1, ఫిబ్రవరి 2012, బుధవారం

జీవితం...స్త్రీ...లక్ష్యం...X

(చాన్నాళ్ళకి మళ్ళి ఈ కధ కొనసాగించాలి అనిపించింది ...అందుకే రాస్తున్నాను... ఈ దేశం నుండి ఇదే చివరి టపా.....)

ఏమి జరిగింది???? ::::ఏదో కోపం లో సోషల్ టీచరు గారితో గొడవ పడినందుకు మనకు సన్మాన కార్యక్రమం చేసి హెడ్డు గారు తలంటు పోశారు ...తరవాత నా గురించి ఆచార్యలు మాస్టారు గోపి నారాయణ మాష్టారు గొడవపడటం చూసి కాసేపు ఆలోచనలో పడినా తరువాత మాత్రం నా లోకం లోకి వెళ్ళిపోయాను....

ఇక ........

ఇంటికి వెళ్ళిన తరువాత ...పడుకున్నా గాని అవే మాటలు....వాడు బాగా చదువుతాడు...వాడు బాగా చదువుతాడు....

అసలు నేను బాగా చదువుతానా??? ఏమో ?? నాకంటే అరుణ కే ఎక్కువ మార్కులు వస్తాయి ...నా కంటే సతీష్ గాడి ఇంగ్లీష్ మార్కులు ఎక్కువ ...మనకు సబ్జేక్ట్లలో కంటే భవాని దృష్టి లో మార్కులే ఎక్కువ ...ఒక్కసారి ట్రై చేద్దాం ....అసలు మనకు ఎన్ని మార్కులు వస్తాయో చూసి తరిద్దాం అని ...నిర్ణయించుకొని సడన్ గా లేచి లైటు వేసాను ..
అబ్బో చాలా రాత్రి అయ్యింది ...ఇప్పుడు చదవలేము గాని ..అసలు ఎలా చదవాలో ఒక ప్రణాళిక రాదం అని పుస్తకం పెన్ను తీసుకుని , పొద్దున్న లేచి నప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒక ప్రణాళిక రచించి అది జాగర్తగా జేబులో పెట్టుకుని హాయిగా నిద్రపోయా....

మర్నాడు మొట్టమొదటగా లేగవడం  లోనే ఫెయిల్ అయిపోయాను ...అరగంట లేటు గా లేచాను ....ఇక ఎలాగోలా టైం టేబుల్ ని ఫాల్లో అవడానికి ప్రయాసపడి ...మొత్తానికి సాయత్రం వరకు కచితం గా అమలు పరిచాను...అలా పొద్దునే నాలుగు గంటలకు లేగవడం...గంటన్నర వరకు ఇంగ్లీష్ సోషలు ఒక రోజు సైన్సు , తెలుగు ఒక రోజు హిందీ, లెక్కల సూత్రాలు ఒక రోజు చదవడం రోజు సాయత్రం పుట చూడకుండా రాయడం లెక్కలు చేయడం ...అలా ఒక ఇరవై రోజులు కష్టపడి పరీక్షల్లో కూర్చున్నాను ...అన్ని తొంభైలు రాక పోయినా అరుణ కంటే ఒక్క మార్కు ఒకే ఒక్కమార్కు ఎక్కువ వస్తే చాలు అనుకున్నా......

అలా పరీక్షలు అయిపోయాయి....

పేపర్లు ఇస్తున్నారు ....ఫస్టు ఇంగ్లీషు ...మార్కులు సరిగా గుర్తు లేవు గాని అందరికంటే ఎక్కువగా నావే.......అందరు చప్పట్లు.....
తరువాత తెలుగు ...మళ్ళి అందరికంటే నావే ఎక్కువ ...రెండు సేక్షనులు కలిపి నా మార్కులు కంటే ఎవరికీ ఎక్కువ రాలేదని తెలుగు టీచరు " నాగమణి" గారు మనకు పెన్ను బహుమానం...మల్లి చప్పట్లు 
అలా అన్ని సబ్జెక్టులో నాకే ఎక్కువ మార్కులు మొత్తం అన్ని మార్కులు కలిపి ఇప్పటికి బాగా గుర్తు 494 ...అంటే ఫస్టు నేనే....నా తరువాత "గోతి నక్కల "  అరుణ ...అబ్బో చాలా దూరం లో ఉంది 403 మార్కులు అంటా...బాగా ఏడిచింది అంటా...నేను మాత్రం సంబరాలు చేసుకున్నాను ....ఆ తరువాత "కర్రి" గోపాలం గాడు.......మూడువందల చిల్లర తో సరిపెట్టుకున్నాడు......

 

మనం చదివితే అలాగే ఉంటుంది మరి...హహహ అప్పటి దాకా చిల్లర గాడు అని ఉన్న పేరు కొంచెం మారి "నోటు గాడు" అయ్యింది ...మన పేరు స్కూలు మొత్తం లో మారు మ్రోగిపోయింది....బాగా చదువుతాడు ..ఈ సారి స్కూలు ఫస్టు వీడే అని అందరు తెగ పోగిడేస్తున్న్నారు ఏంటో ..!!!!


మీగత కధ త్వరలో ఇండియా నుండి ప్రసారం.......ధన్యవాదాలు....

మీ శ్రేయోభిలాషి ......
రాజు













6 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

మంచి మార్కులు తెచ్చుకున్న రాజుకి అభినందనలు!
చప్పట్లు, చిటికెలు :);)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజు మంచి అబ్బాయని నా నమ్మకం ఎలా రుజువైందో చూడండీ!!! ఆ టెక్కు భవాని మాయలో పడి రాజు కాజ్ లేకుండా చెడ్డవాడు అయ్యాడు అని ఇప్పటికైనా తెలిసింది కదా!? కృషి ఉంటె మనుషులు ఋషులు అవుతారు. ఈ దేశమైనా ఏదేశమైనా .. రాజు లక్ష్యం గొప్పది. సాధిస్తాడు.. సాధిస్తాడు. సాధిస్తాడు. ..

జ్యోతిర్మయి చెప్పారు...

సాధనమున పనులు సమకూరు ధరలోన..రాజు బేషుగ్గా నిరూపించాడు.

PALERU చెప్పారు...

రసజ్ఞ బెహెన్.....

అమ్మయ్యా ..!! ఇన్నాళ్ళకి మా రాజు మీకు నచ్చాడు...:) ధన్యవాదాలండి బాబు....:):)



వనజా దీది....

మీ నమ్మకం నిజం అవ్వటానికి ఇంకా చాలా సమయం ఉంది ...ఇది ఒక భాగమే కాని దీని తరువాత మీ రాజు మీరు ఉహించనంతగా చేడిపోయాడు అది ఎలాగో మిగతా భాగాలలో ...." భవాని మాయ " అనే పదం నాకు నచ్చలేదు..ఎందుకనో?? :):) రాజు లక్ష్యం కచ్చితంగా సాధిస్తాడు ...నాక నమ్మకం ఉంది ...:):)



జ్యోతిర్మయీ గారు....

ముందుగా ఒక ప్రశ్న మిమ్మలిని దీది అని పిలిస్తే మీకేమైనా అభ్యంతరమా??

రాజు ఇంకా నిరుపించలేదండి..ఏదో అలా మొదటి అడుగు వేసాడు అంతే.....ధన్యవాదాలు ...:)

sarma చెప్పారు...

check ur comment section immediate. good

PALERU చెప్పారు...

Tata...will check soon thnx fa responce