొదలుపెట్టా ఏదేమైనా ఒక డిజైన్ చాలా బాగా నచ్చింది..అదే గ్రీటింగ్ కార్డ్ మీద రాసి రేపు ఎలా ఇవ్వాలా అని తెగ ప్లాన్లు వేసా...ఇక నాకు తట్టింది ఏంటంటే రేపు తను వచ్చే టైం కి తను వచ్చే దారిలో వెయిట్ చేసి తను వస్తున్నప్పుడు ఇచ్చేద్దాం అని ...

ఆ రాత్రి నిద్ర పడితే ఒట్టు ....నేను తనకి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి నట్టుగా...... తను తీసుకుని థాంక్స్ చెప్పినట్టు గా ....నువ్వు చాలా మంచోడివి......... అన్నట్టుగా ఏవేవో .................ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు గాని పొద్దునే నన్నారు తెగ తిడుతున్నారు...ఎవర్నో అయితే నాకెందుకు ? నన్నే....పాలు తీసుకు రాలేదని....లేచి వెళ్ళాను మా దిబ్బ దగ్గిరకి " దిబ్బ అంటే మా పొలాల దగ్గిర మాకు కొంచెం మెట్ట ఉంది లెండి ఇంగ్లీష్ గడ్డి వేస్తాం అక్కడ, గేదలు అక్కడే ఉంటాయి, బలే ఉంటది అక్కడా చల్లగా ...అక్కడ సపోటా, కొబ్బరి, నిమ్మ , బత్తాయి , ఉసిరి, చింతకాయల చెట్టు, ఉన్నాయ్ మా ఉళ్ళో నాకు నచ్హిన ప్రదేశాలలో మా దిబ్బ ఒకటి ...సరే సరే...లేచానా!...అందరిని తిట్టుకుంటూ పాలకి వెళ్ళాను ..రాగానే ఫ్రెష్ గా తయారయ్యి ఏమి తిన్నానో ఏమి తాగానో గుర్తులేదు కాని నా దగ్గిర ఉన్న ఖాకి కలరు ప్యాంటు , తెల్ల చొక్కా వేసుకొని గ్రీటింగ్ కార్డ్లని బద్రం గా దాచుకుని తొమ్మిది గంటలకు హిందీ క్లాస్స్  అయితే ఎనిమిది గంటలకే బయలు దేరి భవాని వచ్చే దారిలో కాపు కాసా.....అబ్బా వెయిటింగ్ ఎంతా చిరాగ్గా ఉంటుందో

.....ఎనిమిదిన్నర ....

తను రావట్లేదు ...ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు నన్ను విచిత్రం గా చూస్తున్నారు...వీడెందుకు ఇక్కడ ఉన్నదా అని!! అప్పట్లో పిల్లలని ఎత్తుకేల్లె వాళ్ళు తీరుగుతూ ఉండే వాళ్ళు ..నేను కుడా అదే బాపతు అనుకుంటున్నారేమో..లేకపోతె దొంగ కోళ్ళ కోసం వచ్చాను  అనుకుంటున్నారేమో....ఇది తొందరగా వస్తే బాగుండు.... ఇది ఇంతే ఎప్పుడు లేట్......

ఎనిమిది నలభై అయిదు ...

ఉహు రావట్లేదు.....నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది ...ఇప్పటికి యాభై సార్లు అనుకున్న తనతో ఏమి     మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ,


పదినిమిషాల తక్కువ తొమ్మిది....

రావట్లేదు...అసలు కనబడట్లేదు.....తను ఎప్పుడు మానదు క్లాస్స్ కాని ఎప్పుడు కరెక్ట్ టైం కి వస్తుంది కొంచెం ముందు కొంచెం లేటు రాదు..

అయిదు నిమిషాల తక్కువ తొమ్మిది...

ఏది ? కనబడదే? ఇవ్వాళా రాదా ఏమి కొంపదీసి ??

తొమ్మిది ....

నాలో నేనే అనుకుంటున్నా "ఒరే రాజు గా తను ఎప్పుడైనా రావచ్చు..కొంచెం జాగర్తగా మాట్లాడు ....ఈ ధన్ ధన్ ...మని సౌండ్ ఏంటి ? ఓహో నా గుండె చప్పుడా..!!! నాకే వినిపిస్తుందే....నా జేబు కి పెట్టుకున్న పెన్ను ఎగిరెగిరి పడుతుంది నా గుండె కొట్టుకునే వేగానికి ...బాగా దాహం గా ఉంది ......అరచేతిలో చెమట వస్తుంది...ఇక తను వచేస్తుంది....నేను ఇచ్చెయ్యాలి ఈ గ్రీటింగ్ కార్డులు...."

తొమ్మిది అయిదు ...............
                             ********************************************
కొంచెం టెన్షన్ కోసం.....అలా వదిలిపెట్టా ...కాసేపు టెన్షన్ పడండి.....ఈ లోపు లంచ్ ఫినిష్ చేసేస్తా.....ఏమి జరిగిందో ఊహించండి ....దీని తరువాత పార్ట్ చదవకుండా!!!!

4 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

aa roju Holiday!? Bhavaani raadu.. antenaa!?

PALERU చెప్పారు...

పాటకులు ఉహించినట్టు రాస్తే రచయితా గొప్పదనం ఏముంది...అందుకే చిన్న ట్విస్ట్.....దీనితో రాజు గాడి లైఫ్ బస్సుస్తాండే....చుడండి ఏమి జరుగుతుందో .......

రసజ్ఞ చెప్పారు...

భవానిని వాళ్ళ నాన్నగారు బండి మీద దింపుతారు!

PALERU చెప్పారు...

రసజ్ఞ గారు, థాంక్స్ ఫర్ కామెంట్.
మీరు కూడా...........నా ఉహాసక్తి అంచనా వెయ్యడం లో ఓడిపోయారు...హి హిహి.....

NOW THE GAME STARTS......