4, ఫిబ్రవరి 2013, సోమవారం

విదేశియానానికి ఇక సెలవు !!!

ఇలా చాలా సార్లు అనుకున్నాను ....కాని మాట మీద నిలబడలేక పోయాను...వేరే దేశం వెళ్ళిన ప్రతీసారి ఇండియా వచ్చేయాలి అనిపిస్తుందితీరా వచ్చాకా ....ఎందుకోచ్చేసానా .... అనిపిస్తుంది ....

దుబాయ్ లో ముగించేసాను ....!!! మళ్ళి నిర్ణయించుకున్నాను ...ఎక్కడికి వెళ్ళకుడదని .....నా భారతదేశం ఏమి చేస్తుందో ఈ సారి !!!!

నన్ను అక్కున చేర్చుకుని తన వొడి లో కూర్చో బెట్టుకుంటుందో ...లేక కోపంతో విదిలించి కొడుతుందో ??

కూర్చో బెట్టుకున్న ...విదిలించి కొట్టినా.....తల్లి తల్లే......!!!

డబ్బులు అన్నిచోట్ల ఉన్నాయ్ ....కాని భారతీయత లేదు .....ఇలా అంటే ...జనాలు నవ్వుతున్నారు ...ఈ కాలం లో కుడా ఆ సెంటిమెంట్స్ ఏంటి రా అని ....కొన్ని సార్లు సిగ్గేస్తోంది ...కొన్ని సార్లు వాళ్ళమీద జాలేస్తుంది ....

ఆ పచ్చటి  పొలాలు ....ఆ పొంగే నదులు...పక్షుల కిలకిలరావాలు ....పశువుల సంతలు ....జాతరలు ....ఎలక్షనులు .... గొడవలు .....రాజకీయాలు ...స్కాములు .......అమ్మ చీవాట్లు ...నాన్న కోప్ప డ టం .....చెల్లి సానుభూతి ...తమ్ముడి సప్పోర్టు ....నా ఉద్యోగుల .అభిమానం .....నా స్కూళ్ళు ....ఆ పిల్లలు ....అన్నింటికంటే ...గొప్ప మా వూరు ......ఎన్నని చెప్పను ...?? ఏమని చెప్పను ??? ఈ డబ్బు అనే పదం లేకపోతె ....వదిలి వెళ్ళేవాడిని కాను .....

ఏదేమైనా ......కొన్ని  అనుభవాలు......... మంచి పాఠాలు ....!!!

ఈ సారైనా ...ఇండియాలో కుదురుగా ఉండగలనా?? ఉండాలని ఉంది ..!!! ఆ దేవుడేమి చేస్తాడో ?? ఏమి జరుగుతుందో??

ఇండియా ....వచేస్తున్నా.....!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

2 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సంతోషం.!! మనసుకి నచ్చిన పని చేస్తే సంతృప్తి. మనవారి కోసం పని చేస్తే ఆత్మసంతృప్తి

అజ్ఞాత చెప్పారు...

guvvaa laa egiripovaali....eeee...eee...eee eskondi ee paatani!!

Narsimha K