1, అక్టోబర్ 2019, మంగళవారం

పపా ఈజ్ బ్యాక్

2015 తరువాత మళ్ళి ఇప్పుడే తెలుగు లో రాయడం .... పెద్దగా ఏది ప్లాన్ చేసుకోలేదు కానీ ఎదో ఒకటి రాయాలి అనిపించింది అందుకే ఈ పద శోధన ...!!

ఈ మధ్య అందరు రాస్తున్నారు, ఎక్కడ చూసినా రచయితల రక్త హేళి ... ఏదో సామెత అన్నట్టు వినేవాడు ఉంటె చెప్పేవాడు చిరంజీవి అని ... కొందరేమో సరదాగా రాస్తే కొందరు రాయడానికే రాస్తున్నారు కొందరు తమ పైత్యం చూపడానికి రాస్తారు 

నేను మాత్రం జనాలను ఎలాగైనా హింసించాలి అనే సైకో ఆనందం కోసమే రాస్తాను ... నాకేమి బాధ గాని భయం గాని అస్సలు లేవు, సాహసం చేసి చదవడానికి వస్తున్నా మీకే అంతఉంటే మరి రాసేవాడిని నాకెంత ఉండాలి? 

చిన్న చిన్న 

1, నవంబర్ 2015, ఆదివారం

A Journey From Money to Honey...

When I started my career I have no expectation about future except entering into those tall buildings with glass everywhere and a so perfectly managed interiors. 
And when I landed into real world I started caring about my appearance, New Bike and new apparels...........Clothing, Fashion, dining it's all about Month first week... :) 
When this cruel world became more cruel (costly), New cloth brands entered in Indian market and when 150 cc bikes started rolling on roads... I started thinking about my salary... Let me remind you again not about the Career but the salary....!! 
Life is like a girl or women......Looks like you understood fully yet you are confused...! Sometimes it acts as Granny and gives you an apple to have a bite...Likewise I got an offer from Sadaf petrochemicals with 400% hike in salary... Yet I have no feelings about the career...went there and started earning and don't know how to do saving.... and a year rolled out, 
Money is like Morning sleep, you slept entire night but still you want to sleep 10 more minutes before you woke up..!! And to sleep 10 more minutes I fly to Dubai...and slept for 1 year. :) 
When all is well...it's like "well" ........no new learning and very small world.....!!! fly back to India due to some technical ( Family) problems...!!! and joined Flextronics with 350% low salary... :( 
If you are working in entirely good environment you are not YOU..!! I am exposed to the corporate politics first time and my brain activated...!!! And I understood the importance of career building. Talent is like water if you want to stop it with a dam ....Damn..!! it overflows.... and Hard work is like air it will be everywhere........ I mixed everywhere with water and got promoted... and given a team for the first time... 
And yes..when you have Money you have Money and when have Honey you already got money.... ( Coz you purchased it with you money, that means you had already money) . 
It seems short but believe me it's a journey of 7 years and 2 months. And now I am looking for new heights with a good ladder... 
Hello Ladder I am coming........... 

6, జూన్ 2015, శనివారం

బ్లాగ్మిత్రులారా
ప్రపంచం ఎలాపరిగేడుతోందో చూసారా?  అప్పుడే నేను బ్లాగ్ లో టపా రాసి రెండుసంవత్సరాలు అయ్యిపోయింది . మదిలో కధలు , కబుర్లు , కాకరకాయలు మొలిచినా సమయాభావం వల్ల కొంత బద్ధకం వల్ల కొంత రాయలేకపోయాను .

   ఒక కధ బుర్రను తినేస్తోంది దాన్ని పేపర్ మీద పెట్టాలని ఎప్పటినుండో ఆలోచన ఉంది . త్వరలో రాస్తాను కూడా ...

నా బ్లాగ్మిత్ర బంధుగణం ఎలా ఉన్నారో , అసలు నేను గుర్తున్ననో లేదో ? వనజక్క , రసజ్ఞ చెల్లి , తాత గారు , బులుసు గారు పద్మార్పిత గారు ప్రిన్సు , జ్యోతిర్మయి, సుధా గారు, ఇంకా చాలా మందిని చాలా మిస్సయ్యాను ....


వస్తున్నాడు త్వరలో మీ "పల్లెటూరి పాలేరు " మిత్రుల్లారా జాగర్తా ................ ............... నా ఇన్ని రోజుల మౌనదీక్ష వీడి వస్తున్నా ................... ఇక మీ బుర్రలు బురేల్లా ఉబ్బుతాయో ... ! మీ కళ్ళు కాకుల్లగా అరుస్తాయో .... !! అసలు మీరు మీరుగా ఉంటారో లేక నన్నుఎగరేసి  తంతారో త్వరగా తేల్చుకొని రెడీ అవ్వండి .... :)

4, ఫిబ్రవరి 2013, సోమవారం

విదేశియానానికి ఇక సెలవు !!!

ఇలా చాలా సార్లు అనుకున్నాను ....కాని మాట మీద నిలబడలేక పోయాను...వేరే దేశం వెళ్ళిన ప్రతీసారి ఇండియా వచ్చేయాలి అనిపిస్తుందితీరా వచ్చాకా ....ఎందుకోచ్చేసానా .... అనిపిస్తుంది ....

దుబాయ్ లో ముగించేసాను ....!!! మళ్ళి నిర్ణయించుకున్నాను ...ఎక్కడికి వెళ్ళకుడదని .....నా భారతదేశం ఏమి చేస్తుందో ఈ సారి !!!!

నన్ను అక్కున చేర్చుకుని తన వొడి లో కూర్చో బెట్టుకుంటుందో ...లేక కోపంతో విదిలించి కొడుతుందో ??

కూర్చో బెట్టుకున్న ...విదిలించి కొట్టినా.....తల్లి తల్లే......!!!

డబ్బులు అన్నిచోట్ల ఉన్నాయ్ ....కాని భారతీయత లేదు .....ఇలా అంటే ...జనాలు నవ్వుతున్నారు ...ఈ కాలం లో కుడా ఆ సెంటిమెంట్స్ ఏంటి రా అని ....కొన్ని సార్లు సిగ్గేస్తోంది ...కొన్ని సార్లు వాళ్ళమీద జాలేస్తుంది ....

ఆ పచ్చటి  పొలాలు ....ఆ పొంగే నదులు...పక్షుల కిలకిలరావాలు ....పశువుల సంతలు ....జాతరలు ....ఎలక్షనులు .... గొడవలు .....రాజకీయాలు ...స్కాములు .......అమ్మ చీవాట్లు ...నాన్న కోప్ప డ టం .....చెల్లి సానుభూతి ...తమ్ముడి సప్పోర్టు ....నా ఉద్యోగుల .అభిమానం .....నా స్కూళ్ళు ....ఆ పిల్లలు ....అన్నింటికంటే ...గొప్ప మా వూరు ......ఎన్నని చెప్పను ...?? ఏమని చెప్పను ??? ఈ డబ్బు అనే పదం లేకపోతె ....వదిలి వెళ్ళేవాడిని కాను .....

ఏదేమైనా ......కొన్ని  అనుభవాలు......... మంచి పాఠాలు ....!!!

ఈ సారైనా ...ఇండియాలో కుదురుగా ఉండగలనా?? ఉండాలని ఉంది ..!!! ఆ దేవుడేమి చేస్తాడో ?? ఏమి జరుగుతుందో??

ఇండియా ....వచేస్తున్నా.....!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

5, జనవరి 2013, శనివారం

హిందువు సోదరులారా .....సోదరీమణులార ......!!!

ఎవడో ఏదో వాగాడని ....అందరం కొట్టుకుందామా ?? ఒకడు చేసిన పాపానికి జాతి మొత్తాన్ని అవమానిద్దమా ?? పరమత సహనం నరనరాన  జీర్ణించుకున్న మనం ఇలా కొట్టుకున్తున్నాం కాబట్టే ....పక్కనున్న పాకిస్తాన్  లు మనకంటే ముందుకు వెళ్తున్నై .......!!!

వేరే మతం గురించి అపహాస్యపు మాటలు మాట్లాడే ఎ కుక్క అయినా ఒకటే .....అది కచితం గా రాజకీయ  కుక్కే అయ్యి ఉంటుంది .... అదే అక్బర్ కావచ్చు ...మోడీ కావచ్చు...అద్వాని కావచు.....వీళ్ళు కోరుకుంది ఒక్కటే .....సామాన్యులు కొట్టుకోవాలి వీరు పండగ చేసుకోవాలి.....

"అదే నిన్ను ఎవరైనా అంటే ఇలాగే చూస్తూ ఉరుకుంటావా?"  అని ఎవరినా నన్ను అడిగితె ...నా సమాధానం ఒక్కటే ....ఊరుకోను ...అవకాసం దొరికితే చంపేస్తాను ....కాని వాడి జాతి మొత్తాన్ని తిట్టను .....అందరు వీళ్ళు ఎక్కడి నుండో వచ్చారు ...వీళ్ళు భారతీయులు కాదు అంటున్నారు ...బాధగా ఉంటుంది ఆ మాటలు వింటే !! నా భారతదేశం నా భారత దేశం అని గొంతు చించుకుంటుంటే  గొంతు లో ముళ్ళు గుచ్చినంత  బాధ గా !! మిత్రులారా !!! ఆ ..వచ్చిన వాళ్ళు చచ్చిపోయారు ...మేము ఇక్కడే పుట్టాం ...ఇక్కడే పెరుగుతున్నాం .....ఇక్కడే ఉంటున్నాం ...మేము మీ వాళ్ళమే .....భారతీయులమే ..... దయచేసి ఒక్కడి మనస్తత్వాన్ని అందరికి ఆపాదించకండి ....అందరిని ఒకే రకమైన చూపుతో చూడకండి .....

నేను ఇక్కడ భారత దేశానికి చాలా దూరం లో ఉన్నాను ....కాని నా మనసు మొత్తం భారతదేసమే నిండి ఉంటుంది ....నా చావు ఇండియా లోనే రావాలి అని ఎప్పుడు కోరుకుంటాను .....మొదట్లో అనిపించేది ....భారతదేశం మంచిది కాదు అని ....గుజరాత్ ఘటన తరువాత నా మనసు మరీ మారిపోయింది ...ప్రసాంతంగా ఆలోచించాను ....భారతీయుల మనస్తత్వం అర్ధం అయ్యింది ....కొందరి వల్ల అందరికి కష్టాలు ..అందరు ఒకటి కాదు కొందరే అందరు కాదు .భారత దేశ ముస్లిం లకు నా సలహా ఏంటంటే వేరే దేశం లో సంపన్న జీవితం గడపటం కన్నా భారత దేశ హిందువుల చేతిలో చావడం మేలు .....చంపినా తరువాత అయినా కనీసం కనికరం చూపిస్తారు ...ఎందుకంటే భారతీయులు !!!! దయ , ప్రేమ , సహాయం చేయడం ....ప్రత్యేకం గా పగవాడికి కుడా...అది మనకే చెల్లుతుంది ....


అక్బర్ ఏదో అన్నాడని ....దయచేసి నన్ను మాత్రం వేలివేయకండి ...కుల్లబోడవకండి ....నేను భారతీయుడినే మీ సోదరుడినే !!!! జై హింద్ !!!

2, జనవరి 2013, బుధవారం

సంఘర్షణ ....నిజమైన కల !!!

అరుణ , ఒక పెద్ద వ్యాపారి కూతురు ....తెలివిగలది , చదువుకున్నది , గుణవంతురాలు ....కాని అందమే అంతగా లేదు. మరీ కరుపి అని కాదు గానిఒక మోస్తరు గా ఉంటుంది ....

రాజు ఒక లేబర్ , అటు ఇటు చేసి పది అయ్యిన్దనిపించాడు ...కాని పై చదువులకు నోచుకోలేక పోయాడు ...బ్లాకు టికెట్లు అమ్ముకుంటూ , చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ...జల్సా గా బ్రతికేస్తున్నాడు .

విధి, అదృష్టవంతుల తో ఒక విధంగా .....దురదృష్టవంతులతో మరో విధంగా ఆట ఆడుతుంది ....ఇక్కడ అలాగే జరిగింది ....అరుణ రాజు తో ప్రేమలో పడింది .............ఈ కొత్త వింత అనుభూతి ని ఇద్దరు బాగా అనుభవిస్తున్నారు .........రాజు కైతే మరీ కొత్తగా ఉంది ..ఈ ప్రేమించుకోవడం ఏంటి? ఇలా తిరగటం ఏంటి ? సినిమాలల్లో లాగా ?? అందునా సినిమా దియేటర్ కు వెళ్తే టికెట్లు అమ్మలనిపిస్తుంది కానీ కొనాలనిపించదు ...మరీ ప్రేమొస్తే మన రంగి ఉండనే ఉంది గా!!! రెండు టికెట్లు నావి కావు అనుకుంటే సరి ఎంత ప్రేమ కావాలో అంత  ప్రేమ ఇస్తుంది .ఈ పార్కులేంటి ? ఈ శికార్లేంటి? కాని కొత్త కొత్త బట్టలు మంచి బండి ఇవన్ని పాపం అరుణ ఇప్పించింది అందుకే కిక్కురుమనకుండా ప్రేమించేస్తున్నాడు ....కాని తెలీకుండా నే రాజు జీవితం అరుణమయం అయిపొయింది .అరుణ లేకపోతె జీవితం లేదు అన్నట్టు అయిపోయాడు ...నిజంగా అరుణ ను ప్రేమించడం మొదలుపెట్టాడు. రోజు ఒక కొత్త అనుభూతి పంచేది అరుణ ...ప్రేమంటే రంగి కాదు ప్రేమంటే అరుణ అనుకునే స్టేజి కి వచ్చాడు . ఒకరోజు అరుణ  పుట్టిన రోజు గురించి అడిగింది ..రాజు కేమో తెలవదాయే పదోతరగతి లో ఒక పుట్టినరోజు ఉంది అది సరి అయినది కాదు అని సుబ్బులు చెప్పేవాడు . ఏదైతేనేమి అదే చెప్పాడు . అంటే రేపే నా ? నీ పుట్టినరోజు ఆనందం పట్టలేక అరిచింది అరుణ . అంత  గట్టిగా అరిచింది కాబట్టి రేపే అని నమ్మేసాడు రాజు ......"రాజు రేపు నీకు నేను ట్రీట్ ఇస్తాను మార్నింగ్ రెడీ గా ఉండు నేను నా కారు తీసుకొస్తా అందులో వెళ్దాం " అని చెప్పి వెళ్ళిపోయింది ....


           అన్నట్టుగానే ఉదయం కారు తీసుకుని వచ్చింది అరుణ ...రాజు కారు లో కూర్చున్న తరువాత బండి ముందుకు కదిలింది ....సిటి దాటినా తరువాత అరుణ అకస్మాత్తుగా కారు ఆపి రాజు వైపు చూసింది.ఏమిటన్నట్టు  చూసాడు రాజు అరుణ వైపు ,ఒక కర్చీఫ్ తీసి రాజు కళ్ళకు గంతలు  కట్టింది? ఏమిటిది అన్నాడు రాజు , ఇక్కడినుండి మనం నడిచి వెళ్తాం ..ఒక సుందర ప్రదేశానికి తీసుకువెళ్తాను అప్పటి దాకా నువ్వు ఏమి చూడకూడదు అని ఇలా కళ్ళకు గంటలు అన్నమాట అంది అరుణ ...సరే పద అంటూ ఇద్దరు నడిచారు ...నడుస్తున్నారు ...నడూస్తూనే ఉన్నారు...ఒక గంట తరువాత అడిగాడు రాజు ఇక ఆగలేక ఇంకా ఎంత దూరం నడవాలి అరుణ అని ...కొంచెమే వచ్చే .... సాఆఆఆఆఅ మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్ ..................అరుణ గొంతు ఉన్నట్టుండి దూరం కాసాగింది ...ఏమైందో అని కంగారుగా అటుఇటు కదిలాడు ....అంతే !!!! ఓఓఓఓఓఒ ఎక్కడో పడిపోతున్నాడు ...ఏదో బావి లో పడుతున్నా అనుకుంటూ నే స్పృహ తప్పిపోయాడు .....

    రాజు మెల్లగా కళ్ళు తెరిచాడు లీలగా వెలుతురూ కనబడుతుంది ఎక్కడో దూరం గా !! టైం ఎంతయిందో చూద్దాం అని చెయ్యి కదిపాడు రావటం లేదు , గట్టిగా లాగాడు ఏదో బరువు వెనక్కు లాగుతున్నట్టు అనిపించి అటుకేసి తిరిగాడు ...అంతే  ఒక్కసారిగా ...స్థాణువు అయిపోయాడు ...అప్పుడు గుర్తుకు వచ్చింది తను అరుణ రావటం ఇద్దరు ఒక గోతిలో పడటం ......పైకి చూసాడు ...ఎక్కడో మినుకు మినుకు మంటూ వెలుతురూ అమావాస్య రోజు వెన్నెల లా !!! సరిగా గాలి ఆడటం లేదు శ్వాస ఇబ్బంది గా ఉంది ..అంటే తను చాలా లోతుగా పడ్డాడు ....అరుణ ను కదిపాడు ...కదలటం లేదు ...గట్టిగా....కదిపాడు ఉహు.....అప్పుడు చూసాడు అరుణ వైపు కళ్ళు చీల్చుకొని ....అరుణ కు ఋణం తీరిపోయినది ...ఇక తనే మిగిలాడు ...సరే పోయిన అరుణ ఇకరాదు  కాబట్టి తను బ్రతకాలి అంటే ఇక్కడి నుండి బయటపడాలి అది కుడా ఆ అరుణుడు ఆరిపోయేముందు ......గోడలను తడిమాడు ఇంట పెద్ద బావి కాబట్టి మెట్లు ఉంటై అనే నమ్మకం తో ..ఎక్కడ తగలడం లేదు ...ఇక్కడినుండి ఎలా పైకి వెళ్ళడం అని ఆలోచిస్తుంటే ఏదో కాలికి తగిలింది ..తీసి చూసాడు ..ఒక రాయి ముక్క ...ఏమైనా ఆయుధాలు దొరుకుతాయేమో అని వెతికాడు ఉహు లాభం లేదు ...హుసురు మంటూ ఒక పక్క చతికిల బడ్డాడు ......

    మూడు వస్తువులకోసం మనిషి ఏమైనా చేయగలదు ...ఒకటి డబ్బు ...రెండు ప్రాణాలు... మూడు ఆడవారు. రాజు దగ్గర ఎలాగు ఒకటి మూడు లేవు ఇక మిగిలిన రెండు అయినా కాపాడుకుందాం అని మల్లి లేచాడు ..ఆలోచించాడు ఎలా బయట పడాలో అని. గోడలను తడిమాడు ..పాతకాలం రాళ్ళు రాయి చుట్టుపక్కల గాడి తవ్వి మెల్లగా రాయిని బయటకు లాగాడు ....అది బయటకు వచ్చింది ...అంటే రాజు ఒక ఉపాయం ఆలోచించాడు ..ఇలా రాళ్ళు తీసుకుంటూ ఆ ఖాళి జాగా లో కాళ్ళు పెట్టుకుంటూ పైకి వెళ్దాం అని ...కాని రెండు రాళ్ళు తీసిన తరువాతా రాళ్ళు కుడా రావడం కష్టం అయిపొయింది ..ఏదైనా సూది గా ఉన్న వస్తువు కావాలి ..రాళ్ళ చుట్టూ గాడి తవ్వడానికి .....కాని ఏమి లేదు ?? ఎలా ఎలా? కిందకు చూసాడు ..అరుణ శవం కనిపించింది..ఒక ఆలోచన తలుక్కున మెరిసింది ....కాని మరీ ఇంత కిరాతక పని చేయడానికి మనసొప్పలేదు. సందిగ్దం లో ఉండిపోయాడు కాసేపు ...కాని పోయిన అరుణ కంటే ఉన్న ప్రాణాలు ముఖ్యం కాబట్టి ...తప్పలేదు ..కిందకు దిగి ..అరుణ చేతులను విరగొట్టి ఎముకలు బయటకు తీసాడు ...చీకటి ఎక్కువైపోసాగింది ...చేతులు లేని అరుణ భయంకరం గా కనిపిస్తుంది ..ఈ అరుణను చూస్తె ప్రేమ పొంగుకోచేదో ..ఈ అరుణ వొళ్ళో పడుకోవలనిపించేదో ...ఇప్పుడు అదే అరుననుంది పారిపోవాలనిపిస్తుంది ....

    బావి కి ఇటు పక్క ఒక రాయి అటు పక్క ఒక రాయి తవ్వుతూ ..దానిపైన కాళ్ళు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు ...కాని ఈ ప్రయాణం కుడా ఎక్కువసేపు సాగలేదు ....పైకి వెళ్తున్న కొద్ది బావి వెడల్పు పెరుగుతుంది ...రెండు కాళ్ళు జాపడానికి ఇబ్బంది గా ఉంది ..పైగా చీకటి పడసాగింది....ఎలా బయటపడాలో ? తెలియడం లేదు ...అసలు బ్రతుకుతాడో లేదో తెలియదు.ఎ విశాపురుగు అయినా కాటేయవచ్చు  జారి కింద పడి  తల పగిలి చనిపోవచ్చు ...చీకటి పెరగ సాగింది ...అంతా మసక మసక అయిపొయింది. అలాగే ఒక రాయి పైన ఇంకో రాయి తవ్వుతూ పైకి ఎగ బాకుతూ ఉన్నాడు ....మసక చీకటి నుండి ముసుగు చీకటి దాకా తవ్వుతూనే ఉన్నాడు ...అలా తవ్వుతూ తవ్వుతూ ఉండగా మెల్లగా వెన్నెల పెరగసాగింది .....ఏమి తినలేదు కాబట్టి నీరసం ఆవహిస్తోంది ..ఎక్కువసేపు పట్టు కునేలా లేడు ...కాని కింద పడితే పోయేవి ప్రాణాలు కాబట్టి తెగించి ముందుకు వెళ్తున్నాడు ......కొన్ని గంటల తరువాతా ఒక్కసారిగా వెలుగు పెరిగింది అంటే తెల్లారింది ...పైన ఆకాశం ...చెట్లు కనబడటం  మొదలయ్యాయి  ....ఉత్సాహం పెరిగింది .....ఇంతలో ఒక రాయి తీసి చేయి ఆ కన్నం లో పెట్టగానే ఏదో చల్లగా తగిలింది ..డడిచి కిందకు లాగాడు చేతిని ...అంతే  ఒక్కసారిగా ...పట్టుతప్పి కిందకు పడిపోయాడు...మళ్లి  అరుణ దగ్గరకు ...ఇక వెళ్ళలేను అని నిర్ణయించుకొని అలాగే ఉంది పోయాడు తన చావు కోసం ఎదురు చూస్తూ .....కాని రాజు మనిషి కదా....అన్నేతీకన్న తీపే ప్రాణాలే ..కాబట్టి మళ్లి ప్రయాణం మొదలు పెట్టాడు....ఈ సారి త్వరగానే పైకి వెళ్ళగలిగాడు ...ఇంకా ఒక అయిదు అడుగులు పైకి వెళ్తే నేలను చూడవచ్చు ....సమయం చూసాడు మధ్యాన్నం ఒంటి గంట ....అంటే ఒకటినర్ర కాల్లా తను బ్రతికి పోతాడు అని ఆలోచించుకొని ఇంకా రెట్టించిన ఉత్సాహం తో రాళ్ళను తవ్వుతూ బావి గోడమీద పాకుతూ ముందు కదిలాడు ...

     రాజు ...పైకి వచేసాడు ....చేతిలో ఉన్న ఎముకలను చూసి ఒక్కసారి గాధంగా నిట్టూర్చి ఆ ఎముకలను అదే బావి లో పారేసాడు ....ఇక ఇంటికి బయలు దేర్దాం అని వెనక్కి తిరిగితే .....రెండు సింహాలు ఆకలిగా తన వైపే చూస్తున్నాయి ...మొదటిసారి సింహాలను అంతదగ్గరగా చూడటం వాళ్ళ కొంచెం జంకి రెండడుగులు వెనక్కి వేసాడు అంతే మళ్లి బావి లోకి జారిపోయాడు.......మల్లి ఎక్కడ నుండి బయలు దేరాడో అక్కడికే వెళ్ళిపోయాడు ...కాని ఈ సారి స్పృహ తప్పలేదు ....రెండు మూడు భారి దెబ్బలు తగిలాయి కాని తల మాత్రం అరుణ మీద పడటం వల్ల బ్రతికి పోయాడు ...బట్టలు దులుపుకుంటూ ...పైకి చూసాడు ఏమి కనబడటం లేదు ఎక్కడో దూరం గా ఒక వెలుగు ...అరుణ వైపు చూసాడు ...."నేను చచ్చి బ్రతికిపోయాను రా నువ్వు బ్రతికి చస్తున్నావ్" అన్నటు కనబడింది అరుణ  మొఖం లో .....తల అరుణ మీద పడక పొతే తనుకూడా అరుణ తో పాటు కైలాసం లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడే ....భరించే వాడిని భర్త అంటారు కాని నాకెంటో  అన్ని ఆరుణే  భరిస్తోంది అనుకుని మళ్లి ప్రయాణం మొదలు పెట్టాడు ...ఎలాగైతే నేమి ఈసారి త్వరగానే పైకి రాగలిగాడు రాళ్ళు తీసి ఉండటం వల్ల !!!

   మెల్లగా పైకి వచ్చి చూస్తె ...   సింహాలు కనబలేదు ..గడియారం మూడు గంటలు చూపిస్తోంది ....ఇక బ్రతికి పోయాను అనుకుంటుండగానే ..సింహాల గాండ్రింపులు ఒక్కసారిగా వినబడ్డాయి చూస్తె ...గుంత కాడ నక్కల్లా ..చెట్టు చాటు న నిలబడి ఉన్నాయి ....నా చావు నూతి నుండి నోటి కి షిఫ్ట్ అయ్యిందేమో అనుకుని ఏమి చేయలేక అలాగే చతికిల బడ్డాడు ...సింహాలు దగ్గరకు రాసాగాయి ....ఇక తప్పదు నాకెలాగు రెండు రోజుల నుండి తిండి లేదు పరుగెట్టలేను ఇక మీరు నన్ను తినండి అనుకుని కళ్ళు మూసుకున్నాడు ...సింహాలు చాలా దగ్గరగా వచ్చేసాయి కాని ఎంత సేపు కళ్ళు మూసుకుంటాడు? ప్రాణాల  మీద తీపి ఎవడు వదులుకుంటాడు? సింహాలు దగ్గరకు రాగానే మనసు మారిపోయింది ..బ్రతకాలన్న ఆశ ఎక్కువయ్యింది ....అంతే ఒక్కసారిగా సింహాల మీద నుండి గెంతి చెట్టు ఎక్కడం ప్రారంభించాడు ...చాలా సేపు ఎక్కుతూనే ఉన్నాడు ..ప్రాణాల మీద తీపి వల్ల...సింహాల భయం వల్ల ....అలా చాలా పైకి ఎక్కేసాడు ....సింహాలేమో ..కిందకు రావా ? అన్నట్టు పైకి చూస్తున్నాయి ....అంత పైనుండి కిందకు చూడటం వాళ్ళ కళ్ళు తిరుగుతున్నై .....కిందకు జారిపోతున్నాడు ....వీధి ఇంతగా పగ బడుతుంది అనుకోలేదు రాజు ..ఇక సరీగా సింహల నోటి ముందు పడేవాడే కొంచెం ఉంటె ...కాళ్ళు చిక్కుకోవడం వల్ల  ఒక కొమ్మ మీద ఆగిపోయాడు ....యముడికి ఎవరో మిస్ కాల్ ఇచి వుంటారు ...... అలా కాసేపు శ్వాస తీసుకుంటుండగా ....కాలు కొమ్మకు బిగుసుకు పోతోంది ...ఏంటో అని చూస్తుండగానే ..ఒక పెద్ద అనకొండ చుట్టేసి ఉంది కాళ్ళకు.....ఒక్కసారిగా నోరు పెద్దగ తెరిచి మీదకు రాసాగింది  ఇంకొంచెం ఉంటె తన తల దాని నోట్లో ఫలహారం అయ్యేదే ... రెండు చేతులతో దాని మెడ గట్టిగా పట్టుకున్నాడు ...దాని చూస్తుంటే నే భయం వేస్తుంది ..దాని పట్టుకున్నాను అనే ఫీలింగ్ తో చావు దగ్గరికి వచ్చేలా  ఉంది ......యముడు మళ్ళి  ప్రాజెక్ట్ పని మొదలు పెట్టాడు ....ఒక పక్క చీకటి పెరుగుతోంది ...ఒక పక్క ఈ అనకొండ తన ఫలహారం కోసం విశ్వప్రయత్నం చేస్తుంది ..తన శరీరం తో రాజు ని చుట్టేసింది .....గట్టిగా బిగించసాగింది....ఎముకలు విరిగిపొతున్నయెమొ అనిపిస్తుంది రాజు కి ......అప్రయత్నం గా కిందకు చూసాడు ..సింహాలు బేటరా ??? పాము బేటరా ??? అని ...సింహాలు వేల్లిపోయినాయి ...ఇక పామే గతి అనుకుంటూ .....కళ్ళు మూసుకున్టుండగా .....అనకొండ ఒక్కసారిగా పట్టు వదిలేసింది ...అంతే కిందకు జారడం మొదలు పెట్టాడు అది కుడా అనకొండ ను పట్టుకొని .....కిందకు జారి నేల మీద పడగానే ....ఒక్కసారిగా పరుగు లంకించుకొన్నాడు ...ఇంటికి చేరేదాక ఆపలేదు ...ఇంటికి చేరుకొని ఒక్కసారిగా మంచం మీద పడిపోయాడు ......అరుణ గుర్తుకు వచ్చింది .....ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది ...తను బ్రతికి ఏమి లాభం ?? అరుణ లేనప్పుడు అనుకుంటూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద భవనం ఎక్కి దూకేసాడు......తల పగిలి పోయింది ....రక్తం ధారగా కారడం ..ఒక బాట తాయారు చేసుకొని తల కిందుగా వెళ్ళడం జరుగుతుంది ......రాజు ఆత్మా ఏడవటం మొదలు పెట్టింది ......ఏడుస్తూ ఏడుస్తూ ....ఒక్కసారిగా ఏడుపు పెరిగింది .....

     తల కింద ఏదో చల్ల గా తగులడం చూసి రాజు లేచాడు ....చూస్తే ...రాజు ఏడుస్తున్నాడు .....అదేంటి ఇదంతా కలా?? నేను చావలేదా ?? మరి రక్తం!!! అనుకుంటూ కింద చూస్తె ...తనగుడిసేలో కుండ పగిలి కింద అంతా తడిచిపోయింది ...  తనేకలలో ఘర్షణ పడుతూ కుండను ఒక్క తన్ను తన్ని ఉంటాడు అనుకుని ...నిద్రలోనుంచి లేచాడు రాజు.......

                                ************అయిపొయింది ****************

23, డిసెంబర్ 2012, ఆదివారం

రేప్......... రేప్ ....రేప్ ....రేప్....


రేప్......... రేప్ ....రేప్ ....రేప్....

ప్రస్తుతం దేశాన్నిహోరెత్తిస్తున్న పదం ..........జనాలు అన్నీ మర్చిపోయి మాట్లాడుకుంటున్న నిజం .....

అవును జనాలు అనీ మర్చిపోయారు !!! మనం ఇరవయి ఒకటో శతాబ్దపు మనుషులం కదా !!! అభివృద్ధికి నిలువు అద్దాలం  కదా!!! మూలాన్ని మరిచి ముఖాన్ని చూస్తాం !!! కారణాన్ని వదిలి ఫలితాన్ని చూస్తాం .....!!! 

రోగికి రోగం వస్తే మందు ఇవ్వడమే సరి కాదు ...రోగం మూలం కనుగొని దాన్ని నియత్రించాలి ...నివారించాలి ....నాశనం చేయాలి ... అంటే మందు వద్దా ?? అనే పండితుల ప్రశ్నకు నా సమాధానం " ముందు మందు" కాని మందే మొత్తం కాదు ..............

ఆ ఢిల్లీ అమ్మాయి రేప్ కు గురి కావాడానికి మనమే కారణం మనం అందరం కారణం తప్పు చేస్తే ఎయిడ్స్ వస్తుంది అని తెలిసి కుడా తప్పు చెయ్యండి కాని కండోం పెట్టుకుని చేయండి అనే ప్రభుత్వం కారణం ..........డబ్బుల కోసం అరకొర దుస్తులతో సినిమాల్లో నటించే సినీ తారలు కారణం ...ఫ్యాషన్  పేరుతొ దుస్తుల సైజు తగ్గించిన ఫ్యాషన్ పితామహులు కారణం ....డబ్బుల కోసం పొర్న్ సైట్లు నిర్వహించే నిర్వాహకులు కారణం .........పిల్లలకు  సరైన విలువలు నేర్పని తల్లితండ్రులు కారణం....మేము ఎలాంటి బట్టలైన వేసుకుంటాం మీరు చూసి ఊరికే వెళ్లిపోవాలి గాని మా బట్టల మీద ఎటువంటి కామెంటు చేయకూడదు అనే ఫెమినిస్టులు కారణం ...........

ఓహో !!! ఇది మరీ బాగుందయ్యా పాలేరా !!! మేమందరం కలిసి ఆ రేప్ ని తీవ్రం గా ఖండిస్తున్నాం ...ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ....ఉద్యమం చేస్తున్నాం !!! నువ్వు మమ్ములను దోషులు అంటావెం ??? అంటారా ....కారణం కావాలా ???

ఇదీ కారణం :.ఒక డ్రెస్ మార్కెట్ లో కి వచ్చి బాగా పొపులర్ అయితే అది నేను కుడా కొంటాను , నా ఫ్రెండ్స్ అందరు నాకు ఇష్టం లేని హీరో సినిమా చుసివచ్చి చాలా బాగుంది అంటే "నిజంగా బాగుంది ఏమో ??నాకు ఆ హీరో కి ఏమైనా గొడవలు ఉన్నాయా" !! అని మనసుకి సర్దిచెప్పుకుని సినిమా చూస్తాను, మార్కెట్ లో ఫలానా రకం కారు బాగుంది అంటే నేను కుడా కొందామని ప్రయత్నిస్తాను. సినిమా హీరోల హెయిర్ స్టైల్ చూసి నేను అనుకరిస్తాను, అంటే ....మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇతరులనుండి INFLUENCE పొందుతాం...ఇది నిజం...అలాగే B గ్రేడ్ సినిమాలు చూసి చూసి .....పోర్న్ సైటులు చూసి చూసి....బికినిల్ల్లో హీరోయిన్ లను చూసి చూసి ...రేచాగోట్టే లాగా దుస్తులు ధరించే అమ్మాయిలను రోడ్ల మీద ,షాపింగ్ మాల్లో ,చూసి చూసి.....చూసి ఒక వెధవ ఒకానొక బలహీన క్షణం లో బలాత్కారం చేస్తాడు, ఆ తరువాత వాడి జీవితం సంకనాకి పోతుంది. దరిద్రం వదిలిపోతుంది, ఒక ఆబల బలి కావటానికి ఎంతమంది ఎన్ని రకాలుగా తోడ్పడుతున్నారో ఇప్పుడు ఆలోచించండి.!!! డబ్బు కోసం B గ్రేడ్ సినిమాలు తీసే వ్యాపారస్తులు , మార్కెటింగ్ కోసం పోర్న్ సైట్లు నడిపే వెబ్ నిర్వాహకులు, ఫేం కోసం వెంపర్లాడే అమ్మాయిలు ( హీరోయిన్లు), సంస్కృతీ, సంస్కారం లేకుండా మానవ అవతారంలో అర్ధనగ్నం గా తిరిగే జంతువులూ , అందరు కలిసి ఎవరి బలి కి కారణం అవుతున్నారు..????? నేడు  ఒక ఢిల్లీ అమ్మాయి ... రేపు మరో అమ్మాయి .....


సమస్యను కాదు రండి మూలాన్ని తుడిచేద్దాం .............విలువ ఇచ్చే బట్టలు ధరిద్దాం ....నైతిక విలువలతో బ్రతుకుదాం !!!

20, ఆగస్టు 2012, సోమవారం

మళ్ళి విదేశీయానం

జీవితం ఎటు నుండి ఎటు పోతుందో ఎవరికీ తెలీదు , మనం అనుకుంటాం గాని అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా..!!!

చిన్చేద్దం అని వచ్చాను ఇండియా కాని ఇక్కడ బిజినెస్ చేయడం అంటే మాటాలు కాదు అని తెలిసిపోయింది , ఎంత కంప్రమైస్ అవుదామన్నా కుదరటం లేదు , ఇక తప్పట్లేదు, మళ్ళి డబ్బులు వెతుక్కుంటూ ఇతర దేశానికి వలసపోవాలిసిరావటం ...చాలా బాధగా ఉంది అయినా తప్పదు . నన్ను నమ్ముకున్నవాల్లకోసమైనా వెళ్ళాలి .అక్కడికి నా కంపనీ లో యాభై పర్సెంట్ వాటా అమ్మేసినా కుడా పని కావడం లేదు .

నా ముందు ఉన్నవి రెండే దారులు ఒకటి బిజినెస్ ని మర్చిపోవడం లేదా బిజినెస్ లో దిగిపోవడం . అది ఈ షార్జా వెళ్లి వచ్చిన తరువాతా తేలుతుంది ...

ఏది ఏమైనా "మేరా భారత్ మహాన్ "