2, జనవరి 2013, బుధవారం

సంఘర్షణ ....నిజమైన కల !!!

అరుణ , ఒక పెద్ద వ్యాపారి కూతురు ....తెలివిగలది , చదువుకున్నది , గుణవంతురాలు ....కాని అందమే అంతగా లేదు. మరీ కరుపి అని కాదు గానిఒక మోస్తరు గా ఉంటుంది ....

రాజు ఒక లేబర్ , అటు ఇటు చేసి పది అయ్యిన్దనిపించాడు ...కాని పై చదువులకు నోచుకోలేక పోయాడు ...బ్లాకు టికెట్లు అమ్ముకుంటూ , చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ...జల్సా గా బ్రతికేస్తున్నాడు .

విధి, అదృష్టవంతుల తో ఒక విధంగా .....దురదృష్టవంతులతో మరో విధంగా ఆట ఆడుతుంది ....ఇక్కడ అలాగే జరిగింది ....అరుణ రాజు తో ప్రేమలో పడింది .............ఈ కొత్త వింత అనుభూతి ని ఇద్దరు బాగా అనుభవిస్తున్నారు .........రాజు కైతే మరీ కొత్తగా ఉంది ..ఈ ప్రేమించుకోవడం ఏంటి? ఇలా తిరగటం ఏంటి ? సినిమాలల్లో లాగా ?? అందునా సినిమా దియేటర్ కు వెళ్తే టికెట్లు అమ్మలనిపిస్తుంది కానీ కొనాలనిపించదు ...మరీ ప్రేమొస్తే మన రంగి ఉండనే ఉంది గా!!! రెండు టికెట్లు నావి కావు అనుకుంటే సరి ఎంత ప్రేమ కావాలో అంత  ప్రేమ ఇస్తుంది .ఈ పార్కులేంటి ? ఈ శికార్లేంటి? కాని కొత్త కొత్త బట్టలు మంచి బండి ఇవన్ని పాపం అరుణ ఇప్పించింది అందుకే కిక్కురుమనకుండా ప్రేమించేస్తున్నాడు ....కాని తెలీకుండా నే రాజు జీవితం అరుణమయం అయిపొయింది .అరుణ లేకపోతె జీవితం లేదు అన్నట్టు అయిపోయాడు ...నిజంగా అరుణ ను ప్రేమించడం మొదలుపెట్టాడు. రోజు ఒక కొత్త అనుభూతి పంచేది అరుణ ...ప్రేమంటే రంగి కాదు ప్రేమంటే అరుణ అనుకునే స్టేజి కి వచ్చాడు . ఒకరోజు అరుణ  పుట్టిన రోజు గురించి అడిగింది ..రాజు కేమో తెలవదాయే పదోతరగతి లో ఒక పుట్టినరోజు ఉంది అది సరి అయినది కాదు అని సుబ్బులు చెప్పేవాడు . ఏదైతేనేమి అదే చెప్పాడు . అంటే రేపే నా ? నీ పుట్టినరోజు ఆనందం పట్టలేక అరిచింది అరుణ . అంత  గట్టిగా అరిచింది కాబట్టి రేపే అని నమ్మేసాడు రాజు ......"రాజు రేపు నీకు నేను ట్రీట్ ఇస్తాను మార్నింగ్ రెడీ గా ఉండు నేను నా కారు తీసుకొస్తా అందులో వెళ్దాం " అని చెప్పి వెళ్ళిపోయింది ....


           అన్నట్టుగానే ఉదయం కారు తీసుకుని వచ్చింది అరుణ ...రాజు కారు లో కూర్చున్న తరువాత బండి ముందుకు కదిలింది ....సిటి దాటినా తరువాత అరుణ అకస్మాత్తుగా కారు ఆపి రాజు వైపు చూసింది.ఏమిటన్నట్టు  చూసాడు రాజు అరుణ వైపు ,ఒక కర్చీఫ్ తీసి రాజు కళ్ళకు గంతలు  కట్టింది? ఏమిటిది అన్నాడు రాజు , ఇక్కడినుండి మనం నడిచి వెళ్తాం ..ఒక సుందర ప్రదేశానికి తీసుకువెళ్తాను అప్పటి దాకా నువ్వు ఏమి చూడకూడదు అని ఇలా కళ్ళకు గంటలు అన్నమాట అంది అరుణ ...సరే పద అంటూ ఇద్దరు నడిచారు ...నడుస్తున్నారు ...నడూస్తూనే ఉన్నారు...ఒక గంట తరువాత అడిగాడు రాజు ఇక ఆగలేక ఇంకా ఎంత దూరం నడవాలి అరుణ అని ...కొంచెమే వచ్చే .... సాఆఆఆఆఅ మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్ ..................అరుణ గొంతు ఉన్నట్టుండి దూరం కాసాగింది ...ఏమైందో అని కంగారుగా అటుఇటు కదిలాడు ....అంతే !!!! ఓఓఓఓఓఒ ఎక్కడో పడిపోతున్నాడు ...ఏదో బావి లో పడుతున్నా అనుకుంటూ నే స్పృహ తప్పిపోయాడు .....

    రాజు మెల్లగా కళ్ళు తెరిచాడు లీలగా వెలుతురూ కనబడుతుంది ఎక్కడో దూరం గా !! టైం ఎంతయిందో చూద్దాం అని చెయ్యి కదిపాడు రావటం లేదు , గట్టిగా లాగాడు ఏదో బరువు వెనక్కు లాగుతున్నట్టు అనిపించి అటుకేసి తిరిగాడు ...అంతే  ఒక్కసారిగా ...స్థాణువు అయిపోయాడు ...అప్పుడు గుర్తుకు వచ్చింది తను అరుణ రావటం ఇద్దరు ఒక గోతిలో పడటం ......పైకి చూసాడు ...ఎక్కడో మినుకు మినుకు మంటూ వెలుతురూ అమావాస్య రోజు వెన్నెల లా !!! సరిగా గాలి ఆడటం లేదు శ్వాస ఇబ్బంది గా ఉంది ..అంటే తను చాలా లోతుగా పడ్డాడు ....అరుణ ను కదిపాడు ...కదలటం లేదు ...గట్టిగా....కదిపాడు ఉహు.....అప్పుడు చూసాడు అరుణ వైపు కళ్ళు చీల్చుకొని ....అరుణ కు ఋణం తీరిపోయినది ...ఇక తనే మిగిలాడు ...సరే పోయిన అరుణ ఇకరాదు  కాబట్టి తను బ్రతకాలి అంటే ఇక్కడి నుండి బయటపడాలి అది కుడా ఆ అరుణుడు ఆరిపోయేముందు ......గోడలను తడిమాడు ఇంట పెద్ద బావి కాబట్టి మెట్లు ఉంటై అనే నమ్మకం తో ..ఎక్కడ తగలడం లేదు ...ఇక్కడినుండి ఎలా పైకి వెళ్ళడం అని ఆలోచిస్తుంటే ఏదో కాలికి తగిలింది ..తీసి చూసాడు ..ఒక రాయి ముక్క ...ఏమైనా ఆయుధాలు దొరుకుతాయేమో అని వెతికాడు ఉహు లాభం లేదు ...హుసురు మంటూ ఒక పక్క చతికిల బడ్డాడు ......

    మూడు వస్తువులకోసం మనిషి ఏమైనా చేయగలదు ...ఒకటి డబ్బు ...రెండు ప్రాణాలు... మూడు ఆడవారు. రాజు దగ్గర ఎలాగు ఒకటి మూడు లేవు ఇక మిగిలిన రెండు అయినా కాపాడుకుందాం అని మల్లి లేచాడు ..ఆలోచించాడు ఎలా బయట పడాలో అని. గోడలను తడిమాడు ..పాతకాలం రాళ్ళు రాయి చుట్టుపక్కల గాడి తవ్వి మెల్లగా రాయిని బయటకు లాగాడు ....అది బయటకు వచ్చింది ...అంటే రాజు ఒక ఉపాయం ఆలోచించాడు ..ఇలా రాళ్ళు తీసుకుంటూ ఆ ఖాళి జాగా లో కాళ్ళు పెట్టుకుంటూ పైకి వెళ్దాం అని ...కాని రెండు రాళ్ళు తీసిన తరువాతా రాళ్ళు కుడా రావడం కష్టం అయిపొయింది ..ఏదైనా సూది గా ఉన్న వస్తువు కావాలి ..రాళ్ళ చుట్టూ గాడి తవ్వడానికి .....కాని ఏమి లేదు ?? ఎలా ఎలా? కిందకు చూసాడు ..అరుణ శవం కనిపించింది..ఒక ఆలోచన తలుక్కున మెరిసింది ....కాని మరీ ఇంత కిరాతక పని చేయడానికి మనసొప్పలేదు. సందిగ్దం లో ఉండిపోయాడు కాసేపు ...కాని పోయిన అరుణ కంటే ఉన్న ప్రాణాలు ముఖ్యం కాబట్టి ...తప్పలేదు ..కిందకు దిగి ..అరుణ చేతులను విరగొట్టి ఎముకలు బయటకు తీసాడు ...చీకటి ఎక్కువైపోసాగింది ...చేతులు లేని అరుణ భయంకరం గా కనిపిస్తుంది ..ఈ అరుణను చూస్తె ప్రేమ పొంగుకోచేదో ..ఈ అరుణ వొళ్ళో పడుకోవలనిపించేదో ...ఇప్పుడు అదే అరుననుంది పారిపోవాలనిపిస్తుంది ....

    బావి కి ఇటు పక్క ఒక రాయి అటు పక్క ఒక రాయి తవ్వుతూ ..దానిపైన కాళ్ళు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు ...కాని ఈ ప్రయాణం కుడా ఎక్కువసేపు సాగలేదు ....పైకి వెళ్తున్న కొద్ది బావి వెడల్పు పెరుగుతుంది ...రెండు కాళ్ళు జాపడానికి ఇబ్బంది గా ఉంది ..పైగా చీకటి పడసాగింది....ఎలా బయటపడాలో ? తెలియడం లేదు ...అసలు బ్రతుకుతాడో లేదో తెలియదు.ఎ విశాపురుగు అయినా కాటేయవచ్చు  జారి కింద పడి  తల పగిలి చనిపోవచ్చు ...చీకటి పెరగ సాగింది ...అంతా మసక మసక అయిపొయింది. అలాగే ఒక రాయి పైన ఇంకో రాయి తవ్వుతూ పైకి ఎగ బాకుతూ ఉన్నాడు ....మసక చీకటి నుండి ముసుగు చీకటి దాకా తవ్వుతూనే ఉన్నాడు ...అలా తవ్వుతూ తవ్వుతూ ఉండగా మెల్లగా వెన్నెల పెరగసాగింది .....ఏమి తినలేదు కాబట్టి నీరసం ఆవహిస్తోంది ..ఎక్కువసేపు పట్టు కునేలా లేడు ...కాని కింద పడితే పోయేవి ప్రాణాలు కాబట్టి తెగించి ముందుకు వెళ్తున్నాడు ......కొన్ని గంటల తరువాతా ఒక్కసారిగా వెలుగు పెరిగింది అంటే తెల్లారింది ...పైన ఆకాశం ...చెట్లు కనబడటం  మొదలయ్యాయి  ....ఉత్సాహం పెరిగింది .....ఇంతలో ఒక రాయి తీసి చేయి ఆ కన్నం లో పెట్టగానే ఏదో చల్లగా తగిలింది ..డడిచి కిందకు లాగాడు చేతిని ...అంతే  ఒక్కసారిగా ...పట్టుతప్పి కిందకు పడిపోయాడు...మళ్లి  అరుణ దగ్గరకు ...ఇక వెళ్ళలేను అని నిర్ణయించుకొని అలాగే ఉంది పోయాడు తన చావు కోసం ఎదురు చూస్తూ .....కాని రాజు మనిషి కదా....అన్నేతీకన్న తీపే ప్రాణాలే ..కాబట్టి మళ్లి ప్రయాణం మొదలు పెట్టాడు....ఈ సారి త్వరగానే పైకి వెళ్ళగలిగాడు ...ఇంకా ఒక అయిదు అడుగులు పైకి వెళ్తే నేలను చూడవచ్చు ....సమయం చూసాడు మధ్యాన్నం ఒంటి గంట ....అంటే ఒకటినర్ర కాల్లా తను బ్రతికి పోతాడు అని ఆలోచించుకొని ఇంకా రెట్టించిన ఉత్సాహం తో రాళ్ళను తవ్వుతూ బావి గోడమీద పాకుతూ ముందు కదిలాడు ...

     రాజు ...పైకి వచేసాడు ....చేతిలో ఉన్న ఎముకలను చూసి ఒక్కసారి గాధంగా నిట్టూర్చి ఆ ఎముకలను అదే బావి లో పారేసాడు ....ఇక ఇంటికి బయలు దేర్దాం అని వెనక్కి తిరిగితే .....రెండు సింహాలు ఆకలిగా తన వైపే చూస్తున్నాయి ...మొదటిసారి సింహాలను అంతదగ్గరగా చూడటం వాళ్ళ కొంచెం జంకి రెండడుగులు వెనక్కి వేసాడు అంతే మళ్లి బావి లోకి జారిపోయాడు.......మల్లి ఎక్కడ నుండి బయలు దేరాడో అక్కడికే వెళ్ళిపోయాడు ...కాని ఈ సారి స్పృహ తప్పలేదు ....రెండు మూడు భారి దెబ్బలు తగిలాయి కాని తల మాత్రం అరుణ మీద పడటం వల్ల బ్రతికి పోయాడు ...బట్టలు దులుపుకుంటూ ...పైకి చూసాడు ఏమి కనబడటం లేదు ఎక్కడో దూరం గా ఒక వెలుగు ...అరుణ వైపు చూసాడు ...."నేను చచ్చి బ్రతికిపోయాను రా నువ్వు బ్రతికి చస్తున్నావ్" అన్నటు కనబడింది అరుణ  మొఖం లో .....తల అరుణ మీద పడక పొతే తనుకూడా అరుణ తో పాటు కైలాసం లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడే ....భరించే వాడిని భర్త అంటారు కాని నాకెంటో  అన్ని ఆరుణే  భరిస్తోంది అనుకుని మళ్లి ప్రయాణం మొదలు పెట్టాడు ...ఎలాగైతే నేమి ఈసారి త్వరగానే పైకి రాగలిగాడు రాళ్ళు తీసి ఉండటం వల్ల !!!

   మెల్లగా పైకి వచ్చి చూస్తె ...   సింహాలు కనబలేదు ..గడియారం మూడు గంటలు చూపిస్తోంది ....ఇక బ్రతికి పోయాను అనుకుంటుండగానే ..సింహాల గాండ్రింపులు ఒక్కసారిగా వినబడ్డాయి చూస్తె ...గుంత కాడ నక్కల్లా ..చెట్టు చాటు న నిలబడి ఉన్నాయి ....నా చావు నూతి నుండి నోటి కి షిఫ్ట్ అయ్యిందేమో అనుకుని ఏమి చేయలేక అలాగే చతికిల బడ్డాడు ...సింహాలు దగ్గరకు రాసాగాయి ....ఇక తప్పదు నాకెలాగు రెండు రోజుల నుండి తిండి లేదు పరుగెట్టలేను ఇక మీరు నన్ను తినండి అనుకుని కళ్ళు మూసుకున్నాడు ...సింహాలు చాలా దగ్గరగా వచ్చేసాయి కాని ఎంత సేపు కళ్ళు మూసుకుంటాడు? ప్రాణాల  మీద తీపి ఎవడు వదులుకుంటాడు? సింహాలు దగ్గరకు రాగానే మనసు మారిపోయింది ..బ్రతకాలన్న ఆశ ఎక్కువయ్యింది ....అంతే ఒక్కసారిగా సింహాల మీద నుండి గెంతి చెట్టు ఎక్కడం ప్రారంభించాడు ...చాలా సేపు ఎక్కుతూనే ఉన్నాడు ..ప్రాణాల మీద తీపి వల్ల...సింహాల భయం వల్ల ....అలా చాలా పైకి ఎక్కేసాడు ....సింహాలేమో ..కిందకు రావా ? అన్నట్టు పైకి చూస్తున్నాయి ....అంత పైనుండి కిందకు చూడటం వాళ్ళ కళ్ళు తిరుగుతున్నై .....కిందకు జారిపోతున్నాడు ....వీధి ఇంతగా పగ బడుతుంది అనుకోలేదు రాజు ..ఇక సరీగా సింహల నోటి ముందు పడేవాడే కొంచెం ఉంటె ...కాళ్ళు చిక్కుకోవడం వల్ల  ఒక కొమ్మ మీద ఆగిపోయాడు ....యముడికి ఎవరో మిస్ కాల్ ఇచి వుంటారు ...... అలా కాసేపు శ్వాస తీసుకుంటుండగా ....కాలు కొమ్మకు బిగుసుకు పోతోంది ...ఏంటో అని చూస్తుండగానే ..ఒక పెద్ద అనకొండ చుట్టేసి ఉంది కాళ్ళకు.....ఒక్కసారిగా నోరు పెద్దగ తెరిచి మీదకు రాసాగింది  ఇంకొంచెం ఉంటె తన తల దాని నోట్లో ఫలహారం అయ్యేదే ... రెండు చేతులతో దాని మెడ గట్టిగా పట్టుకున్నాడు ...దాని చూస్తుంటే నే భయం వేస్తుంది ..దాని పట్టుకున్నాను అనే ఫీలింగ్ తో చావు దగ్గరికి వచ్చేలా  ఉంది ......యముడు మళ్ళి  ప్రాజెక్ట్ పని మొదలు పెట్టాడు ....ఒక పక్క చీకటి పెరుగుతోంది ...ఒక పక్క ఈ అనకొండ తన ఫలహారం కోసం విశ్వప్రయత్నం చేస్తుంది ..తన శరీరం తో రాజు ని చుట్టేసింది .....గట్టిగా బిగించసాగింది....ఎముకలు విరిగిపొతున్నయెమొ అనిపిస్తుంది రాజు కి ......అప్రయత్నం గా కిందకు చూసాడు ..సింహాలు బేటరా ??? పాము బేటరా ??? అని ...సింహాలు వేల్లిపోయినాయి ...ఇక పామే గతి అనుకుంటూ .....కళ్ళు మూసుకున్టుండగా .....అనకొండ ఒక్కసారిగా పట్టు వదిలేసింది ...అంతే కిందకు జారడం మొదలు పెట్టాడు అది కుడా అనకొండ ను పట్టుకొని .....కిందకు జారి నేల మీద పడగానే ....ఒక్కసారిగా పరుగు లంకించుకొన్నాడు ...ఇంటికి చేరేదాక ఆపలేదు ...ఇంటికి చేరుకొని ఒక్కసారిగా మంచం మీద పడిపోయాడు ......అరుణ గుర్తుకు వచ్చింది .....ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది ...తను బ్రతికి ఏమి లాభం ?? అరుణ లేనప్పుడు అనుకుంటూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద భవనం ఎక్కి దూకేసాడు......తల పగిలి పోయింది ....రక్తం ధారగా కారడం ..ఒక బాట తాయారు చేసుకొని తల కిందుగా వెళ్ళడం జరుగుతుంది ......రాజు ఆత్మా ఏడవటం మొదలు పెట్టింది ......ఏడుస్తూ ఏడుస్తూ ....ఒక్కసారిగా ఏడుపు పెరిగింది .....

     తల కింద ఏదో చల్ల గా తగులడం చూసి రాజు లేచాడు ....చూస్తే ...రాజు ఏడుస్తున్నాడు .....అదేంటి ఇదంతా కలా?? నేను చావలేదా ?? మరి రక్తం!!! అనుకుంటూ కింద చూస్తె ...తనగుడిసేలో కుండ పగిలి కింద అంతా తడిచిపోయింది ...  తనేకలలో ఘర్షణ పడుతూ కుండను ఒక్క తన్ను తన్ని ఉంటాడు అనుకుని ...నిద్రలోనుంచి లేచాడు రాజు.......

                                ************అయిపొయింది ****************

కామెంట్‌లు లేవు: