29, ఫిబ్రవరి 2012, బుధవారం

పపా గారితో ఇంటర్వు .......


 పాపా అంటే ....పల్లెటూరి పాలేరు అన్న మాటా ....అంటే ఎవరో అనుకునేరు నేనే......ఇంటర్వు చేసేది అంతరాత్మా జవాబులు ఇచ్చింది నేను ....

అంతరాత్మ : 25 సంవత్సరాలలో ఇరవై మూడున్నర సంవత్సరాలు భారతం లో గడిపి సంవత్సరంనర్ర విదేశాలలో గడిపి ఏదో చిన్చేద్దామని పరిగెత్తుకుని ఇండియా వచ్చి మూడు వారాలకే నీరు గారిపోయినా "పపా" గారితో మన ఇంటర్వు ...

అ: నమస్కారమండి పపా గారు ? ఎలా ఉన్నారు?
ప: ఆ ఆ నమస్కారమండి ....ఎలా ఉంటాం ఏదో అలాగే ఉన్నాం ....
అ : ఎంటండి అంత చిరాగ్గా విసుగ్గా ఉన్నారు...??
ప: ఏమి చేస్తాం సార్....!!అలా ఏమి లేదు మీ పని కానివ్వండి ..
అ: ఆ ఏమి లేదు సార్ అలా విదేశాలు తిరిగొచ్చ్చారుగా ఏమైనా విశేషాలు చెబుతారేమో అని ..!!!
ప : విశేషాలు !!! హు !! ఏమి ఉంటాయండి విశేషాలు....
అ: అలా అంటే ఎలా సార్ ?? ఏవో ఒకటి ఏడవండి ?
ప: ఆ ఎడుపోక్కటే తక్కువయ్యింది లే సార్...   
అ : ఏంటి సార్ అలా అంటారు ఎప్పుడు నిత్యనూతనం గా, నిండు కుండలాగా భయంకరమైన ఆత్మవిశ్వాసం తో ఉండే మీరు అలా మాట్లాడటం ఏమి బాలేదండి ....
ప :  నిత్యనూతనం గా, నిండు కుండలాగా,ఆత్మవిశ్వాసం లాంటి బూతులు వాడకండి సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది
అ : సరే ఎలా ఉంది మీ అరబ్ యాత్ర?
ప: ఎలా ఉంటుందండి ...మనమేమైనా జేబు కొవ్వెక్కి ....వెళ్ళలేదుగా ఏదో అప్పులు బాధలు తీరతాయని విదేశీ బిచ్చగాడిలాగా రాళ్ళూ కొట్టుకోవడానికి వెళ్ళాం....
అ: అదేలే సార్ అక్కడ ఏమి చిన్చేవారు అని ?
ప: చించడానికి ఏముంటుందండి ?? వాళ్ళే మనలని చించారు.....
అ: అబ్బా..!! ముందు మీరు ఆ నిరాశవాదం లో నుండి బయటకు వచ్చి మాట్లాడండి .....చచ్చిపోతున్నాం మీతో .....
ప: సరేలెండి ఇంతకీ ఏంటి మీ బాధ? నేనక్కడ ఏమి చేసేవాడిని అనేగా....SABIC  అని ఒక కంపని ఉంది అలాగే SHELL  అని ఇంకో కంపని తగలడింది ఆ రెండు పెళ్లి చేసుకుని ఒక కూతురిని కన్నయంటా... దాని పేరు SADAF ..ఇది ఆ రెండు కంపనీల జాయింటు వెంచరు....అందులో .....
అ: అందులో స్వీపర్ గానా లేకా టీ బాయ్  గానా మీరు చేసింది?
ప : జానిటర్ గా అండి.....
అ : అంటే ఏమి చేసేవారండి ...?
ప : మీలాంటి వాళ్ళ తలకయాలు పగలగొట్టి అందులోనుండి ఎందుకు పనికిరాని మెదడు తీసి, కాల్చి.... కాకులకు అమ్మేవాడిని ......
అ : మీరు మళ్ళీ ......
ప: లేకపోతె ఎంటండి మొత్తం చెప్పనివ్వకుండా,,,,,
అ: సారి అండి......... చెప్పండి......... కెలికిన తరువాత తప్పదుగా ....
 ప :  ఆ ...ఆ దిక్కుమాలిన కంపని ఒక పెట్రోకెమికల్ ప్లాంటు .....
అ : అంటే పెట్రోలు అమ్ముకునేవల్లండి మీరు?
ప: నీ బొంద రా ....నీ బొంద నీ శ్రాద్ధం ....నీ తలకాయ.....వెధవన్నర వెధవ .....చీపిరి మొహం నువ్వును ...సగం మైండు సన్నాసి ......గుద్దితే గోడలో దురిపోతావ్ సన్నాసి .......మొత్తం విని చావు ......మధ్యలో కేలక్కు ...........నాకసలే సగం మెంటల్ .....
అ: మీకు ఇన్ని బాలకృష్ణ డైలాగులు వస్తాయని తెలిస్తే కేలక్కపోదును అసలు ............ ఇంద ఈ మంచి నీళ్ళు తాగి కొంచెం ప్రశాంతం గా చెప్పండి సార్.....
ప: కోపం లో నేను బాలకృష్ణ గా మారి తరువాత రజనికాంత్ అవతారం ఎత్తుకుంటా ...ఇంకోసారి కేలకకు...!!! ఇంతకీ ఆ పెట్రోకెమికల్ కంపని లో ఉన్న " ప్లానింగ్ ..లాజిస్టిక్స్ ..మరియు ఎకనామిక్స్ " అనే విభాగం లో " ప్లానింగ్ మరియు లాజిస్టికు " అధికారి గా వెళ్ళాను ...
అ: ఆహా ( ....అంటే అక్కడోల్లు సరిగ్గా చదువుకోరా అండి ??  ఆహా సందేహం ఎందుకంటే మన పదోతరగతి ఫెయిల్ అయినవాడికే అంత పెద్ద ఉద్యోగం ఇస్తే ఇక డిగ్రీ వాడు ఇంకా బా...........రు..... జాబు చేస్తాడేమో కదండీ ..... !!!
ప: అరేయ్ ...సగం మైండు సన్నాసి ......నేను పది ఫెయిలు కాదురా వెధవా....పదోతరగతి తరువాత నువ్వు వెధవవేషాలు  వేస్తూ తిరుగుతుంటే నిన్ను పట్టించుకోకుండా బుద్ధిగా నేను MBA   చదివానురా ....
అ: అబ్బా ............ పదోతరగతి తరువాత MBA  చదివావా...???? ఎవడికి పెడుతున్నావురా చెవిలో పువ్వులు ...నేనేమైనా తెలుగు బ్లాగర్ని అనుకున్నావా? అయినా పది తరువాత ఇంటరు, డిగ్రీ .....లేకుండా MBA నా ..ఎవడండి వీడు ???
ప: వొరేయ్ ..........భవాని పిచ్చోడా .....మెంటల్ సచ్చినోడా... నీ బండ బడ .....నువ్వు వెధవ వేషాలు వేసింది మొత్తం ఏడు సంవత్సరాలురా.....అందుకే నీకు తెలీదు...
అ: అబ్బ బూతులు కుడా బలే ప్రాసః లో తిడతావ్ గురువా నువ్వు ....అందుకే నువ్వంటే నాకు అంత ఇది ....
ప: ఆ ఏడిచావ్ లే గాని .....ఇంకా ఏంటి?
అ: మరి అంత పెద్ద జాబు చేస్తూ మల్లి ఎందుకు మానేశావ్?
ప: నీకు తెలుసు కదరా,,,చిన్నప్పటి నుండి నేను కొంచెం తేడాగా ఆలోచిస్తానని .....పదవ తరగతి తరువాత అందరు CEC  లేదా HEC  తీసుకుందాం రా సులువుగా ఉంటుంది అంటే...నేను మాత్రం ఏది కష్టం గా ఉంటుంది అని అడిగి మరీ MPC  తీసుకున్నాను .....ఇంటర్ తరువాత డిగ్రీ లో అందరు జనరల్  B.Sc. తీసుకుంటుంటే నేను మాత్రం B.Sc. ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను ......అలాగే డిగ్రీ తరువాత అందరు MCA  MCA  అని అరుస్తుంటే నేను మాత్రం MBA  తీసుకున్నాను .....అందునా చిన్నపటినుండి ఒక పెద్ద బిజినెస్ మాన్ అవ్వాలన్నది నా కల కదా అది కుడా ఒక కారణం అనుకో MBA  తీసుకోవడానికి.....
అ: గురువా ....ఒక్కనిమిషం ....అసలు నేను అడిగిన కొచ్చేను కి నువ్వు చెప్పే సమాధానానికి ఏమైనా పొంతన ఉందా గురువా ....నీ సొంత డబ్బా కొట్టుకోవడానికి కాకపొతేను....!!!
ప: అరె బుర్ర తక్కువ బర్రె .....ఏదైనా అర్ధం కావాలంటే ముందునుండి తెలియాలిరా .....నీకు బాగా ఇష్టం అయినా "సినిమా" అయినా మధ్యలోనుండి చుస్తే అర్ధం అవుతుందా ??? 
అ: సరేలే కాని "వినక తప్పదు" అని ప్రాస లో తిట్టి మరీ చెబితే వినక చస్తామా......
ప: ఆ అదే ...విని తగలడు....  అలా విచిత్రం గా ఆలోచించుకుంటూ ....జాబులు చేసి ...చ ఇది జీవితం కాదు ...ఇక మన గోల్ సాధించాల్సిందే అని " ఒక స్కూలు మొదలు పెట్టాను రా ....స్కులే ఎందుకు అంటావేమో ...దానికి సామాధానం ఉంది .....ఇక్కడ సంపాదనతో పాటు ఆత్మా సంతృప్తి ఉంటుంది రా....చేపల పులుసు తో అన్నం పెట్టె వాడికన్నా ....చేపలు పట్టడం నేర్పించడం మంచిది కదా....అందుకు ...
అ: నువ్వు మరీలే గురువా ....మరీ నీతులు చెబుతావు ......స్కూలు అయితే బాగా డబ్బులు వస్తాయని మొదలు పెట్టి ఉంటావు ......
ప: అరేయ్ ,,,, నేను నిజం గా డబ్బులు సంపాదించడానికే అయితే పల్లెటూరి లో ఎందుకు పెడతాను రా.....?? ఇక్కడ ఉన్న రెండు స్కూళ్ళలో ఒకయనేమో పదవతరగతి వాళ్ళను టీచర్లుగా పెట్టి స్కూలు నడిపిస్తూ పిల్లల చదువు గురించి పట్టించుకోవట్లేదు అందునా అయన వయసు కుడా అయిపొయింది ఏదో సరదాకి నడుపుతున్నాడు స్కూలు ని ఇంకో ఆయనేమో పిల్లలకు పాఠాలు చెప్పండి అని పంపిస్తుంటే వాళ్ళతో ప్రార్ధనలు చేయిస్తూ చిన్నపిల్లలో "విషబీజాలు " నాటే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళేమో ఇంటికి వచ్చి అమ్మ మనం అలా మారిపోదాం అని అంటుంటే తల్లితండ్రులు ముందుగా అవాక్కయి కాని అంతకంటే మంచి స్కూలు లేక సిటీలలో ఉన్నా గాని అంత అంత ఫీజులు కట్టలేక అక్కడికే పంపిస్తుంటే....చూసి ....ఛా.....ఎంతో మంది బాగా చదువుకున్న ..ఈ గడ్డ మీద సరైనా స్కూలు లేదు అని పిల్లలకు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా సరైన విద్య ఇవ్వాలి అని ప్రారంభించాను..
అ: అన్నాయ్ ....నిజంగానా??/
ప: అవునురా ..వొట్టు ...నిజం..
అ: సరేలే గురువా...ఇంతకీ ఇప్పుడేంటి....??
ప: ఏముందిరా....అలా స్కూలు ప్రారంభించి ..ఇంకో చిన్న యాడ్ ఏజెన్సీ ప్రారంభించి కొంత మంది కి ఉపాధి కల్పించి ...అందులో లాసులు వస్తే అవి తీర్చడానికి "సౌది " వెళ్లి అప్పులు అయినతరువాత అందరు ఇంకో రెండేళ్ళు సంపాదిన్చుకోరా నీకు తిరుగుండదు అనే ఎంత చెప్పినా వినకుండా....ఏదో చేద్దాం అని వచ్చేసానురా మన ఇండియా ...
అ: మరి?
ప: ఏముందిరా ....దూరపు కొండలు నునుపు అన్నట్టు ....దూరంగా ఉన్నప్పుడు మన ఇండియా ఏమో "కేక" అనిపించింది ....ఇప్పుడేమో "కెవ్వు" మనిపించింది ....
అ: ఇంతకీ ఏమి జరిగింది గురువా ? అంతలా హార్ట్ అయ్యావు?
ప: రెండు విషయాలు నన్ను తెగ కలచి వేసాయి రా...కాని అవి నేను ఇక్కడ నీతో పంచుకోలేను రా....
అ: ఎందుకు గురువా? అంత కానివాడినా??
ప: అలా అని కాదురా కాని ఎందుకో చెప్పుకోవాలనిపించటం లేదు ..అంతే... 
అ: సరేలే గురువా....చెప్పకు గాని ...ఇంతకీ నీ భవిష్యత్తుకార్యచరణ ఎంటో అదయినా చెపుతావా?
ప: ఏమి లేదురా...ఇండియా చూడటానికి చాలా బాగున్నా ....నాకు మాత్రం " నివురు గప్పిన నిప్పు " లా కనిపిస్తోందిరా ......ఇక్కడ నోరన్నా ఉండాలి......... నోటన్నా ఉండాలి ....ఎంత మనది అనుకున్నా....ఎక్కడో తేడా కొడుతుంది రా......ఏదేమైనా .............నా ముందు ఉన్నది రెండే రెండు దారులు ....ఒకటేమో ఓటమి ఒప్పుకుని ముందు అనుకున్నట్టుగా PR తీసుకుని కెనడా వెళ్లి చిన్నగా బ్రతికేయడం ...లేదా పోటిపడుతూ బెదురుతూ బెదిరిస్తూ ...నా హక్కుల కోసం పోరాడటం ..... మొదటిది చాలా ఈజీ రా ...కాని రెండోదే చాలా కష్టం ..ఒక్కోసారేమో ఈ చిన్నజీవితానికి ఎందుకోచిన గొడవ ప్రసాంతంగా మనకు నచినట్టు ఉండిపోదాం అనిపిస్తుంది .....ఒక్కోసారేమో జీవితాన్ని .....................................ఎంతోరా ఏమి అర్ధం కావట్లేదు......వింత వింతగా ఉంది .......పిచేక్కేస్తుంది
...ఏమి చెప్పలేనురా తరువాత కనబడు ....

23, ఫిబ్రవరి 2012, గురువారం

11, ఫిబ్రవరి 2012, శనివారం

నా ముగింపు II

హాయ్ ..........బాగున్నారా.....!!! మీకేమిలెండి ..బానే ఉండుంటారు....!!! నేనే కిందా మీద పడుతూ చేరుకున్నాను మన ఇండియా....

మొత్తం మీద ఒక ఫైన్ డే మనకు టికెటు దొరికింది ...రాత్రి పన్నెండు గంటలకు మన వాహనం అని తెలిసింది ...త్వర త్వరగా రెడీ అయ్యి అందరిని కలిసి బయలు దేరాను ...

ఒక కామ్రీ తీసుకున్నాను రెంట్ మీద నాతొ పాటు నా ఫ్రెండు ఒక్కడిని మాత్రమె తీసుకు వెళ్ళాను ఎయిర్ పోర్ట్ కి ...

ఒక ఫ్రెండు మాత్రం చాలా ఏడ్చాడు .............చాలా మంది సరిగా మాటలాడలేదు వాల్ల్లను బాగా నొప్పించాను ....వెళ్లొద్దు అంటే మాత్రం నాకు కోపం వచేసేది ....

ఏదేమైనా 24  గంటల సుదేర్ఘ ప్రయాణం తరువాత చేరుకున్న ను మా ఉఉరు ....


మరిన్ని విశేషాలతో త్వరలో ,,,,

మీ రాజు 

4, ఫిబ్రవరి 2012, శనివారం

ఆహా ఏమి కధ....!!!

              స్పాన్సర్ గాడు నా హోటల్లో పని చేయమని గొడవా...కాంట్రాక్టరు ...రకరకాల సర్టిఫికేట్ ల పేర్లు చెప్పి పట్రా ,,,అప్పుడు గాని డబ్బులు ఇవ్వా... అని మారం....ఎయిర్ టికెట్ వోడు నీ పాస్పోర్ట్ వచిందా?? అని వెకిలి ప్రశ్న!!! ఇలాంటి వాటి వల్ల విసిగి పోయి పిచ్చెక్కి....సరదాగా ఏమైనా చూద్దాం అని బ్లాగ్లోకం లోకి వచ్చి ఎక్కేడేక్కడో దూరి రక రకాల దురదలు గజ్జులు చూసి....చివరగా ఇక ఇలాకాదు గాని నా మెంటల్ జనాలకు చుపించాలిసినదే అని డిసైడ్ అయ్యి ఒక కధ రాద్దాం అని నిర్ణయించుకుని లాపు తెరిస్తే ఆలోచన రాదే??? 

సరే...ముందుగా అందరు ఇష్టపడే హాస్య కధ రాద్దాం.... దీని లక్ష్యం మాత్రం అందరిని నవ్వించి వాళ్ళు నవ్వుతుంటే " పాపం" అని వాళ్ళ వంక చూసుకుని నేను నవ్వుకోవచ్చు కదా....అని....

సరే...కమాన్...వాన్ ...టు......త్రి....స్టార్ట్.......

హహహహహహహహహహహాహ్హాహః వూఉ హుహుహుహుహుహుహు .....అమ్మో రాజు ఇక ఆపు !!నవ్వలేక చస్తున్నాం ....హమ్మే హమ్మో ..నిజోక్లు....హహహహహ్హహ ఆపు నాయన ...ప్లీజ్ రాజు ...కధ ఆపేయి...ఇంకా చాలు నవ్వలేక పోతున్నాం....


అదేంటి.....??? ఇంకా నేను మొదలు పెట్టలేదు అప్పుడే వీళ్ళ నవ్వులు?? ఆపెయమనడాలు...!!! ఇదిగో ఇలా తిక్క ఎక్కించకండి...అసలే మెంటల్ లో ఉన్నా...కరిస్తే కైలాసం కనిపిస్తుంది...నేను కధ చెప్పల మీరు నవ్వాల అంతే!!!...

అసలేం జరిగిందంటే.....
హాహహహహహహహ్హహః ....వువువువ్ హూహుహుహుహూహుహుహ్ అబ్బ ఏమి నవ్విస్తావ్ రాజు....ఇంత మంచి జోకులు నీకు ఎక్కడివి హహహ్హహ అసలు నువ్వు హహహః మనిషి వేనా.....అమ్మో అమ్మో ఆహాహహ్హహః ఏమి జోకులు ఏమి పంచులు .....రాజేందర ప్రసాద్, బాలకృష్ణ కాంబి నేషన్ సినిమా చుపిస్తున్నావ్ గా ...హహహహః 

మరక్కడే నాకు కాలేది....వినకుండా ఏమిటా వెకిలి నవ్వులు ?? మీకు గాని మైండు పనిచేయడం మొదలుపెట్టిందా ఏమి ?? అసలు నాకు తెలియాలి .??..మీరెందుకు నవ్వుతున్నారో???,,,,,అసలు కధ చెప్పకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో??? నాకు తెలియాలి ...తెలియాలి...తెలియాలి......!!!

టెన్సన్ పడకు రాజు ...ఏమి లేదు నువ్వు కధ చెప్పుతానంటే మాకు అంతకంటే కామెడి ఏమి ఉంటుంది చెప్పు ??? 
ఎంతైనా మాకు కొంచెం ధైర్యం ఎక్కువ  ఇక్కడకు వచ్చి ముర్చపోయి ...మల్లి లేచి వెళ్ళడానికే కొంచెం సమయం పడుతుంది మరి నువ్వు కధ కుడా చెపితే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కదా...అందుకే ప్లీజ్ బాబు ,,,,కధ చెప్పకే....ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్..

ఆపండి మీ అసందర్భ ప్రేలాపనలు.....ఏ నేను కధ చెపుతానంటే......అంత కామెడి గా ఉందా....??? ఎంత అవమానం ఇంతా అవమానం జరిగిన తరువాత నేను కధ చెపుతాను అనుకుంటున్నారా .....చెపుతా....కచ్చితంగా చెబ్తా,,,మీరు వినక పొతే పినోడ్డు కాని నేను మాత్రం చెప్పడం స్యురే.....


భావాన్ని ని అలా.....
అరె ....!!! ఏరి వీళ్ళంతా....?? కనిపించారు?? పారిపోయారా....????  అరె కింద కుర్చుని అలా ఆకాశం వంక చుస్తున్నరేమిటి?? ఏదో గొణుక్కుంటున్నారు ....ఎంటబ్బా అది ......

"దేవా..!!!.దేవ దేవ దేవ దేవా .....మమ్మలిని కాపాడు వీడు మల్లి భవాని అని మొదలు పెట్టాడు ....మేము తట్టుకోలేము ,,,ఇప్పటికి విని చెవులు చేటలు అయి పోయాయి...దేవుడా....కాపాడు ప్లీజ్ ...కుదిరితే.... నువ్వు కోరుకున్నట్టు వీడి కాళ్ళు నీకు నైవేద్యం చేసిపెడతాం....."

హహః నవ్వు వచ్చింది నాకు ఆ దేవుడికి వీళ్ళ మైండులు ఆల్రెడీ సమర్పించాం మనం, ఇంకా వీళ్ళ మాటలు ఎందుకు వింటాడు...చచ్చారే ఈ రోజు నా కధ తోటి వీళ్ళు .....ఎలా వినరో చూద్దాం... 

"ఇదుగో .....పాలేరు వారి బ్లాగ్మిత్రులు ....అసలేమి జరిగిందంటే....."

"వద్దు నాయనా......!!"

"అదికాదు ....అసలు ....ఆ రోజు..."

"నాయనా పాలేరా ....నీకో దణ్ణం నాయనా..."
"బంగారాలు...అది కాదు ....భావాన్ని అంటె...."

"మాకు తెలుసు నాయనా .....వదిలేయరా ...బాబు ..... "

"మీరు అలా పరిగెట్టకండి....నేను మీకంటే బాగా పరిగెత్తగలను...."

"వద్దురా నాయనా,,,,, నువ్వు పరిగెత్తకు....కాళ్ళు నొప్పి పుడతాయి...."

"పర్లేదు నా కధ చెప్పపోతే మనసు నొప్పి పుడుతుంది..... హా హా అమ్మ ఆయాసం వస్తుంది ఆగండి నా బంగారాలు ...ఈ కధ విని వెళ్లి పొండి"

"అరేయ్ ..మేము బతకాల్రా ,,,!!!అలా వెంట పడకురా ....హచ్ ఆడ్ లో !@#$ లాగా....." 

"మీరు !@#$ అన్నా ...%^&* అన్నా ....కధ వినాల్సిందే...." 


"నువ్వు మంచి గా చెపితే వినవురా...వెధవా. చవటాయ్....బడుద్దాయ్.......నిన్ను ...నిన్ను...నిన్ను....."

ఏయ్!! అలా రాళ్ళు విసరకూడదు........అరె........చప్పులు  విసరకండి.....  మళ్ళి  కొత్తయి  కొనుక్కోవాలి  అంటె కష్టం.................  ....అరె అలా ఏవి  పడితే  అవి  విసరకండి............. దెబ్బలు  తగులుతాయి ...............బుజ్జులు  ...బంగారాలు ....బంగారు కొండలు ,,,,,,,,,,,,,,,,వినండి......ఇదిగో నేను పరిగెత్తలేకపోతున్నా ......అలా వెళ్లి పోకండి...ఈ కధ మీ కోసమే....అరె ....ఆగండి...................

                   ఆగండి ..................................................................హు .....పారిపోతున్నారు........



1, ఫిబ్రవరి 2012, బుధవారం

జీవితం...స్త్రీ...లక్ష్యం...X

(చాన్నాళ్ళకి మళ్ళి ఈ కధ కొనసాగించాలి అనిపించింది ...అందుకే రాస్తున్నాను... ఈ దేశం నుండి ఇదే చివరి టపా.....)

ఏమి జరిగింది???? ::::ఏదో కోపం లో సోషల్ టీచరు గారితో గొడవ పడినందుకు మనకు సన్మాన కార్యక్రమం చేసి హెడ్డు గారు తలంటు పోశారు ...తరవాత నా గురించి ఆచార్యలు మాస్టారు గోపి నారాయణ మాష్టారు గొడవపడటం చూసి కాసేపు ఆలోచనలో పడినా తరువాత మాత్రం నా లోకం లోకి వెళ్ళిపోయాను....

ఇక ........

ఇంటికి వెళ్ళిన తరువాత ...పడుకున్నా గాని అవే మాటలు....వాడు బాగా చదువుతాడు...వాడు బాగా చదువుతాడు....

అసలు నేను బాగా చదువుతానా??? ఏమో ?? నాకంటే అరుణ కే ఎక్కువ మార్కులు వస్తాయి ...నా కంటే సతీష్ గాడి ఇంగ్లీష్ మార్కులు ఎక్కువ ...మనకు సబ్జేక్ట్లలో కంటే భవాని దృష్టి లో మార్కులే ఎక్కువ ...ఒక్కసారి ట్రై చేద్దాం ....అసలు మనకు ఎన్ని మార్కులు వస్తాయో చూసి తరిద్దాం అని ...నిర్ణయించుకొని సడన్ గా లేచి లైటు వేసాను ..
అబ్బో చాలా రాత్రి అయ్యింది ...ఇప్పుడు చదవలేము గాని ..అసలు ఎలా చదవాలో ఒక ప్రణాళిక రాదం అని పుస్తకం పెన్ను తీసుకుని , పొద్దున్న లేచి నప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒక ప్రణాళిక రచించి అది జాగర్తగా జేబులో పెట్టుకుని హాయిగా నిద్రపోయా....

మర్నాడు మొట్టమొదటగా లేగవడం  లోనే ఫెయిల్ అయిపోయాను ...అరగంట లేటు గా లేచాను ....ఇక ఎలాగోలా టైం టేబుల్ ని ఫాల్లో అవడానికి ప్రయాసపడి ...మొత్తానికి సాయత్రం వరకు కచితం గా అమలు పరిచాను...అలా పొద్దునే నాలుగు గంటలకు లేగవడం...గంటన్నర వరకు ఇంగ్లీష్ సోషలు ఒక రోజు సైన్సు , తెలుగు ఒక రోజు హిందీ, లెక్కల సూత్రాలు ఒక రోజు చదవడం రోజు సాయత్రం పుట చూడకుండా రాయడం లెక్కలు చేయడం ...అలా ఒక ఇరవై రోజులు కష్టపడి పరీక్షల్లో కూర్చున్నాను ...అన్ని తొంభైలు రాక పోయినా అరుణ కంటే ఒక్క మార్కు ఒకే ఒక్కమార్కు ఎక్కువ వస్తే చాలు అనుకున్నా......

అలా పరీక్షలు అయిపోయాయి....

పేపర్లు ఇస్తున్నారు ....ఫస్టు ఇంగ్లీషు ...మార్కులు సరిగా గుర్తు లేవు గాని అందరికంటే ఎక్కువగా నావే.......అందరు చప్పట్లు.....
తరువాత తెలుగు ...మళ్ళి అందరికంటే నావే ఎక్కువ ...రెండు సేక్షనులు కలిపి నా మార్కులు కంటే ఎవరికీ ఎక్కువ రాలేదని తెలుగు టీచరు " నాగమణి" గారు మనకు పెన్ను బహుమానం...మల్లి చప్పట్లు 
అలా అన్ని సబ్జెక్టులో నాకే ఎక్కువ మార్కులు మొత్తం అన్ని మార్కులు కలిపి ఇప్పటికి బాగా గుర్తు 494 ...అంటే ఫస్టు నేనే....నా తరువాత "గోతి నక్కల "  అరుణ ...అబ్బో చాలా దూరం లో ఉంది 403 మార్కులు అంటా...బాగా ఏడిచింది అంటా...నేను మాత్రం సంబరాలు చేసుకున్నాను ....ఆ తరువాత "కర్రి" గోపాలం గాడు.......మూడువందల చిల్లర తో సరిపెట్టుకున్నాడు......

 

మనం చదివితే అలాగే ఉంటుంది మరి...హహహ అప్పటి దాకా చిల్లర గాడు అని ఉన్న పేరు కొంచెం మారి "నోటు గాడు" అయ్యింది ...మన పేరు స్కూలు మొత్తం లో మారు మ్రోగిపోయింది....బాగా చదువుతాడు ..ఈ సారి స్కూలు ఫస్టు వీడే అని అందరు తెగ పోగిడేస్తున్న్నారు ఏంటో ..!!!!


మీగత కధ త్వరలో ఇండియా నుండి ప్రసారం.......ధన్యవాదాలు....

మీ శ్రేయోభిలాషి ......
రాజు