స్పాన్సర్ గాడు నా హోటల్లో పని చేయమని గొడవా...కాంట్రాక్టరు ...రకరకాల సర్టిఫికేట్ ల పేర్లు చెప్పి పట్రా ,,,అప్పుడు గాని డబ్బులు ఇవ్వా... అని మారం....ఎయిర్ టికెట్ వోడు నీ పాస్‌పోర్ట్ వచిందా?? అని వెకిలి ప్రశ్న!!! ఇలాంటి వాటి వల్ల విసిగి పోయి పిచ్చెక్కి....సరదాగా ఏమైనా చూద్దాం అని బ్లాగ్లోకం లోకి వచ్చి ఎక్కేడేక్కడో దూరి రక రకాల దురదలు గజ్జులు చూసి....చివరగా ఇక ఇలాకాదు గాని నా మెంటల్ జనాలకు చుపించాలిసినదే అని డిసైడ్ అయ్యి ఒక కధ రాద్దాం అని నిర్ణయించుకుని లాపు తెరిస్తే ఆలోచన రాదే???
సరే...ముందుగా అందరు ఇష్టపడే హాస్య కధ రాద్దాం.... దీని లక్ష్యం మాత్రం అందరిని నవ్వించి వాళ్ళు నవ్వుతుంటే " పాపం" అని వాళ్ళ వంక చూసుకుని నేను నవ్వుకోవచ్చు కదా....అని....
సరే...కమాన్...వాన్ ...టు......త్రి....స్టార్ట్.......
హహహహహహహహహహహాహ్హాహః వూఉ హుహుహుహుహుహుహు .....అమ్మో రాజు ఇక ఆపు !!నవ్వలేక చస్తున్నాం ....హమ్మే హమ్మో ..నిజోక్లు....హహహహహ్హహ ఆపు నాయన ...ప్లీజ్ రాజు ...కధ ఆపేయి...ఇంకా చాలు నవ్వలేక పోతున్నాం....
అదేంటి.....??? ఇంకా నేను మొదలు పెట్టలేదు అప్పుడే వీళ్ళ నవ్వులు?? ఆపెయమనడాలు...!!! ఇదిగో ఇలా తిక్క ఎక్కించకండి...అసలే మెంటల్ లో ఉన్నా...కరిస్తే కైలాసం కనిపిస్తుంది...నేను కధ చెప్పల మీరు నవ్వాల అంతే!!!...
అసలేం జరిగిందంటే.....
హాహహహహహహహ్హహః ....వువువువ్ హూహుహుహుహూహుహుహ్ అబ్బ ఏమి నవ్విస్తావ్ రాజు....ఇంత మంచి జోకులు నీకు ఎక్కడివి హహహ్హహ అసలు నువ్వు హహహః మనిషి వేనా.....అమ్మో అమ్మో ఆహాహహ్హహః ఏమి జోకులు ఏమి పంచులు .....రాజేందర ప్రసాద్, బాలకృష్ణ కాంబి నేషన్ సినిమా చుపిస్తున్నావ్ గా ...హహహహః
మరక్కడే నాకు కాలేది....వినకుండా ఏమిటా వెకిలి నవ్వులు ?? మీకు గాని మైండు పనిచేయడం మొదలుపెట్టిందా ఏమి ?? అసలు నాకు తెలియాలి .??..మీరెందుకు నవ్వుతున్నారో???,,,,,అసలు కధ చెప్పకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో??? నాకు తెలియాలి ...తెలియాలి...తెలియాలి......!!!
టెన్సన్ పడకు రాజు ...ఏమి లేదు నువ్వు కధ చెప్పుతానంటే మాకు అంతకంటే కామెడి ఏమి ఉంటుంది చెప్పు ???
ఎంతైనా మాకు కొంచెం ధైర్యం ఎక్కువ ఇక్కడకు వచ్చి ముర్చపోయి ...మల్లి లేచి వెళ్ళడానికే కొంచెం సమయం పడుతుంది మరి నువ్వు కధ కుడా చెపితే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కదా...అందుకే ప్లీజ్ బాబు ,,,,కధ చెప్పకే....ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్..
ఆపండి మీ అసందర్భ ప్రేలాపనలు.....ఏ నేను కధ చెపుతానంటే......అంత కామెడి గా ఉందా....??? ఎంత అవమానం ఇంతా అవమానం జరిగిన తరువాత నేను కధ చెపుతాను అనుకుంటున్నారా .....చెపుతా....కచ్చితంగా చెబ్తా,,,మీరు వినక పొతే పినోడ్డు కాని నేను మాత్రం చెప్పడం స్యురే.....
భావాన్ని ని అలా.....
అరె ....!!! ఏరి వీళ్ళంతా....?? కనిపించారు?? పారిపోయారా....???? అరె కింద కుర్చుని అలా ఆకాశం వంక చుస్తున్నరేమిటి?? ఏదో గొణుక్కుంటున్నారు ....ఎంటబ్బా అది ......
"దేవా..!!!.దేవ దేవ దేవ దేవా .....మమ్మలిని కాపాడు వీడు మల్లి భవాని అని మొదలు పెట్టాడు ....మేము తట్టుకోలేము ,,,ఇప్పటికి విని చెవులు చేటలు అయి పోయాయి...దేవుడా....కాపాడు ప్లీజ్ ...కుదిరితే.... నువ్వు కోరుకున్నట్టు వీడి కాళ్ళు నీకు నైవేద్యం చేసిపెడతాం....."
హహః నవ్వు వచ్చింది నాకు ఆ దేవుడికి వీళ్ళ మైండులు ఆల్రెడీ సమర్పించాం మనం, ఇంకా వీళ్ళ మాటలు ఎందుకు వింటాడు...చచ్చారే ఈ రోజు నా కధ తోటి వీళ్ళు .....ఎలా వినరో చూద్దాం...
"ఇదుగో .....పాలేరు వారి బ్లాగ్మిత్రులు ....అసలేమి జరిగిందంటే....."
"వద్దు నాయనా......!!"
"అదికాదు ....అసలు ....ఆ రోజు..."
"నాయనా పాలేరా ....నీకో దణ్ణం నాయనా..."
"బంగారాలు...అది కాదు ....భావాన్ని అంటె...."
"మాకు తెలుసు నాయనా .....వదిలేయరా ...బాబు ..... "
"మీరు అలా పరిగెట్టకండి....నేను మీకంటే బాగా పరిగెత్తగలను...."
"వద్దురా నాయనా,,,,, నువ్వు పరిగెత్తకు....కాళ్ళు నొప్పి పుడతాయి...."
"పర్లేదు నా కధ చెప్పపోతే మనసు నొప్పి పుడుతుంది..... హా హా అమ్మ ఆయాసం వస్తుంది ఆగండి నా బంగారాలు ...ఈ కధ విని వెళ్లి పొండి"
"అరేయ్ ..మేము బతకాల్రా ,,,!!!అలా వెంట పడకురా ....హచ్ ఆడ్ లో !@#$ లాగా....."
"మీరు !@#$ అన్నా ...%^&* అన్నా ....కధ వినాల్సిందే...."
"నువ్వు మంచి గా చెపితే వినవురా...వెధవా. చవటాయ్....బడుద్దాయ్.......నిన్ను ...నిన్ను...నిన్ను....."
ఏయ్!! అలా రాళ్ళు విసరకూడదు........అరె........చప్పులు విసరకండి..... మళ్ళి కొత్తయి కొనుక్కోవాలి అంటె కష్టం................. ....అరె అలా ఏవి పడితే అవి విసరకండి............. దెబ్బలు తగులుతాయి ...............బుజ్జులు ...బంగారాలు ....బంగారు కొండలు ,,,,,,,,,,,,,,,,వినండి......ఇదిగో నేను పరిగెత్తలేకపోతున్నా ......అలా వెళ్లి పోకండి...ఈ కధ మీ కోసమే....అరె ....ఆగండి...................
ఆగండి ..................................................................హు .....పారిపోతున్నారు........
7 కామెంట్లు:
ఏమి వ్రాయకుండానే ఇంత పేల్చావ్!? ప్రేలాపన కాదులే!!!!!
ఇంతకీ హచ్ యాడ్ ..హచ్ ఆడ్ లో !@#$ లాగా....."
"మీరు !@#$ అన్నా ...%^&* అన్నా ....కధ వినాల్సిందే...." :)))))))))
ఇది మాత్రం సూపరో..సూపర్. మల్లిక్ గుర్తు వచ్చాడుగా..
సరే.. జాగ్రత్త బంగారం. మైండ్ జాగ్రత్త. అక్కడ వదిలేసి రాకు. సరేనా!?
:):)
సుత్తి బాగా కొట్టేవయ్యా!!!
ఇది తప్పకుండా హాస్య కధే:-) :-)
ఇంక నవ్వలేను బాబు:-):-)
ఇన్స్టాల్ మెంట్లలో నవ్వేసుకుంటా:-)
Happy Eid-Milad-Un-Nabi
వాళ్ళంతా వెళిపోతే వెళిపోయారు కాని నేను వచ్చాగా (చెవిలో దూది పెట్టుకుని, అన్న కోసం ఆ ఆమాత్రం వినలేమా ఏంటి?) నువ్వు చెప్పు అన్నయ్యా ;)
కరిస్తే కైలాసం కనిపిస్తుంది...కెవ్వ్ కేక! నువ్వు కోరుకున్నట్టు వీడి కాళ్ళు నీకు నైవేద్యం చేసిపెడతాం..... నహీ ఈ ఈ ఈ ఈ నేనొప్పుకోను!
కధ చెప్తారని, ఊకొడదామని వస్తే ఇలా మోసం చేస్తారా?
ఏమిటీ మాయ?
కరిస్తే కైలాసం... > కెవ్వ్వ్వ్వ్వ్
వర్డ్ వెరిఫికేషన్ తీసేయవలసిందిగా కోరుతున్నా ;)
కామెంట్‌ను పోస్ట్ చేయండి