మంచి పిల్లాడు, బుద్ధిమంతుడు , బాగా చదువుతాడు , అనే బిరుదులూ ఉన్న రాజు ఒక్కసారిగా రౌడి ఎందుకు అయిపోయాడు, మళ్ళి తన పూర్వ స్థితి కి వచడా ??? భవాని ఏమైపోయింది? అసలు పదవతరగతి పాస్ అయ్యాడా??? UTKANTHAM ఉల్లాసం , విరహం, విచారం, వివాదం, విలాసం, హాస్యం ల మేళవింపు గల మంచి తాలింపు " జీవితం...స్త్రీ...లక్ష్యం.." ఏడవ భాగం త్వరలో.....
స్వచమైన పల్లెటూరి మనసు, కల్మషం లేని టపాలు, కపటం లేని కామెంట్లు వెరసి ఈ పల్లెటూరి పాలేరు.... A man with a village mindset, Unbiased posts, Ethical values...!!
31, డిసెంబర్ 2011, శనివారం
"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" VI
( ఎంతో కష్టపడి సంపాదించినా గ్రీటింగులు తన ప్రియ సఖి భవాని కి లత ద్వార పంపిస్తాడు రాజు, తీసుకుని థాంక్స్ చెప్తుంది భవాని , రెండురోజుల తరువాత హిందీ క్లాసు కు వచ్చిన భావాన్ని ఆ గ్రీటింగులని హిందీ మాస్టారి చేతిలో పెడుతుంది , అవి చుసిన హిందీ మాస్టారు రాజు గాడి వీపు బేగుంపేట్ విమానాశ్రయం చేస్తాడు ....ఇంటికి వెళ్ళిన తరువాత రాజు గాడు వాళ్ళ నాన్న చెప్పిన పని చేయలేదని వాళ్ళ నాన్న విమానాశ్రయాన్ని బేగం పెట్ నుండి శంషబాద్ కి మారుస్తాడు....ఆరోజు అనుకోకుండా దేవదాసు సినిమా చూస్తాడు రాజు.)
.ఇక చదువుకుందాం
ఎవరికోసం ?? ఎవరికోసం ?? ఈ పాల కేంద్రం ...ఈ స్వామి గారి మఠం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ???? అని పాడుకుంటూ ఉండిపోయా ఒక రెండు రోజులు ..భావాన్ని మీద ఎంత కోపం వచ్చింది అంటే....రెండు తమలపాకులతో తల మీద కొట్టేద్దాం అనిపించింది ...మల్లి నేప్పేడుతుందేమో !!! అని వదిలేసా.......
రెండు రోజులు హిందీ క్లాసు కి వెళ్ళలేదు, మూడో రోజు అసలు ఒకసారి భవాని తో మాట్లాదాం అనిపించింది...అంతే..భవాని రోజు వచ్చే దారిలో మళ్ళి మకాం వేసాను....ఈ రోజు మేడం గారు సైకిల్ వేసుకొని వస్తోంది అసలే కొత్తేమో ,,హండిల్ తెగ ఉపెస్తోంది.. అప్పటి దాక భవాని మీద ఉన్న కోపం ఒక్కసారిగా పోయింది, తను నన్ను చూసింది ...నవ్వుకుంటుంది.... పట్టులంగా లో ఎంత ముద్దోస్తుందో అనుకున్నా...లేచి నిలబడ్డాను రోడ్డు మీద కు వచ్చాను నా పక్కనుండి వెళ్ళిపోతుంది లే అనుకున్నా సరాసరి తీసుకువచి గుద్దేసింది..... తన హేండిల్ పట్టుకున్న కాబట్టి సరిపోయింది కాని లేకపొతే ఈ ప్రేమ, పెళ్లి, మనకు వర్తించేవి కావు .....నేను అడ్డం రావడం వల్ల పడిపోయింది అనుకుని , ఇక జన్మలో నాతొ మాటలాడదు అనుకోని చుస్తే నవ్వుతోంది నా వంక చూస్తూ మోచెయ్యి కి మట్టి అంటుకుంది. నిజం చెప్పనా...ఆ మట్టినైతే బాగుండు అనిపించింది కాసేపైనా భావాన్ని తో ఉండవచ్చు కదా అని ......అప్పుడు తను చెప్పిన మాట ఇప్పటికి ,నా బొంద ఇప్పటికేంటి ఎప్పటికైనా గుర్తు ఉండిపోతుంది.. ఒక చిన్న కలహం తరువాత మాటలడింది కదా అందుకే అంత విలువ ఆ మాటలకు " ఎంత కోపం ఉంటె మాత్రం ఇలా పడేస్తార బాబు?" అంది నవ్వుతు......అప్పుడు నేను సిగ్గుతో తిరిగిన మెలికలు.... పాములు గనక చూసిఉంటె నన్ను సర్పరాజ్య అధిపతిని చేసి ఉండేవి....."హిహిహ్హి అలా ఏమి లేదు, నువ్వు ఎందుకు నా గ్రీటింగ్ కార్డులు సార్ కి ఇచ్చావ్ అని అడిగాను ....." అదంతేలే" అని చెప్పి వెళ్ళిపోయింది .... ....
సాయంత్రం భయపడుతూనే ట్యూషన్ కి వెళ్ళాను .... ఇది హిందీ ట్యూషన్ కాదు ...రోజు వెళ్ళే జనరల్ ట్యూషన్ అన్న మాట...అది భవాని వాళ్ళ పెద్దనాన్న చెప్పే ట్యూషన్...అంటే భవాని వాళ్ళ ఇంటి ముందు మేము చదువుకున్నమే..ఆ స్కూల్ లో అన్న మాట .......నిజం చెప్పాన ఉత్త భవాని కోసమే మనకు ట్యూషన్ లేకపోతె మనం ట్యూషన్ కి వెళ్ళం...రోజు అందరికంటే ముందు వెళ్ళిపోవడం కిటికిలో నుండి భవాని ఇంటి వైపు చూస్తూ ఉండటం..భవాని పాలకు గాని కురగాయలకు గాని వెళ్తుంటే కితికో లో నుండి చూసి ఆనందించడం మన ప్రధాన ట్యూషన్ కర్తవ్యలన్నమాట, అలా ఆ రోజు కుడా అందరికంటే ముందుగా వెళ్లి కిటికీ లో నుండి చూస్తుండగా భవాని బయటకు వచ్చింది చేతిలో బుట్టతో ,...ఆ రోజు మంగళవారం..అంటే ఉళ్ళో సంత, అంటే కురగాయలకోసం వెళ్తుంది..ఈరోజు కుడా నా జీవితం లో ఎప్పటికి మర్చిపోను ...ఎందుకంటే నేను భవాని కలిసి షాపింగ్ చేసాం గా......అందుకు ..సరే తను అలా వెళ్తుంటే నేను కిటికీ లో నుండి "భవాని... భవాని ..."అని నాకు భవానికి స్కూల్ గోడలకి కొంచెం గాలికి అక్కడ ఉన్న ఒక కుక్కకు మాత్రమె వినబడేటట్టు పిలిచా ...విచిత్రం గా చూసింది స్కూల్ వైపు నేను మళ్ళి కిటికిలోనుండి "నేను రాజు" ని అన్నా "ఏంటి" అంది,,, కి కి కి,,,,, తనకి ఇంకా నేను కనబడలేదు, "ఎక్కడికి"
"కురగాయలకి"
"నేను రానా? "
"ఎందుకు"
"బెరమడాడానికి"
"నాకొచ్చు బేరం ఆడటం "
"నాకంటే బాగా వచ్చా"
"ఆ ..."
"సరేలే ..వెళ్ళు "
"ఎ వస్తావా?"
"అవును"
'సరే రా... నేను సందు తిరిగిన తరువాత రా"
"అలాగలాగే నువ్వు పద" ఎవ్వరు రాలేదు ట్యూషన్ లో ...నేనోక్కడినే.... తీన్ మార్ డాన్సు చేసుకున్నా...కాసేపు ...ఆయాసం వస్తే ఆపి నీళ్ళు తాగి ఎవరుచుడకుండా సొందు దాటేసాను.
అక్కడ మనకోసం భవాని వెయిటింగ్...
ఇక్కడ భవాని వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచే చెప్పాలి ..భవాని వాళ్ళ అమ్మ మా చిన్నప్పుడు అంటే మేము రెండు లోనో ముడులోనో ఉన్నప్పుడే చనిపోయింది ,భవాని వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, తను బ్యాంకు మానేజరు, ఆ పెళ్లి భవానికి ఇష్టం లేదు అనుకుంటా తనకి వాళ్ళ పిన్ని అంటే పడదు అని విన్నాను, తను ఎంత బాగా చూసుకున్న తానంటే భవానికి కోపం అంట, వాళ్ళ పిన్ని చాలా మంచిది అని విన్నాను ,భవాని కి ఒక అక్క కుడా ఉంది కళ్యాణి అని భవాని లాగే బాగుంటుంది, కాని మనకంటే పెద్దది కదా......ఇప్పుడు వాళ్ళ పిన్ని కి ఒక పాపా పుట్టింది తన పేరు "సిరి ". భవాని సిరి తో బానే ఆడుకుంటుంది కాని వాళ్ళ పిన్ని తోనే సరిగా మాట్లాడదు.
సరే అలా బయలు దేరాం సంత కి ...తను ఏవోవో కొంటుంది నేను ఏదేదో మాట్లాడు తున్నాను, టమాటోలు కోంది, అచ్చం నీలా ఉన్నాయి కదూ అన్నాను ,
మీ అమ్మ వండుతుండా ఇవి లేకపొతే నువ్వే వండుతావా అని అడిగాను.
అమ్మా? ఆవిడా లేక పోబట్టే కదా నాకు ఇన్ని కస్టాలు "
ఎ ? ఎక్కడికి వెళ్ళింది? "
పుట్టింటికి వెళ్లి ఇంకా రావట్లేదు అన్నది"
నిజం చెప్పాలంటే ఆ రోజు భవాని కళ్ళలో చుసిన బాధ నేను ఎప్పటికి మర్చిపోను, అలా ఆ రోజు షాపింగ్ ముగించాం. సిరి కొంచెం పెద్దది అయి తన అక్క తో పాటు ట్యూషన్ లో రావడం మొదలు పెట్టేది, నేనేమో తనకు మాటలు నేర్పించే వాడిని , నన్ను బావ అనమనేవాడిని ...
ఒక సారి బలే జరిగింది భవాని వాళ్ళ పెద్దనాన్న క్లాసు లో ఉన్నారు, సిరి నా దగ్గ్రకోచి "బావా నన్ను అక్క గిచ్చింది" అని గట్టిగా చెప్పింది , అందరు షాక్ అయ్యారు. ఒక్కసారిగా సిలెంట్ అయిపొయింది క్లాసు అంతా...
అప్పటినుండి భావాన్ని నాతొ మాట్లాడటం మానేసింది.....ఈలోపు మా ట్యూషన్ లో దుర్గా ప్రసాద్ అనే పదవతరగతి వాడు భవాని ని ప్రేమిస్తున్నాడు అని తెలిసింది, వాడు మా ట్యూషన్ లోనే చదివేవాడు , ఒకరోజు ఆడి పుస్తకం మీద భవాని పేరు చూసి వాడిని ఇరగ కొట్టేశాను, భవాని వాళ్ళ పెద్దనాన్న వచ్చి నన్ను అందరిముందు ఇరగ కుమ్మెశారు. అప్పటిదాకా మంచి పేరు తో ఉన్న నేను, ఒక్కసారిగా అందరి కళ్ళలో రౌడి అయిపోయాను , పదవతరగతి వాళ్ళేమో నన్ను శత్రువుని చూసినట్లు చూసే వాళ్ళు, అందరికి తెలిసిపోయింది నేను భవాని ని ప్రేమిస్తున్నాని,
ఇలా సాగుతూ నేను పదవ తరగతిలోకి వచ్చేసాను...

27, డిసెంబర్ 2011, మంగళవారం
26, డిసెంబర్ 2011, సోమవారం
వీళ్ళు ముస్లిములు కారు.....వీళ్ళ మతం ఇస్లాం కాదు....
ఈ టాపిక్ మీద టపా రాసేంత పెద్దవాడిని కాను, ఇలాంటి సున్నితమైన అంశాలు చర్చిన్చాదగినవి కుడా కాదు....
నిన్న పేపరు చదువుతుంటే ఎందుకో !! ఇలాంటి వాళ్ళ వల్లే కదా చాలా మందికి అవమానాలు అనిపించింది. నేను అనుకోని ఏమి లాభం అందరికి తెలియాలి అని అలా రాసాను..... సహృదయం తో అర్ధం చేసుకున్న పెద్దలందరికీ ధన్యవాదాలు... ఇలాంటి కొంతమంది అతివాదుల వాళ్ళ అందరికి నష్టం...వాళ్ళు ఎ మతానికి చెందినా సరే వాళ్ళను ఆ మతం నుండి వెలి వేయాలి....
ఆ టాపిక్ వదిలేద్దాం ఇక
...మన స్త్రీ... జీవితం...లక్ష్యం....VII వ పార్ట్ త్వరలో రిలీజ్ చేస్తాను....అందరం హాయిగా నవ్వుకుంటూ రాజు బాధను అంతర్లీనంగా వ్యక్తపరుస్తూ...నవ్వుతూనే ఏడిపించే ఈ నవల నా ప్రియమిత్రుడి జీవిత కదః......నాకు ఈ ప్రపంచం లో ఉన్న ఏకైక మిత్రుడు...ఎలాంటి మిత్రుడు అంటే నేను చనిపోతే కుడా నాతోనే ఉంటాను అని మారం చేసే నా ప్రియమిత్రుడి వినోద , విచిత్ర ,విచార, గాధ..ఈ కధ...

వీళ్ళు ముస్లిములు కారు.....వీళ్ళ మతం ఇస్లాం కాదు.... నేను ఈ టపా రాసి చాల మందికి దూరం అవుతానేమో అనిపిస్తుంది , కాని కొంత మందికి తెలియని నిజాలు సమాజం లో ఒక వర్గం మీద ఉన్న అపోహలు తొలగించడానికి నాకు తప్పట్లేదు... ఎవరిని కించపరచడం గాని, లేక ఒక వారగా ప్రచార నిమిత్తం గాని ఈ టపా కాదు..
చెప్పోచేదేంటంటే ...ఏ మతం అయినా పక్కనోడిని హింసించి నువ్వు ఆనందించు..!! అని చెప్పదు....దానికి ఇస్లాం కుడా మినహాయింపు కాదు, ఒకవేళ ఇస్లాం గనక అలా చెప్పిఉంటే ఒక ముస్లిం గా నేను తల దించుకుంటాను, కాని నా పరిశోధనలో నాకు అలా కనబడలేదు , అసలు వచ్చిన సమస్య ఏంటంటే కురాన్ లోని కొన్ని వాక్యాలను తీసుకుని ఇస్లాం లో ఉగ్రవాదం ఒక భాగం అనే భావాన్ని సమాజం లో నాటడంలో అతివాదులు సఫలీకృతులయ్యారు, ఉదాహరణకు కురాన్ లో ఒక చోట " మీకు ఎక్కడ యూదులు కనబడితే అక్కడ వారిని హత మార్చండి" అని వుంటుంది, ఈ ఒక్క వాక్యమే గనక మనం చుస్తే...నిజంగా ఇస్లాం మీద దురభిప్రాయం గలగడం సహజం ఇలాంటి వాక్యాలనే అతివాదులు తమ పబ్బం గడుపుకోవటానికి, తమ అభిప్రాయాలు ఇతరుల మీద రుద్దడానికి, తమ కుయుక్తులు పండటానికి వాడుకున్నారు..ఒకవేళ నేను ఇస్లాం మతం బయట నుండి ఈ వాక్యం చుస్తే కచ్చితంగా... ఇస్లాం తీవ్రవాదాన్ని ప్రోత్సహించే మతం ,పరమత సహనం లేని మతం అని అపోహ పడతాను, ఇక్కడే అతివాదులకి తమ కుయుక్త రాజ్య నిర్మాణానికి బీజం పడింది, అది పెరిగి పెద్దదై, ఒక వర్గం ఈ రోజు ఎన్నో అసమానలతకు , అవమానాలకు గురయ్యింది ,ఆ వర్గ ప్రజల వైపు అనుమానపు చూపు పడడానికి దోహదం అయ్యింది. పైన ఉదహరించిన వాక్యం " " మీకు ఎక్కడ యూదులు కనబడితే అక్కడ వారిని హత మార్చండి" అన్న వాక్యం కురాన్ లో ఉన్నా మాట నిజమే, కాని దాని context ఏమిటి అనేది మాత్రం ఎవరు పట్టించుకోరు.
ఇక్కడ విషయం ఏంటంటే ముస్లిములకు మరియు యూదులకు జరిగిన ఒక యుద్ద సందర్భములో వెలువడిన వాక్యమే ఆ వాక్యం, ముస్లిములతో ఒక ఒడంబడిక కుదుర్చుకొని దాన్ని ఉల్లఘించి యుద్ధానికి పాల్పడిన యూదులను ఉద్దేశించి ప్రేకోనబడిన వాక్యం ఇలా మొదలవుతుంది " యుద్ధ రంగం లో ఎక్కడ యౌడులు కనబడితే అక్కడ వారిని హతమార్చండి " అతీవాదుల కుయుక్తులకు నేను హైలైట్ చేసిన పదాలు హైజాక్ కు గురై, ఎక్కడో అడవులలో దాగి ఉన్నాయ్ దాని వలన ఆ గ్రంధ ఉద్దేశం, ఆ వాక్య సారంశం, ఆ వర్గ జనులు మనో హత్య కు గురయ్యారు, యుద్ధరంగం లో వెన్ను చూపక పోవడం కుడా అన్ని మత ధర్మాలలో కుడా ఒక భాగమే, యుద్ధరంగం లో వెన్ను చూపి పారిపోవడం అనేది ఆ దేశ, వర్గ, ప్రాంత, మత , విశ్వాసాల ను అవమాన పరచడం, నమ్మక పోవడం వలననే జరుగుతుంది అని విజ్ఞత ఉన్నా ఈ మనిషైనా చెప్పే మాటలే....ఇక్కడ యుద్ధ వాతావరణం లో యూదులతో యుద్ధం జరుగుతుండగా యూదులను హతమార్చడం అనేది యుద్ధ ధర్మం మే కాని ద్వేషం కాదు .....ఒడంబడికను ఉల్లఘించటం అన్యాయం మరియు అధర్మం కాబట్టి ఇది ధర్మానికి - అధర్మానికి జరిగిన యుద్ధం గా పేర్కొనబడింది, అందుకే పవిత్ర యుద్ధం అనే పదం వాడబడింది దాని అరబిక్ పదమే ఈ "జీహాద్". అంటే జీహాద్ అంటే మన పైన అన్యాయంగా దాడి చేసేవారి మీద ,అక్రమంగా మన మీద, మన వ్యవస్థ మీద దాడి చేసిన వారిమీద ప్రతిదాడి చేయడం.
ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను ...1920 లో అమెరికా మరియు రష్యన్ల మధ్య యుద్ధం జరిగింది అనుకుందాం, ఆ యుద్ధ సమయం లో అమెరికా ప్రెసిడెంట్ తమ సైన్యాన్ని ఉత్సాహ పరుస్తూ ,స్ఫూర్తి నింపే ఉపాన్యాసం లో "మీకు యుద్ధ రంగం లో ఎక్కడ రష్యన్ కనబడితే అక్కడ హతమార్చండి " అన్నారు అనుకుందాం..ఇక్కడ రెండు విషయాలు గమనించాలి, ఒకటి అమెరికన్ సైనికుడు రష్యన్ కనిపించగానే హతమార్చడం అనేది యుద్ధ ధర్మ భాగమా కాదా? ఒకవేళ ఇతను హతమార్చకపోతే రష్యన్ ఇతనిని హత మారుస్తాడు కదా...ఒకవేళ అమెరికన్ కాని, రష్యన్ కాని యుద్ధరంగం లో తమ తమ శత్రువులను హత మార్చట్లేదు అంటే కారణం ఏమి ఉండొచ్చు? ఒకటి తమ తమ దేశం అంటే వీరికి ప్రేమ లేకపోవడం, తమ ప్రజలను కాపాడాలి అనే ధర్మం నిర్వర్తించక పోవడం, లేదా శత్రు దేశం మీద ఇష్టం ,(జాలి దయ అనే పదాలు అన్నిచోట్లా ఉపోయోగాపడినా యుద్ధరంగం లో వాటిని వాడలేము అనేది నిర్వివాదాంశం) ఇక రెండవ విషయం... ప్రస్తుతం అంటే 2011 లో అప్పటి మాటలు కొంచెం కుదించి " ఎక్కడ రష్యన్ కనబడితే అక్కడ హతమార్చండి" అని అమెరికన్లను ద్వేషించడం అవమాన పరచడం మంచి పనేనా? విజ్ఞత గలిగిన వాళ్ళు చేసే పనేంటంటే " పరిశోధన"!!! అసలు ఈ వాక్యం ఎందుకు వాడబడింది? ఎప్పుడు వాడబడింది? ఏ పరిస్థితులలో ఈ వాక్య ప్రయోగం జరిగింది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం.. గుడ్డిగా నమ్మేసి ద్వేషించడం మూర్ఖత్వం అని నేను అనుకుంటాను.
అసలు ఒక దిన పత్రికలో వచ్చే విషయాలే సరిగా లేవు, వాడి మీద వీడు వీడి మీద వాడు రాసుకోవడం తరతరాల నుండి వస్తున్న ముర్ఖాచారమే ..ఎన్నో మతాల, సంప్రదాయాల, ఆచార వ్యవహారాల, నిలయం అయిన అఖండ భారతావని లో ఒక వర్గం మీద మరొక వర్గం దాడి చేయడం కూడా మానవ సహజ నైజం...కాని విజ్ఞత ఉపయోగించక పోవడం వాటిల్ని నమ్మి గుడ్డిగా ఆచరించడం ఒక్క మూర్ఖరాజ్య ముఖ్యులకే సాధ్యం. ఏమంటారు? ఏ మత దినపత్రిక అయినా గాని వేరే మతాన్ని ద్వేషిస్తూ, కించపరుస్తూ, సంపదికియాలు గాని కధనాలు గాని రాస్తుంది అంటే అది నా వరకు సహజం, ఎందుకంటే,,, అసూయా మనవ లక్షణం, తమ వర్గం మీద అభిమానం, తమది అందరికంటే గొప్ప వర్గం అభిప్రాయం...ఇవి సహజ గుణాలు ...కాని ఇలాంటివి చదివి నప్పుడు మనిషిలోనుంది వేరొకడు బయటకు వస్తాడు వాడు " మూర్ఖుడా" విజ్ఞుడా" అనేది ఆ వ్యక్తీ , అభిరుచి, అలవాట్లు , పెరిగిన వాతావరణం, ఆలోచన శక్తి లాంటి వాటి మీద ఉంటుంది.
మన చరిత్రలలోను ,మత చరిత్ర లోను యుద్ధాలు ఒక భాగామే!!! క్రుసేడులు కానివ్వండి, మహాభారత యుద్ధం కానివ్వండి, జీహాద్ కానివ్వండి, ఇవి అప్పటి పరిస్థితులను అనుసరించి జరిగిన యుద్ధాలే గాని, వాటిని మత ధర్మాలను ముడి పెట్టడం సరికాదు. ప్రతీ మత చరిత్రల లోను రాజ్య పాలన జరిగింది. రాజ్యపాలన వేరు, మత ధర్మాలు వేరు, అసలు ఈ జిహాద్ అనే పదం వ్యాప్తి లోకి రావడానికి మరియు తప్పుగా అర్ధం చేసుకోవటానికి ఆద్యుడు లాడెన్. ఎన్నో సంవత్సరాల నుండి ఈ పదం ఉన్నా గాని ఒక హంతకుడి చేతిలో పడి దీని అర్ధం పాడయ్యిపోయింది, అసలు జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అనే మనకు తెలుసు, కాని ఒక ముస్లిం గా జిహాద్ రెండు రకాలు అని నాకు తెలుసు, ఒకటి జిహాద్ ఎ అక్బర్, రెండవది జిహాద్ ఎ అస్గర్, జిహాద్ ఎ అక్బర్ అంటే పెద్ద జీహాద్ అని జిహాద్ ఎ అస్గర్ అంటే చిన్న జీహాద్ అని అర్ధం, మనసు మీద చేసే యుద్ధం పెద్ద జీహాద్ , శత్రువుల మీద చేసే యుద్ధం చిన్న జీహాద్, మన మనసులో ఉండే ద్వేషం, అసూయా ,కుట్ర, కుళ్ళు , వీటి మీద ఆధిక్యం పొందడమే అసలు జిహాద్..ఏది అర్ధం కాని కొంత మంది మూర్ఖులు ప్రస్తుతం చేస్తున్నది జిహాద్ ఏ అస్గర్ ....మొట్ట మొదట జిహాదే అక్బర్ మీద వీళ్ళు ఎంతవరకు విజయం సాధించారో నాకైతే తెలీదు.....అసలు జిహాద్ చేయడానికి కూడా ఇస్లాం లో కొన్ని నియమాలు ఉన్నాయి ...సత్రుదేసం లేదా శత్రువుల నుండి యుద్ధ ప్రకటన కావడం కూడా అందులో ఒక భాగం...ఇవేమీ లేకుండా దొంగ తనంగా దెబ్బతీయడం జిహాద్ కాజాలదు.... దీనిని ఎంత మాత్రం ఇస్లాం ప్రోత్సహించదు,...ఇస్లాం పేరు చెప్పుకుని ఈ పనికి పాల్పడిన వాళ్ళు , పాల్పడే వాళ్ళు ఎంత మాత్రము ముస్లిములు కాజాలరు..
ఇస్లాం లో కొన్ని నియమాలు ఉన్నాయి అవి అతిక్రమిస్తే ఆ వ్యక్తీ ముస్లిం కాదు అని అవి ఉద్ఘాటిస్తాయి...ఇలా ఇస్లాం లో లేని వాటిని ఉన్నట్టుగా ఉహించుకుని ఆచరించడం కూడా అలాంటిదే...ఏక పాకిస్తాన్ విషయం కూడా కొంచెం ప్రస్తావించుకుందాం..వాళ్ళు ISI కానివ్వండి , తాలిబాని కానివ్వండి, లష్కరే తయ్యిబా కానివ్వండి ఏ ఉగ్రవాద సంస్థ అయినా కానివ్వండి ,అలాగే వాళ్లకు సపోర్ట్ గా పనిచేసే భారత దేశపు సంస్థ లైన " దీన్దార్ అంజుమన్ " "సిమి" వీళ్ళు చేసేది జిహాద్ కానే కాదు ఒక భుబాగం కోసం అది ఇతరులకు చెందినా దాని మీద అన్యాయంగా దాడి చేయడం, ఇప్పుడు.... భారతీయ ముస్లిములు లేదా అందరు భారతీయులు కలిసి తమ దేశానికి చెందినా కాశ్మీర్ మీద దాడి కి తెగబడుతున్న పాకిస్తానీయుల మీద జిహాద్ ప్రకటించవచ్చు..ఇది సమ్మతమే ఇస్లాం లో ....
నేను మనవి చేసేది ఒక్కటే ..గెడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకున్న ప్రతీవాడు ..ముస్లిము కాదు ..అలా అని తీవ్రవాది కాదు...రక్తపాతం సృష్టించే ఈ ముస్లిం కూడా ముస్లిం కాదు ఎందుకంటే కురాన్ ని నమ్మడం ఆచిరించడం ఇస్లాం పద్దతి అయితే అదే కురాన్ ఈ వాక్యం కూడా చెబ్తుంది " మీరు అన్యాయంగా ఒక మనిషిని చంపితే మొత్తం మానవాళిని చంపినట్లే.( ఒక మనిషిని చంపినా పాపం కాదు మొత్తం మనుషులను చంపినా పాపం చుట్టుకుంటుంది) " అని మరి ఆఫ్గనిస్తాన్ మీద దాడి చేసింది అమెరికన్ సైన్యం...WTC లో పని చేసుకుంటున్న వాలు ఏ పాపం చేసారు ? నా భారత సోదరులైనా ముంభై వాసుల మీద ఈ పాప నెపం తో దాడి చేసారు? వాళ్ళు ముస్లిములు కాదు ముస్లిములు కాదు....మా మీద ఏదో అన్యాయం జరుగుతుంది అనుకుని మా రక్షణ కోసం దాడి చేస్తున్నాం అనుకునే ముర్ఖత్త్వపు పాకిస్తానీయులు తెలుసుకోవాలిసింది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ముస్లిములు, ఒక ముస్లిం కాని వేరే వర్గ ఆధిక్యం లో ఉన్న దేశం లో తక్కువ జనాభా కలిగి కూడా ఎంతో సుఖం గా ,హాయిగా , ప్రశాంతంగా..ఎక్కడైనా ఉన్నారు అంటే అది భారత దేశం లోనే.......అది మా దేశ సాంప్రదాయం..మరి అల్లర్లు ???? అనీ అసహనం గా మొఖం పెట్టె వాళ్ళను నేను అడిగే ప్రశ్న ఒక్కటే..." మీరు ఎప్పుడు మీ అన్నయ్యలతో గాని తమ్ముళ్ళతో గాని , అక్కలతో గాని , చ్ల్లెళ్ళతో గాని ,గొడవ పడలేదా ???? మీరు కొట్టుకోలేదా???" సమాధానం సులభం, అనుసరణీయం కుడా ....వాళ్ళు చేసే మూర్ఖపు పనుల వల్ల ప్రపంచం లో ఇస్లాం కి చెడ్డ పేరు..... భారదేసపు ముస్లిమలకు అవమానాలు..ఇదే వాళ్ళ విజయం .
ఇంకొక్క విషయం ఏంటంటే ...ముస్లిములు వేరు భారతీయ ముస్లిములు వేరు,... మన సంప్రదాయం , పరమత సహనం , కలివిడి తనం , భిన్నత్వం లో ఏకత్వం ప్రపంచం లో ఎక్కడా లేవు..వాటిని నరనరాన నింపుకున్న భారతీయ ముస్లిముల్ని పాకిస్తానియులతో పోల్చకండి..ఎందుకంటే మాకు ఈ నేలె ముఖ్యం అని మేము ఇక్కడే ఆగిపోయాం, దేశమంతా అల్లర్లు రక్తపాతాలు జరుగుతున్నా మాకేమి తెలీ నట్లే కలిసి మెలసి ఉండి పోయాం కాని.............. కొంతమంది పాకిస్తానియులను తిడుతూ ...ముస్లిమల వంక ఓరకంటి తో చూస్తుంటే ఉండే బాధ అందరికి అర్ధం కాదు...అందరు కలిసి భారత్ పాకిస్తాన్ క్రికటే ఆట చూస్తుంటే ..పాకిస్తానీ వికెట్ పడితే ముస్లిముల వంక గర్వంగా చూసే చూపు కలిగించే నొప్పి భరించలేము.....అవసరం ఉన్న లేక పోయినా "మేము భారతీయులమే" అని చెప్పుకు తిరాగాల్సిన దౌర్భాగ్యపు బ్రతుకు బాధ మీకు అర్ధం కాదు......ఎక్కడ దాడి జరిగినా అందరు చూసే చూపు కంటే గునపం గుండెల్లో దించితే హాయి గా ఉంటుంది.... ప్రతీ ముస్లిం టెర్రరిస్టు కాదు ప్రతీ టెర్రరిస్టు ముస్లిం కాదు....మమ్మలిని వేరు చేసి చూసే చూపులు మమ్మలిని ఎంత బాధ పెడతాయో తెలుస్కున్తారనే గాని ....ఎవరిని ఉద్దేశించి మాత్రం నేను ఎప్పుడు రాయను..అర్ధం చేసుకోగలరు .......
24, డిసెంబర్ 2011, శనివారం
"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" V
PART - V
( భవాని పుట్టినరోజు కోసమని ఎంతో కష్టపడి గ్రీటింగులు సంపాదిస్తాడు రాజు, తీరా వాటిని ఇద్దామనుకునే సమయానికి భవాని హిందీ క్లాస్ కి రాదు..లత ని మాటలతో మాయ చేసి....లత ద్వార భవాని కి గ్రీటింగ్స్ పంపిస్తాడు రాజు ...తీసుకుని థాంక్స్ చెప్తుంది భవాని....రెండు రోజుల తరువాత క్లాసు కి వచ్చిన భవాని క్లాసు అయిపోయిన తరువాత ఆ గ్రీటింగ్ కార్డులు హిందీ మాస్టారి చేతిలో పెడుతుంది...అవేమి తెలియని రాజు ఉల్లాసంగా వస్తు వస్తూ..గేటు దగ్గర హిందీ మాస్టారిని మరియు హిందీ మాస్టారి చేతిలో ఉన్న తను ఇచిన గ్రీటింగ్ కార్డులను చూసి ఆవాక్కయాడు...ఆ తరువాత ....)
"ఎరా రాజు " భింకరంగా పలికింది హిందీ వొడి గొంతు....
(యండమూరి వారైతే కళ్ళు చింతనిప్పులా మండుతున్నాయి....అతని చేతులు అస్ప్రష్టంగా వణుకుతున్నాయి అని వివరించే వారు మనకంత శీను లేదు కాబట్టి ...సింపుల్ గా )
కోపంగా ఉన్నాడు. నాకేమో నా గుండె మోకాల్లోకి జారి మళ్ళి గొంతులోకి వచ్చి..మళ్ళి మోకాల్లో కి జారి మళ్ళి గొంతులోకి వచ్చి అలా ఒక నాలుగైదు సార్లు కొట్టుకుని యదాస్థానానికి వచ్చింది. నోట్లోనించి మాట వస్తే వొట్టు గుడ్లు అప్పగించి అలా చూస్తున్న ఎందుకంటే నేను షాక్ లో ఉన్నా మరీ.....
మళ్లీ హిందీ వొడి గొంతు ..."మాట్లడవేరా "??
"ఆ సార్...అది..... చెప్పండి సార్ "
"ఇవి ఏంట్రా ?" హిందీ వొడి గంభీర కంఠం
"గ్రీటింగులు సార్" మన కీచు శబ్దం
ఇంతలో రోడ్డు మీద నా ఫ్రెండు దావీదు గేదలని తోలుకువేళ్తున్నాడు..రాజకీయనాయకుడి స్టైల్లో చెయ్యెత్తాడు నేనేమో సినిమా హీరో లాగా నవ్వాను ...ఇక్కడ నేను చేసిన పాపం ఏంటో గాని ...హిందీ వోడికి ఒక్కసారిగా పూనకం వచ్చింది గ్రీటింగులు గోడ మీద పెట్టి మెరుపులా దగ్గరికి వచ్చి వంగోబెట్టి రెండు ఉతప్పాలు ఒక చపాతి ఒక పరోటా వేసుకున్నాడు నా వీపు మీద...ఆడు కొట్టినందుకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయో....అందరిముందు కొట్టినందుకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయో.....లేక అసంకల్పిత ప్రతీకార చర్య వల్ల కళ్ళలో నీరు వచిందో నాకు ఇప్పటికి కన్ఫ్యుసనే..!!! ఏదైతేనేమి పొద్దున్న టిఫిన్ చేయలేదు అన్న బాధ మాత్రం తీరింది ....
"నాకు తెలిదట్రా..!! ఇవి గ్రీటింగులు అని ....నకరాలు చేస్తావా....బ్లా బ్లా బ్లా భౌ భౌ భౌ చై చై చై .....ఇలా ఆయన కట్ట తెగిన కృష్ణ నదిలా వాగుతూనే ఉన్నాడు ....నాకేమో ఎవరు కనబడట్లేదు అంతా గుండ్రంగా తిరిగినట్టు...మసక మసక గా కనిపిస్తుంది.ఏదో ప్రశ్న అడిగినట్టున్నాడు ...చెప్పాగా... మనం వినట్లేదు ఆని, మనమేమో ఒక కొసెన్ మార్కు మొహం పెట్టాం....ఆ తరువాతా...ఒక మంచి పాఠం చెప్పాడు " గ్రీటింగులు ఇవ్వడం లో తప్పు లేదురా.... కాని ఈ సంభోదన ఏంటి ? డియర్ భవాని ఏంటి? ఇంకోసారి ఇలా చేసావా తోలు తీస్తా" అని ఒక వార్నింగ్ ఇచి మనకు సెలవు ఇప్పించాడు. ఆ గ్రీటింగులు నా చేతికి ఇచ్చాడు..అవి పుచ్చుకొని బయలు దేరా.....నాకు ఇంగ్లీష్ లో తక్కువ మార్కులు వచినప్పుడు..పేపర్లు ఇచ్చిన తరువాతా ఆ మార్కులు చూసుకుంటూ కళ్ళు భూమి లో పాతిపెట్టి నడుస్తానే అలా నడుస్తున్నాను....
వీడు ఒకప్పుడు ఇంగ్లీష్ చెప్పే రాణి మేడం గారికి లైన్ వేసాడు అంట ....ఆవిడేమో పడలేదు ఆని పదవతరగతి వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నా....ఇడికి ఇలాగే జరగాలి అది ఈడికి పడలేదని ఇంకా ఎవరు ఎవరికీ లైన్ వేయకూడదు ఆని ఎదవా ఆలోచన వీడిది..ఆని మనసులో అనుకుంటూ వెళ్తుండగా.....ఒక్కసారిగా నాకు పిచ్చ కోపం వచ్చింది ఆ గ్రీటింగులు చింపి ముక్కలు ముక్కలు చేసి , రోడ్డు మీద పారేసుకుంటూ వెళ్ళా....నా వెనక అందరు ఉన్నారు అన్న సంగతి నాకు తెలుసు కాని వాళ్ళ వంక చూసే ధైర్యం నాకు లేకపాయింది ఆ సమయం లో.....అలా ఆ రోజు అనుకోని , ఉహించని ఎదురుదెబ్బ తగిలింది, నాకేమి తెలుసు వెరిగిన నా మనసు ఇంకొంచెం సేపటిలో పగలబోతోందని.....
అలా కోపంగా ఇంటికి వెళ్ళా ....ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో అందరు అదోలా ఉన్నారు ....కొంపదీసి వీళ్ళకు కుడా తెలిసిపోయిందా ఆని మనసులో అనుకుంటుండగా......బక్కెట్టు చేతిలో పట్టుకుని మా నాన్న " రాజు " అన్నాడు .
"ఆ ఏంటి"
"నిమ్మకాయిల తోట ఆవిడ లేదు ఆవిడ చనిపోయింది రా "..
"అయితే నేనేమి చేయను?"
"వెళ్లి చూసిరా , మనకు కావలిసిన వాళ్ళు" ....
"పొతే పోనీ ...నేను వెళ్ళను."
"వెళ్ళవా" మా నాన్న కొసెను లాంటి కోపం తో అడిగాడు,
"నేను వెళ్ళను నాన్న..విసిగించకు "
"వెళ్ళు..నేను చెప్తున్నాను వెళ్లి చూసిరా...."
"ఎవరో పొతే ..నేను వెళ్ళడం ఏంటి ? అసలే నా మనసు ఏమి బాలేదు ఈ రోజు, అవిడేమైనా ఇందిరా గాంధి నా ..? దొంగ నిమ్మకాయలు అమ్మేది..డబ్బులకోసం రోడ్డు మీద పడిన కొబ్బరికాయలు కుడా ఎత్తుకెళ్ళి మా దొడ్లోయే అనేది అలాంటి ఆవిడ కోసమా నేను వెళ్ళేది? వెళ్ళనంటే వెళ్ళను' ఆని కరాఖండీగా చెప్పేసా..
"చనిపోయిన ఆవిడ గురించి అలా మాట్లాడతావేరా" ఆని మా నాన్న ఆ రోజు కు సరిపడా భోజనం పెట్టాడు...పోనీ అప్పుడైనా వదిలాడా అంటే... అదీ లేదు...రెండు కొవ్వత్తులు ఇచ్చి.. ఇవి ఆవిడా సవం దగ్గిర వెలిగించి రా లేకపోతె నీకు ఈ రోజు నా చేతిలో మూడిందే..ఆని హుంకరించాడు...అప్పుడు నాకొచ్చిన కోపానికి మా నాన్న వైపు చూడకుండా మా కొబ్బరి చెట్టు వైపు చూసా ...అది అప్పటినుండి ఇప్పటి వరకు కొబ్బరికాయలు కాయడం మానేసింది....
అసలే విరిగిన నా మనసు ఈ సంఘటనతో ముక్కలైపోయింది ....నా బాధ ఎవడు అర్ధం చేసుకుంటాడు ?? శవం దగ్గిరికి వెళ్లి ఎంత కోపం గా చుసానంటే ...ఇప్పటికి ఆవిడ ఆత్మ నన్ను క్షమించి ఉండదు...ఇంటికి రాగానే ...ఈ బట్టలు మనకు కలిసి రాలేదు ఆని విప్పి ఇంటి వెనకకు వెళ్లి చింపి పాతిపెట్టేసా ఆ ఖాకి ఫాంటు, తెల్ల చొక్కాని .....
ఆరోజు సాయంత్రం వరకు ప్రతీదానికి ఇంట్లో ప్రతి వోక్కళ్ళు తిట్టడమే..అన్ని తిక్కపనులు చేశా... సాయంత్రం పూటా అలా నడుచుకుంటూ సెంటర్ కి వెళ్తుంటే..పాల వెంకటేశ్వరరావు ఇంట్లో ఏదో సినిమా వస్తుంటే చూసా....అప్పట్లో తెలీదు గాని అది దేవదాసు..ఇంకేం మనం కుడా...................
VI వ భాగం త్వరలో ...........
20, డిసెంబర్ 2011, మంగళవారం
జీవితం...స్త్రీ....లక్ష్యం....V ............ ట్రైలర్ ..............
జీవితానికి లక్ష్యానికి మధ్యలో స్త్రీ వస్తే ఏమౌతుంది???? అతి చిన్న వయసులోనే ప్రేమించడం ప్రారంభించిన రాజు సఫలీకృతుడు అయ్యాడా??? రాజు ఎలాంటివాడు?? ఎంతమందిని ప్రేమించాడు ఎంతమందిని వంచించాడు? ఎంతమంది చేత వంచనకు గురయ్యాడు? అసలు రాజు లక్ష్యం ఏంటి??? సాధించాడా??? లేదా?? అనుక్షణం ఉత్కంతం..... అదంత్యం హాస్యం ......ఉత్సాహం, ఉల్లాసం, విచారం, విషాదం, నవరసాలతో సాగే విచిత్ర, విలక్షణ, నిజ జీవిత, కలల వల...... ఈ నవల.......
"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" V వ
భాగం త్వరలో......
"జీవితం....స్త్రీ.....లక్ష్యం......" V వ
భాగం త్వరలో......
19, డిసెంబర్ 2011, సోమవారం
జీవితం...స్త్రీ....లక్ష్యం.....IV
పార్ట్ IV ........
(భవాని పుట్టినరోజు నాడు తనకు గ్రీటింగ్ కార్డ్ ఇద్దామని తను హిందీ క్లాసు కు వచ్చే దారిలో వేచి చూస్తున్నాడు రాజు..హిందీ క్లాసు సమయం అయిపోతున్నా తను మాత్రం రాలేదు, రాజు గాడికి టెన్షన్ పెరిగిపోతుంది...ఆ తరువాత ఏమైందో ఈ రోజు చూద్దాం )
***************************************************
తొమ్మిది అయిదు...
నాకేమో టెన్షన్ గా ఉంది,తనేమో రావట్లేదు....ఎందుకు ఈరోజు లేట్ చేస్తుంది ??
తొమ్మిది పది....
ఏది ? కనబడదే? ఆ ఆ అదిగో వస్తోంది...వచేస్తోంది...నా భావాన్ని వచేస్తోంది...ఇంకో సారి అనుకుందాం ఎలా చెప్పాలో తనకి " హాయ్ భవాని, ఈ రోజు నీ బర్త్ డే కదా అందుకు నీకు ఈ రోజు పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నమాట , మరేమో ఈ గ్రీటింగ్ కార్డులు నీకోసమే కొన్నాను, తీసుకో,,, ఇంకా నీ డ్రెస్ చాలా బాగుంది," ఇలా చెప్పేద్దాం....
అదేంటి ఒక్కరోజులో భవాని ఇంత హైటు పెరిగింది...కొంపదీసి భవాని కాదా ఏంటి? చేతిలో పుస్తకాలు ఉన్నాయే....
అరె లత వస్తుంది..భావాన్ని కాదా....దగ్గరికి వచేసింది.....
"రాజు !! ఏంటి ఇక్కడున్నావ్? క్లాసు లేదా?"
"ఆ ఉంది భవాని పుట్టినరోజు కదా గ్రీటింగ్స్ ఇద్దాం అని వెయిటింగ్ లే తనేమో ఇంకా రాలేదు.."
"తను ఈ రోజు రాదులే...వాళ్ళ ఇంటికి వెళ్ళే వస్తున్నాను"
"ఎ ఎందుకు రాదు?"
"తనకి జ్వరం '
"జ్వరమా !! నిన్న బానే ఉందే!
"అది అంతేలే ఆడపిల్లలకి ఎప్పుడైనా రావోచు జ్వరం "
"ఎందుకు? రావోచు?"
"అవన్నీ నీకెందుకులే గాని...గ్రీటింగ్ కొన్నావా? చూపించు?"
"ఇవిగో...పద నడుచుకుంటూ మాట్లాడుకొందాం"
"ఎవరైనా చుస్తే బాగోదు రాజు'
"చ నిన్ను నన్ను చూసి అక్క తమ్ముడు అనుకుంటారులే, నీ పర్సనాలిటీ ఎక్కడా!! నాది ఎక్కడా!! మనల్ని చూసి ఎవరు లవర్స్ అనుకోరు"
"అబ్బ..!! బలే ఉన్నాయ్ రాజు గ్రీటింగ్స్...భవాని లక్కీ....నువ్వు చాలా మంచోడివి...మావాడు ఏమి కొనడు..అసలు నా వంకే చూడట్లేదు...నేను బావుండనా రాజు???
"బానేఉంటావుగా లతా నీకేంటి...గోడకి కొట్టిన సున్నం లాంటి కలరు,సౌందర్య లా... అసలు సౌందర్య ఏంటి..!! సౌందర్య అమ్మలా ఉంటావ్"
"సరే పద ..పొగిడింది చాలు గాని క్లాసు దగ్గిరికి వచ్చింది హిందివోడు చుస్తే మళ్ళి ఎమన్నా అంటాడు నువ్వు ముందు వెళ్ళు ఇవిగో నీ గ్రీటింగులు"
"అవి నీ దగ్గిరే ఉండని, క్లాసు తరువాత తీసుకుంటా..."
క్లాసుకైతే వెళ్ళాను గాని కళ్ళన్నీ గుమ్మం వైపే ఉన్నాయ్...ఏమో..?? వస్తుందేమో !! అని......ఈ లోపు మన మైండ్ దుమ్ము కొంచెం దులిపితే మొన్న లత కి సోప్ వేసిన విషయం గుర్తుకు వచ్చింది....ఒక పధకం రూపు దిద్దుకుంది మన చిన్ని మెదడులో ..ఆ ఏముంది లత కి గ్రీటింగ్స్ ఇచ్హి వాటిని భవాని ఇంటికి వెళ్లి ఇవ్వమని చెప్పాలి, అలా చేస్తే నీ గురించి దాము దగ్గిర తెగ పోగిడేస్తా దీంతో నీ మీద వేపరీతమైన లవ్ వస్తుంది అప్పుడు మీరిద్దరూ కూడా గ్రీటింగులు ఇచుకోవచ్చు..అని ఒక చిన్న సోది చెప్తే చాలు పిచ్చిది..నమ్మేస్తుంది...అని ఒకసారి క్రురంగా నవ్వి, లత వైపు చూసా,.... తనే మో దాము గాడినీ నా వైపు చూస్తావా.....!! చస్తావా ......!! అన్నటు చూస్తుంది ఆడేమో రెండు మోచేతులు డెస్క్ మీద పెట్టి అరచేతుల్లో గడ్డాన్ని పెట్టుకుని ఈ పాఠం నాకు వస్తుందా... రాదా.... !! అన్నట్టు తెగ చూస్తున్నాడు నల్ల బోర్డు నీ.... "పిచ్హ మంద "అని ఒకసారి మనసులో అనుకోని.....నేను కూడా పాఠం వినడంలో పడిపోయా...
క్లాస్స్ అయిపోయిన తరువాతా హిందీ మాస్టారు సెంటర్ కి వెళ్లారు కిళ్ళి కోసం..మేమేమో కాసేపు "షో "ఆడుకున్దామని ..పేర్లు రాసుకుని ఆడుకున్నాం..అదేంటో ఎప్పుడు నీనే గెలుస్తాను.....మళ్ళి నీనే గెలిచా...మనం బై బర్తు లక్కి అనుకుంటా...మెల్లగా లత దగ్గరికి వెళ్లి...మన పధక అమలు కై మాటల గారడీ మొదలు పెట్టా...మొదటిలో కొంచెం బెట్టు చేసింది కాని ...తరువాత వప్పుకుని తీసుకుంది......ఆనందమే ఆనందం...ఆనందమే జీవిత మకరందం...అని పాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను...
******************************************
సాయింత్రం వరకు ఎలా ఉన్నానో ఏమి తిన్నానో ఎక్కడెక్కడ ఆడుకున్ననో తెలీదు గాని..సాయంత్రం అవ్వగానే ఒక్కసారిగా ...లత ఇంటి వైపు మెరుపు వేగం తో దుసుకువేల్లిపోయా....వెళ్తూ వెళ్తూ..ఒక పుస్తకం కూడా పట్టుకున్నాను చేతిలో...ఒక వేల వాళ్ళ అమ్మ కు ఏమైనా డౌట్ వస్తే ఈ పుస్తకం ఇవ్వడానికి వచ్చా అని చెప్పి మన మేటర్ ఏమైందో కనుక్కుందాం అని మన ప్లాన్ అన్నమాట....
మన టైం బాగుంది లతా దొరికింది... అంటె.... వాళ్ళ ఇంట్లోనే ఉంది ఎక్కడికో టీవీ చూడటానికి వెళ్ళకుండా......
"ఏమైంది లతా ఇచ్చావా?"
"ఇచ్చారా , తీసుకుంది "
"రా" అంటుంది ఏంటి? అంత నీరసం గా చెప్పుద్దె!!! కుళ్ళు..!! దీనికి మా ప్రేమనీ చూడలేక ఏడిచి చస్తున్నట్టుంది, దీని డిప్పమొహం ఇదీను....ఏదైతే ఏమి లే మన పనిచేసిపెట్టింది కదా దీనికి ఒక చాక్లేట్ ఇవ్వాలి రేపు...అని మనసులో అనుకుని
"తీసుకుందా....ఇంకా ఎమంది? ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ?బాగుందా తను? జ్వరం తగ్గిందా?
"ధాంక్స్ చెప్పమంది రా .....బానే ఉంది.."
దీని గుండు మొహం "రా" అనేస్తుంది నన్ను...ప్రస్తుతానికి ఏమి అనలేం ...." అవునా !! ఇంకా ఏమి చెప్పింది లతా?"
"ఏమి చెప్పలేదు రా...'
"హ్యాపీ గా తీసుకుందా?"
"అవును ....నవ్వుతు తీసుకుంది.....నువ్వు లక్కీరా....."
తను విసిరి కొట్టాలి అనుకుందేమో ఇది.... నవ్వుతు తీసుకునే టప్పటికి దీనికి నీరసం వచినట్లుంది....హహహ ..నా భవాని నా మాటలా..ఎంతైనా దీని ప్రేమ ఈ మధ్య పుట్టింది మరి నేనో అయిదవ తరగతి నుండి లైను వేస్తున్నానయే...
లత కి ధాంక్స్ చెప్పి నేను నడుచుకుంటూ వెళ్తుంటే......నా మనసు మాత్రం గంతులేసుకుంటూ వెళ్తుంది "అ ధింక చిక అ చిక ఆ చికా " అని పాట కుడా పాడేసుకుంటుంది.....
ఇంకా రెండు రోజులు స్కూల్ లేదు, హిందీ క్లాసు ఉంది...రెండో రోజు కూడా భవాని రాలేదు.....మూడోరోజు
నా జీవితం లో మర్చిపోలేని రోజు.....భవాని పచ్చ కలరు లంగా జాకెట్టు లో వచ్చింది అసలే భావాన్ని ఎర్రగా తెల్లగా అందంగా ఉంటుంది కదా...ఈ డ్రెస్ లో ఇంకా అందంగా ఉంది ..రోజు స్కూల్ డ్రెస్ లో చూసి చూసి సడన్ ఇలా కొత్త బట్టల్లో చూసే సరికి నన్ను నేనే పొగుడు కున్నా...అబ్బ ఏమి టెస్టు నాది అని....రాగానే నా వైపు చూసింది...ఆ రోజు ఎంత ఆనందం వేసిందో.......నేను నవ్వాను ...తను నవ్వలేదు ..సిగ్గు పడుతుంది అనుకుంటా......ఆ క్లాసు అంటా భావాన్ని నే చూస్తూ కూర్చున్నా...తను కూడా నా వైపు దొంగ చూపులు చూస్తుంది, నాకేమో పిచ్హ పిచ్హ ఆనందం, ఈ టైం లో గనక హిందీ మాస్టారు సోషల్ కోసేను అడిగినా సమాధాన చెప్పేస్తా అంత ఉత్సాహమ గా ఉన్నానన్నమాట. ఓ మీకు తెలీదు కదూ..!! మనకి సోషల్ రాదు.....హిహిహ్
క్లాసు అయిపొయింది......ముందుగా ఆడపిల్లలు లేచి బయటకు వెళ్లారు ...మాస్టారు కుడా వెళ్ళిపోయారు...మేమేమో పుస్తకాలు సర్డుకున్తున్నాం బాగులోకి....అందరు వెళ్ళిపోయినా తరువాతా దాము గాడికి సుభ్రమన్యానికి చెప్పా ఇలా గ్రీటింగ్ ఇచ్చాన్రా అని ....అబ్బో వాలు నా వైపు చుసిన చూపు " నా మనస్సు సే సే సే సే ఈ మనసే సే సే సే సే ...పరిగెడుతోంది నీకేసే..... వినమంటోంది తన ఊసే ......కలేలగాసే కలవరమాయే మదిలో నిను చూసే........అనే తొలిప్రేమ పాటలో పవన్ కళ్యాణ్ నీ దగ్గరనుంచి చూసి నట్లు చూసారు నా వైపు నాకేమి తెలుసు కాసేపట్లో నా కాపురం కులబోతోందని...అలా నవ్వుకుంటూ బయటకు వచ్చాం.....సడన్ గా గేటు దగ్గిరా హిందీ మాస్టారు...భవాని ...కొంతమంది అమ్మాయిలు..లత కుడా...హిందీ మాస్టారి చేతిలో నేను భవాని కి ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్...... ఇంకేముంది మన "సీన్ సితార ..దుని హందారా" అయి పోయింది.....అప్పుడు నా గుండె కొట్టుకున్న స్పీడ్ గనక గిన్నిస్ వాళ్ళు లెక్కపెడితే ...వరల్డ్ రికార్డ్ ఒకటి మన ఖాతాలో పడుడేంది.....సరే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది మనం ఊహించింది ఒకటి ...అక్కడ జరిగింది మరొకటి....అదేంటంటే......
( ఆ చెప్పేస్తారు.....అప్పుడే....!!!! వెయిట్ చేయాలి...టెన్షన్ పడాలి... BP పెరగాలి....... మా సిస్టర్, డాక్టర్ ప్రాక్టీస్ బాగా పెరగాలి.........హహహ )

ఈ రోజు ఆఫీసు లో పని మరీ ఎక్కువగా ఉంది....సెక్రటరీ వాడి దేశం వెళ్తున్నాడు, అందుకే కొన్ని అర్జెంట్ పనులు వచ్చి పడ్డాయి, రెండు మీటింగులు ఒకే రోజులో అంటే, ఎలా జాబు చేసేది??? వెధవన్నర వెధవలు....అస్సలు ఖాళి దొరకనివ్వట్లేదు...ఎమన్నా అంటే జాబు సెక్యూరిటీ భయం ఒకటి...వెధవ సంత.....
18, డిసెంబర్ 2011, ఆదివారం
జీవితం......స్త్రీ .....లక్ష్యం III
PART III
( భవాని పుట్టినరోజు నాడు గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలి అని ఒక పధకం వేసిన రాజు మొదటి మెట్టు గా ఒక మధ్యవర్తి ని ఎంచుకున్నాడు...(లత అనే వీడి సహాధ్యాయిని ) ఆ గ్రీటింగ్ కార్డ్ సంపాదించడానికి ఒక దొంగతనం ప్లాన్ చేసి విఫలం అవుతాడు రాజు, ఆ తరువాత తన ఉరిలో ఉన్న ఒక FANCY షాప్ అతని దగ్గర తన మాటల చాకచక్యం తో కార్డులు అప్పుగా సంపాదించి స్కూల్ కి వెళ్ళాడు,)
మధ్యానం లంచ్ బెల్ తరువాత అలా బ్యాగ్ పట్టుకు వెళ్ళిపోతున్న నన్ను ఈ మాస్టారు కనిపెట్టలేదు గాని ఈ గోపాలం గాడు తగిలాడు.
"ఎరా రాజు మధ్యానం రావా ? బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నావ్"
"లేదురా తలనొప్పిగా ఉంది అందుకే రెస్టు తీసుకుందామని "
"రేపు హిందీ క్లాసు కి వెళ్తావా ? ఆదివారంగా !!!"
"వెళ్ళాలి రా పరీక్షా దగ్గిర పడుతుంది " ఉంటాన్రా బై ...
"బై "
ఈడి ఎదవ నస వీడికేందుకో నేను ఏమిచేస్తే ఎప్పుడు నా మీద పది ఏడవడమే డబ్బా మొహం గాడు...అలా ఆరోజు మధ్యానం ఇంటికి వెళ్లి ఇంట్లో ఒక అబద్దం చెప్పి సెటిల్ అయిపోయా ..మధ్యానం మా అమ్మ కు పడుకోవడం అలవాటు..అదే మనకు అదును కూడా ...అమ్మ పడుకోగానే పుస్తాకాలు తీసి రక రకాల డిజైన్ లలో భవాని పేరు చెక్కడం మొదలుపెట్టా ఏదేమైనా ఒక డిజైన్ చాలా బాగా నచ్చింది..అదే గ్రీటింగ్ కార్డ్ మీద రాసి రేపు ఎలా ఇవ్వాలా అని తెగ ప్లాన్లు వేసా...ఇక నాకు తట్టింది ఏంటంటే రేపు తను వచ్చే టైం కి తను వచ్చే దారిలో వెయిట్ చేసి తను వస్తున్నప్పుడు ఇచ్చేద్దాం అని ...
ఆ రాత్రి నిద్ర పడితే ఒట్టు ....నేను తనకి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి నట్టుగా...... తను తీసుకుని థాంక్స్ చెప్పినట్టు గా ....నువ్వు చాలా మంచోడివి......... అన్నట్టుగా ఏవేవో .................ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు గాని పొద్దునే నన్నారు తెగ తిడుతున్నారు...ఎవర్నో అయితే నాకెందుకు ? నన్నే....పాలు తీసుకు రాలేదని....లేచి వెళ్ళాను మా దిబ్బ దగ్గిరకి " దిబ్బ అంటే మా పొలాల దగ్గిర మాకు కొంచెం మెట్ట ఉంది లెండి ఇంగ్లీష్ గడ్డి వేస్తాం అక్కడ, గేదలు అక్కడే ఉంటాయి, బలే ఉంటది అక్కడా చల్లగా ...అక్కడ సపోటా, కొబ్బరి, నిమ్మ , బత్తాయి , ఉసిరి, చింతకాయల చెట్టు, ఉన్నాయ్ మా ఉళ్ళో నాకు నచ్హిన ప్రదేశాలలో మా దిబ్బ ఒకటి ...సరే సరే...లేచానా!...అందరిని తిట్టుకుంటూ పాలకి వెళ్ళాను ..రాగానే ఫ్రెష్ గా తయారయ్యి ఏమి తిన్నానో ఏమి తాగానో గుర్తులేదు కాని నా దగ్గిర ఉన్న ఖాకి కలరు ప్యాంటు , తెల్ల చొక్కా వేసుకొని గ్రీటింగ్ కార్డ్లని బద్రం గా దాచుకుని తొమ్మిది గంటలకు హిందీ క్లాస్స్ అయితే ఎనిమిది గంటలకే బయలు దేరి భవాని వచ్చే దారిలో కాపు కాసా.....అబ్బా వెయిటింగ్ ఎంతా చిరాగ్గా ఉంటుందో
.....ఎనిమిదిన్నర ....
తను రావట్లేదు ...ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు నన్ను విచిత్రం గా చూస్తున్నారు...వీడెందుకు ఇక్కడ ఉన్నదా అని!! అప్పట్లో పిల్లలని ఎత్తుకేల్లె వాళ్ళు తీరుగుతూ ఉండే వాళ్ళు ..నేను కుడా అదే బాపతు అనుకుంటున్నారేమో..లేకపోతె దొంగ కోళ్ళ కోసం వచ్చాను అనుకుంటున్నారేమో....ఇది తొందరగా వస్తే బాగుండు.... ఇది ఇంతే ఎప్పుడు లేట్......
ఎనిమిది నలభై అయిదు ...
ఉహు రావట్లేదు.....నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది ...ఇప్పటికి యాభై సార్లు అనుకున్న తనతో ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ,
పదినిమిషాల తక్కువ తొమ్మిది....
రావట్లేదు...అసలు కనబడట్లేదు.....తను ఎప్పుడు మానదు క్లాస్స్ కాని ఎప్పుడు కరెక్ట్ టైం కి వస్తుంది కొంచెం ముందు కొంచెం లేటు రాదు..
అయిదు నిమిషాల తక్కువ తొమ్మిది...
ఏది ? కనబడదే? ఇవ్వాళా రాదా ఏమి కొంపదీసి ??
తొమ్మిది ....
నాలో నేనే అనుకుంటున్నా "ఒరే రాజు గా తను ఎప్పుడైనా రావచ్చు..కొంచెం జాగర్తగా మాట్లాడు ....ఈ ధన్ ధన్ ...మని సౌండ్ ఏంటి ? ఓహో నా గుండె చప్పుడా..!!! నాకే వినిపిస్తుందే....నా జేబు కి పెట్టుకున్న పెన్ను ఎగిరెగిరి పడుతుంది నా గుండె కొట్టుకునే వేగానికి ...బాగా దాహం గా ఉంది ......అరచేతిలో చెమట వస్తుంది...ఇక తను వచేస్తుంది....నేను ఇచ్చెయ్యాలి ఈ గ్రీటింగ్ కార్డులు...."
తొమ్మిది అయిదు ...............
********************************************
కొంచెం టెన్షన్ కోసం.....అలా వదిలిపెట్టా ...కాసేపు టెన్షన్ పడండి.....ఈ లోపు లంచ్ ఫినిష్ చేసేస్తా.....ఏమి జరిగిందో ఊహించండి ....దీని తరువాత పార్ట్ చదవకుండా!!!!

16, డిసెంబర్ 2011, శుక్రవారం
జీవితం......స్త్రీ .....లక్ష్యం III
ఈ కధ రాద్దామంటే టైం కుదిరి చావట్లేదు... ఈఈఈ ఈఈఈ
12, డిసెంబర్ 2011, సోమవారం
ప్రియరాగాలు .....నన్ను ఏడిపించిన టపా
ఈ రోజు ఆనందంగా వచ్చా ఆఫీసులోకి...
బాగానే మొదలుపెట్టా .....నా వర్క్ ని ...మధ్యలో బ్లాగ్ ఓపెన్ చేశా ....అనుకోకుండా ఒక బ్లాగ్ కి వెళ్ళా ....ప్రియరాగాలు ...
అసలు ఏమని రాయాలో కుడా అర్ధం కావట్లేదు ....
నా జీవితం లో నేను చూసిన ఆడవాళ్ళు చాలా తక్కువ ....
మా అమ్మ .....నాకే అర్ధం కాదు తను, కోపం ఎక్కువ అనాలో, మనస్తత్వమే అలా ఉందిలే అని అనుకోవాలో , ఎప్పుడు కోపంగా ఉండేది మా అమ్మ ఒక్కోసారి వాళ్ళు సరదాగా అన్నా... నేను నిజంగా వీళ్ళ పిల్లవాడిని కాదేమో నేను నిజంగా దొరికానేమో వీళ్ళకి, అనుకునే వాడిని ...నాన్నతో చెప్పేవాడిని చిన్నప్పుడు నాకు ఈ అమ్మ వద్దు అని ...చిన్నతనం కదా ....పోనీ నన్ను సరిగా చుసుకొదా ? అంటే నేనంటే ప్రాణం... ఇంటికి లేట్ గా వస్తే నేను వచ్చే వరుకు పడుకోదు...ఎక్కడైనా దూరంగా ఉంటె రోజు తలుచుకుని బాధపడుతుంది ( మా చెల్లెళ్ళు చెప్పేవారు) ఇప్పుడు కొంచెం పెద్ద వాడిని అయ్యా కదా ....అమ్మ ఏమిచేసినా నా కోసమే అనిపిస్తుంది.....ఇక నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నాగాని, చిన్నది ఏమో మరీ చిన్నది (నేను ఇంట్లో ఉండేప్పుడు)......పెద్దది.... హాస్టల్ లో .....ఇక నేను ప్రేమించిన భవాని , నా క్లాసు అమ్మాయిలు ( హై స్కూల్ లో) లత , తో కొంచెం మాట్లాడే వాడిని ....
ఇంటర్లో అమ్మాయిలని కామెంట్లు చేసే పోకిరి చేష్టలేగాని ఎప్పుడు కుడా వారితో క్లోజ్ గా ఉన్నది లేదు ...డిగ్రీ లో మాత్రం ఒక అమ్మాయి నాతొ మాట్లాడేది ..చాలా క్లోజ్ గా ...తను అందరితో అలాగే క్లోజ్ గా ఉండేది ..అది నాకు నచ్హక నేను తనతో మాట్లాడేవాడిని కాదు .....అదేంటో చిన్నపటినుండి ఏదైనా నాది అనుకుంటే ...అది నాతోనే ఉండాలి అనుకొనే మనస్తత్వం నాది ....ఇంకా స్నేహితులతో కలిసి అమ్మాయిలని ఏడిపించడం షరా మామూలే....ఎంతో మందిని ప్రేమించేసాను గాని ఎవరికీ చెప్పే ధైర్యం చేయలేదు ..కాని MBA లో మాత్రం ఒక్క అమ్మాయి తో ఫోనే లో పరిచయం ...అది చాలా దూరం వెళ్ళడం ...ఆ తరువాత అంటే ప్రస్తుతం ఆ పరిచయం ఇవ్వాళా రేపా ? అన్నట్టుగా పాడిమీద ఉండటం ....ఇవి కాక నా టీచర్లు ....నా కొలిగులు ...ఇప్పుడు నా RAAFSUN లో చేసే అమ్మాయిలు లేదా ఆడవారు ...మీకు తెలుసు వీల్లందిరితో మన పరిచయం ప్రవర్తన ఎలా ఉంటుందో?? అంతా ప్రోఫెస్సనల్ గా ఉంటుంది....
ఇంతే నా జీవితం లో ఆడవారి పాత్ర .....అందరు అమ్మలానే ఉంటారేమో అనుకున్నా...ఉహు కాదు కొంతమంది భవాని లా ఉంటారు అనుకున్నా ...ఉహు ...పోనీ సినిమాల్లో చూపించే వాళ్ళల ఉంటారు అనుకున్నా ....ఎక్కడ సరైన అవగాహన లేక ....వయసుతో పాటు ఆడవారి పై ఉండే ఆకర్షణే తప్ప ...ప్రత్యెక అభిమానం అంటూ ఏది లేదు ....
ఈ నా విదేశీ జీవితం నాకు చాల నేర్పింది ...ప్రతి మనిషి స్వార్ధపరుడే...నేను కూడా...కాని అతి స్వార్ధపరుడిని మాత్రం కాదు ...కాని ఇక్కడకు వచ్చి స్వార్ధపరుడి లో రెండవ క్లాసు పాస్స్ అయ్యా.....జనాలని గుడ్డిగా నమ్మే నేను ...నాతొ ప్రేమగా మాట్లాడితే శత్రువు ని కూడా నమ్మే నేను ....ప్రతివాడిని అనుమానంగా చూడటం అలవాటు చేసుకున్నా...తప్పట్లేదు నేను బాగున్నా... సమాజం బాలేదుగా..నేను సమాజం లో ఉండాలి అంటే కొన్ని త్యాగాలు తప్పవు ...నన్ను నేను మార్చుకోవాలి .....ఈరోజు కాకపొతే రేపు మారాలి ....మారాల్సి వస్తుంది .... గలగలా మాట్లాడే నేను ముభావి ని అయిపోయా .....నీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోసార్ర.. అనే వాళ్ళు అందరు మా ఉరిలో ,అలాంటిది ఇక్కడ ఏందీ భై అసలు మాట్లాడవు ? అనే స్టేజి కి వచేసా ....కాని అప్పటికి ఇప్పటికి నాలో మారని దృక్పదం ఏదైనా ఉంటె అది ఒకటే.....డబ్బు అనేది జీవితం లో ఒక భాగం,రేపటికోసం కాదు ఈరోజు కోసం కర్చు పెట్టుకోవడం నాకు ఇష్టం ...నేను MBA లో ఉండగా ఎప్పుడు అంటూ ఉండే వాడిని " డబ్బు ది ఏముందిరా కుక్క ను తంతే రాలతాయి" అని ఎప్పుడైనా సినిమా కి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను వాడే డైలాగు ఇది ..ఆ తరువాత ఎవడో ఒక స్నేహితుడి దగ్గర అప్పుచేసి వెళ్ళేవాళ్ళం ....నా ఫ్రెండ్ అనే వాడు ఎరా ఆడిని తన్నావా ( డబ్బులు ఇచిన వాడిని ) డబ్బులు రాలినాయి ..!! అనే వాడు ....
అయ్యో ఏదో మొదలు పెట్టి ఏదో రాసేస్తున్నా ....ఆ ఆడవారు ....నాకు అంతగా పరిచయం లేని పదం లా అనిపిస్తుంది....నేను ప్రేమించిన ఇద్దరు ఆడవారు (సిన్సియర్ గా) ఒకళ్ళు అస్సలు ప్రేమించ కుండా గాయ పరిచారు ఇంకొకకల్లు ప్రేమించి గాయపరిచారు .....
ఈ విదేశియానం లో నాకు దొరికిన ఒక వ్యాపకం తెలుగు నవలలు చదవడం ..అంతర్జాలం లో ఎన్ని కావాలంటే అన్ని ఉండేయి ...తెలుగు నాకు ఎంత ఇష్టం అంటే .....ఇప్పటికి కొంతమంది తెలుగు మాత్ర భాష మరియు ప్రాంతీయ భాష అయినవాళ్ళు కూడా నా అంత బాగా మాట్లాడలేరు అని చెప్పుకోవచ్చు ...అంతలా నేర్చుకున్నా...
ఇలా కధలు వెతుకుతూ వెతుకుతూ ఒక మంచి ముహూర్తాన ....బ్లాగ్లోకం లో వచ్చి పడ్డాను ఇక అప్పటినుండి బ్లాగులే మన కాలక్షేపం ....నాకు బాగా నచ్హిన బ్లాగులలో ప్రముఖం గా బులుసు వారిది...అల అలా ...ఆడ పేర్లు చూసి ఆకర్షితుడినై...వాళ్ళ బ్లాగులలో కి వెళ్ళిన నేను ....నిజంగా "ఆడాళ్ళు మీకు జోహార్లు" అని అందామనుకున్నా..!!!! తరువాత నా కొటేషన్ ని వదిలా " కొందరు ఆడాళ్ళు మీకు మనస్పూర్తిగా జోహార్లు " అని ...కొన్ని బ్లాగులు నిజంగా నన్ను కదిలించినై ....నేను ఎ ఒక్కటి ఇక్కడ ప్రస్తావించను గాని ..ఒక ఆవిడ బ్లాగ్ చదివి నిజంగా ఇవిడ జీవితం ఇంత ఆనదంగా హాయిగా ఉంటుందా ? లేకపోతె కధలు రాస్తుందా ? అని ఆలోచనలో పడ్డా...ఎంతబ్లాగ్ అయితే మాత్రం....మరీ ఇంత అబద్దాలు రాయాలా అనిపించింది....ఆవిడనే అడిగాను ఏమండి మీ జీవితం లో కష్టాలు లేవా ? ఇంత సరదాగా రాస్తున్నారు ? నాకేమో ఇన్ని కష్టాలు ఉన్నాయ్ ?అని ....పాపం ఆవిడా నాకు రిప్లై ఇచి నన్ను ఓదార్చింది ....
మనకు పరిచయం లేని ఆడవారి ని "ఆడ" వారిగానే చూసే మగబుద్ది చాలామందికి ఉంటుంది...జగద్విదితం ...నేను మినహాఇంపు కాదు ....కాని పరిచయం అయినతరువాత కూడా "ఆడ"వారిగానే చూసే బుధి కనీసం 40 శాతం మగవాళ్ళకి ఉంటుంది అని నేను అనుకుంటున్నా...ఆ నలభై శాతం మిగిలిన అరవై శాతం మధ్యలో ఉండే దుర్భాగ్యం నాది ...
అలాంటి నన్ను కొంచెం కొంచెం గా మార్చిన ఆడ బ్లాగర్లకు వందనాలు....అనుకోకుండా ఇందులో ఒక మగ బ్లాగరు కూడా ఉన్నాడు , పేరు ప్రస్తావించను గాని అయన బ్లాగులో అయన కాలేజి విషయాలు రాసుకుంటూ GAURI అనే తన సహాధ్యాయి గురించి రాసారు ...అంబులెన్సు లో పరీక్షలకి హాజరు అయిందిట...చనిపోతానని ముందే తెలిసినా ఎప్పుడు ఆ బాధ ని ఎవరితో పంచుకోలేదు ఎవరి జాలి కోరలేదు ...నిబ్బరంగా ఉన్న తన గురించి తెలుసుకొని మనసులోనే దణ్ణం పెట్టాను ఆవిడకి ...ఆవిడ ఆత్మా సంతిచాలని కోరుకుంటున్నాను.
అసలు నా బాధ అంటా ప్రియరాగాలు అనే బ్లాగ్ చదివిన తరువాత మొదలైంది ...చదివిన మొదటి టపా " చేతులెత్తి" ఆ ఎవరో బంధువు చనిపోయరేమో లే అనుకున్నా....మొత్తం టపా చదివినా సరిగా అర్ధం కాలేదు ఏడు ఎనిమిది సార్లు చదివా ..ఆ బ్లాగు అక్కచేల్లెల్లది ....అంటే ఆ బ్లాగ్ రాసిన ఆవిడ ఇక లేదు అని ...వాళ్ళ అక్క రాసిన టపా అది అని అర్ధం అయ్యింది....ఆవిడ టపాలు చదివా ....ఆవిడా రాసిన "మైలుదూరం" లో నాకు ఏడుపంటే యాక్ అంటూనే తన నాన్నారిని తల్చుకుని బాధపడి మళ్ళి తేరుకొని మనలని నవ్వించిన ఆ మాహతల్లి ని తలచుకొని నను ఏడవలేదు కాని నా కళ్ళు ఎందుకో నీళ్ళు రాల్చాయి... నాకు దేవుడు కనిపించి ఏమైనా కోరుకో అంటే నేను కోరుకునేది ఎంతో తెలుసా " దేవుడా మంచి మనసున్న అడ్డవాల్లని పుట్టించు కవ్వించే వాళ్ళని మాత్రం వద్దు కవ్వించే వారి వల్ల మంచి వాళ్ళు కూడా తమ ఉనికి కోల్పోతున్నారు ...లేదా వాళ్ళని విడి విడి గా చూసేంత బుద్ధి మగవాళ్ళకు ప్రసాదించు అని " అమ్మా!!! ప్రియా అయ్యంగార్ ...నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ....నువ్వు కనబడని లోకాలకేల్లిపోయినా కూడా నన్ను మార్చి నా జీవితం లో నవ్వు నింపావు..నేను పరిపూర్ణంగా మారడమే నేను నీకు ఇచ్హే నివాళి "
ఆడవాళ్ళూ అంటే ఇంతే ..ఇందుకే ....అని ఎల్లప్పుడూ అనుకోకపోయినా ..అప్పుడప్పుడైనా అనుకున్నందుకు చాలా బాధపడ్డా....ఇక అనుకో కూడదు....
మనసంతా పాడి పోయింది ఈ రోజు.......
10, డిసెంబర్ 2011, శనివారం
జీవితం......స్త్రీ ....లక్ష్యం II
PART II
కోలుకోలేని ఎదురుదెబ్బ ....రాజు గాడికి వీడి పుట్టిన రోజు ఎప్పుడో తెలీదు కాని భవాని పుట్టినరోజు మాత్రం తెలుసు ...అందుకే తగిలింది వీడికి ఎదురుదెబ్బ ....అసేలంజరిగిందంటే ...వీడు వీడి సహా విద్యార్ధులు అయిన వెంకటేశ్వర్రావు , దామోదరం అరుణ ,స్వాతి ,మహేశ్వరి, భవాని,నీలిమ, లత , కలిసి దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించే హిందీ పరిక్షలు రాద్దాం అని హిందీ మాస్టర్ దగ్గరికి వెళ్లారు ..ఆయన అందుకు ఒప్పుకుని ప్రతి ఆదివారం తన ఇంట్లో ప్రివాతే చెప్తాను అని ఫీజు కట్టించాడు...సో ప్రతీ ఆదివారం భావాన్ని ని కలవదనికైనా ఇష్టం లేకపోయినా ప్రైవేట్ కి వెళ్ళేవాడు రాజు... హిందీ మాస్టారు ప్రైవేట్ మొదలు పెట్టేలోపు వీళ్ళందరూ కలిసి ఏదో ఒక ఆట ఆడుకునేవారు...అలా కొంచెం భావానికి దగ్గిర కాగలిగాడు మన హీరో ...ఈలోపు వీడి ప్రేమకధ మిగత వాళ్ళు కూడా కనిపెట్టేశారు..వీడికి భావాన్ని అంటే ప్రాణం అని ...వీడు కూడా ఒక ప్రేమ కదా కనుక్కున్నాడు లత , దామోదారాన్ని ఇష్టపడుతుంది అని ....తను వాడికి చెప్పలేదు వీడు చెప్పలేదు సో లత వీడు దగ్గిరయ్యారు ఒకరి బాధలు ఇంకొకరికి చెప్పుకుందామని ....ఈలోపు రాజు గాడు ఒక మహత్తర ప్లాన్ వేసాడు ..త్వరలో భవాని పుట్టిన రోజు ...ఆ రోజు తనకి గ్రీటింగ్స్ పంపిస్తే బాగుండు అనుకున్నాడు ...కాని ఎలా ఇవ్వాలి ? వీడికేమి అర్ధం కావట్లేదు ...రోజు పొలం గట్టు మీద కూర్చుని ఆలోచించే వాడు....ఎలా ఎలా ఎలా ఇవ్వాలి అని ....ఇంతలో వీడికి ఒక మహత్తర ఆలోచన ఒకటి వచ్చింది ...లత చేత్తో ఇప్పిస్తే ? అంటే లేచి డైరెక్ట్ గా లత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు లత ను కలిసి "లత నేను నీ గురించి ఒకటి ఆలోచించా" అన్నాడు
"ఏంటది రాజు "
"ఏమి లేదు నువ్వు ఎలాగు చెప్పలేక పోతున్నవ్ కదా దాము గాడికి వాడు కూడా మొద్దు మొహంగాడు కనుక్కో లేకపోతున్నాడు అందుకే నేను చెబ్దాం అనుకుంటున్నా ...ఏమంటావ్"
"దాము గాడు ఏంటి ? మొద్దు మొహం ఏంటి ? సరిగా మాట్లడలేవా? "
"ఒహో !! సారి లే తల్లి ఏదో హెల్ప్ చేదాం అని వస్తే నన్నే కోప్పడతావే?"
"అది కాదు ఎంతైనా నా వాడు కదా "
ఆఆ నీవాడు !! రేపు మీ ఇంట్లో గాని వాడి ఇంట్లో గాని తెలిస్తే డిప్పలు పగిలిపోతాయి ఇద్దరివిని. అయినా నా అంత ధైర్యం గా వీల్లెక్కడ ప్రేమించగలరు అని స్వగతం లో అనుకోని . "సరేలే ఇంతకీ ఏమంటావ్? చెప్పెయనా?"
"చెప్తావా? ఏమంటాడో ? అసలు వాడికి వాడు కనుక్కోవాలి కదా రాజు ? ఏంటో అన్ని కష్టాలు నాకే, నువ్వు నిజంగా చెప్తే బందరు నుండి 5 స్టార్ చాక్లేట్ తెప్పించి ఇస్తా నీకు "
"సరేలే ఇద్డుగాని ఎప్పుడు చెప్పను ? "
"ఎప్పుడు అంటే !! ఓ పని చేయి ...మనం వచ్చే వారం పరిక్షలు రాయడానికి బందరు జార్జి కారనేషణ్ స్కూలు కి వెళ్తాం కదా ...ఆరోజు బస్సులో చెప్పు ...సరేనా ? "
"సరేలే ...నేను వెళ్తున్న " అని చెప్పి ఇప్పుడు దీన్ని భవాని కి గ్రీటింగ్ కార్డ్ ఇమ్మంటే బాగుండదు ఇంకా రెండు రోజుల టైం ఉంది కదా ఈ లోపు మెల్లగా చెప్పోచ్చులే అని ఇంటికి బయలు దేరాడు రాజు.
గ్రీటింగ్ కార్డ్స్ కి డబ్బులు కావాలి ఎలా ? ఒక్కోటి 5 రూపాయలు అంటా..కనీసం రెండు ఇవ్వాలి అంటే పది రూపాయలు కావాలి " ఎలా ? ఊఊ ...అయిడియా ...నాన్నగారి వల్లేట్ ఉందిగా ..ఈ రోజు దొంగతనం జరగాలి మా ఇంట్లో ...ఫస్ట్ నేను బాగా నీళ్ళు తాగి నిద్రపోవాలి ..ఎందుకంటే బాగా నీళ్ళు తాగితే అర్ధరాత్రి ఒంటెలు వస్తుంది అప్పుడు అందరు పడుకొని ఉంటారు ఈ లోపు దొంగతనం జరిగి పోవాలి ....ఏది మన ప్లాను
సమయం అర్ధరాత్రి ....లేచాను...ఒంటెలు కి వెళ్ళాను నిద్ర మత్తులోనే అలానే వచ్చి పడుకున్నా...ఇంకేముంది ...తెల్లారింది ...ప్లాను ఫ్లోప్ అయింది ....ఛా...లేచిన వాడిని కాసేపు మేలుకొంటే బాగుండేది...రేపే భవాని పుట్టిన రోజు ...ఈ రోజు ఎలాగైనా కార్డులు కొని దాని మీద అందంగా తన పేరు చేక్కలి ఎవరు చూడకుండా ఎలా? ఎలా ? ఆ ...FANCY షాప్ అంకుల్ దగ్గరికి వెళ్లి ఆయన వీక్నేస్స్ మీద దేబ్బకోడదాం...ఆయనకీ వాళ్ళ అబ్బాయి అంటే చాలా ఇష్టం....వాడి గురించి కొంచెం డప్పు కొట్టి రెండు కార్డులు అప్పుగా కొట్టుకు వచ్చేయాలి....కాసేపాగి వెళ్దాం అనుకుని రెడీ అయ్యి స్నానం చేసి స్కూల్ కి అని బయలు దేరాను ..
కాని స్కూల్ కి వెళ్ళలేదు అంకుల్ షాప్ కి వెళ్ళాను..
"హలో అంకుల్ "
"ఏమ్వోయ్ రాజు ఏంటి ఎలా వచ్హావ్?
"ఏముందండి బాబు మీ లాంటి పెద్దోల్లని అప్పుడప్పుడు కలుస్తూ ఉండమని చెప్పాడు మా నాన్న "
"హ హ హ బలే చెప్తావ్ రా జోకులు "
"జోకులు కాదండి ..నిజం ..మొన్న మీ అబ్బాయి చరణ్ లేదు తనకి IIT లో సీటు వచ్చింది కదా అది ఎవరో చెప్పుకుంటుంటే విని చెప్పాడు..ఆ అంకుల్ ని కలుస్తూ ఉండరా మంచి సలహాలు ఇస్తాడు అని .."
"అవునా"
"అవునండి బాబు నేను అన్నా... నాకు మంచి ఫ్రెండు ఆయన అని... "
"అంతే కదరా మనం దాదాపుగా సంవత్సరం నుంచి కలుస్తున్నాం మంచి చెడు మాట్లాడు కుంటాం ఏవో నాకు తెలిసిన రెండు సలహాలు చెప్తాను నువ్వు సరదాగా వింటావు...నువ్వు ఎప్పటికి అయినా చాలా పైకి వస్తావ్ రా ఇంకా ఏమన్నాడు రా మీ నాన్న చరణ్ గురించి"
అసలు అలాంటి అబ్బాయి మన వుల్లో ఉండడం మన వురి అదృష్టం ...రేపు భవిష్యత్తులో అతని వాళ్ళ మన ఉరికి మంచి పేరు వస్తుంది....నువ్వు కూడా తన లాగే చదవాలి అన్నాడు "
"అసలు మా అబ్బాయి అని కాదు గాని రా రాజు..వాడి పద్దతి నాకు చాలా బాగా నచుతుంది ..పొద్దునే లేచి చదువుకోవడం టైం కి తినడం టైం కి పడుకోవడం ..ఎక్కడో చదివాను రా అబ్దుల్ కలం ఆజాద్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు లే అయన కూడా ఇలాగే చేసేవాదంతా చిన్నప్పుడు ..."
"అవునండి మన చరణ్ ని ఆయనేంటి ..నేను కూడా ఫాల్లో కావాలి అప్పుడే బాగా చదువుకొని మంచి వాడిని అనిపించు కొంటాను ..."
ఆ ఆ అంతే అంతే ...మొన్న ఏమి జరిగిందో తెలుసా నేను సమానులు కొందామని చల్లపల్లి వెళ్ళాను ...పున్నం రాజు లేడు..! అదేరా SUNFLOWER కాలేజి అతను..నన్ను పిలిచి కూర్చో బెట్టి ఎంత మర్యాద చేసాడు అనుకున్నావ్ ?
ఎందుకండీ ? ఆయన కూడా ఏమైనా FANCY షాప్ పెడుతున్నడా ...
నీ తలకాయా రా ...ఆయన FANCY షాప్ పెట్టడం ఏంటి ? అందుకే మీరు మా చరణ్ వేరు వేరు అంటాను నేను ..ఆయన చరణ్ చదివిన కాలేజి ప్రిన్సిపాలు ...అసలు చరణ్ ఎలా ఉన్నాడు ..ఎంత మంచి స్టుడెంటు తను ..అలాంటి స్టూడెంట్ ని నేను అసలు చూడలేదు ..ఏదో ఒకరోజు మీకు మంచి పేరు తెస్తాడు అని తెగ చేప్పాడ్రా చరణ్ గురించి .."
"అసలు ఆయనెంటండి....ఆ కాలేజి లో స్వీపరు కూడా అదే అంటాడు ఎందుకంటే చరణ్ అలాంటోడు..ఎంత మంచి గుణాలు ....అసలు మీ అబ్బాయి లాగా అవ్వాలంటే ఎం చేయాలి అంకుల్?
"హ హ ఏముందిరా ఆ గుణాలు అందరికి రావురా ...పుట్టుకతో వచినై ఆడికి....."
"అవునా..!! అయ్యో చరణ్ మాటల్లో పది స్కూల్ టైం మర్చిపోయాను ...పోనిలెండి ఎప్పుడు చెప్పే పాఠాలు...చరణ్ గురించి తెలుసుకున్న కొంచెం అయినా ....తనలా ఉండాలి అంకుల్ ప్రతి స్టుడెంటు ....ఉంటాను అంకుల్ "
"సరే రా బాగా చదువు ...మీ నాన్న చాలా మంచి అతను నువ్వు బాగా చదివి ఆయన్ను సుఖపెట్టాలి రా ....."
"సరే అంకుల్ ఉంటాను...అని మెట్లు దిగుతూ అప్పుడే చూసిన వాడిలా " అంకుల్ ఈ గ్రీటింగ్ బలేగుంది ఎంత "
"అదా అందరికి 5 రుపాయల్రా నీకైతే నాలుగు రుపాయిలే ..."
"ఏది ఒకసారి చూపించండి ఒక ఫ్రెండ్ పుట్టినరోజు ఉంది వాడికి ఇద్దాం "
"ఇదిగో ఇది చూడు ...ఇంకో మోడల్ ఉంది చూడు ....ఆ కట్ట లో నుండి తీసి ఇప్పుడే బయట పెట్టా ...ఇది బ్రహ్మాండం రా తీసుకో "..
"నాకు ఈ రొండు కావాలి అంకుల్ "
"తీసుకో రా "
"చరణ్ మీద అభిమానం తో మీరంటే నాకు ఎక్కడ లేని గోరవం ..చరణ్ ని అడిగానని చెప్పండి ...సరే ఇటివ్వండి ..అయ్యో డబ్బులు పట్రాలేదు అనుకుంటా ...సాయంత్రం తీసుకెల్తా లెండి "
"సరే లేరా"
ఇయనేంటి సరేలే అంటాడు పట్టుకేల్లరా ఇవ్వోచులే అనడే..! అనుకుని " ఆ అలా కాదు ఇప్పుడివ్వండి సాయంత్రం డబ్బులు ఇస్తా ...అన్నట్టు చెప్పడం మరిచా చరణ్ వస్తే నాన్నగారు కుడా అడిగానని చెప్పమన్నారు ..
"సరేలే... ఇంద పట్టుకెల్లు "
"థాంక్స్ అంకుల్ సాయంత్రం కలుస్తాను ..ఉంటాను .." వీడి బొందా...ఇంకో వారం ఇటు వస్తే అడుగు ....ఎప్పుడు ఇంట్లో దొంగతనం జైగితే అప్పుడే నీకు డబ్బులు ..సొల్లు డబ్బా మొహం గా అనుకుని బయలు దేరా స్కూల్ కి ...
**************************************************
స్కూలు కి వెళ్ళానా...అలా వచ్హాడు...దాము గాడు ...."ఏంట్రా లేట్ గా వచ్హావ్"
ఏమి లేదురా ...FACNY అంకుల్ దగ్గరికి వెళ్ళా ..
"వాడి దగ్గిరికా ఎందుకురా నాయనా సొల్లు డబ్బా గాడు ..
"మా పనులు మాకు ఉంటాయిరా..."
"సర్లే మేడం వస్తుంది తెలుగు టెక్ష్టు తీ "
"సరేలే"
*********************************************************
ప్రస్తుతానికి ...ఇంతే ....మాళ్లి కంటిన్యూ చేద్దాం త్వరలో ...మీ అభిప్రాయాలూ రాయండి ...ఒక కాబోయే రచయిత ని ఉత్సాహ పరచండి .... సినిమా కధలు కూడా రాసే ఆలోచన ఉంది కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ సినిమా లో ఏదో ఒక పాత్ర ఇప్పిస్తా కావాలంటే .....తరువాత మీ ఇష్టం ..ఆ ...

జీవితం.....స్త్రీ .....లక్ష్యం I
రాజు ...ఎంత మంచి పేరు....పూర్వ కాలం లో ఈ పేరు వింటే జనాల జేజేలు ...మంది మర్భాలం తో ఊరేగింపులు .....మన హీరో పేరు రాజు నే ...ఒక జీవితం ...ఒక కల ...ఒక ఆశ ...ఒక లక్ష్యం .....ఒక ఆడది ...అందరు కలిసి రాజు ని ఏమి చేసారు? ఏమిజరిగింది వీడి జీవితం లో ?
అది ఒక పల్లెటూరు పల్లెటూరు లో ఉన్న ఏకైక ప్రేవేట్ స్కూల్ ప్రాంగణం....అక్కడ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు క్లాసులు నడుస్తున్నాయి...అందరు ఆడుకుంటున్నారు కాని ఒకడు మాత్రం ఒక అమ్మిని తదేకంగా చూస్తున్నాడు....ఎందుకో ఆ ఆమ్మాయిని చూస్తుంటే వీడికి ముచటగా ఉంది....తను ఆడుతుంటే వీడు ఆనంద పడుతున్నాడు ....తను గెంతుతుంటే ....వీడు చూస్తున్నాడు ....పుస్తకం తీసి తన పేరు రాసాడు భ.. వా.. ని... ఎన్నో సార్లు తడిమి చూస్కున్నాడు ఆ పేరు ని...అప్పటికి దేశానికీ స్వతంత్రం వచ్చి కేవలం 50 సంవత్సరాలు మాత్రమె అయింది, వీడు అప్పటికి చదువుతున్నది 5 వ తరగతి వీడి పేరు రాజు....దీన్నే ప్రేమ అంటారని వాడి దోస్తు చెప్పాడు...అంటే ఇప్పుడు రాజు ప్రేమిస్తున్నాడు....తిప్పి తిప్పి కొడితే 10 సంవత్సరాల వయసు ...చదివేది 5 వ క్లాసు వీడికి ప్రేమ ..... మన ఖర్మ ....తప్పదు ఎం చేస్తాం కలికాలం....
రాజు మధ్యతరగతి ఇంట్లో పుట్టిన 2 కూతుళ్ళు 2 కొడుకులలో మొదటి వాడు అందరిలో పెద్దవాడు ....వీడి తండ్రి ఒక చిన్న మెకానిక్ కొంచెం పొలం గట్రా ఉన్నాయ్...ప్రశాంతం గా సాగుతున్న జీవితం.ఆనందం గా భవాని ని ప్రేమిస్తూ.... ఎక్కాలు బట్టి పడుతూ......
వీడి క్లాసుమేట్ గోపాలం " ఏరా రాజు గా ఏంటి రా నీ పుస్తకం మీద భవాని పేరు రాసావ్ ? " రాజు " ఏమి లేదు రా ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం "
"అంటే నువ్వు చిరంజీవి భవాని శ్రీదేవి నా "
"అవున్రా ఆ అమ్మాయి అంటే ఎందుకో ఇది "
అబ్బో ...ఒరేయ్ శ్రీను మన రాజు గాడు భవాని లవర్ అంటా "
"అరేయ్ అరవకు రా ఆ అమ్మాయి వింటుంది "
"ఓహో భయమా ? ఒసిని ..బలేగుంది రా ...నీ పని ..."
సర్లే నిన్న చెప్పిన లెక్కలు చేసావేరా గోపాలం ?"
ఓ చేసాన్రా ! నువ్వో ? నీకేం లే నువ్వు లెక్కలు బాగా చేస్తావ్ గా చేసేసే ఉంటావ్ లే "
లేదేహ ...నిన్నంతా గోలీలు ఆడుకున్న మర్చిపోయా..ఒక సారి నీ హోం వరకు బుక్కు ఇవ్వర ఎక్కిచేసుకుంటా ..."
ఎల్లెలెల్లరా....నేను ఇవ్వను నీ భవాని నే అడుగు పో "
మచినీళ్ళ దగ్గరికి వెళ్తుంది వెళ్ళు ..అడిగి తీస్కో "
మంచినీళ్ళ దగ్గిరకు వెళ్లి రాజు గాడు భవాని తో
"బన్ని "
"ఏంటి "
"ఏమి లేదు.... నిన్న లెక్కలు చేయలేదు........... నీ పుస్తకం ఇవ్వా........ కొంచెం ఎక్కించు కుంటా "
"సర్లే "
"నువ్వు చాలా మంచి దానివి "
భవాని పుస్తకం ఇచ్చింది ..వీడు లెక్కలు ఎక్కించుకున్నాడు..పుస్తకం చివరన తన పేరు రాసి ఇచ్చాడు...
రాజు గాడు ఎప్పుడు స్కూలు ఫస్టు రాలేదు గాని ఎప్పుడు ఫెయిల్ కుడా కాలేదు బానే చదువుతాడు ...తెలివిగల వాడు అని వీళ్ళ టీచర్లు అంటుంటారు....కాని ఎందుకో కరస్పండేంట్ కి వీడంటే ఇష్టం లేదు. వీడికి ఎప్పుడు ఎంత బాగా పరిక్షలు రాసినా క్లాస్ థర్డ్ మాత్రమె వచ్చేది ...క్లాసు ఫస్టు కి క్లాస్ సెకండ్ కి మాత్రమె బహుమతులుఇచే వాళ్ళు వాళ్ళిద్దరూ గోపాలం , శ్రీను ....ఇంతకీ భవాని ఉరుఫ్ బన్ని అనబడు అమ్మాయి వీడు చదివే స్కూల్ కరస్పండేంట్ కి స్వయానా తమ్ముడి కూతురు ....వీళ్ళు అయిదవ తరగతి నుండి ఆరవ తరగతి లోకి వెళ్లారు....అది ఉరిలో ఉన్న పెద్ద స్కూల్ ZP స్కూలు ...500 వందల మంది పిల్లలు 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు క్లాసులు ....వీడు C సెక్షను...భవాని కూడా ...అప్పటిదాకా భవాని ఒక్కటే అందంగా ఉంది అనుకున్న వీడు అక్కడ కొత్తగా జాయిన్ అయిన ఎలిమెంటరి పిల్లలు వేరే ఉరి పిల్లల్ని చూసి కొంచెం ఆశ్చర్య పోయినా నాకు భవాని నే కావలి అనుకున్నాడు...కొత్త స్కూలు ..కొత్త మాస్టర్లు...ఇక్కడి మస్తార్లని పాత స్కూల్ మాస్తార్లతో పోల్చుకొని ఆనందపడేవాడు వీడు ...
ఇప్పుడు భవాని స్కూల్ కి వెళ్ళాలంటే వీడి ఇంటి మీదగానే వెళ్ళాలి ఇక చూసుకోండి స్కూల్ పది గంటలకు అయితే మనవడు మొఖానికి పవ్దార్ రాసుకుని వీడి ఇంటి ఎదురుగా ఉన్న అరుగు మీద కూర్చునే వాడు ఇక భవాని వచ్చే వరకు వెయిటింగ్ ...తర్తువాట భవాని వెనకాలే స్కూల్ వరకు ఫాలోఇంగ్.....అలా ఆరో క్లాస్స్ లో గడిపేస్తూ ఉండంగా మనవాడు హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది....ఒక రోజు యూనిట్ పరీక్షా పెట్టారు ...ఎవరికీ ఎక్కువ మార్కులు వస్తే వాడికి స్కూల్ అసెంబ్లీ లో డిక్షనరీ ఇస్తానని వీళ్ళ క్లాసు ఇంగ్లీష్ టీచర్ రాణి మేడం ప్రకటించారు...వీడేమో ఆ ( గోపాలం గాడికో లేకపొతే శ్రీను గాడికో లేకపోతె కొత్తగా వచ్చిన సతీష్ గాడికో వస్తుంది లే అనుకున్నాడు...పరిక్షలు రాసారు పేపర్లు ఇస్తున్నారు ....ఆశ్చర్యం అందరికంటే ఎక్కువగా వీడికి వచినై ఇంగ్లీష్ లో మార్కులు ....ఒక్కసారిగా స్కూల్ అందరి దృష్టి లో వీడు హీరో అయిపోయాడు...రాజు అంటే బాగా చదువుతాడు ...తెలివైన వాడు అని...వీడు బాగాచదవగలడు అని వీడికి కూడా అప్పుడే తెలిసింది....అలా వీడు భావాన్ని ని ప్రేమించుకుంటూ చదువుకుంటూ ..మచ్న్హోడు అనిపించికుంటూ ...6 7 8 క్లాసులు దాటేసాడు ....ఇప్పుడు రాజు 9 వ తరగతి ...ఇక్కడ ఒక అద్భుతం జరిగింది వీడి దోస్తు ఒకరోజు వీడని బందరు సినిమా కి తీసుకువెళ్ళాడు ..అదే వీడు తొలిసారి సినిమా హాలు కి వెళ్ళడం సినిమా చూడడం....చుసిన సినిమా కుడా " తొలిప్రేమ" అంతే !! మనోడు ఇంటికిరాగానే పవన్ కళ్యాణ్ వీడిలోకి దూరిపోయాడు ఆ సినిమా ప్రభావం తో భవాని పిచ్చ పిచ్చ గా ప్రేమించడం మొదలు పెట్టాడు ...అలా జరుగుతుండగా వీడి జీవితం లో ఒక పెద్ద సంఘటన......మొట్టమొదటి ఎదురుదెబ్బ ......
(స శే సం )
ఈ కధ చదివిన వాళ్ళు కామెంట్ రాసి మీ అభిప్రయలు తెలియజేయగలరు...నేను ఇంకా బాగా రాయడానికి సహకరించగలరు .....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)