మంచి అవకాసం చేజారిపోతుందేమో? ఎలా ? ఎలా? ఈ రోజు మనసంతా చికాకుగా ఉంది. ఎవడో అన్నాడు " మాటలే ...!!! చేతలు ఉండవు " అని ....నాకోసమే అన్నాడో లేక ఉరికే అన్నాడో కాని నాకు మాత్రం బాణం సూటిగా తగిలింది...నిజంగా ఈ బిజినెస్ అనేది చాలా కష్టం....జాబే సుఖం అనిపిస్తుంది ...కాని నాకంటూ ఒక కొత్త దారి వేసుకోవాలని నా కల ....నిజం చేయగలనో లేదో ?? గెలుస్తానో ? ఓడిపోతానో ? దీనెమ్మ జీవితం ...హు
5 కామెంట్‌లు:
జీవితం,అమ్మ రెండు గొప్పవి భాయి. ఓర్పు అవసరం కదా! జీవితాన్ని,అమ్మని తిట్టు కుంటామా ? వ్యాపారం అంటే మాటలా!? పెట్టుబడి, శ్రమ ,వనరులు సేకరించడం,మార్కెటింగ్,లాభ-నష్టాలు,సరి అయిన నిర్ణయాలు తీసుకోగల్గడం అన్నీ ఉంటాయి .. వేచి చూడండి. మీకై ఉన్నాయి కొన్ని నాళ్ళు.
Don't get disheartened for a failure. failure is the stepping stone for success.
నిజమే. మనం అడుగు పెట్టిన చోటల్లా, మనకి విజయాలే దక్కుతాయి అనుకోకూడదు... వంద అపజయాల తర్వాతే ఒక్క విజయం.ఈ లాభ నష్టాల నిష్పత్తి శాతం వ్యాపారం లో మరీ హెచ్చుతగ్గులు గా ఉంటాయి... కనీసం ఐదేళ్ళకి తక్కువ కాకుండా సరి పడినంత సమకూర్చుకొని మాత్రమే వ్యాపారం లో దిగాలి.కష్టపడితే గాని విజయం దక్కదు... నిరుత్సాహ పడకండి. మీరు నమ్మిన దారి లో ముందుకెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది.
Sudha
పెట్టుబడీగురించి ఆయితే చాలామార్గాలు వున్నాయి.ఆయినా మీరు ఇంతలా ఎదురుచూస్తూన్నరు కాబట్టి మీప్రాజక్ట్ వివరం తెలిపితె మెయిల్ ద్వారా నేను సహాయపడగలను.
వనజక్కా ....
మీరు చెప్పింది అక్షరాలా నిజం... రెండు విలువైనవే.....ఈ దేశం లో ఏదైనా చేద్దాం అంటే అడ్డుపడేది ఎవరో తెలుసా ?? ఎవరో కాదు మన ప్రభుత్వమే మన బిజినెస్ మెన్ లకు శత్రువు ....డబ్బు ఉన్నవాడే బిజినెస్ చేయాలా ?? నాలాంటి వాడు చేయలేడా?? నేనెప్పటికీ వేరే దేశపు పనివాడి గానే మిగిలిపోవాలా ??? ఎలా చేయాలి అన్నది ఒక ప్రశ్న కానే కాదు అక్కా ....ఇలానే ఎందుకు చేయాలి ?? అన్నదే నా ప్రశ్న....అయినా మీరు ప్రోత్సాహం ఇస్తుంటే ...కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి..నాకు ఒక అక్క ఉంది అని...ధాంక్స్ అక్కా
@ తాతయ్యా
ఉభయకుశలోపరి ......క్షమించాలి కొన్ని కారణాల వాళ్ళ మీతో మాట్లాడలేక పోతున్నాను ఫోనే లో ......నా ప్రయత్నాన్ని ఎప్పటికి మానను తాతయ్య .....
@ సుధా గారు...
వ్యాపారం ...బిజినెస్ ...ధందా....ఏదేమైనా ......ప్రణాలికలు పనిచెయ్యడం లేదు ..సమకూర్చుకుని ..వేలిముద్ర గాడు కుడా బిజినెస్ చేయగలడు...అయినా మీకు టీ తాగాలి అనిపించినప్పుడు జేబు లో రూపాయి ఉంటె చాలా తేలిగ్గా తాగెస్తారు అదే పది రూపాయిలు ఉంటె కుడా తాగెస్తారు ...వంద ఉంటె ఆలోచిస్తారు ...అయిదు వందల కాగితం ఉంటె "అవసరమా" అనుకుంటారు ...వెయ్యి రూపాయిల కాగితం ఉంటె వద్దులే " అనిపిస్తుంది ....టూకీగా ....డబ్బు నిల్వ పెరిగిన కొద్దీ ....మనిషి మెదడు సేకుర్డ్ అయిపోతుందండి....... కాన్సెప్ట్ తో బిజినెస్ చెయ్యడమే నా లక్ష్యం ...నా దగ్గిర కాన్స్పేట్ ఉంది , వనరులే లేవు...అయినా .." ధైర్యే సాహసే లక్ష్మి" అని ముందుకి వెళ్తాను ..మీ లాంటి పెద్దల ఆశిస్సులు ఉండాలే గాని ....దూసుకేల్లిపోనూ :):)..ధాంక్స్ అండి
@ రమేష్ బాబు గారు....
మీ లాంటి వారి అవసరం నాకు చాలా ఉంది ...మీ మార్గదర్శకత్వం నాకు చాలా అవసరం ....కాన్సెప్ట్ ఇక్కడ కన్నా మెయిల్ లో అయితే బాగుంటుంది ..మీకు మెయిల్ చేస్తాను ...ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి