5, జనవరి 2013, శనివారం

హిందువు సోదరులారా .....సోదరీమణులార ......!!!

ఎవడో ఏదో వాగాడని ....అందరం కొట్టుకుందామా ?? ఒకడు చేసిన పాపానికి జాతి మొత్తాన్ని అవమానిద్దమా ?? పరమత సహనం నరనరాన  జీర్ణించుకున్న మనం ఇలా కొట్టుకున్తున్నాం కాబట్టే ....పక్కనున్న పాకిస్తాన్  లు మనకంటే ముందుకు వెళ్తున్నై .......!!!

వేరే మతం గురించి అపహాస్యపు మాటలు మాట్లాడే ఎ కుక్క అయినా ఒకటే .....అది కచితం గా రాజకీయ  కుక్కే అయ్యి ఉంటుంది .... అదే అక్బర్ కావచ్చు ...మోడీ కావచ్చు...అద్వాని కావచు.....వీళ్ళు కోరుకుంది ఒక్కటే .....సామాన్యులు కొట్టుకోవాలి వీరు పండగ చేసుకోవాలి.....

"అదే నిన్ను ఎవరైనా అంటే ఇలాగే చూస్తూ ఉరుకుంటావా?"  అని ఎవరినా నన్ను అడిగితె ...నా సమాధానం ఒక్కటే ....ఊరుకోను ...అవకాసం దొరికితే చంపేస్తాను ....కాని వాడి జాతి మొత్తాన్ని తిట్టను .....అందరు వీళ్ళు ఎక్కడి నుండో వచ్చారు ...వీళ్ళు భారతీయులు కాదు అంటున్నారు ...బాధగా ఉంటుంది ఆ మాటలు వింటే !! నా భారతదేశం నా భారత దేశం అని గొంతు చించుకుంటుంటే  గొంతు లో ముళ్ళు గుచ్చినంత  బాధ గా !! మిత్రులారా !!! ఆ ..వచ్చిన వాళ్ళు చచ్చిపోయారు ...మేము ఇక్కడే పుట్టాం ...ఇక్కడే పెరుగుతున్నాం .....ఇక్కడే ఉంటున్నాం ...మేము మీ వాళ్ళమే .....భారతీయులమే ..... దయచేసి ఒక్కడి మనస్తత్వాన్ని అందరికి ఆపాదించకండి ....అందరిని ఒకే రకమైన చూపుతో చూడకండి .....

నేను ఇక్కడ భారత దేశానికి చాలా దూరం లో ఉన్నాను ....కాని నా మనసు మొత్తం భారతదేసమే నిండి ఉంటుంది ....నా చావు ఇండియా లోనే రావాలి అని ఎప్పుడు కోరుకుంటాను .....మొదట్లో అనిపించేది ....భారతదేశం మంచిది కాదు అని ....గుజరాత్ ఘటన తరువాత నా మనసు మరీ మారిపోయింది ...ప్రసాంతంగా ఆలోచించాను ....భారతీయుల మనస్తత్వం అర్ధం అయ్యింది ....కొందరి వల్ల అందరికి కష్టాలు ..అందరు ఒకటి కాదు కొందరే అందరు కాదు .భారత దేశ ముస్లిం లకు నా సలహా ఏంటంటే వేరే దేశం లో సంపన్న జీవితం గడపటం కన్నా భారత దేశ హిందువుల చేతిలో చావడం మేలు .....చంపినా తరువాత అయినా కనీసం కనికరం చూపిస్తారు ...ఎందుకంటే భారతీయులు !!!! దయ , ప్రేమ , సహాయం చేయడం ....ప్రత్యేకం గా పగవాడికి కుడా...అది మనకే చెల్లుతుంది ....


అక్బర్ ఏదో అన్నాడని ....దయచేసి నన్ను మాత్రం వేలివేయకండి ...కుల్లబోడవకండి ....నేను భారతీయుడినే మీ సోదరుడినే !!!! జై హింద్ !!!

8 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నేను అర్ధం చేసుకున్నాను..బాయీ ! మీరందరూ.. నా సహోదరులు. అవును ముమ్మాటికి.. నా సహోదరులే!

అజ్ఞాత చెప్పారు...

శభాష్! బాగా అన్నావు, కాని అక్బర్ చెప్పిన మాట తప్పని నిశితంగా ఎందుకు చెప్పలేకపోయావ్? కూడా ఆద్వానీ ని మోడీ ని ఎందుకు కలిపేవు ఇప్పుడు? ముస్లిం సమాజ ఆలోచనా విధానాన్ని మార్చు.

అజ్ఞాత చెప్పారు...

రాఫ్సన్ భాయి ,
"ఎవడో ఏదో వాగాడని ....అందరం కొట్టుకుందామా ?? ఒకడు చేసిన పాపానికి జాతి మొత్తాన్ని అవమానిద్దమా ?? "
మీరు కూడా అది అర్థం చేసుకోవాలి భాయ్ .ఎవడో ఒక్కడు, ఇద్దరు మిమ్మల్ని వేరు చేసి మాట్లాడాడని మీరు ఇలా బాధ పడవద్దు. అది వారి కుసంస్కారానికి నిదర్శనం. మనందరం ఒకటే. అందరికి ఒక విజ్ఞప్తి - ఇలాంటి జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఆ జాతి వాళ్ళు ఖండిస్తే అందరం ఒకటే ఆ వ్యాఖ్యలు చేసిన వాడు తప్ప అనే భావన ఉంటుంది. కాబట్టి, ముస్లిం సోదరులారా అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించండి. అలాగే ఎవరినా సరే ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మతాలకి అతీతంగా అందరం ఖండించాలి. జై హింద్.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
PALERU చెప్పారు...

వనజక్కా !!!

ఉభయకుశలోపరి ..!! నా ఫీలింగ్స్ అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు ...ఎవరో కొన్ని కుక్కలు ఏదో వాగాయని మనమెందుకు కొట్టుకోవాలి ? అనేది నా టపా ఉద్దేశం అంతే .

PALERU చెప్పారు...

అజ్ఞాత @1

బాబాయ్ ....నువ్వు సరీగా చదవలేదు అనుకుంటా !!! మరొక్క సారి చదువు ....నేను ఖండించానో లేదో తెలిసిపోతుంది ....మోడీ అద్వాని లను ఎందుకు లాగాను అంటే ...వారు కుడా అదే జాతి ...మతోన్మాద జాతి కాబట్టి ......! HOPE ANSWERED THE QUESTION

PALERU చెప్పారు...

అజ్ఞాత @2

నేను తీవ్రాతి తీవ్రం గా ఖండిస్తున్నాను భాయి ....మతోన్మాడులందరూ ఒక్కటే ...వాడు ఎవడైనా సరే తన్ని తరిమేయలిసిందే .......జాతి వ్యతిరేక వాఖ్యలు చేసే వాడు మనిషే కాదని నా అభిప్రాయం ......ఎదేమైనా మీ వాఖ్య ఆనందాన్ని కలిగించింది ......ధన్యవాదాలు

PALERU చెప్పారు...

అజ్ఞాత @3

అజ్ఞాతా !!! నేను మనిషినే కాని అజ్నాతను మాత్రం కాదురా ....అజ్ఞాత మనిషి అవ్వవచ్చు ...జంతువూ అవ్వవచ్చు ...అమ్మాయి అవ్వవచ్చు .....అబ్బాయి అవ్వవచ్చు....లేదా రెండు అవ్వవచ్చు ....ఇంతకీ నేను ఏమనుకోనురా ??? సర్లే ....ఆప్షన్ నాకే ఇచ్చావు కాబట్టి మూడోదే అనుకుందాం ....నేను ముస్లిం బ్లాగరుని అని ఎక్కడైనా చెప్పానట్రా బడుద్ధాయ్ !!! చిత్తశుద్ది ఉంది కాబట్టే నా బ్లాగులో నా పేరుతొ అక్బర్ ను ఖండించాను రా ....అజ్ఞాత గా ఎక్కడా ఏమి కుయలేదురా కుయ్యా !!! వాళ్ళను వీళ్ళను కలపడం ఎంటిరా ?? దెయ్యాలను దేవుళ్ళతో కలిపినట్టు బాధపడుతున్నావ్ ?? ఏ వాళ్ళేమైనా నీ దేవుళ్ళా ? నీ పిచి రాతలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది లే .... నేను ఇతరులతో పోల్చుకోవడం ఏంటిరా !! ఎవరికీ వారే స్పెషలు ....సర్లే ...నీ వాఖ్య తొలగించింది ...భయపడి కాదు సుమా!!! నీ లాంటి మతోన్మదులతో నేను అస్సలు భయపడనురోయ్ ......నీ పిచి ఇతరులకు అంట కూడదని తీసేసాను ...ఉంటానే !!!