29, ఫిబ్రవరి 2012, బుధవారం

పపా గారితో ఇంటర్వు .......


 పాపా అంటే ....పల్లెటూరి పాలేరు అన్న మాటా ....అంటే ఎవరో అనుకునేరు నేనే......ఇంటర్వు చేసేది అంతరాత్మా జవాబులు ఇచ్చింది నేను ....

అంతరాత్మ : 25 సంవత్సరాలలో ఇరవై మూడున్నర సంవత్సరాలు భారతం లో గడిపి సంవత్సరంనర్ర విదేశాలలో గడిపి ఏదో చిన్చేద్దామని పరిగెత్తుకుని ఇండియా వచ్చి మూడు వారాలకే నీరు గారిపోయినా "పపా" గారితో మన ఇంటర్వు ...

అ: నమస్కారమండి పపా గారు ? ఎలా ఉన్నారు?
ప: ఆ ఆ నమస్కారమండి ....ఎలా ఉంటాం ఏదో అలాగే ఉన్నాం ....
అ : ఎంటండి అంత చిరాగ్గా విసుగ్గా ఉన్నారు...??
ప: ఏమి చేస్తాం సార్....!!అలా ఏమి లేదు మీ పని కానివ్వండి ..
అ: ఆ ఏమి లేదు సార్ అలా విదేశాలు తిరిగొచ్చ్చారుగా ఏమైనా విశేషాలు చెబుతారేమో అని ..!!!
ప : విశేషాలు !!! హు !! ఏమి ఉంటాయండి విశేషాలు....
అ: అలా అంటే ఎలా సార్ ?? ఏవో ఒకటి ఏడవండి ?
ప: ఆ ఎడుపోక్కటే తక్కువయ్యింది లే సార్...   
అ : ఏంటి సార్ అలా అంటారు ఎప్పుడు నిత్యనూతనం గా, నిండు కుండలాగా భయంకరమైన ఆత్మవిశ్వాసం తో ఉండే మీరు అలా మాట్లాడటం ఏమి బాలేదండి ....
ప :  నిత్యనూతనం గా, నిండు కుండలాగా,ఆత్మవిశ్వాసం లాంటి బూతులు వాడకండి సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది
అ : సరే ఎలా ఉంది మీ అరబ్ యాత్ర?
ప: ఎలా ఉంటుందండి ...మనమేమైనా జేబు కొవ్వెక్కి ....వెళ్ళలేదుగా ఏదో అప్పులు బాధలు తీరతాయని విదేశీ బిచ్చగాడిలాగా రాళ్ళూ కొట్టుకోవడానికి వెళ్ళాం....
అ: అదేలే సార్ అక్కడ ఏమి చిన్చేవారు అని ?
ప: చించడానికి ఏముంటుందండి ?? వాళ్ళే మనలని చించారు.....
అ: అబ్బా..!! ముందు మీరు ఆ నిరాశవాదం లో నుండి బయటకు వచ్చి మాట్లాడండి .....చచ్చిపోతున్నాం మీతో .....
ప: సరేలెండి ఇంతకీ ఏంటి మీ బాధ? నేనక్కడ ఏమి చేసేవాడిని అనేగా....SABIC  అని ఒక కంపని ఉంది అలాగే SHELL  అని ఇంకో కంపని తగలడింది ఆ రెండు పెళ్లి చేసుకుని ఒక కూతురిని కన్నయంటా... దాని పేరు SADAF ..ఇది ఆ రెండు కంపనీల జాయింటు వెంచరు....అందులో .....
అ: అందులో స్వీపర్ గానా లేకా టీ బాయ్  గానా మీరు చేసింది?
ప : జానిటర్ గా అండి.....
అ : అంటే ఏమి చేసేవారండి ...?
ప : మీలాంటి వాళ్ళ తలకయాలు పగలగొట్టి అందులోనుండి ఎందుకు పనికిరాని మెదడు తీసి, కాల్చి.... కాకులకు అమ్మేవాడిని ......
అ : మీరు మళ్ళీ ......
ప: లేకపోతె ఎంటండి మొత్తం చెప్పనివ్వకుండా,,,,,
అ: సారి అండి......... చెప్పండి......... కెలికిన తరువాత తప్పదుగా ....
 ప :  ఆ ...ఆ దిక్కుమాలిన కంపని ఒక పెట్రోకెమికల్ ప్లాంటు .....
అ : అంటే పెట్రోలు అమ్ముకునేవల్లండి మీరు?
ప: నీ బొంద రా ....నీ బొంద నీ శ్రాద్ధం ....నీ తలకాయ.....వెధవన్నర వెధవ .....చీపిరి మొహం నువ్వును ...సగం మైండు సన్నాసి ......గుద్దితే గోడలో దురిపోతావ్ సన్నాసి .......మొత్తం విని చావు ......మధ్యలో కేలక్కు ...........నాకసలే సగం మెంటల్ .....
అ: మీకు ఇన్ని బాలకృష్ణ డైలాగులు వస్తాయని తెలిస్తే కేలక్కపోదును అసలు ............ ఇంద ఈ మంచి నీళ్ళు తాగి కొంచెం ప్రశాంతం గా చెప్పండి సార్.....
ప: కోపం లో నేను బాలకృష్ణ గా మారి తరువాత రజనికాంత్ అవతారం ఎత్తుకుంటా ...ఇంకోసారి కేలకకు...!!! ఇంతకీ ఆ పెట్రోకెమికల్ కంపని లో ఉన్న " ప్లానింగ్ ..లాజిస్టిక్స్ ..మరియు ఎకనామిక్స్ " అనే విభాగం లో " ప్లానింగ్ మరియు లాజిస్టికు " అధికారి గా వెళ్ళాను ...
అ: ఆహా ( ....అంటే అక్కడోల్లు సరిగ్గా చదువుకోరా అండి ??  ఆహా సందేహం ఎందుకంటే మన పదోతరగతి ఫెయిల్ అయినవాడికే అంత పెద్ద ఉద్యోగం ఇస్తే ఇక డిగ్రీ వాడు ఇంకా బా...........రు..... జాబు చేస్తాడేమో కదండీ ..... !!!
ప: అరేయ్ ...సగం మైండు సన్నాసి ......నేను పది ఫెయిలు కాదురా వెధవా....పదోతరగతి తరువాత నువ్వు వెధవవేషాలు  వేస్తూ తిరుగుతుంటే నిన్ను పట్టించుకోకుండా బుద్ధిగా నేను MBA   చదివానురా ....
అ: అబ్బా ............ పదోతరగతి తరువాత MBA  చదివావా...???? ఎవడికి పెడుతున్నావురా చెవిలో పువ్వులు ...నేనేమైనా తెలుగు బ్లాగర్ని అనుకున్నావా? అయినా పది తరువాత ఇంటరు, డిగ్రీ .....లేకుండా MBA నా ..ఎవడండి వీడు ???
ప: వొరేయ్ ..........భవాని పిచ్చోడా .....మెంటల్ సచ్చినోడా... నీ బండ బడ .....నువ్వు వెధవ వేషాలు వేసింది మొత్తం ఏడు సంవత్సరాలురా.....అందుకే నీకు తెలీదు...
అ: అబ్బ బూతులు కుడా బలే ప్రాసః లో తిడతావ్ గురువా నువ్వు ....అందుకే నువ్వంటే నాకు అంత ఇది ....
ప: ఆ ఏడిచావ్ లే గాని .....ఇంకా ఏంటి?
అ: మరి అంత పెద్ద జాబు చేస్తూ మల్లి ఎందుకు మానేశావ్?
ప: నీకు తెలుసు కదరా,,,చిన్నప్పటి నుండి నేను కొంచెం తేడాగా ఆలోచిస్తానని .....పదవ తరగతి తరువాత అందరు CEC  లేదా HEC  తీసుకుందాం రా సులువుగా ఉంటుంది అంటే...నేను మాత్రం ఏది కష్టం గా ఉంటుంది అని అడిగి మరీ MPC  తీసుకున్నాను .....ఇంటర్ తరువాత డిగ్రీ లో అందరు జనరల్  B.Sc. తీసుకుంటుంటే నేను మాత్రం B.Sc. ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను ......అలాగే డిగ్రీ తరువాత అందరు MCA  MCA  అని అరుస్తుంటే నేను మాత్రం MBA  తీసుకున్నాను .....అందునా చిన్నపటినుండి ఒక పెద్ద బిజినెస్ మాన్ అవ్వాలన్నది నా కల కదా అది కుడా ఒక కారణం అనుకో MBA  తీసుకోవడానికి.....
అ: గురువా ....ఒక్కనిమిషం ....అసలు నేను అడిగిన కొచ్చేను కి నువ్వు చెప్పే సమాధానానికి ఏమైనా పొంతన ఉందా గురువా ....నీ సొంత డబ్బా కొట్టుకోవడానికి కాకపొతేను....!!!
ప: అరె బుర్ర తక్కువ బర్రె .....ఏదైనా అర్ధం కావాలంటే ముందునుండి తెలియాలిరా .....నీకు బాగా ఇష్టం అయినా "సినిమా" అయినా మధ్యలోనుండి చుస్తే అర్ధం అవుతుందా ??? 
అ: సరేలే కాని "వినక తప్పదు" అని ప్రాస లో తిట్టి మరీ చెబితే వినక చస్తామా......
ప: ఆ అదే ...విని తగలడు....  అలా విచిత్రం గా ఆలోచించుకుంటూ ....జాబులు చేసి ...చ ఇది జీవితం కాదు ...ఇక మన గోల్ సాధించాల్సిందే అని " ఒక స్కూలు మొదలు పెట్టాను రా ....స్కులే ఎందుకు అంటావేమో ...దానికి సామాధానం ఉంది .....ఇక్కడ సంపాదనతో పాటు ఆత్మా సంతృప్తి ఉంటుంది రా....చేపల పులుసు తో అన్నం పెట్టె వాడికన్నా ....చేపలు పట్టడం నేర్పించడం మంచిది కదా....అందుకు ...
అ: నువ్వు మరీలే గురువా ....మరీ నీతులు చెబుతావు ......స్కూలు అయితే బాగా డబ్బులు వస్తాయని మొదలు పెట్టి ఉంటావు ......
ప: అరేయ్ ,,,, నేను నిజం గా డబ్బులు సంపాదించడానికే అయితే పల్లెటూరి లో ఎందుకు పెడతాను రా.....?? ఇక్కడ ఉన్న రెండు స్కూళ్ళలో ఒకయనేమో పదవతరగతి వాళ్ళను టీచర్లుగా పెట్టి స్కూలు నడిపిస్తూ పిల్లల చదువు గురించి పట్టించుకోవట్లేదు అందునా అయన వయసు కుడా అయిపొయింది ఏదో సరదాకి నడుపుతున్నాడు స్కూలు ని ఇంకో ఆయనేమో పిల్లలకు పాఠాలు చెప్పండి అని పంపిస్తుంటే వాళ్ళతో ప్రార్ధనలు చేయిస్తూ చిన్నపిల్లలో "విషబీజాలు " నాటే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళేమో ఇంటికి వచ్చి అమ్మ మనం అలా మారిపోదాం అని అంటుంటే తల్లితండ్రులు ముందుగా అవాక్కయి కాని అంతకంటే మంచి స్కూలు లేక సిటీలలో ఉన్నా గాని అంత అంత ఫీజులు కట్టలేక అక్కడికే పంపిస్తుంటే....చూసి ....ఛా.....ఎంతో మంది బాగా చదువుకున్న ..ఈ గడ్డ మీద సరైనా స్కూలు లేదు అని పిల్లలకు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా సరైన విద్య ఇవ్వాలి అని ప్రారంభించాను..
అ: అన్నాయ్ ....నిజంగానా??/
ప: అవునురా ..వొట్టు ...నిజం..
అ: సరేలే గురువా...ఇంతకీ ఇప్పుడేంటి....??
ప: ఏముందిరా....అలా స్కూలు ప్రారంభించి ..ఇంకో చిన్న యాడ్ ఏజెన్సీ ప్రారంభించి కొంత మంది కి ఉపాధి కల్పించి ...అందులో లాసులు వస్తే అవి తీర్చడానికి "సౌది " వెళ్లి అప్పులు అయినతరువాత అందరు ఇంకో రెండేళ్ళు సంపాదిన్చుకోరా నీకు తిరుగుండదు అనే ఎంత చెప్పినా వినకుండా....ఏదో చేద్దాం అని వచ్చేసానురా మన ఇండియా ...
అ: మరి?
ప: ఏముందిరా ....దూరపు కొండలు నునుపు అన్నట్టు ....దూరంగా ఉన్నప్పుడు మన ఇండియా ఏమో "కేక" అనిపించింది ....ఇప్పుడేమో "కెవ్వు" మనిపించింది ....
అ: ఇంతకీ ఏమి జరిగింది గురువా ? అంతలా హార్ట్ అయ్యావు?
ప: రెండు విషయాలు నన్ను తెగ కలచి వేసాయి రా...కాని అవి నేను ఇక్కడ నీతో పంచుకోలేను రా....
అ: ఎందుకు గురువా? అంత కానివాడినా??
ప: అలా అని కాదురా కాని ఎందుకో చెప్పుకోవాలనిపించటం లేదు ..అంతే... 
అ: సరేలే గురువా....చెప్పకు గాని ...ఇంతకీ నీ భవిష్యత్తుకార్యచరణ ఎంటో అదయినా చెపుతావా?
ప: ఏమి లేదురా...ఇండియా చూడటానికి చాలా బాగున్నా ....నాకు మాత్రం " నివురు గప్పిన నిప్పు " లా కనిపిస్తోందిరా ......ఇక్కడ నోరన్నా ఉండాలి......... నోటన్నా ఉండాలి ....ఎంత మనది అనుకున్నా....ఎక్కడో తేడా కొడుతుంది రా......ఏదేమైనా .............నా ముందు ఉన్నది రెండే రెండు దారులు ....ఒకటేమో ఓటమి ఒప్పుకుని ముందు అనుకున్నట్టుగా PR తీసుకుని కెనడా వెళ్లి చిన్నగా బ్రతికేయడం ...లేదా పోటిపడుతూ బెదురుతూ బెదిరిస్తూ ...నా హక్కుల కోసం పోరాడటం ..... మొదటిది చాలా ఈజీ రా ...కాని రెండోదే చాలా కష్టం ..ఒక్కోసారేమో ఈ చిన్నజీవితానికి ఎందుకోచిన గొడవ ప్రసాంతంగా మనకు నచినట్టు ఉండిపోదాం అనిపిస్తుంది .....ఒక్కోసారేమో జీవితాన్ని .....................................ఎంతోరా ఏమి అర్ధం కావట్లేదు......వింత వింతగా ఉంది .......పిచేక్కేస్తుంది
...ఏమి చెప్పలేనురా తరువాత కనబడు ....

5 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్చ్.. చాలా రోజుల తర్వాత భాయి పోస్ట్ చూసి ఆనందం. ఆ శైలి చూసి.. మరింత ఖుషి. ఏం కామెంటాలో తెలియక గంటన్నర పైచిలుకు ఆలోచన. సాలోచనతో.. ముందుకు సాగమని.. సూచన.
ఆశయాల బాటలో.. క్షణం చేజారనీయక .. అలుపెరుగక ..సాగాలని.. ..చింతనలో అంతరాత్మని నులిమెయ్యక.. ఆత్మ ప్రబోధం తో..నడక సాగించాలని..

Padmarpita చెప్పారు...

"ఇక్కడ నోరన్నా ఉండాలి....నోటన్నా ఉండాలి" its absolutely correct.
అయినా సులువుగా అయిపోతే సుఖముంటుందేమో!!
కానీ కష్టపడి సాధించిన దాని తృప్తే వేరని నా భావం:-)

kastephale చెప్పారు...

అయ్యో! దేశం లోకొచ్చి వారం తిరగకుండానే ముఖం మొత్తేసిందా?

సుభ /Subha చెప్పారు...

మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా మీరు చెప్పిన విధానం ఆశ్చర్యంగానే ఉంది భాయీ నాకైతే..ఏదేమైనా మీ ఈ నిరాశను వీడి చిగురంత ఆశతో ముందుకు సాగిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

రసజ్ఞ చెప్పారు...

అన్నయ్యా నేనొచ్చేశా! ఇది చదువుతుంటే నాకు కొన్ని సందేహాలు, కొన్ని సమాధానాలు దొరికాయి. అవేమిటంటే:

౧. మెదడు తీసి, కాల్చి.... కాకులకు అమ్మేవాడిని అన్నావ్ బాగుంది అయితే ఆ కాల్చిన మెదడు వలన కాకులకి లాభాలేమిటి? ఒకవేళ ఇదేనా అవి కావ్ కావ్ అని అరవటానికి రహస్యం?

౨. భవాని పిచ్చోడా అన్నావ్ ఇక్కడ నాకు స్పష్టంగా తెలిసిన విషయం రాజు నువ్వే అని

౩. ఏది కష్టం గా ఉంటుంది అని అడిగి మరీ MPC తీసుకున్నాను అదేమిటి? MBiPC కదా ఇంకా కష్టమయినది? ఎవరో నిన్ను మోసం చేసేశారు!

ఉలితో కొడితే రాయికి దెబ్బని కొట్టడం మానేస్తే శిల శిల్పంగా మారుతుందా? కష్టాలన్నవి ఎదురుకున్నప్పుడే వచ్చే సుఖానికి విలువ. కనుక నా మాట విని ధైర్యంగా ముందుకే సాగు వెనకడుగు వేయకు. నేనున్నా! నా ఫుల్ సప్పోర్ట్ నీకే!